loksabhaప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్‌ పిలుపుమేరకు ఐదుగురు వైసిపి లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం తెలిసిందే! ఈ రాజీనామా లేఖలు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వద్ద పెండింగ్‌లో వున్నాయి.

ఇంకో ఏడాదిలోనే దేశమంతా లోక్‌సభ ఎన్నికలు జరుగు తాయి. ఇప్పుడు ఈ ఐదుగురు రాజీనామాలు ఆమోదిస్తే ఆర్నెల్ల లోపు 5 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. మళ్ళీ ఆర్నెల్ల లోపే ఇవే లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఆరు నెలల సంబరానికి... ఈలోపు మళ్ళీ ఉపఎన్నికలు... కోట్ల రూపాయల ఖర్చు... అధికార యంత్రాంగం వినియోగం... పెద్దఎత్తున దుబారా... ఈ కోణాలన్నీ ఆలోచించే లోక్‌సభ స్పీకర్‌ వైసిపి ఎంపీల రాజీనామాలను ఆమోదించలేదని తెలుస్తోంది.

కావాలనే వైసిపి ఎంపీల రాజీనామాలను కేంద్రప్రభుత్వం ఆమోదింపచేయడం లేదని, వైసిపితో బీజేపీ లాలూచీ పడిం దంటూ తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి... తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా

ఉన్నామని ప్రకటించాడు.

ఒకవేళ లోక్‌సభ స్పీకర్‌ వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే పరిస్థితేంటి? ఉపఎన్నికలు తప్పవు. వైసిపికి పాత అభ్యర్థులే! నెల్లూరు లోక్‌సభకు వైసిపి అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డే! మరి తెలుగుదేశంపార్టీ తరపున ఎవరు? 2014ఎన్నికల్లో పోటీ చేసిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు లోక్‌సభ పోటీకి ఇష్టంగా లేడు. ఇటీవల నెల్లూరులో నిర్వహించిన జిల్లా మినీమహానాడులో కూడా గతంలో ఉపఎన్నికలు వస్తే మంత్రులే పోటీ చేసారని, నెల్లూరు లోక్‌సభకు ఉపఎన్నిక వస్తే మంత్రులే పోటీ చేయాలంటూ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. సోమిరెడ్డి అందుకు తగ్గట్లుగానే స్పందిస్తూ... పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడం తన నైజమని, పార్టీ ఆదేశిస్తే నెల్లూరు పార్లమెంట్‌లోనే కాదు, కడప పార్లమెంటుకైనా పోటీకి దిగుతా అన్నట్లు చెప్పాడు.

నెల్లూరు లోక్‌సభకు ఉపఎన్నిక వస్తే టీడీపీలో ఎవరూ టిక్కెట్‌ కావాలని అడిగే పరిస్థితి లేదు. చంద్రబాబు ఆదేశిస్తే సోమిరెడ్డి, బీద, నారాయణలాంటోళ్ళకు దిగక తప్పదు. వైసిపి వాళ్ళకంటే జిల్లా టీడీపీ నాయకులే ఉపఎన్నికలు రాకుంటే బాగుండుననుకుంటున్నారు. నిన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పిన దానిబట్టి చూస్తే ఉపఎన్నికలు రావడం అనుమానమే!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter