vakatiరాష్ట్రపతితో బ్రేక్‌ఫాస్ట్‌, ఉపరాష్ట్రపతితో లంచ్‌, ప్రధానమంత్రితో టీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో డిన్నర్‌. ఒకేరోజులో ఇవన్నీ మాటల్లో సాధ్యం చేయగల మేధావి, మాటల మాంత్రికుడు, జిల్లా రాజకీయ చిత్రపటంలో ఓ విచిత్రమైన నాయకుడు వాకాటి నారాయణరెడ్డి. జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడిగా ఓ పర్యాయం పనిచేసి ఆ తరువాత యంయల్‌సిగా కాంగ్రెస్‌పార్టీ నుండి ఎంపికై గోడదూకి తెలుగుదేశం నుండి రెండవసారి బరిలో దిగి గెలిచిన వ్యక్తి ఆయన. ఇంతవరకూ బాగానే వుంది, మరి ఇప్పుడు ఆయనెక్కడున్నాడు...?

సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కీలకపాత్ర పోషిస్తూ బలమైన నాయకుడిగా ఎదగాలనే తాపత్రయంతో ఎప్పుడూ వార్తల్లో వుంటూ, సాధ్యమైనంత వరకూ ఎవరో ఒకరితో విభేదిస్తూ తనదైన శైలిలో రాణిస్తుండిన వాకాటి నారాయణరెడ్డి వృత్తి కాంట్రాక్టులైతే ప్రవృత్తి రాజకీయాలు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్‌.రాజశేఖరరెడ్డి వంటి నాయకులతో నేరుగా సంబంధాలు కలిగివుండేవాడు. కాంగ్రెస్‌లో వున్నప్పుడు ఇప్పుడే సోనియాగాంధీతో లంచ్‌ చేసి వచ్చాననో, వై.యస్‌.తో ఫ్లైట్‌లో ప్రక్కసీటులో కూర్చుని ప్రయాణం చేసివచ్చాననో చెప్పడంతో కాలం గడిపేవాడు. రాజకీయ నేతగా, కాంట్రాక్టర్‌గా కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం ఆయన హవా బాగానే నడిచింది. గల్లీ నుండి ఢిల్లీ స్థాయిలో ఏర్పడిన మంచి సంబంధాలు, వ్యాపార వ్యవహార లావాదేవీలు చురుకుగా కొనసాగాయి. ఢిల్లీలో ఓ గెస్ట్‌హౌస్‌, అద్దెకు ప్రత్యేక విమానం, హెలికాఫ్టర్‌లు ఇలా ఆయన స్టైల్‌కి తగ్గట్లుగా అన్నీ ఘనంగానే వుండేవి. వీటితో పాటు బ్యాంకు అప్పులు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. డాంబికానికి పోయి బ్యాంకుల్లో చేసిన అప్పుల్తో వ్యాపారాలకు బదులుగా వ్యవహారాలు చేయడంతో ఆ అప్పులు కాస్తా మెడకు చుట్టుకున్నాయి. విషయం సిబిఐ దాకా పాకి వాకాటి కోరుకునే విధంగానే ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది.

దాదాపు నాలుగు నెలల క్రితం ఆయనను అరెస్టు చేసిన సిబిఐ ఆయనను ఎక్కడ విచారిస్తుందో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనతో స్నేహబాంధవ్యాలు నడిపిన నేతలు ఎవ్వరూ ఆయన గురించే పట్టించుకోవడం లేదు. అసలు వాకాటి నారాయణరెడ్డి అనే ఓ నాయకుడుండేవాడన్న సంగతి కూడా అందరూ మర్చిపోయారు. వీళ్ళెవ్వరైనా ఓసారి ఆయన గురించి ఆలోచించి కనీసం ఆయన ఎక్కడున్నాడో ఎవరెవరితో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లు చేస్తున్నాడో జిల్లా ప్రజలకు తెలిపితే బాగుంటుందేమో...! అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు మనం ఎంత సంపాదిస్తే అంత వొదగాలనీ... నలుగురితో మంచిగా మెలగాలని.

cement roadనెల్లూరు-ఆత్మకూరు మధ్య రోడ్డు... ఒకప్పుడు తారురోడ్డు. ముంబై రహదారిగా పేరు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రా లకు వెళ్ళే వాహనాలకు ప్రధాన మార్గం. గతంలో కృష్ణపట్నంపోర్టు నుండి ముడి ఇనుపఖనిజం ఎగుమతి జరుగుతున్న రోజుల్లో ప్రతిరోజూ కొన్ని వందల లారీలు ఈ రోడ్డు మీద తిరుగుతుండేవి. ఈ లారీల క్రింద పడే ఒక్క నెల్లూరు జిల్లాలోనే వందమందికి పైగా మరణించారు. ఈ లారీల దెబ్బకు అప్పట్లో రోడ్డు కూడా బాగా పాడైపోయింది. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణపట్నం నుండి పొద్దుటూరు దాకా ముంబై రహదారిని నాలుగులైన్లుగా విస్తరించాలని నిర్ణ యించారు. అయితే ఆయన హఠాన్మరణంతో ఈ ప్రతిపాదన మరుగునపడిపోయింది.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నెల్లూరు నుండి ఆత్మకూరు సమీపం వరకు సిమెంట్‌ రోడ్డును వేసారు. దాదాపు 300కోట్ల వ్యయంతో ఈ రోడ్డు వేయడం జరిగింది. సిమెంట్‌ ఫ్యాక్టరీలకు ఆదాయం సమకూర్చడానికి తప్పితే ఇలాంటి సిమెంట్‌ రోడ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వేసిన సిమెంట్‌రోడ్డు నాలుగులైన్లు కాదు, గతంలో వున్న డబుల్‌ రోడ్డును ఇంకొంచెం పెంచారంతే. వాహనాలు ఎదురెదురుగా పోవాల్సిందే! ప్రమాదాలు షరా మామూలే! ముఖ్యంగా సిమెంట్‌రోడ్డు మీద వాహనాలలో వెళుతుంటే బండి వూగడంతో పాటు ఒకటే శబ్దం. దీనికితోడు ఈ రోడ్డుపై బండికి పట్టుండదు. ఏదన్నా అడ్డమొచ్చి సడెన్‌ బ్రేక్‌ కొడితే బండి తిరగబడే పరిస్థితి. ఈమధ్య కొన్ని వాహనాలు అలాగే తిరగబడ్డాయి. ఈ సిమెంట్‌రోడ్డు వేయడానికి పెట్టిన ఖర్చుతో శుభ్రంగా నాలుగులైన్ల తారురోడ్డు వచ్చుండేది. భూసేకరణ కూడా జరిపి వుండొచ్చు. తారురోడ్డు మీద వున్న ప్రయాణ సుఖం సిమెంట్‌ రోడ్డు మీద లేకుండాపోయింది.

tdp mlasఇంటర్‌లో, టెన్త్‌ ఫలితాలలో గ్రేడ్‌లు చూస్తుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు, గ్రేడ్‌లు వంటివిస్తుంటారు. గతంలో మంత్రులకు ర్యాంకులు ప్రకటించి నప్పుడు మన జిల్లా మంత్రి నారాయణ చివరి స్థానానికి పోవడం, అది వివాదం కావడం జరిగింది. మంత్రులకు మల్లే ఎమ్మెల్యేలకు కూడా ఆయన గ్రేడ్‌లు ప్రక టించారు. 70శాతం సంతృప్తి మార్కును దాటిన ఎమ్మెల్యేలకు ఆయన ఏ-1గ్రేడ్‌ను ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద తెలుగు దేశం ఎమ్మెల్యేలలో 13మంది మాత్రమే ఏ-1 గ్రేడ్‌ సాధించారు. మన జిల్లాలో టీడీపీకి వైసిపి గోడ దూకి వచ్చిన ఎమ్మె ల్యేను కూడా కలుపుకుంటే నలుగురు ఎమ్మెల్యేలున్నారు. నలుగురికీ కూడా ఏ-1 గ్రేడ్‌ రాలేదు.

జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల మీద ప్రజల్లో అసంతృప్తి వుంది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ దఫాలో వ్యతిరేకత తెచ్చుకున్నాడు. పలు వివాదా లను కొని తెచ్చుకున్నాడు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి పార్టీలోనే ఒక వర్గం వ్యతిరేకంగా వుంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు ప్రజలకు అందుబాటులో వుండడని పేరుంది. పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా ఆయన పెద్దగా పనులు చేయలేకపోతున్నాడు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ వైసిపి నుండి టీడీపీలో చేరాడు. సహజం గానే దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వుంటుంది. నియోజవర్గంలోని పార్టీలో కూడా సమ న్వయం లేదు. కాబట్టి చంద్రబాబు ఏ-1 గ్రేడ్‌ను వీళ్ళు అందుకోలేకపోయారు.

Page 9 of 60

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter