anuradhaఆడోళ్ళు కడుపులో ఏదీ దాచుకోరు... ఆనందం వచ్చినా పట్టలేము, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేము... ఏదీ ఆపుకోలేరు. వారిని చూసి జిల్లా తెలుగుదేశం మగనాయకులు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి. జిల్లా తెలుగుదేశం నాయకుల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటుంటారు. అయినా ఎదురెదురు పడితే ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. కడుపుల్లో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు. మేం మగనాయకులు మాదిరిగా కాదు... లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకోటి చేయలేం, ఏదైనా ఓపెన్‌ ఫైట్‌ అంటూ జిల్లా తెలుగు మహిళలు తమ సత్తా చూపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తమ విభేదాలకు వేదికగా మలిచారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులకు మధ్య విభేదాలున్నట్లే నాయకురాళ్ళ మధ్య కూడా విభేదాలున్నాయి. అయితే నాయకుల మధ్య విభేదాలున్నా బయటపడలేరు. నాయకురాళ్ళు మాత్రం బయటపడ్డారు. 8వ తేదీ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధ ఆధ్వర్యంలో టీడీపీ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. దీనికి మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ అతిథిగా వచ్చి మాట్లాడిపోబోయారు. అంతలో జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు పొత్తూరు శైలజ, రాష్ట్ర మహిళా ఆర్ధిక సహకార సంస్థ డైరెక్టర్‌ మల్లి నిర్మలలు ఇంకొందరు మహిళలతో వచ్చారు. మంత్రి నారాయణ ముందే అనూరాధతో మల్లి నిర్మల, శైలజలు గొడవకు దిగారు. తమకు తెలియకుండా తమను పిలవకుండా పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. దీంతో అనూరాధ వైపు మహిళలు కూడా అరుపులకు లేచారు. మంత్రి వారికి సర్ధిచెప్పి అక్కడ నుండి జారుకున్నాడు. మంత్రి వెళ్ళాక ఇరువర్గాల మధ్య గొడవ ఇంకొంచెం ఎక్కువైంది. ఈ రచ్చ భరించలేక పార్టీ ఆఫీసు ఇన్‌ఛార్జి శీనయ్య మంత్రికి ఫోన్‌ ద్వారా విషయం చెప్పాడు. పార్టీ ఆఫీసు నుండి అందర్నీ పంపించేయమని మంత్రి చెప్పడంతో శీనయ్య అదే పని చేసాడు. మొత్తానికి కడుపులో కసిపెట్టుకుని పెదాలపై చిరునవ్వులు చిందించడానికి మేం నాయకులం కాదు... నాయకురాళ్ళం అని నిరూపించారు తెలుగు మహిళా నేతలు.

huda dగత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలం నుండి కూడా పత్రికలలో, ప్రచారంలో విస్తృతంగా కనిపించి, వినిపించిన నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) కల ఎట్టకేలకు నెరవేరింది. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 18వ తేదీన ఆమోదముద్ర వేసింది. 'నుడా'కు తుది రూపం కూడా వచ్చేసింది.

నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాల్టీలు, కావలి, బోగోలు, అల్లూరు, కొడవలూరు, విడవలూరు, కోవూరు, నెల్లూరు రూరల్‌, వెంకటాచలం, మనుబోలు, గూడూరు, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరు, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, డి.వి.సత్రం, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలను కలిపి 'నుడా'కు తుదిరూపం ఇచ్చారు. ఓ మాటలో చెప్పాలంటే జిల్లాకు ఉత్తరాన ఉన్న కావలి మండలం నుండి దక్షిణాన వున్న తడ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వున్న మండలాలను 'నుడా'లో చేర్చారు. 1644 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఒక కార్పొరేషన్‌, నాలుగు మున్సిపాల్టీలు, 21 మండలాలు, 156గ్రామాలతో 13.01లక్షల జనాభాతో నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి రూపుదిద్దుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే 'నుడా' ఏర్పాటుపై చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా 'నుడా' ఏర్పాటుపై ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. పలు దఫాలుగా నివేదికలు తయారయ్యాయి. సాధారణంగా ఇంతకుముందు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఆ నగరం పరిసరాలలో గ్రామాలను కలిపి ఏర్పాటు చేసేవాళ్లు. కాని తొలిసారిగా దాదాపు 200 కిలోమీటర్ల పొడవున 'నుడా'ను ఏర్పాటు చేసారు. అమరావతి రాజధాని కూడా ఇంత పొడవున లేదు.

ఛైర్మెన్‌ గిరిపై ఆశలు

నుడా ఆవిర్భవించింది. ఇక పాలక మండలిని నియమించాలి. ఒక ఛైర్మెన్‌, 20మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సంగతి పక్కన పెడితే, ఛైర్మెన్‌ పదవి కోసం ఇక రసవత్తరమైన పోటీ ఉంటుంది. 'నుడా' ఛైర్మెన్‌ రేసులో ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, దేశాయిశెట్టి హనుమంతురావు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనూరాధ వంటి నాయకులందరూ వున్నారు. ఎవరి మార్గాల్లో వాళ్లు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే వీరెవరికీ సంబంధం లేకుండా, అసలు రాజకీయాలతో కూడా సంబంధంలేని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ పేరు కూడా ఛైర్మెన్‌గా ప్రచారంలో

ఉండడం విశేషం. కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు కుమార్తెగానే కాక, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, నెల్లూరు నెక్ట్స్‌ వంటి కార్యక్రమాలతో నెల్లూరు అభివృద్ధి కోసం సొంత ప్రణాళికలతో ముందుకు వెళుతున్న ఆమెను 'నుడా'కు ఛైర్మెన్‌గా చేస్తే తెలుగుదేశంలో అసంతృప్తికి తెరదించడంతో పాటు నెల్లూరు అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి సహకారం పొందవచ్చనే ఆలోచన వుంది. ఇక రెండో కోణంలో డాక్టర్‌ జడ్‌.శివ ప్రసాద్‌ పేరు బలంగా వినిపిస్తోంది. 2014 కార్పొరేషన్‌ ఎన్నికల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపింది ఆయనే! పార్టీకి అన్ని విధాలుగా సేవలం దించారు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు సైతం వైద్యవృత్తి ద్వారా పలు ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదీగాక నెల్లూరు రూరల్‌, నగర నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ లుగా గాని, కన్వీనర్‌లుగా కాని అగ్ర వర్ణాల నాయకులున్నారు. మైనార్టీకి చెందిన వ్యక్తి మేయర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో బలహీనవర్గాలలో బలం పెంచుకునే దిశగా ఆ వర్గాలకు చెందిన జడ్‌.యస్‌ను నుడా ఛైర్మెన్‌ను చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా పార్టీ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ilandsతలా తోక లేకుండా చేసే పనులకు ఎంత ప్రజాధనం దుర్వినియోగమవు తుందన్నదానికి నెల్లూరులోని విగ్రహాల ఐలాండ్‌లే ఒక ఉదాహరణ. నగరాన్ని అందంగా కనిపించేలా చేయడానికి వివిధ ఆకృతులతో ఐలాండ్‌లు నిర్మించడం వరకు ఓకే! అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించని రీతిలో ఐలాండ్‌లు ఉండాలి. రోడ్లు వెడల్పుగా వుండి, ట్రాఫిక్‌ సాఫీగా పోతుంటే ఐల్యాండ్‌ ఎంత పెద్దదున్నా ఇబ్బంది లేదు.

కాని నెల్లూరులో రోడ్లు ఉండేదే అంతంత మాత్రం. ఆక్రమణలతో రోడ్లు మూసుకుపోయాయి. వీటికి తోడు రోడ్ల మధ్యలో ఐలాండ్‌లు... వీటి వల్లే ట్రాఫిక్‌ సమస్యలు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆనం వివేకానందరెడ్డి నెల్లూరును ఒంటి చేత్తో ఏలుతున్నప్పుడు నగరంలో వున్న ఐలాండ్‌ లన్నింటిని అందంగా ముస్తాబు చేయిం చారు. గాంధీబొమ్మ, నెహ్రూబొమ్మ, ఇందిరమ్మ బొమ్మ, ఆనం వెంకురెడ్డి, గాంధీ, అంబేద్కర్‌, పూలే, ఏ.సి.సుబ్బారెడ్డి, వై.యస్‌., రాజీవ్‌గాంధీ... ఇలా చాలా ఐలాండ్‌లను పెద్దవిగా చేశారు. వాటర్‌ ఫౌంటేన్‌లు, గార్డెనింగ్‌, బొమ్మలు వంటి వాటితో వాటిని ఆకర్షణీయంగానే తీర్చి దిద్దారు. అయితే ఆ ఆకర్షణలు, తళుకు బెళుకులు తాత్కాలికమే అయ్యాయి. వాటర్‌ ఫౌంటేన్‌లు తుప్పుపట్టాయి. ఐలాండ్‌లు మాత్రం ట్రాఫిక్‌కు పెద్ద అడ్డయ్యాయి.

నెల్లూరు ట్రాఫిక్‌ను సరిదిద్దేక్రమంలో ఎస్పీ విశాల్‌గున్నీ ఈ ఐలాండ్‌లను తగ్గించే పనికి శ్రీకారం చుట్టడం తెలి సిందే! నగరంలో మొత్తం 14 ఐలాండ్‌ లను కుదించాలని నిర్ణయించారు. కొన్ని విగ్రహాల ఐలాండ్‌లను తగ్గించొద్దంటూ కొన్ని సంఘాల వాళ్లు ఆందోళన చేసినా ఎస్పీ లెక్కపెట్టలేదు. విగ్రహాల పేరుతో వితండవాదాలు చేయొద్దంటూ గట్టిగానే చెప్పారు. ట్రాఫిక్‌ ఐలాండ్‌లను తగ్గించే పని తొందరలోనే పూర్తి కావచ్చు.

అయితే ఇక్కడ బాధల్లా ఒక్కటే... ఐలాండ్‌లను పెంచడానికీ ప్రజాసొమ్మే దుర్వినియోగమైంది, ఇప్పుడు కుదించ డానికి వారి సొమ్మే వాడాల్సి వచ్చింది. పాలకుల ఆనాలోచిత నిర్ణయాలకు ప్రజల సొమ్ము ఈ విధంగా రోడ్ల పాలవుతోంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter