trafficజమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్న యినా పూర్తిగా తుడిచిపెట్టొచ్చేమోగాని నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యను ఒక దారికి తేవడం మాత్రం ఎవరి వల్లా అయ్యే పనికాదు. ఏ ఎస్పీకైనా నెల్లూరులో పెద్ద సవాల్‌ ట్రాఫిక్కే! కొందరు ఎస్పీలు మాకెందుకొచ్చిన తలనొప్పిలే అని దాని గురించే పట్టించుకోరు. ఇంకొందరు జనం అవస్థలు చూడలేక కొంతన్నా సరి దిద్దాలనే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత ఎస్పీ రామకృష్ణ అదే ప్రయత్నం చేస్తున్నారు.

రోడ్లు ఎలాగూ పెంచలేరు. వాహనా లను తగ్గించలేరు. కనీసం కొన్ని మార్పు లతో ట్రాఫిక్‌ను సరిదిద్దాలనుకున్నారు. ఇందులో భాగంగానే కె.వి.ఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద వున్న జంక్షన్‌ను మూసి వేయించి అటూ ఇటూ కొంచెం దూరంలో సిండికేట్‌ బ్యాంకు వద్ద, కస్తూరిదేవి స్కూల్‌ వద్ద వాహనాలు మలుపులు తిరిగేలా డివైడర్లు ఏర్పాటు చేయించారు. దీనివల్ల జంక్షన్‌లో రోడ్డు దాటడం కోసం ఒక్కో రోడ్డులో వాహనాలను ఆపేసి ఇంకో రోడ్డులో వాహనాలను పంపే పరిస్థితి

ఉండదు. ఇక్కడ మలుపు తిరిగి ఎటువైపు వెళ్ళే వాహనాలు అటు వెళ్లొచ్చు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అవసరం లేని పద్ధతి ఇది. కాక పోతే మలుపు తిరిగే చోట రోడ్డును ఇంకా వెడల్పు చేయాలి. దాని వల్ల నేరుగా వచ్చే వాహనాలకు మలుపు తిరుగుతున్న వాహ నాలతో ఇబ్బంది వుండదు. మలుపు తిరిగే చోట రోడ్డు ఇరుకు వల్ల యధా తధంగా ట్రాఫిక్‌జాం అవుతుంది. గాంధీ బొమ్మ, రామలింగాపురం జంక్షన్‌ల వద్ద కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. వాహనాలు మలుపు తిరిగే చోట రోడ్డు వెడల్పు చేసి మలుపు తిరిగే వాహనాలకు, అలాగే నేరుగా వచ్చే వాహనాలకు విడివిడి లైన్‌లు కేటాయిస్తే ఈ విధానం విజయ వంతమవుతుంది.

ilandsహైదరాబాద్ లో ఐఎస్ఐ టెర్రరిజం, కర్నూలుకు ఫ్యాక్షనిజం, కరీంనగర్ కు మావోయిజం ఎటువంటి సమస్యో నెల్లూరు నగరానికి ట్రాఫిక్ అలాంటి సమస్య. నెల్లూరులో ఇది ఎప్పటికీ పరిష్కారం చేయలేని సమస్యే. ఎందుకంటే పెరుగుతున్న ఆటోలను, కార్లను, బస్సులను, బైక్ లను తగ్గించలేం. రోజురోజుకు వాహనాలు పెరిగిపోతున్నాయని చెప్పి రోడ్లను పెంచలేం కదా. ఉన్నరోడ్లను ఇంకా వెడల్పు చేయలేం కదా. పెరిగిపోతున్న ట్రాఫిక్ ను తగ్గించలేం గాని కొంత క్రమపద్ధతిలో పెడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నగ్నసత్యం. పోలీసులు గట్టిగా పనిచేస్తే ఈ ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం పెద్ద సమస్య కాదు. వాహనాలను క్రమపద్ధతిలో నడిచేలా చేసి ట్రాఫిక్ జాం వంటి సమస్యలను నివారించవచ్చు.

నెల్లూరులో ట్రాఫిక్ కు ప్రధాన సమస్య ఆటోలు. దాదాపు 15వేల ఆటోలున్నాయి. ఇన్ని ఆటోలు మన రాష్ర్టంలో ఇంకే నగరంలోనూ కనిపించవు. ఇక సిటీబస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు వేలసంఖ్యలోనే ఉంటాయి. ఇక అయ్యప్పగుడి నుండి ఎల్ఐసి ఆఫీసు వరకు రోడ్డు కొంత విశాలంగా వుంది. కాని అక్కడి నుండి బోసుబొమ్మ దాకా చాలా వరకు రద్దీగానే వుంటుంది. దీనికి తోడు ట్రంకురోడ్డులో, మినీబైపాస్ లలో ఆయా విగ్రహాల వద్ద నిర్మించి వున్న ఐలాండ్ లు మరీ పెద్దవి కావడం ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉంటుంది.

కొత్త ఎస్పీగా వచ్చిన సెంథిల్ కుమార్ వీటిపై దృష్టి పెట్టారు. కార్పొరేషన్ పాలకులు, అధికారులు సహకరిస్తే ఐలాండ్ లను తగ్గించి ట్రాఫిక్ ను కొంతవరకు దారిలో పెట్టాలనే ఆలోచనలో ఆయనున్నట్లు తెలుస్తుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter