ycp leadsఅత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి 87 ఓట్ల తేడాతో గెలిచాడు. వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి గట్టి పోటీనే ఇచ్చి ఓడిపోయాడు. ఓ దశలో వైకాపా గెలుస్తుందనే పరిస్థితి కూడా కల్పించారు. అసలు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా? అనే మీమాంస పరిస్థితి నుండి వైకాపా ఈ స్థాయి పోటీనివ్వడం గొప్ప విష యమే! మారిన సమీకరణల ప్రకారం జిల్లాలో వైకాపాకంటే తెలుగుదేశంకు 150కి పైగా ఓట్లు ఎక్కువ వున్నప్పటికి, అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ధీటుగా పోటీనిచ్చాడు. తెలుగుదేశం వాళ్ళకు రెండు వారాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసాడు. తెలుగుదేశం వాళ్ళు జిల్లాలో అర్ధబలం, అంగబలం మోహరిం చారు. అధికారాన్ని పూర్తిస్థాయిలో వాడు కున్నారు. అధికారులను కూడా వాడేసు కున్నారు. ఇద్దరు మంత్రులు జిల్లాలోనే తిష్టవేశారు. ఇక జిల్లా తెలుగుదేశం నాయకులంతా తామే పోటీ చేసామ న్నంతగా పరుగులుపెట్టారు. చంద్రబాబు, లోకేష్‌లైతే ఉదయం, సాయంత్రం గ్యాప్‌ లేకుండా సమీక్షలు పెట్టారు. ఇంత చేసినా, తమ క్యాంప్‌లో వైసిపి కంటే దాదాపు 200 మందిని అదనంగా పెట్టు కున్నా గెలిచింది 87ఓట్ల తేడాతో!

అసలు జిల్లాలో వైకాపా నాయకత్వం సరిగా లేక ఇక్కడ ఓడిపోయిందిగాని, పక్కా వ్యూహంతో పనిచేసి వుంటే ఖచ్చి తంగా ఇక్కడ వైకాపా గెలిచిఉండేది. ఇక్కడ ఎన్నికల నిర్వహణలో వైకాపా నాయకులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి మీద ఆ పార్టీ నాయకు ల్లోనే వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకో లేకపోయారు.

జిల్లాలో వైసిపికి మేకపాటి రాజ మోహన్‌రెడ్డి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తు న్నారు. జగన్‌ కూడా జిల్లాలో పార్టీ నిర్ణయాలను ఆయనకే వదిలేస్తున్నాడు. ఆయనకు రాజకీయాలు చేతకావు. గాలి వాటంతో గెలుస్తున్నాడు. అసలు నెల్లూరు జిల్లా రాజకీయాలకే ఆయన సూటు కాడు. అయినా ఇక్కడ చక్రం తిప్పాలనుకుం టాడు. పార్టీలో ఇతరులకు అవకాశ మివ్వడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంతో సైలంట్‌గా చేసివుండొచ్చు. తెలుగుదేశం అభ్యర్థి రూపంలో జిల్లా వైకాపాకు ఓ మంచి అవకాశం కలిసొచ్చినట్లయ్యింది. ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థి అయ్యుంటే వైకాపా ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. వాకాటి కాబట్టి వైకాపాకు ఒక ఛాన్స్‌ ఇచ్చినట్లయ్యింది. కాని వైకాపా వాళ్లే ఆ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్నారు. మొదట్లో వైసిపిలో చేరిన అయిదారు మంది ఎంపీటీసీలకే తెగ ప్రచారం చేసారు. తామేదో ఘనకార్యం చేసినట్లు ఫోజులిచ్చారు. దీంతో చంద్రబాబుకు విషయం తెలిసి జిల్లాపై పట్టు బిగిం చాడు. తెలుగుదేశంలో వాకాటికి వ్యతి రేకంగా వున్న నాయకులను కూడా దారి లోకి తెచ్చాడు. వారి చేత వాకాటికి పని చేయించాడు. చంద్రబాబు భయంతో వాకాటి మీద వ్యతిరేకత వున్నా కూడా ఏ నాయకుడూ క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్స హించలేకపోయాడు. అప్పటికే తెలుగు దేశం శిబిరంలో ఉన్నోళ్లు కూడా కొంత వరకు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వాకాటిని వ్యతిరేకించే నాయకులు గాని క్రాస్‌ ఓటింగ్‌ చేయించుంటే తెలుగుదేశం ఓడేది. వైకాపా వాళ్ళు తొలుత చేసిన ఆగిత్యంవల్లే 'దేశం'లోని వాకాటి వ్యతి రేకులు కూడా బాబు గీసిన గీత దాట లేకపోయారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter