co opనెల్లూరుజిల్లాలో లక్షలాదిమంది రైతులున్నారు. తడ నుండి సీతారాంపురం దాకా అన్ని గ్రామాలు, పల్లెటూర్లలో సేద్యంతో స్వేదం చిందిస్తూ పంటలు పండించే అన్నదాతలకు పొలం, హలం, నీళ్ళు, బీళ్ళు, చెరువు, ఎరువుతో తప్ప జిల్లా కేంద్రమైన నెల్లూరుతో పెద్దగా సం బంధాలుండవు. అయినా జిల్లాలో వున్న రైతులందరికీ నెల్లూరు నగరంతో వున్న అనుబంధానికి ఒకే ఒక వేదిక నెల్లూరు నడిబొడ్డున వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. అవును, రైతుల కోసం, రైతుల శ్రేయస్సు కోసం నెలకొల్పిన బ్యాంకు ఇది. రైతులే ఖాతాదారులు, రైతులే సభ్యులు, రైతులే డిపాజిటర్లు, రైతులే ఋణగ్రహీ తలు, ఈ బ్యాంకుకు రైతులే వెన్నెముక.

మన కుటుంబంలో ఎవరికైనా 60 ఏళ్లు నిండితే షష్టిపూర్తి చేస్తాం. 50ఏళ్ళు వస్తే అర్థశత జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం. అలాంటిది లక్షలాది మంది రైతులతో బంధం, అనుబంధం వున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వందేళ్ళు వస్తే... ఆ వేడుకను ఇంకెంత ఘనంగా జరపాలి. అలాంటి వేడుకకే నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వతేదీ మధ్యాహ్నం 3గంటలకు బ్యాంకు ప్రాంగణంలోనే నిర్వహించన్ను శత వసంతాల వేడుకలను రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టు కూరు ధనుంజయరెడ్డి నేతృత్వంలో బ్యాంకు పాలక మండలి కమిటి సభ్యులు ఆహ్వాన కమిటీగా ఏర్పడి శత వసంతోత్సవ సంబ రాలను చరిత్రలో చిరస్మరణీయంగా నిలి చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర సహకార శాఖ మంత్రి సి.ఆదినారా యణరెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు ముఖ్యఅతిథులుగా, ఏపి రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ పిన్నమ నేని కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ కె.రవీందర్‌రావు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. అలాగే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా సంస్థల ఛైర్మెన్‌లు, మాజీమంత్రులు, మాజీశాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌లు, సహ కార శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరవు తున్నారు. వందేళ్లకాలంలో ఈ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసిన బ్యాంకు మాజీ ఛైర్మెన్‌లను, మాజీ జనరల్‌ మేనేజర్‌లను ఈ వేదికపై సన్మానించాలని పాలకవర్గం నిర్ణయించింది.

నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతవసంతాల ప్రయాణంలో ఎన్నో మలు పులున్నాయి. ప్రగతి పథంలో ఎంతో మంది కృషి వుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1918 సంవత్సరం జనవరి 11వ తేదీన మద్రాసు రాష్ట్ర సహకార చట్టం క్రింద నేటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రిజిష్టర్‌ చేయబడింది. గ్రామీణ రైతులే సభ్యులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రైతులకు వాణిజ్య బ్యాం కుల కంటే మిన్నగా సేవలందించసాగాయి. 1933 అక్టోబర్‌ 17వ తేదీన ఇప్పుడున్న కేంద్ర సహకార బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రావు బహుద్దూర్‌ చెంగయ్య పంతులు, రేబాల దశరథరామి రెడ్డి, చుండూరు సుబ్బయ్యశెట్టి, ఏ.సి.సుబ్బా రెడ్డిలు ఒక కమిటీగా ఏర్పడి ఈ భవన నిర్మాణ సన్నాహాలు సాగించారు. 1935 ఏప్రిల్‌ 21వ తేదీన మద్రాసు ప్రొవిన్షియల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ వి.రామదాసు పంతులు చేతుల మీదుగా ఈ బ్యాంకు భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆరోజుకు బ్యాంకు అధ్యక్షుడుగా రేబాల దశరథరామిరెడ్డి వున్నారు. ఈ బ్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు వేల రూపాయలను షేర్‌ క్యాపిటల్‌గా మంజూరు చేసింది. అప్పటి నుండి ఇప్పటి దాకా బ్యాంకు అంచలంచెలుగా ఎదు గుతూ శాఖోపశాఖలుగా విస్తరించింది. రావుబహుద్దూర్‌ చెంగయ్య పంతులు బ్యాంకు మొదటి అధ్యక్షులుగా సేవలం దించారు. కె.వి.రాఘవాచార్యులు, రావు సాహెబ్‌ విశ్వనాథరావు పంతులు, రేబాల దశరథరామిరెడ్డి, రేబాల లక్ష్మీనరసారెడ్డి, దువ్వూరు బలరామిరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, వేమా రెడ్డి రామచంద్రారెడ్డి, వేనాటి మునిరెడ్డి, మేకల హజరత్తయ్య, వాకాటి నారాయణ రెడ్డి, వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డిలు ఈ వందేళ్లలో బ్యాంకు ఛైర్మెన్‌లుగా సేవలం దించి బ్యాంకు పురోభివృద్ధిలో భాగస్వాము లయ్యారు.

ఇది నా అదృష్టం - మెట్టుకూరు ధనుంజయరెడ్డి

నేను మెట్ట ప్రాంతంలో పుట్టాను. రైతు సమస్యలు తెలిసిన వాడిని. నిద్రలేస్తే రైతు కష్టం చూసే వాడిని. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా రైతులకు ఈ రూపంలో సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇందులో వున్న సంతృప్తి ఇక ఏ పదవిలోనూ, ఏ బాధ్యతలోనూ వుండదు. రైతు వుంటే ఈ ప్రపంచం వుంటుంది, రైతు తింటేనే మనం తింటాం. కాబట్టి మనం రైతులను గౌరవించాలి. రైతులను ప్రోత్సహించాలి. నేను బ్యాంకు ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టాక రైతుల శ్రేయస్సు కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం అహర్నిశలు కృషి చేసా! రాష్ట్ర ప్రభుత్వం మా పాలకవర్గ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టే బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. బ్యాంకు శత వసంతాల వేడుక జరుపుకునే సమయంలో బ్యాంకు ఛైర్మెన్‌గా నేనుండడం నా పూర్వజన్మ సుకృతం. ఈ వందేళ్ల ప్రయాణం ఒక చరిత్ర. ఆ చరిత్రలో నా పేరు నిలబడడం నాకు లభించిన వరం.

nellore leadersనోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా మాటతీరే! కాలు జారితే తీసుకోవచ్చు గాని, నోరు జారితే తీసుకోలేమనే సామెత వుంది కదా!

ఇలా అతిగా నోరు జారే ఒకప్పుడు తమ ముందు కూర్చోవడానికే భయపడ్డ చిన్నాచితకా నాయకుల చేత కూడా నానా మాటలు అనిపించుకుంటున్నారు ఆనం సోదరులు. ముఖ్యంగా ఈ వయసులో ఆనం వివేకానందరెడ్డి ప్రతిపక్ష నేత జగన్‌పై చేస్తున్న విమర్శలు చాలా అతిగా వుంటున్నాయి. ఆపై నలుగురి చేత నాలుగు అనిపించుకుంటున్నాడు. ఎవరి మెహర్బానీ కోసం వివేకా జగన్‌పై ఇంతగా విరుచుకుపడుతున్నాడో అర్ధం కావడం లేదు. జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగితే సీఎం పదవి రాదు, మంత్రి పదవి ఇవ్వరు. ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి మీద కూడా గ్యారంటీ లేదు. మరెందుకు జగన్‌ను అంతగా ఆడిపోసుకోవాలి. కరుడుగట్టిన తెలుగుదేశం నాయకులు కూడా జగన్‌ను తిట్టనంతగా ఈయన ఎందుకు తిట్టాలి. జగన్‌తో పడకపోతే దూరంగా ఉండొచ్చు, లేదా రాజకీయ అవసరాల కోసం రాజకీయ కోణంలోనే విమర్శలు చేయొచ్చు. కాని జుగుప్సాకరమైన విమర్శలేంటి..? జగన్‌ పగలు రైతు దీక్ష చేస్తాడు.. రాత్రి మందు కొట్టి గుడ్డలిప్పుకుని పడుకుంటాడు... ఇవి విమర్శలా? విజ్ఞత ఉండేవాళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి! కాంగ్రెస్‌లో వున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఆశించి వివేకా, రామనారాయణరెడ్డిలిద్దరు కూడా జగన్‌పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. జగన్‌ను నరరూప రాక్షసుడన్నారు. ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదన్నారు. ఉరి తీయాలన్నారు. వీళ్ళ ఆస్తులన్నీ ఏం కొల్లగొట్టాడని జగన్‌ను ఉరితీయాలి? జగన్‌కు ఆనం సోదరులకు మధ్య ఎటువంటి రాజకీయ వైరం లేదు. వై.యస్‌. హయాంలో వీళ్ల ప్రాబల్యానికి జగన్‌ ఎప్పుడూ అడ్డుపడింది కూడా లేదు. మరి అతని మీద ఉరితీయాలనేంత కక్షను వీళ్ళు ఎందుకు పెంచుకున్నారో ఎవరికీ అర్ధం కాదు. కాంగ్రెస్‌లోనే కాదు తెలుగుదేశంలో చేరాక కూడా చంద్రబాబు ఇస్తాడో లేదో తెలియని ముష్టి పదవి కోసం జగన్‌పై మళ్ళీ వ్యక్తిగత విమర్శలతో రెచ్చిపోతున్నారు. వివేకా, రామనారాయణరెడ్డిలది మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ చరిత్ర. ఇంతకాలం ఏ పార్టీలో వున్నా

గౌరవం పొందారు. కాని ఇప్పుడు ఇప్పటిదాకా సంపాదించుకున్న ఆ గౌరవాన్ని పోగొట్టు కుంటున్నారు. జగన్‌పై వివేకా చేసే విమర్శలను ఎవరూ పర్షించడం లేదు. ప్రతిఒక్కరూ, ఆఖరుకు తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళు ఈ స్థాయికి దిగజారిపోయారా అని అనుకుంటున్నారు. చివరకు సొంత తమ్ముడు ఆనం విజయకుమార్‌రెడ్డే తన అన్న ఆనం వివేకాను వీధుల్లో పెట్టాడు. అన్న అని కూడా చూడకుండా నిలువునా కడిగేసాడు. ఇక నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ వివేకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, దీనిపై వివేకా తనయుడు ఆనం రంగమయూర్‌రెడ్డి స్పందించి అనిల్‌ను ఒరే అని సంబోదిస్తూ సవాల్‌ విసరడం, వైసిపి కార్పొరేటర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్‌ మయూర్‌కు కౌంటర్‌ ఇస్తూ మూడడుగుల మనిషివి, ఆడోళ్లచేత కొట్టించుకుంటావని హెచ్చరించడం... వంటి మాటలన్నీ కూడా హద్దులు దాటినవే! సాధారణంగా ఇంకో సామాజికవర్గం నాయకులు ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆనం సోదరులపై విమర్శలు చేస్తే రెడ్లలోనన్నా రోషం రావాలి. కాని నెల్లూరులో రెడ్లు కూడా అనిల్‌కు ఈ విషయంలో మద్దతునిస్తున్నారు. ఈరోజుకీ ఆనం పక్కన తిరేగే వాళ్ళు కూడా జగన్‌పై ఆయన చేసే విమర్శలను సహించడం లేదు. కాకపోతే వివేకా కోసం భరిస్తున్నారంతే! రోజురోజుకీ జగన్‌పై రెచ్చిపోతూ జనంలో పలుచబడిపోతున్నాడు వివేకా! అంతేకాదు, తన రాజకీయ చరిత్రతో పోల్చుకుంటే ఏ మాత్రం దరిదాపుల్లోలేని నాయకుల చేత నానా మాటలనిపించుకోవడం అతనికి అవసరమా?

portదాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు దుగరాజపట్నంను ఎంపిక చేయడం తెలిసిందే! రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఏపికి ఇచ్చిన హామీలలో దుగరాజపట్నంను పొందుపరిచారు. 2014 ఎలక్షన్‌లకు ముందు తిరుపతి ఎంపిగా వున్న చింతా మోహన్‌ ఈ పోర్టుకు హడావిడిగా శంకు స్థాపన చేయించాలని కూడా చూసారు. అయితే అది సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ పోర్టుపై మీన మేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ పోర్టు ఇక్కడ కడితే వచ్చే లాభనష్టాలపై బేరీజు వేశారు. దుగరాజపట్నంకు సమీపంలోనే కృష్ణపట్నం పోర్టుతో పాటు చెన్నైలో రెండు పోర్టులు వుండడం, దీనికితోడు ఇస్రో, పర్యావరణ శాఖ అభ్యంతరాలు ఈ పోర్టుకు అడ్డంకిగా మారాయి. ఈ పోర్టు కట్టినా పెద్దగా ఆదాయం ఉండబోదని నీతిఅయోగ్‌ తేల్చిచెప్పింది. దీనిబదులు ఏపికి మరో రూపంలో ప్రయోజనం కల్పిస్తామని కేంద్రం చెప్పడంతో ఇక దుగరాజపట్నం పోర్టుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter