beedaరాజ్యసభ రేసులో చివరివరకు పోరాడిన మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు చివరి క్షణంలో వెనుకబడిపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సున్నితంగా ఆయనను పక్కకు తప్పించాడు. దీంతో ఈసారి రాజ్యసభ పై గంపెడాశలు పెట్టుకున్న బిఎంఆర్‌కు చివరకు నిరాశే మిగిలింది.

2014 ఎన్నికల్లో కావలి నుండి ఓటమి చెందిన మస్తాన్‌ రావును చంద్రబాబు రాజధానికమిటిలో సభ్యులుగా నియమిం చారు. అలాగే ఆయన కావలి ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల కంటే రాజ్యసభకు వెళ్ళడమే మేలనుకున్న మస్తాన్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఒకసారి రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు గట్టిగానే ప్రయత్నించాడు కాని సఫలం కాలేదు. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మెన్‌గా కూడా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. అది కూడా సక్సెస్‌ కాలేదు.

ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ పదవులకు ఎన్నికలొ చ్చాయి. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి టీడీపీకి రెండు, వైసిపికి ఒకటి దక్కాయి. తెలుగుదేశంకు దక్కే రెండు పదవుల్లో ఒకదాని కోసం బీద మస్తాన్‌రావు గట్టిగా ప్రయత్నిం చాడు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు జిల్లా పార్టీ నాయకులు కూడా బీఎంఆర్‌కు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. చివరి వరకు కూడా బీఎంఆర్‌కు రాజ్యసభ గ్యారంటీ అనే ప్రచారం సాగింది. అయితే చివరి క్షణంలో చంద్రబాబు మొండిచేయి చూపారు. బీదకు రాజ్యసభను ఇవ్వకపోవడానికి చంద్రబాబు చెప్పిన కారణం మీరు రాజ్యసభకు వెళితే కావలిలో ఇక అభ్యర్థి లేడని! ఇది నిజమే. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కావలి తెలుగుదేశంపార్టీకి బీద సోదరులే నాయకులు. బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా వున్నాడు. ఆయనకు ఇంకా పదవీ కాలం వుంది. బీద మస్తాన్‌రావు కావలి ఇన్‌ఛార్జ్‌గా వుంటున్నాడు. కావలి అసెంబ్లీకి గట్టి అభ్యర్థి బీద మస్తాన్‌రావే! ఆయన రాజ్యసభకు వెళితే కావలికి కొత్త అభ్యర్థిని వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఎలక్షన్‌ చేయగల సత్తా వున్నోళ్ళంతా రాజ్యసభకు, శాసనమండలికి వెళితే రేపు ఎలక్షన్‌లలో పోటీ చేసేదెవరు? ఈ కోవలోనే బీఎంఆర్‌ ఆశలు గల్లంతయ్యాయని తెలుస్తోంది.

no helmetఎందుకనో గాని నెల్లూరుజిల్లాలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ ప్రయోగం విఫలమవుతూనే వుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలన్న నిబంధనను గతంలో ఎన్నోసార్లు అమలు చేసారు. దీని కోసం మోటార్‌ వాహనాల షోరూమ్‌లలో హెల్మెట్‌ల అమ్మకాలు కూడా పెట్టారు. బండితో పాటు హెల్మెట్‌ కొనాలనే నిబంధన తెచ్చారు. హెల్మెట్‌ లేని వాహనదారులకు పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే దానిని నిరంతరాయంగా అమలు చేయలేకపోయారు. కొద్దిరోజులు మాత్రమే ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌లు పెట్టుకున్నారు. తర్వాత యధాపరిస్థితే!

కాగా, రవాణాశాఖాధికారులు మరోసారి హెల్మెట్‌ సబ్జెక్ట్‌ను తెరమీదకు తెచ్చారు. ఈ నెల 20వ తేదీ నుండి పెట్రోల్‌ బంకుల వద్ద హెల్మెట్‌ లేని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్‌ పోయరంట. 'నో హెల్మెట్‌ - నో పెట్రోల్‌' నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తామని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తామని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ శివరాంప్రసాద్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పెట్రోల్‌ బంకు ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో కూడా మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్‌ వాడకం మంచిదే! ప్రజలు, ద్విచక్రవాహనదారులు కూడా దీనికి సహకరిస్తే బాగుంటుంది.

trafficజమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్న యినా పూర్తిగా తుడిచిపెట్టొచ్చేమోగాని నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యను ఒక దారికి తేవడం మాత్రం ఎవరి వల్లా అయ్యే పనికాదు. ఏ ఎస్పీకైనా నెల్లూరులో పెద్ద సవాల్‌ ట్రాఫిక్కే! కొందరు ఎస్పీలు మాకెందుకొచ్చిన తలనొప్పిలే అని దాని గురించే పట్టించుకోరు. ఇంకొందరు జనం అవస్థలు చూడలేక కొంతన్నా సరి దిద్దాలనే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత ఎస్పీ రామకృష్ణ అదే ప్రయత్నం చేస్తున్నారు.

రోడ్లు ఎలాగూ పెంచలేరు. వాహనా లను తగ్గించలేరు. కనీసం కొన్ని మార్పు లతో ట్రాఫిక్‌ను సరిదిద్దాలనుకున్నారు. ఇందులో భాగంగానే కె.వి.ఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద వున్న జంక్షన్‌ను మూసి వేయించి అటూ ఇటూ కొంచెం దూరంలో సిండికేట్‌ బ్యాంకు వద్ద, కస్తూరిదేవి స్కూల్‌ వద్ద వాహనాలు మలుపులు తిరిగేలా డివైడర్లు ఏర్పాటు చేయించారు. దీనివల్ల జంక్షన్‌లో రోడ్డు దాటడం కోసం ఒక్కో రోడ్డులో వాహనాలను ఆపేసి ఇంకో రోడ్డులో వాహనాలను పంపే పరిస్థితి

ఉండదు. ఇక్కడ మలుపు తిరిగి ఎటువైపు వెళ్ళే వాహనాలు అటు వెళ్లొచ్చు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అవసరం లేని పద్ధతి ఇది. కాక పోతే మలుపు తిరిగే చోట రోడ్డును ఇంకా వెడల్పు చేయాలి. దాని వల్ల నేరుగా వచ్చే వాహనాలకు మలుపు తిరుగుతున్న వాహ నాలతో ఇబ్బంది వుండదు. మలుపు తిరిగే చోట రోడ్డు ఇరుకు వల్ల యధా తధంగా ట్రాఫిక్‌జాం అవుతుంది. గాంధీ బొమ్మ, రామలింగాపురం జంక్షన్‌ల వద్ద కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. వాహనాలు మలుపు తిరిగే చోట రోడ్డు వెడల్పు చేసి మలుపు తిరిగే వాహనాలకు, అలాగే నేరుగా వచ్చే వాహనాలకు విడివిడి లైన్‌లు కేటాయిస్తే ఈ విధానం విజయ వంతమవుతుంది.

Page 7 of 48

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter