killerగత ఏడాది జనవరిలో వరుస హత్యలకు పాల్పడి జిల్లాలో భయోత్పాతాన్ని సృష్టించిన సైకో కిల్లర్‌ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌కు నాల్గవ అదనపు జిల్లా జడ్జి మరణశిక్ష విధిస్తూ 17వతేదీ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే కొండాపురం మండలానికి చెందిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు కావలి పట్టణానికి వలస వచ్చి న్యూడిల్స్‌ బండిని పెట్టుకున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ అతను నేరాల వైపు దృష్టి సారించాడు. ఒంటరిగా వున్న మహిళలను టార్గెట్‌ చేసాడు. కావలిలో ఇంట్లో ఒంటరిగా వున్న ఓ మహిళను తలపై సుత్తితో కొట్టి చంపి ఆమె ఒంటిపై వున్న బంగారు నగలతో ఉడాయించాడు. నెల్లూరు రూరల్‌ మండలం పెద్దచెరుకూరులో వృద్ధ పూజారి దంపతులను హత్య చేసి పరారయ్యాడు. గతేడాది జూలై 9న నెల్లూరు, చిల్డ్రన్స్‌ పార్కు ప్రాంతంలో వున్న ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లోకి కేబుల్‌ టీవీ టెక్నీషియన్‌ లాగా వెళ్లాడు. అక్కడ వున్న నాగేశ్వరరావు భార్య ప్రభావతి మీద, వారి బంధువైన మరో అమ్మాయి మీద సుత్తితో దాడి చేసాడు. ప్రభావతి అక్కడికక్కడే చనిపోగా, ఇంకో యువతి స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఇంటికొచ్చిన నాగేశ్వరరావు మీద కూడా వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు చేరి వెంకటేశ్వర్లును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత గాయపడ్డ యువతి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వరుస హత్యలు అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించాయి. ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లో ఈ సైకో కిల్లర్‌ పట్టుబడకపోయివుంటే జిల్లాలో ఇంకెన్ని ఘోరాలు జరిగి వుండేవో? మొత్తానికి ఈ సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

matti roadభూగర్భ డ్రైనేజీ పనుల మాటేమోగాని నిలువునా ధ్వంసమవుతున్న రోడ్లను చూస్తుంటే జనం గుండె రగిలిపోతోంది. నగరంలో ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా శుద్ధంగా లేదు. అన్ని వీధుల్లో సిమెంట్‌రోడ్లను ధ్వంసం చేశారు. తవ్విన చోట కాంక్రీట్‌తో నింపకుండా మట్టిపోసారు. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు ఈ మట్టి కొట్టుకు పోయి గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్ల మీద వాహనాలను నడపడానికే కాదు, జనం నడవ డానికి కూడా ఇబ్బందిగా వుంది. భూగర్భ డ్రైనేజీ పనులంటూ శుద్ధంగా వున్న రోడ్లను పాడు చేయ డంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

venkaనెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ నుండి నింగిలోకి రాకెట్లు ఎగురుతుంటాయి. ఆ రాకెట్లకు ఎగరడానికి ఒక లాంచ్‌ ప్యాడ్‌ ఉంటుంది. కాని నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం నుండి ఎటువంటి లాంచ్‌ప్యాడ్‌ లేకుండానే ఒక రాకెట్‌ ఎగిరి సాధారణ కార్యకర్త స్థాయి నుండి భారత ఉపరాష్ట్రపతి స్థాయికి దూసుకుపోయింది. ఆ రాకెట్‌ పేరే ముప్పవరపు వెంకయ్యనాయుడు.

నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో మనకు చాలాగొప్పగా కనిపించే నాయ కులు బెజవాడ గోపాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యలు. అయితే వారికి కూడా సాధ్యం కానటువంటి అత్యున్నత స్థానాన్ని అలంకరించబోతున్న తొలి నెల్లూరీయుడు మన వెంకయ్యనాయుడు.

ఏబివిపి కార్యకర్తగా, విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆరెస్సెస్‌ సేవకుడిగా, జనసంఘ్‌ నేతగా, శాసనసభ్యుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా... ఆయన చూడని పదవులు లేవు... ఆయన ఎరుగని రాజకీయ కోణాలు లేవు. ఎన్ని పదవులు అనుభవించినా ఆయనకు సంతృప్తినిచ్చే పదవి మొదట భారతీయుడు. ఆ తర్వాత నెల్లూరీయుడు. పుట్టినగడ్డపై అంతటి మమకారం ఆయనకు. దేశంలో ఆయన తిరగని రాష్ట్రం, ఆయన కాలు మోపని ప్రాంతం లేదు. ఎక్కడ ప్రసంగి స్తున్నా, ఆయన ప్రసంగంలో 'నెల్లూరు' అనే పదం రాకుండా వుండదు. నెల్లూరుకు ఆయన ఏం చేసాడో అందరికీ తెలిసిందే! చేసిన అభివృద్ధి ఒకెత్తైతే... నెల్లూరును దేశమంతా తెలిసేలా చేసింది కూడా ఆయనే! నెల్లూరుజిల్లాను ఇంతగా ప్రేమించే నాయకుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబో తున్నాడు. 5వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికలో ఆయన గెలుపు లాంఛనమే! ఈ నెల 11వ తేదీ ఉపరాష్ట్ర పతిగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రమాణస్వీకారానికి ముందే తన నెల్లూరుపై అడుగుపెట్టాలని, ఆత్మీయులు, అభిమానులు, ఆప్తులతో కలిసి మాట్లాడా లని ఆయన మనసు పరితపించింది. దీనికోసమే ఆయన 7వ తేదీ ఉదయం తిరుమలలో తన ఇష్టదైవం వెంకన్న దర్శనం చేసుకుని మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరులోని విఆర్‌సి మైదా నంలో వెంకయ్యనాయుడు ఆత్మీయ అభి నందన సభకు భారీ సన్నాహాలు జరుగు తున్నాయి. ప్రముఖదాత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి.నారాయణ, రత్నం విద్యాసంస్థల అధినేత కె.వి.రత్నం, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జమీన్‌రైతు సంపాదకులు నెల్లూరు డోలేంద్రప్రసాద్‌, అపస్మా నాయకులు బి.మనోహర్‌రెడ్డి, 'లాయర్‌' వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, కృష్ణచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ పి.చంద్ర శేఖర్‌రెడ్డిలు సభ్యులుగా వున్న కమిటీ ఆధ్వర్యంలో మన వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో పాటు అన్ని పార్టీల నాయకులు, పది నియో జకవర్గాలలో వున్న వెంకయ్య అభిమా నులు, ఆత్మీయులు ఈ సభకు తరలివస్తు న్నారు. వెంకయ్య మీదున్న అభిమానంతో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు చెన్నై, బెంగు ళూరు, హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ వంటి నగరాలలో, ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన నెల్లూరీయులందరు కూడా వెంకయ్య ఆత్మీయ అభినందన సభకు ఎంతో అభిమానంతో విచ్చేస్తున్నారు.

నెల్లూరుజిల్లా నుండి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మొదటి నాయకుడు వెంకయ్యనాయుడు. ఇక్కడ మనం గర్విం చాల్సింది, స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఆయన ఎదిగిన వైనాన్ని చూసి. ఆయన పెద్దపేరున్న రాజకీయ కుటుంబంలో జన్మించి ఆ స్థాయికి చేరుకోలేదు. ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి, రాజ కీయాలలో పాయింట్‌ వన్‌పర్సంట్‌ కూడా క్రమశిక్షణ తప్పకుండా ఒకే సిద్ధాంతాన్ని ఆచరించి దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన నాయకుడు వెంకయ్య. మన పిల్లలకు ఆయన జీవితాన్ని, ఆయన ఆచరించిన సిద్ధాంతాన్ని ఆదర్శప్రాయంగా చూపాలి. ఇది ఒక వ్యక్తికి జరిగే అభినందన కాదు, ఒక పదవికి జరిగే సత్కారం కాదు, క్రమ శిక్షణాయుత జీవితానికి, సిద్ధాంత నిబ ద్ధతకు జరిగే సత్కారం. మన నెల్లూరీ యుడు సాధించిన ఔన్నత్యానికి, ఆయన చూపిన ఆదర్శానికి సన్మానం. కాబట్టి నెల్లూరీయులందరు వెంకయ్య ఆత్మీయ సభకు హాజరై ఆయనను నిండు మనసుతో దీవించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.

Page 1 of 18

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
  నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter