roadsనెల్లూరు నగరంలో ఈ మధ్యంతా కూడా డ్రైనేజీ పనులు ముమ్మరంగా చేశారు. ఏ ప్రాంతంలో చూసినా సైడు కాలువల పనులు బాగానే జరుగుతూ కనిపించాయి. అయితే ఈ డ్రైనేజీల నిర్మాణం వల్ల అనుకున్న మైలేజీ రావడం లేదని మున్సిపల్‌ మంత్రి పి.నారాయణకు అర్ధమైపోయింది. ఎందుకంటే నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసం అన్ని రోడ్లను పగలగొట్టిపెట్టారు. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పాలకులను జనాలు రోజూ తిట్టుకోవడమే పనవుతోంది. దీనిని గ్రహించిన నారాయణ నగరంలో రోడ్ల పనులపై దృష్టి పెట్టారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను నెల్లూరుకు బాగానే తెచ్చి దీని క్రింద ముమ్మరంగా రోడ్ల పనులు మొదలుపెట్టించారు.

co opనెల్లూరుజిల్లాలో లక్షలాదిమంది రైతులున్నారు. తడ నుండి సీతారాంపురం దాకా అన్ని గ్రామాలు, పల్లెటూర్లలో సేద్యంతో స్వేదం చిందిస్తూ పంటలు పండించే అన్నదాతలకు పొలం, హలం, నీళ్ళు, బీళ్ళు, చెరువు, ఎరువుతో తప్ప జిల్లా కేంద్రమైన నెల్లూరుతో పెద్దగా సం బంధాలుండవు. అయినా జిల్లాలో వున్న రైతులందరికీ నెల్లూరు నగరంతో వున్న అనుబంధానికి ఒకే ఒక వేదిక నెల్లూరు నడిబొడ్డున వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. అవును, రైతుల కోసం, రైతుల శ్రేయస్సు కోసం నెలకొల్పిన బ్యాంకు ఇది. రైతులే ఖాతాదారులు, రైతులే సభ్యులు, రైతులే డిపాజిటర్లు, రైతులే ఋణగ్రహీ తలు, ఈ బ్యాంకుకు రైతులే వెన్నెముక.

మన కుటుంబంలో ఎవరికైనా 60 ఏళ్లు నిండితే షష్టిపూర్తి చేస్తాం. 50ఏళ్ళు వస్తే అర్థశత జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం. అలాంటిది లక్షలాది మంది రైతులతో బంధం, అనుబంధం వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వందేళ్ళు వస్తే... ఆ వేడుకను ఇంకెంత ఘనంగా జరపాలి. అలాంటి వేడుకకే నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వతేదీ మధ్యాహ్నం 3గంటలకు బ్యాంకు ప్రాంగణంలోనే నిర్వహించన్ను శత వసంతాల వేడుకలను రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టు కూరు ధనుంజయరెడ్డి నేతృత్వంలో బ్యాంకు పాలక మండలి కమిటి సభ్యులు ఆహ్వాన కమిటీగా ఏర్పడి శత వసంతోత్సవ సంబ రాలను చరిత్రలో చిరస్మరణీయంగా నిలి చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర సహకార శాఖ మంత్రి సి.ఆదినారా యణరెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు ముఖ్యఅతిథులుగా, ఏపి రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ పిన్నమ నేని కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ కె.రవీందర్‌రావు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. అలాగే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా సంస్థల ఛైర్మెన్‌లు, మాజీమంత్రులు, మాజీశాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌లు, సహ కార శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరవు తున్నారు. వందేళ్లకాలంలో ఈ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసిన బ్యాంకు మాజీ ఛైర్మెన్‌లను, మాజీ జనరల్‌ మేనేజర్‌లను ఈ వేదికపై సన్మానించాలని పాలకవర్గం నిర్ణయించింది.

నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతవసంతాల ప్రయాణంలో ఎన్నో మలు పులున్నాయి. ప్రగతి పథంలో ఎంతో మంది కృషి వుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1918 సంవత్సరం జనవరి 11వ తేదీన మద్రాసు రాష్ట్ర సహకార చట్టం క్రింద నేటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రిజిష్టర్‌ చేయబడింది. గ్రామీణ రైతులే సభ్యులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రైతులకు వాణిజ్య బ్యాం కుల కంటే మిన్నగా సేవలందించసాగాయి. 1933 అక్టోబర్‌ 17వ తేదీన ఇప్పుడున్న కేంద్ర సహకార బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రావు బహుద్దూర్‌ చెంగయ్య పంతులు, రేబాల దశరథరామి రెడ్డి, చుండూరు సుబ్బయ్యశెట్టి, ఏ.సి.సుబ్బా రెడ్డిలు ఒక కమిటీగా ఏర్పడి ఈ భవన నిర్మాణ సన్నాహాలు సాగించారు. 1935 ఏప్రిల్‌ 21వ తేదీన మద్రాసు ప్రొవిన్షియల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ వి.రామదాసు పంతులు చేతుల మీదుగా ఈ బ్యాంకు భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆరోజుకు బ్యాంకు అధ్యక్షుడుగా రేబాల దశరథరామిరెడ్డి వున్నారు. ఈ బ్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు వేల రూపాయలను షేర్‌ క్యాపిటల్‌గా మంజూరు చేసింది. అప్పటి నుండి ఇప్పటి దాకా బ్యాంకు అంచలంచెలుగా ఎదు గుతూ శాఖోపశాఖలుగా విస్తరించింది. రావుబహుద్దూర్‌ చెంగయ్య పంతులు బ్యాంకు మొదటి అధ్యక్షులుగా సేవలం దించారు. కె.వి.రాఘవాచార్యులు, రావు సాహెబ్‌ విశ్వనాథరావు పంతులు, రేబాల దశరథరామిరెడ్డి, రేబాల లక్ష్మీనరసారెడ్డి, దువ్వూరు బలరామిరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, వేమా రెడ్డి రామచంద్రారెడ్డి, వేనాటి మునిరెడ్డి, మేకల హజరత్తయ్య, వాకాటి నారాయణ రెడ్డి, వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డిలు ఈ వందేళ్లలో బ్యాంకు ఛైర్మెన్‌లుగా సేవలం దించి బ్యాంకు పురోభివృద్ధిలో భాగస్వాము లయ్యారు.

ఇది నా అదృష్టం - మెట్టుకూరు ధనుంజయరెడ్డి

నేను మెట్ట ప్రాంతంలో పుట్టాను. రైతు సమస్యలు తెలిసిన వాడిని. నిద్రలేస్తే రైతు కష్టం చూసే వాడిని. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా రైతులకు ఈ రూపంలో సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇందులో వున్న సంతృప్తి ఇక ఏ పదవిలోనూ, ఏ బాధ్యతలోనూ వుండదు. రైతు వుంటే ఈ ప్రపంచం వుంటుంది, రైతు తింటేనే మనం తింటాం. కాబట్టి మనం రైతులను గౌరవించాలి. రైతులను ప్రోత్సహించాలి. నేను బ్యాంకు ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాక రైతుల శ్రేయస్సు కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం అహర్నిశలు కృషి చేసా! రాష్ట్ర ప్రభుత్వం మా పాలకవర్గ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టే బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. బ్యాంకు శత వసంతాల వేడుక జరుపుకునే సమయంలో బ్యాంకు ఛైర్మెన్‌గా నేనుండడం నా పూర్వజన్మ సుకృతం. ఈ వందేళ్ల ప్రయాణం ఒక చరిత్ర. ఆ చరిత్రలో నా పేరు నిలబడడం నాకు లభించిన వరం.

busesఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లకు వెళ్తే... ఇన్సూరెన్స్‌ ఫిటింగ్‌...!

జిల్లా అధికారి చెప్పాడంటూ బెదిరింపులు

బెంబేలెత్తుతున్న వాహన యజమానులు

అతడు కేవలం కానిస్టేబుల్‌. హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ వచ్చినా ట్రాన్స్‌ఫర్‌ వస్తుందనే భయంతో ప్రమోషన్‌ని తిరస్కరించి ''పిట్‌నెస్‌'' విభాగ టేబుల్‌కే పదమూడేళ్ళుగా పరిమితమైపోయిన పవర్‌ఫుల్‌ కానిస్టేబుల్‌.

కుటుంబసభ్యుల పేరుతో ఇన్సూరెన్స్‌ కంపెనీ పెట్టాడు, దొడ్డిదారిలో అక్రమార్జన మరిగాడు. స్కూళ్ళ యజమానులకు చుక్కలు చూపిస్తున్నాడు. వందలాది వాహనాలకు తానే ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా మారాడు. ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా దొడ్డిదారిన భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాహన యజమానులు, స్కూళ్ళ యజమాన్యాలూ దిక్కు తెలియక ఎవరికి మొరపెట్టుకోవాలో అర్ధంకాక సతమతమౌతున్నారు.

నెల్లూరు నగరంలో ఇప్పుడు 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌' ఏమిటంటే, 'ఫిట్‌నెస్‌' సర్టిఫికెట్ల మాయాజాలమే. ఎక్కడ విన్నా దీనిగురించే చర్చ జరుగుతోంది. ఈ సర్టి ఫికెట్‌ల పేరుతో వాహనాల యజమాను లను నిలువుదోపిడీ చేస్తున్నారనే విషయం నగరమంతా వినిపిస్తోంది. రవాణా శాఖలో జరుగుతున్న ఈ మాయాజాలం పై ప్రజలు, వాహనాల యజమానులు జోరుగానే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే, ఆర్టీఏ కార్యాలయంలో ఓ పేరుమోసిన కాని స్టేబుల్‌ ఈ తంతు అంతా గుట్టుచప్పుడు కాకుండా కానించేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరంలో కనీసం వెయ్యికి పైగానే స్కూల్‌ బస్‌లు వున్నాయి. ఇవి కాక, ఆటోలు, ఇతరత్రా వాహనాలు పెద్దసంఖ్యలోనే వున్నాయి. అయితే, ఇవన్నీ ఏడాదికోసారి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసు కోవాలి. ఇదే అదనుగా, ఆ విభాగంలో వున్న ఓ కానిస్టేబుల్‌ ధనార్జనకు మరిగి, అక్రమాలకు తెరతీసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ప్రహసనం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక ఆయనదే ఇష్టారాజ్యమైపోయిందని,

గత పదమూడేళ్ళుగా అదే సీట్‌లో పాతుకుపోయిన ఆయన, తన కుటుంబ సభ్యుల పేరుతోనే ఓ ఇన్సురెన్స్‌ కంపెనీ కూడా ప్రారంభించి, వందలాది వాహ నాలకు తానే ఇన్సురెన్స్‌ ఏజెంట్‌గా మారాడని, ఈ సర్టిఫికెట్‌ల మాయా జాలంతో రెండుచేతులా అక్రమార్జన చేస్తున్నాడని వాహనాల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. తనకు హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ వచ్చినా, ఆ ప్రమోషన్‌ను అంగీకరిస్తే తానెక్కడికి బదిలీ అవాల్సివస్తుందేమోనని ప్రమో షన్‌ను కూడా తిరస్కరించిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఇంతగా ఆయన అక్కడ పాతుకుపోయినా పట్టించుకునే అధికారే లేడని వారు వాపోతున్నారు. అదేమని అడిగితే, జిల్లా ఉన్నతాధికారుల పేరు చెప్పి బెదిరిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ పరువు పోయే విధంగా, తన విభాగాన్నే అక్ర మాల అడ్డాగా మార్చుకుని అడ్డదిడ్డంగా ముడుపులు మూటగట్టుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఉన్నతాధికారులైనా ఈ విష యాలు పరిశీలించి, నిజానిజాలు వెల్ల డించాలని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పేరుతో జరుగుతున్న ఈ నిలువుదోపిడి విషయాన్ని విచారించి తగు చర్యలు తీసుకోవాలని వాహనాల యజమానులు కోరుకుంటు న్నారు. వాహనాల యజమానుల పట్ల ఇలా అక్రమరీతిలో వ్యవహరించడం అన్యాయమని, ఇకనైనా వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పంపిణీలో రవాణా అధికారులు నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించేవారిని ఆ విభాగంలో నియ మించాలని వాహనాల యజమానులు కోరుకుంటున్నారు.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter