policestationపోలీసుస్టేషన్‌లంటే ఒక ప్పుడు నరకానికి నమూనాగా వుండేవి. శిథిలావస్థలో వున్న భవనాలు... పెంకులు, పెచ్చు లూడే శ్లాబులు... వానొస్తే నీళ్ళు కారే గదులు... కంపు కొట్టే బాత్రూంలు... తప్పు చేసి లాకప్‌లో వున్న వాళ్ళకే కాదు, ఉద్యోగ ధర్మంతో ఇక్కడ పనిచేసే పోలీసులకు కూడా నరకంగా వుండేది.

ఇప్పుడు పోలీసుస్టేషన్‌లు మారుతు న్నాయి. ఆధునిక పోకడలను సంతరించు కుంటూ అందంగా ముస్తాబవుతున్నాయి. నెల్లూరు నగరంలో ఒక్కో పోలీస్‌స్టేషన్‌ రూపం మారుతోంది. దాదాపు 20ఏళ్ల క్రితం నెల్లూరు నగరంలో బాలాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ను మోడల్‌ పోలీస్‌స్టేషన్‌గా నిర్మించారు. మొదట్లో గౌడ్‌ హాస్టల్‌ వద్ద పాడుబడిన బిల్డింగ్‌లో ఈ పోలీస్‌స్టేషన్‌ వుండేది. తర్వాత దానిని ఎస్పీ శ్రీనివాస రెడ్డి హయాంలో బాలాజీనగర్‌పార్క్‌లో నూతనంగా నిర్మించిన భవనంలోకి మార్చారు. అప్పట్లో ఈ మోడల్‌ స్టేషన్‌కు ప్రత్యేకంగా డిఎస్పీని కూడా కేటాయిం చారు. ఆ తర్వాత అయ్యప్పగుడి వద్ద వున్న పార్కులో అయిదో నగర పోలీసుస్టేషన్‌ భవన సముదాయాన్ని ఎంతో అందంగా నిర్మించడమే కాక, పోలీసుస్టేషన్‌ ప్రాంగ ణంలో పచ్చదనంకు ప్రాధాన్యతనిచ్చారు. ఆ సమయంలోనే నెల్లూరు రెండోనగర పోలీసుస్టేషన్‌కు ఉన్న స్థలంలోనే కొత్త భవనాలు నిర్మించారు. ప్రస్తుత గూడూరు డిఎస్పీ రాంబాబు నెల్లూరు త్రీటౌన్‌ ఎస్‌.ఐగా వున్న సమయంలో ఈ స్టేషన్‌ పక్కనేవున్న ఖాళీ స్థలాన్ని ఒక చర్చివారు ఆక్రమించాలని చూసారు. అయితే ఎస్‌.ఐగా వున్న రాంబాబు అప్పట్లో వారి ఆటలు సాగనీయకుండా అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఆ స్థలాన్ని కాపా డారు. ఇప్పుడు అదే స్థలంలో సువిశా లంగా, ఆధునికంగా మూడోనగర పోలీసు స్టేషన్‌ రూపుదిద్దుకుంది. నెల్లూరు నగ రంలో ఇదో అత్యుత్తమ పోలీసుస్టేషన్‌ భవనంగా తయారైంది. ఇక తాజాగా నెల్లూరు నాలుగోనగర పోలీసుస్టేషన్‌కు క్షయ ఆసుపత్రి ప్రాంగణంలో శంకుస్థాపన జరగడం తెలిసిందే! వాటన్నింటిని తల దన్నే రీతిలో దీనిని నిర్మించనున్నారు. ఇక పెద్దబజారులో వున్న ఒకటో నగర పోలీసు స్టేషన్‌లోనే మార్పులు చేయాల్సి వుంది. బ్రిటీష్‌ వారి హయాంలో కట్టిన భవనం లోనే ఇది కొనసాగుతోంది. అలాగే నెల్లూరురూరల్‌ పోలీసుస్టేషన్‌కు కూడా వెంటనే కొత్త భవనాలను నిర్మించాల్సి వుంది. మొత్తానికి పోలీసుస్టేషన్‌లు అంటే ఒకప్పుడు బూతుబంగ్లాలు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు కార్పొరేట్‌ బంగ్లాలను తలపిం చేలా అవి రూపుదిద్దుకుంటుండడం విశేషం.

tdp leadersతెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ వుండిందని, పార్టీ అధికా రంలోకి వచ్చాక తమను వెనక్కు నెట్టేసి, కాంగ్రెస్‌, వైకాపాల నుండి వలసవచ్చిన వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారంటూ జిల్లా టీడీపీ లోని సీనియర్‌ నాయకులు ఆవేదన చెందుతున్నారు.

ముఖ్యంగా నారాయణ మంత్రి అయ్యాక జిల్లాలో ఒరిజినల్‌ తెలుగుదేశం నాయకులకంటే వైకాపా, కాంగ్రెస్‌ల నుండి వచ్చినవాళ్ళకే పెద్దపీట వేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఇచ్చిన తొలి నామినేటెడ్‌ పదవి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మెన్‌గా కాంగ్రెస్‌ నుండి వచ్చిన చాట్ల నర శింహారావును నియమించడం. ఆయన పూర్తిగా నారా యణ మనిషి. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వైసిపి నుండి వచ్చిన ముప్పాళ్ళ విజేతను నియమిం చారు. అలాగే సూళ్ళూరుపేట చెంగాళమ్మ దేవస్థానం బోర్డు ఛైర్మెన్‌గా ముప్పాళ్ళ వెంకటేశ్వరరెడ్డిని నియ మించారు. ఈ నియామకాల పట్ల సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని పార్టీ సీనియర్‌ నాయకులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఇక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండుసార్లు పోటీచేసి అన్ని విధాలా నష్టపోయిన దేశాయిశెట్టి హనుమంతురావును కాకుండా కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశంలో చేరిన తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పెట్టుకున్నాడు మంత్రి నారాయణ. పట్టాభి ఓడిపోవడం తెలిసిందే!

ఎన్నికలు వేగంగా తరుముకొస్తున్న నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం అంటూ జరిగితే ఇప్పుడే జరగాలి. ఈమేరకు కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ కాబట్టి ఆ సామాజికవర్గంకు ఈసారి పెద్దపీట వేయొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే 'నుడా' ఛైర్మెన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నియమించివున్నారు. ఇక ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, కంభం విజయరామిరెడ్డి, టి.అనూరాధ లలో ఇద్దరిని నామినేటెడ్‌ పదవులు వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనం రామనారాయణరెడ్డి రావడం వల్ల ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ హోదాను కోల్పోయిన గూటూరు కన్నబాబును కూడా నామినేటెడ్‌ పదవికి ఎంపిక చేస్తారని సమాచారం. బలహీనవర్గాల నుండి డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, కాపు సామాజికవర్గం నుండి దేశాయి శెట్టి హనుమంతురావులకు ఖచ్చితంగా ఈసారి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి.

నామినేటెడ్‌ పదవులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని తమ్ముళ్ళు అసంతృప్తితో వున్నారు. కనీసం ఇప్పుడన్నా పార్టీని నమ్ముకుని, పార్టీ జెండాలు మోసి, పార్టీ కోసం అన్ని విధాలా నష్టపోయినవాళ్ళకు పదవులు ఇస్తే గత అసంతృప్తిని కొంతన్నా మాయం చేసినవాళ్ళవుతారు.

kakani sanjeeవైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 25పార్లమెంట్‌ స్థానాలను 25 జిల్లాలుగా మారుస్తామని చెప్పి ఆ పార్టీ అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ఆ దిశగా తన పార్టీ నుండే తొలి అడుగు వేసాడు. ఈసారి జిల్లాల వారీగా కాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించాడు. ఇప్పటివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా వున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇక నుండి నెల్లూరు పార్ల మెంటు(నెల్లూరు సిటీ, నెల్లూరురూరల్‌, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, ప్రకాశంజిల్లాలోని కందుకూరు అసెంబ్లీలు) అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్యను తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించారు. నెల్లూరుజిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి అసెంబ్లీలతో పాటు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి.

Page 1 of 23

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
  కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
 • ఇప్పుడన్నా ఇస్తారా?
  తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter