tdp mlasఇంటర్‌లో, టెన్త్‌ ఫలితాలలో గ్రేడ్‌లు చూస్తుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు, గ్రేడ్‌లు వంటివిస్తుంటారు. గతంలో మంత్రులకు ర్యాంకులు ప్రకటించి నప్పుడు మన జిల్లా మంత్రి నారాయణ చివరి స్థానానికి పోవడం, అది వివాదం కావడం జరిగింది. మంత్రులకు మల్లే ఎమ్మెల్యేలకు కూడా ఆయన గ్రేడ్‌లు ప్రక టించారు. 70శాతం సంతృప్తి మార్కును దాటిన ఎమ్మెల్యేలకు ఆయన ఏ-1గ్రేడ్‌ను ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద తెలుగు దేశం ఎమ్మెల్యేలలో 13మంది మాత్రమే ఏ-1 గ్రేడ్‌ సాధించారు. మన జిల్లాలో టీడీపీకి వైసిపి గోడ దూకి వచ్చిన ఎమ్మె ల్యేను కూడా కలుపుకుంటే నలుగురు ఎమ్మెల్యేలున్నారు. నలుగురికీ కూడా ఏ-1 గ్రేడ్‌ రాలేదు.

జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల మీద ప్రజల్లో అసంతృప్తి వుంది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ దఫాలో వ్యతిరేకత తెచ్చుకున్నాడు. పలు వివాదా లను కొని తెచ్చుకున్నాడు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి పార్టీలోనే ఒక వర్గం వ్యతిరేకంగా వుంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు ప్రజలకు అందుబాటులో వుండడని పేరుంది. పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా ఆయన పెద్దగా పనులు చేయలేకపోతున్నాడు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ వైసిపి నుండి టీడీపీలో చేరాడు. సహజం గానే దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వుంటుంది. నియోజవర్గంలోని పార్టీలో కూడా సమ న్వయం లేదు. కాబట్టి చంద్రబాబు ఏ-1 గ్రేడ్‌ను వీళ్ళు అందుకోలేకపోయారు.

tdsఈరోజా... రేపా... అనుకుంటూ జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయ కులు నాలుగేళ్ళుగా ఎదురుచూపులు చూసారు. ఏదో ఒకరోజు తమకు అదృష్టం పడుతుందని ఆశపడ్డారు. ఆ ఆశలన్నీ గల్లంతైనట్లే... ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగేళ్ళయ్యింది. ఇక వుండేది ఏడాది కాలమే. అది కూడా ఇక ఎన్నికల సీజన్‌. నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇక సీట్లు, అభ్యర్థులు, నోట్లు, గెలుపోటములు... ఇదే టాపిక్‌!

కంభం విజయరామిరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, దేశాయిశెట్టి హనుమంతురావు, డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, టి.అనూరాధ, డాక్టర్‌ జ్యోత్స్నలత... వీళ్ళంతా పార్టీని నమ్ముకు న్నోళ్లే! పార్టీ జెండాలు మోసినోళ్ళే! పార్టీ కోసం అంతో ఇంతో నష్టపోయినవాళ్ళే! నామినేటెడ్‌ పదవుల విషయంలో నాలుగేళ్ళుగా వీళ్ళ పేర్లు వార్తల్లో వుంటూనే వున్నాయి. ఇంతవరకు ఒక్కరికీ పదవి దక్కలేదు. చివరాఖరుగా అన్నట్లు ఇటీవల టీటీడీ ఛైర్మెన్‌ పదవితో పాటు ఆర్టీసీ రీజియన్‌ ఛైర్మెన్‌ పదవులను కూడా భర్తీ చేసారు. నెల్లూరు రీజియన్‌ ఛైర్మెన్‌ పదవిని తీసుకుపోయి చిత్తూరుజిల్లా వాళ్ళకిచ్చారు. టీటీడీ బోర్డు సభ్యులుగా జిల్లాలో ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు. జిల్లాలో ఒకరికి సభ్యుడిగా అవకాశం రావచ్చనే ఆశ కూడా పోయింది. ఈ టర్మ్‌కు ఈ విధంగా సరిపెట్టుకోక తప్పదు.

nlr tdpరాష్ట్రంలోనే చంద్రబాబుకు మింగుడుపడని జిల్లా ఏదన్నా ఉందంటే అది నెల్లూరే! ఇక్కడ ప్రతిపక్ష వైసిపి బలంగా వుంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకే మెజార్టీ సీట్లొచ్చాయి. అందుకే చంద్రబాబు సీఎం అయ్యాక ఏ జిల్లా మీద లేని కసి నెల్లూరుజిల్లా ప్రజల మీద పెంచుకున్నాడు. పలు సందర్భాల్లో ఆయన ఈ కసిని బయటపెట్టుకున్నాడు కూడా! అధికారంలోకి వచ్చాక రెండేళ్ళపాటు నెల్లూరుజిల్లాపై ఆయన సవతిప్రేమనే చూపాడు. ఒక్క జాతీయ సంస్థను కాని, ఒక్క ఇండస్ట్రీని కాని ఆయన నెల్లూరుజిల్లాకు ఇవ్వలేదు.

గతం గతః అన్నట్లు జరిగిందేదో జరిగిపోయిందనుకుని గత రెండేళ్ళ నుండి కొంచెం మనసు మార్చుకుని కొంతవరకు జిల్లాలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నాడు. జిల్లా నుండి రెండో మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని తీసుకున్నప్పుడే చంద్రబాబు మనసు కొంచెం మారినట్లయ్యింది. మున్సిపల్‌ మంత్రిగా నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర ఎవరి స్థాయిలో వాళ్ళు పార్టీని పైకి లేపడానికి జాకీలు వేస్తూనే వున్నారు. అయితే జిల్లాలో పార్టీ పైకి లేస్తేగా... వీళ్ళు ఎంత ప్రయత్నించినా పార్టీ బలం పుంజుకోవడం లేదు సరికదా, జిల్లాలో వైసిపి మరింత బలం పుంజుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈసారి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయకపోతే నెల్లూరు లోక్‌సభకు పార్టీలో గట్టి అభ్యర్థే లేడు. జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఢంకా బజాయించి ఈ సీటు గెలుస్తామని చెప్పడానికి ఒక్క సీటు కూడా లేదు. సర్వే పల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి (పార్టీ మారకుంటే), కావలిలో బీద మస్తాన్‌రావులు మాత్రమే గట్టిపోటీ ఇవ్వ గలరని తెలుస్తోంది. ఆదాల టీడీపీలోనే వుండి నెల్లూరురూరల్‌లో పోటీ చేస్తే ఆయన కూడా గట్టి పోటీనే ఇవ్వొచ్చు. వీళ్ళు కాకుండా ఉదయగిరి, వెంకటగిరి, కోవూరులలో సిటింగ్‌ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వుంది. మళ్ళీ వాళ్ళకే సీట్లిస్తే ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అలాగని వారి స్థానాలలో కొత్త వారిని తెద్దామా అంటే... ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకంటే బెటర్‌ అభ్యర్థులు పార్టీలో లేరు. గూడూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌కే సీటిస్తే అది కూడా ఓడిపోతుందనే ప్రచారం వుంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాలలో పార్టీ చంద్రబాబు పుణ్యాన చాలా బలహీనంగా వుంది. నారాయణ లాంటి వాళ్ళను దించినా పార్టీ ఎంతవరకు బలపడుతుందో చెప్పలేని పరిస్థితి. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అయితే వైసిపి ఎమ్మెల్యే సంజీవయ్యకు సరిజోడు దొరకడం టీడీపీకి గగనంగా వుంది.

మొత్తంగా చూస్తే జిల్లాలో టిడిపి పరిస్థితి బాగాలేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పార్టీ ఇంకా బలహీనపడుతోంది. నాయకులు ఎన్ని పాదయాత్రలు, ఎన్ని సైకిల్‌ యాత్రలు చేసినా ఓటర్లను సైకిలెక్కించడం కష్టంగా వుంది.

Page 1 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter