chetta chadaramనెల్లూరు నగరంలో మున్నెన్నడూ లేనంతగా విషజ్వరాలు జనాన్ని గడగడ వణికిస్తున్నాయి. నగరమంతా ఎక్కడ చూసినా మురుగు గుంతలతో, పారిశుద్ద్యం పరమ అద్వాన్నంగా ఉండడంతో దోమలు పెరిగిపోయి ప్రజలు నానా రకాల వ్యాధులకు గురవుతున్నారు. అయినా, అధికారగణం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయి. అటు కార్పొరేషన్‌ కానీ, వైద్యఆరోగ్యశాఖ కానీ ఈ విషజ్వరాలను నివారించడానికి ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ప్రతి సీజన్‌లోనూ సీజనల్‌ వ్యాధులు, విషజ్వరాలు మరింతగా ప్రబలిపోతున్నాయి.

ఇటీవల నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసమని ఎడాపెడా తవ్వేస్తున్న గుంతలతో రోడ్లన్నీ మురుగ్గుంటలుగా..అవే దోమల గుంతలుగా మారిపోయాయి. వీధుల్లో మురుగునీటి ప్రవాహాలు వెల్లువెత్తుతున్నాయి. 'ఏ వీధి చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతివీధి సమస్తం మురుగు ప్రవాహం'..అన్నట్లుగా అంతా దుర్గంధమే. చిన్న వాన కురిసినా చాలు, ఇక నెల్లూరు రోడ్ల మీద నడవాలంటేే సర్కస్‌ చేయాల్సివస్తోంది. ఏ వీధి చూసినా మురుగుదిబ్బలు.. చెత్తకుప్పలతో నిండిపోవడంతో నగరమే ఒక మురికికూపంగా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నా, ఆచరణలో నానాటికీ దుర్గంధం పెరిగి పోతుండడమే తప్ప పారిశుద్ద్య పరిస్థితి బాగుపడిందే లేదు. అంతేకాక, సైడుకాలువల కోసం తవ్విన గుంతల్ని పూడ్చే పనులు నామమాత్రంగానే ఉండడంతో నగరప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ వీధి చూసినా ఇదే వేదన. బాగున్న రోడ్లన్నీ గుంతలమయం చేశారని, రేపో మాపో వచ్చి బాగుచేస్తారులే అనుకుంటే రోజులు గడిచినా ఆ గుంతలు పూడ్చేవారే కరువయ్యారని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. అతుకులు గతుకులుగా, గుంతలు మిట్టలుగా తయారైన రోడ్లను చూసి ఈ నగరవీధులకు ఎంత దుస్థితి పట్టిందో కదా అని వాపోతున్నారు. నగరంలో దోమలు ఎంతగా ప్రబలిపోయి వీరవిహారం చేస్తున్నా దోమలను నివారించే ఫాగింగ్‌ యంత్రాలు మాత్రం కనిపించడం లేదు. ఉన్నతాధికా రులు ఎప్పుడో ఒకసారి కఠినంగా ఆదేశించిన రోజున మాత్రం ఆ సిబ్బంది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారే తప్ప నగరంలో పారిశుద్ద్యాన్ని క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవడం లేదు. నగరంలోని ట్రంకు రోడ్డు, స్టోన్‌హౌస్‌పేట, పెద్దబజారు, చిన్నబజారు, మూలాపేట, రంగ నాయకులపేట, బాలాజీనగర్‌, దర్గామిట్ట, వేదాయపాళెం ఇలా ఏ ప్రధాన ప్రాంతంలోని వీధుల్లోకెళ్ళినా అపారిశుద్ద్యమే. చివరికి కలెక్టర్‌ కార్యా లయం చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా పరమ అధ్వాన్నంగా చెత్తకుప్పల మయంగా దర్శనమిస్తున్నాయి. వానొస్తే నీరంతా ఆ గుంతల్లోనే నిల్వ ఉండడంతో, అవి మురుగునీటి గుంటలుగా మారుతుంటాయి. ఒక్కోసారి ఆ ప్రాంతాల్లో మంచినీటి పైపులు పగిలిపోయి ఉంటే ఆ మురుగంతా ఆ పైపుల్లోకి వచ్చేస్తుంటుంది. రోడ్డు మధ్యలోనే ఉన్న ఆ గుంతలు అటు వాహనాల రాకపోకలకు, ఇటు పాదచారులకు ఎంతో ఇబ్బందిగా ఉన్నా నిత్యం అనేకమంది అధికారులు కూడా ఆ దారుల్లోనే వాహనాల్లో

వెళ్తున్నా, చూసీ చూడనట్లు వెళ్తుంటారే తప్ప ప్రజల బాధలు అస్సలు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ఎన్నివిధాలుగా చెప్తున్నా గతుకుల మయంగా ఉన్న రోడ్లను బాగుచేసిందీ లేదు.. ఆ గుంతలను సక్రమంగా పూడ్చిందీ లేదు. ఇదీ దుస్థితి. ఇక ఆ గుంతల్లోని మురుగంతా రోజుల తరబడి వాహనాల తొక్కిడితో బురదగా మారి, అదే ఎండకు ఎండి..చివరికి మట్టిగా మారి.. దానిపాటికదే గాలిలో... ధూళిలో కలసిపోవాల్సిందే తప్ప ఇక మరో మార్గాంతరం ఉండడం లేదు. తద్వారా ఏర్పడుతున్న ఆ దుర్గంధపూరిత వాతావరణానికి, ఆ కాలుష్యానికి సమీప ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, రోగనిరోధకశక్తి బలహీనమైపోయిన వృద్ధులు లేనిపోని వ్యాధుల బారినపడుతూ నానా బాధలు పడుతున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు వైరల్‌ ఫీవర్స్‌తో పాటు, డయేరియా, డెంగ్యూ తదితర ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం ఉండడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క నగరంలోనే కాక, జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో, గ్రామాల్లోనూ, ప్రతి పంచాయితీలోనూ ఇదే పరిస్థితి. పారిశుద్ద్య పరిరక్షణకు నిధులున్నా సిబ్బంది, అధికారులు అనేకమంది ఉన్నా పారిశుద్ద్య పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా నగరంలో విషజ్వరాలు మరింతగా ప్రబలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, పారిశుద్ద్యాన్ని పరిరక్షించకపోవడంతో, ఎక్కడ చూసినా దుర్గంధమే తాండవిస్తోందని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనేకరకాల వ్యాధుల బారినపడి ఆసుపత్రులకు వెళ్తే ఆ పరీక్షలు ఈ పరీక్షలని అధికమొత్తంలో డబ్బు గుంజేసుకుంటున్నారని, ఈ బాధలనుంచి తమను కాపాడేదెవరని ప్రజలు మరింతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా, జిల్లా కలెక్టర్‌ తదితర ఉన్నతాధికారులు నగరంలోని వీధులను, ప్రధానరోడ్లను స్వయంగా పరిశీలించి, గుంతలు పూడ్పించి రోడ్లను బాగుచేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలను తీవ్ర ఆందో ళనకు గురిచేస్తున్న విషజ్వరాలను నివారించడానికి, అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ద్య పరిస్థితిని వెంటనే మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

crick bettingనెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు. తిన్నామా, తిరిగామా, పడుకున్నామా అన్న పాలసీని అనుసరించే ఎస్పీలు వస్తే బెట్టింగే కాదు, అన్ని రకాల అవలక్షణ కార్యక్రమాలు నిర్వి ఘ్నంగా జరిగిపోతుంటాయి. సిన్సియర్‌ పోలీసు ఆఫీసర్లు వస్తే రౌడీయిజాన్ని అణచి వేయడం, దొంగతనాలను అరికట్టడం, ట్రాఫిక్‌ను దారిలో పెట్టడం వంటివి ప్రధానంగా జరుగుతుంటాయి. కాని, రామకృష్ణ వచ్చీరావడంతోనే బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాడు. దాదాపు రెండువారాల పాటూ ఈ కేసులో లోతైన విచారణ నిర్వహించి ప్రధాన బుకీలను, పంటర్లను, బెట్టింగ్‌ ఆడేవాళ్లను అందరూ కలిపి 115మందిని దాకా అరెస్ట్‌ చేసి కోర్టుకు పెట్టడం తెలిసిందే! కోర్టు మెట్లెక్కి నిందితులకు బెయిల్‌ రావడంతోనే ఈ కేసును అక్కడితో వదిలేస్తారనుకున్నారు. అయితే ఎస్పీ మళ్ళీ వదల్లేదు. జ్యూడిషియల్‌ కష్టడీలో వున్న ఐదుమంది ప్రధానబుకీలు కృష్ణసింగ్‌, షేక్‌ షంషీర్‌, డిటిఎస్‌ రమేష్‌, తన్నీరు రమేష్‌కుమార్‌, అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డిలను తిరిగి కోర్టు అనుమతితో పోలీసు కష్టడీకి తీసుకుని విచారించారు. ముఖ్యంగా బుకీలకు జిల్లాలోని ఇతర ప్రముఖులకు మధ్య వున్న సంబంధాలను బయటకు తెచ్చే క్రమంలోనే ఆయన విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బెట్టింగ్స్‌ మాఫియాతో అధికార, ప్రతిపక్ష పార్టీలలోని పలువురు నాయకులకు సంబంధాలున్నట్లు వెల్లడైంది. వైసిపి నాయకులను మాత్రం పోలీసులకు అరెస్ట్‌ చేశారు. అధికారపార్టీకి చెందినవాళ్ళు మాత్రం పరారీలో వున్నారు. వీళ్లను కూడా పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి ఎస్పీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికీ చెమటలు పట్టిస్తున్నాడు.

killerగత ఏడాది జనవరిలో వరుస హత్యలకు పాల్పడి జిల్లాలో భయోత్పాతాన్ని సృష్టించిన సైకో కిల్లర్‌ కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌కు నాల్గవ అదనపు జిల్లా జడ్జి మరణశిక్ష విధిస్తూ 17వతేదీ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే కొండాపురం మండలానికి చెందిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు కావలి పట్టణానికి వలస వచ్చి న్యూడిల్స్‌ బండిని పెట్టుకున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ అతను నేరాల వైపు దృష్టి సారించాడు. ఒంటరిగా వున్న మహిళలను టార్గెట్‌ చేసాడు. కావలిలో ఇంట్లో ఒంటరిగా వున్న ఓ మహిళను తలపై సుత్తితో కొట్టి చంపి ఆమె ఒంటిపై వున్న బంగారు నగలతో ఉడాయించాడు. నెల్లూరు రూరల్‌ మండలం పెద్దచెరుకూరులో వృద్ధ పూజారి దంపతులను హత్య చేసి పరారయ్యాడు. గతేడాది జూలై 9న నెల్లూరు, చిల్డ్రన్స్‌ పార్కు ప్రాంతంలో వున్న ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లోకి కేబుల్‌ టీవీ టెక్నీషియన్‌ లాగా వెళ్లాడు. అక్కడ వున్న నాగేశ్వరరావు భార్య ప్రభావతి మీద, వారి బంధువైన మరో అమ్మాయి మీద సుత్తితో దాడి చేసాడు. ప్రభావతి అక్కడికక్కడే చనిపోగా, ఇంకో యువతి స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఇంటికొచ్చిన నాగేశ్వరరావు మీద కూడా వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు చేరి వెంకటేశ్వర్లును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత గాయపడ్డ యువతి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వరుస హత్యలు అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించాయి. ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లో ఈ సైకో కిల్లర్‌ పట్టుబడకపోయివుంటే జిల్లాలో ఇంకెన్ని ఘోరాలు జరిగి వుండేవో? మొత్తానికి ఈ సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Page 1 of 148

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • వీడుతున్న సంకెళ్ళు
  రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశంను,…

Newsletter