pigsనెల్లూరు నగరంలో మంత్రులు, మేయర్‌, కార్పొరేటర్లు... అందరూ వందల కోట్లలో అభివృద్ధి పనుల గురించి మాట్లాడేవాళ్లే! కాని మూడేళ్లుగా చూస్తున్నాం కదా... మాటలెక్కువ, పనులు తక్కువ అన్నట్లుగా వుంది పనితీరు. నగరంలో ప్రజలకు ప్రధాన సమస్యగా మారింది పందులు, దోమలు. ఇప్పుడు కాస్తున్న ఎండల దెబ్బకు ముదురుదోమలు మలమల మాడి చస్తున్నాయి. కాని, పం దులు మాత్రం తగ్గడం లేదు. నెల్లూరులో మనుషుల కంటే పందులు సంఖ్య పెరిగి పోతోంది. కొంతమంది వీటిని కోసుకుని తింటుండబట్టి సరిపోతుంది గాని లేకుంటే నెల్లూరు రోడ్లు, వీధుల్లో మనుషులు నడవ డానికి కూడా సందులేనంతగా పందులు తిరుగుతుండేవి. నెల్లూరు నగరంలో మురికివాడల్లోనే కాదు, నెల్లూరు జూబ్లీ హిల్స్‌గా చెప్పుకునే మాగుంట లే అవుట్‌, ఆదిత్యనగర్‌ వంటి ప్రాంతాల్లో కూడా పందులు మందలు మందలుగా తిరుగు తున్నాయి. పందుల పెంపకందార్ల దెబ్బకు జడిసి పాలకులు పందుల ఏరివేత జోలికి పోవడం లేదు. కాని, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీరావు మాత్రం పందుల విషయంలో చాలా సీరియస్‌గా వున్నాడు. 22వ తేదీ ఆయన తన ఛాంబర్‌లో శానిటేషన్‌ అధికా రులు, పందుల యజమానులతో మీటింగ్‌ పెట్టుకున్నారు. పందుల ఏరివేతకు వాళ్లకు 45రోజుల గడువిచ్చారు. ఆ గడువు తర్వాత ఏ సందులో పంది కనిపించినా కాల్చివేస్తామని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. ఈ విషయంలో కమిషనర్‌ గట్టిగానే వున్నట్లు కనిపిస్తోంది. ఆయన వార్నింగ్‌ పనిచేస్తే 45రోజుల తర్వాత మనకు నగరంలో చూద్దామనుకున్నా పందులు కనిపించకపోవచ్చు.

summerఅసలే ఎండా కాలం..మే నెల అంటేనే మండే నెల. ఈ నెలలో ఎండలు కాదు.. నిప్పులు కురుస్తుంటాయి. అందులోనూ రోహిణి కార్తె, రోహిణిలో రోళ్ళు పగిలి పోతాయని సామెత. అంటే, ఎండదెబ్బ ఎంత తీవ్రంగా వుంటుందో అర్ధమవు తుంది. మే ప్రారంభం నుంచి జిల్లాలో రోజురోజుకు ఎండలు మరింతగా పెరిగి పోతూనే వున్నాయి. ఒకప్పట్లో 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతకే హడలిపోయే నెల్లూరు జనం, ఇప్పుడు 45 నుంచి 48 దాకా ఎండ తీవ్రత పెరిగిపోతుండడం చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం దాకా ఎండల భగభగ..రాత్రి 8 గంటల దాకా ఒకటే సెగ. పగలంతా మండే ఎండ..రాత్రయితే ఉక్కపోత.. జనం అల్లాడి చస్తున్నారు. వేడి గాలుల ధాటికి వడలిపోయి.. ఎంతో మంది ముసలీముతకా జనం వడదెబ్బతో హరీమంటున్నారు. బతుకు తెరువు కోసం తప్పనిసరై ఇంత ఎండల్లోనూ ఇళ్ళలోంచి బయటకు వచ్చి పనులు చేసుకునే కూలీలు, శ్రమజీవుల పరిస్థితి మరింత దయనీ యంగా వుంటోంది. నీడ పట్టున వున్నప్ప టికీ ముసలిప్రాణులు ఎండ దెబ్బకు తట్టు కోలేక ప్రాణాలు విడుస్తున్నారు. మరీ ఇంత ఎండలు నెల్లూరులో ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడలేదు. రోడ్లపక్కల చెట్లన్నీ ఇష్టమొచ్చినట్లు నరికిపారేయడం, అడవుల్ని నరికేయడం, సామాజిక వనాల్ని విస్తరిం చుకోలేకపోవడం..వంటివన్నీ మనం చేసుకుంటున్న తప్పిదాలే. అంతెందుకు, ఇంత పెద్ద నగరంలో ప్రధాన రోడ్ల పక్కన కనీసం నిల్చోడానికి నీడ కూడా లేకుండా చెట్లన్నిటినీ నాశనం చేసేయడం.. అసలు పచ్చదనమన్నది కనిపించకుండా పోవడం.. ఇదంతా మనం చేజేతులా తెచ్చుకుంటున్న అవస్తే అన్నది అందరికీ తెలిసిందే. దీంతో పర్యావరణం పరిస్థితి అంతా తారుమారైపోతోంది. పర్యావరణం కాపాడుకుందాం.. మొక్కలు పెంచు కుందాం అంటూ చేసే నినాదాలు కేవలం కంటి తుడుపు కోసమేనా?.. వందల సంవత్సరాల నాటి వృక్షాలను కూలగొట్టేసి చిన్ని చిన్ని మొక్కలు నాటుకున్నందువల్ల ప్రయోజనం ఎప్పటికి చేకూరుతుంది?.. మొక్కలు నాటుకోవడం అన్నది పర్యా వరణానికి ప్రాణప్రదమైన విషయమన్నది ఎవరూ కాదనలేని సత్యం. అది అందరి కర్తవ్యం కూడా. అయితే, మొక్కలు నాటడం పేరుతో అందినకాడికి నిధులను స్వాహా చేసేసి, నాటిన మొక్కలకి కనీసం దోసెడు నీళ్ళు కూడా పోయకుండా వాటిని ఎండబెట్టేయడం మనం చూస్తూనే వున్నాం. జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఇదే దుస్థితి. కేవలం నామమాత్రపు పథకాలు..ఊకదంపుడు ఉపన్యాసాలు పర్యావరణాన్ని మార్చగలవా?..మానవుడి ఈ అరాచక ప్రవృత్తికి పర్యావరణమే తారుమారైపోతోంది. ఇంక ప్రకృతిని నిందించి ఏం ప్రయోజనం?..

ఒకప్పుడు ముక్కారు పండే నేల.. ఇప్పుడు ఎడారి?..

గతంలో నెల్లూరుసీమలో ప్రతి ఏటా పుష్కలంగా వానలు కురిసి ముక్కారు (ఏడాదికి మూరు కార్లు) పంటలు పండేవి. రాష్ట్రంలోనే మంచి పంటభూములున్న ప్రాంతంగా నెల్లూరు ప్రసిద్ధి. ముక్కారు పంటలకు, రుచికరమైన ధాన్యానికి కోశాగారం వంటి సింహపురి సీమ ఇప్పుడు రానురాను ఎడారిగా మారుతోంది. పచ్చగా కళకళలాడే పంటపొలాలన్నీ ఇటీవలి కాలంలో రూపుమారిపోతు న్నాయి. మరోవైపు వేలాది ఎకరాలు పంట భూములు వానలు లేక బీడుభూములుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలోనే అనేక గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో తాగేం దుకు చుక్క మంచినీరు దొరక్క జనం విలవిలలాడిపోతున్నారు. మూగజీవాలకు పిడికెడు గడ్డి, గుక్కెడు నీరు దొరక్క అవి పడే బాధలకు అంతే లేదు. చివరికి అడవు ల్లోనూ నీళ్ళు లేక, ఊర్లమీదకు వస్తున్న మూగజీవాలను కుక్కలు వెంటాడి చంపే పరిస్థితి. జిల్లాలో అనేక మండలాలు కరువుతో వున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఎంత దయనీయమైన స్థితి వున్నా ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వుండబట్టే వడదెబ్బకు పోయేవాళ్ళు పోతూనే వున్నారు. మండే ఎండల్లో జనం అవస్తలు పడుతూనే వున్నారు.

వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం

జిల్లాలో గత పదిరోజులుగా ఎండలు మరీ విపరీతమైపోయాయి. మండే సూర్యుడి భగభగలతో ప్రాణాలు అవిసి పోతున్నాయి. ఎండల తీవ్రత 44 డిగ్రీలు దాటుతుంటే ముసలి ప్రాణాలు బతికి బట్టకట్టడమంటే మాటలా?..గత వారం పదిరోజుల్లోనే ఈ వడదెబ్బకు దాదాపు వందమందికి పైగానే ప్రాణాలు కోల్పోయి వుంటారని ఒక అంచనా. అయితే, వీటిని నిర్ధారించి బాధిత కుటుంబాలకు తగు సాయం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న దేమీ లేదు. ప్రకృతి విపత్తులకు మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకో పోవడం ఎంత దారుణం?...కాకి అరు స్తూనే వుంటుంది..కరవాడ ఎండుతూనే వుంటుందన్న సామెతగా ఎవరెంతగా మొత్తుకుంటున్నా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన. ఇకనైనా ప్రభుత్వం, జిల్లా అధికారగణం మానవతా హృదయంతోనైనా స్పందించి, వడదెబ్బ మృతుల కుటుంబాలను ఆదు కోవాల్సి వుంది. గ్రామాల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టాల్సి వుంది.

raviజిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ముఖ్యంగా బీసీ వర్గాల నుండి పెద్ద నాయకుడిగా వున్న బీద రవిచంద్రకే మూడోసారి తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

గత పదమూడేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడ్డప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా గాని, సామాజిక సమీకరణల కోణంలో గాని పార్టీ అధిష్టానం బీద రవి చంద్రనే అధ్యక్షుడిగా కొనసాగించడానికి నిర్ణయించింది. పార్టీకి పూర్తి విధేయుడు రవిచంద్ర. బి.సి వర్గాలలో పలుకుబడి, పరపతి వున్నోడు. జిల్లాలో నాయకు లందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. 2004కు ముందు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ప్రచారంలోకి వచ్చాడు. అయితే ఆ ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్‌లోకి వెళ్లినా, రవిచంద్ర మాత్రం తెలుగుదేశంలోనే ఉండిపోయాడు. 2004 నుండి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు కూడా పార్టీని వీడకుండా పార్టీ కోసం పనిచేసాడు. పార్టీ పట్ల అతను చూపిన విశ్వాసం, విధేయతే ఈరోజు ఆయ నకు పార్టీలో పెద్దపీట వేసి గౌరవించింది.

ఇక రవిచంద్రను అధ్యక్షుడిగా కొన సాగించినట్లే పార్టీ జిల్లా ప్రధానకార్య దర్శిగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డిని కొనసా గించాలని నిర్ణయించారు. తెలుగుదేశం అనుబంధ సంఘాల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఆనం వివేకా కొడుకు, కార్పొరేటర్‌ ఆనం రంగ మయూర్‌రెడ్డికి అప్పగించారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలిగా గత జడ్పీటీసీ ఎన్నికల్లో డి.వి.సత్రం నుండి వైకాపా అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశంలో చేరిన ముప్పాళ్ల విజేతను నియమించారు. తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉదయగిరి నియో జకవర్గానికి చెందిన బొల్లినేని రామారావు (ఎమ్మెల్యే కాదు)ను, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా నెల్లూరు, చింతారెడ్డిపాలెంకు చెందిన పెనేటి సునీల్‌కుమార్‌ను, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన మొహి ద్దీన్‌ను, బిసి సెల్‌ అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన పిఎల్‌ రావును, టిఎన్‌టియుసి అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన ఓబుళనాయుడును ఎంపిక చేశారు. తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కాకర్ల తిరుమలనాయుడునే కొనసాగించాలని నిర్ణయించారు.

Page 1 of 131

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter