narayanaచాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి నారాయణ పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లే ఎక్కువ. నారాయణ ఇన్‌స్టిట్యూట్స్‌, మందీమార్భలం ఎక్కువుగా ఈ నియోజకవర్గ పరిధిలోనే వుంది. అయితే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. 2000లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే నగరంలో ఆ పార్టీకి చివరి గెలుపు. నగరంలో ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలేవీ లేవు. ఇప్పుడింకా సమీకరణలు మారాయి. ప్రతిపక్ష వైకాపా ఇంకా బలంగా తయారైంది. బలహీనవర్గాలకు చెందిన వాడైనప్పటికీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ బలంగానే నిలబడుతున్నాడు. వ్యతిరేకత తెచ్చుకోలేదు. అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, క్రైస్తవులలోనూ పట్టు సాధించాడు. తెలుగుదేశంకు పట్టున్న నెల్లూరు తూర్పు ప్రాంతంలో సైతం వైసిపికి బలమైన ఓటుబ్యాంకును ఏర్పరచుకున్నాడు.

నెల్లూరు నగరంలో పరిస్థితులు ఆశాజనకంగా వుండవని, నెల్లూరురూరల్‌ అయితే బెటర్‌ అని, ఆ వైపుగా కూడా నారాయణ పేరు వినిపించింది. అయితే అక్కడ కూడా డేంజరే. అక్కడా వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా వున్నాడు. అనునిత్యం ప్రజల్లో వుంటున్నాడు. జనాలతో సామాన్యుడిగా కలిసిపోతున్నాడు. దీనికితోడు నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లెక్కువ. రూరల్‌లో గ్రామాలున్నాయి. ఈసారి రైతుల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి నారాయణకు ఇది కూడా సేఫ్‌జోన్‌ కాదు.

ఈ రెండుచోట్లా ఎక్కడైనా నారాయణ పోటీచేస్తే ఓకే... నెల్లూరు సిటీ నుండి ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే అనే నమ్మకంతో మైనార్టీల నుండి అబ్దుల్‌ అజీజ్‌, మహిళల నుండి అనూరాధ, శ్రీమతి వసంతలక్ష్మి, ఇన్‌ఛార్జ్‌ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఆయనను వదలడం లేదు.

nedurmalliనెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి బీజేపీనే నమ్ముకున్న యం.వెంకయ్యనాయుడు ఈ దేశానికి ఈరోజు ఉపరాష్ట్రపతి అయితే, జీవితాంతం కాంగ్రెస్‌ వాదిగానే వున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

అలాంటి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి రాజకీయ వారసుడే నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి. జనార్ధన్‌రెడ్డికి నలుగురు కొడుకులున్నా తండ్రి రాజకీయ ఆశయాలకు అనుగుణంగా అడుగులేస్తున్నది రాంకుమారే!

అయితే, నేదురుమల్లి నమ్ముకున్న కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో పతనమైపోయింది. కాని, ఆయనను నమ్ముకున్న వెంకటగిరి, ఆయన నమ్మిన వెంకటగిరి ప్రజలు ఇంకా వున్నారు. వెంకటగిరికి, నేదురుమల్లికి మధ్య వున్న అనుబంధాన్ని, రాజకీయ బంధాన్ని అలాగే కొనసాగనివ్వాలనే కృతనిశ్చయంతో ఆయన కొడుకు రాంకుమార్‌రెడ్డి వున్నాడు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుండి వెంకటగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం తెలిసిందే! ఇక్కడ వెంకటగిరి ప్రజలు కాంగ్రెస్‌ను మాత్రమే తిరస్కరించారు, నేదురుమల్లి కుటుంబాన్ని కాదు. అదే రాంకుమార్‌రెడ్డి ఆరోజు వైసిపి నుండో, టీడీపీ నుండో పోటీచేసుంటే పరిస్థితి ఇంకోరకంగా వుండేది. కాని, ఆరోజు ఆయన కాంగ్రెస్‌ను వదలలేక అక్కడే పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం తెలిసిందే!

2019 ఎన్నికల్లో వెంకటగిరి నుండి పోటీ చేయడానికి ఆయన సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీ అన్నదే తేలలేదు. ఖచ్చితంగా బీజేపీలో వుండడు. ఆయన వెంకటగిరి నుండి వైసిపి అభ్యర్థి అవుతాడా? లేక టీడీపీ అభ్యర్థి అవుతాడా? అన్నది తేలాల్సివుంది.

beedaనెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్ష పదవి అంటే ఎవరికైనా కత్తిమీద సాములాంటిదే! ఈ పదవిలో రాణించాలంటే అలివయ్యే పని కాదు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు మూడు పర్యాయాలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాడు. ఆ కాలంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా అనుభవం వున్నోడు కాబట్టి కష్టంగానైనా నెట్టుకొచ్చాడు.

2014 ఎన్నికలకు ముందే బీద రవిచంద్రకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రెడ్ల డామినేషన్‌ వుండే జిల్లా ఇది. బీద రవిచంద్ర బలహీనవర్గాలకు చెందిన నాయకుడు. అయినా కూడా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడిదాకా బాగానే నెట్టుకొచ్చాడు. జిల్లా తెలుగుదేశంపార్టీలో నాయకులు తలోదిక్కు చూస్తుంటారు. ఒకరంటే ఒకరికి పడదు. జిల్లాలో ఇద్దరు మంత్రులు సోమిరెడ్డి, నారాయణలుంటే ఇద్దరూ సీతయ్యలే! ఎవరిదారి వారిదే! ఎవరి రాజకీయ ధోరణి వారిదే! ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఒకప్పుడు రాజకీయ గురువే కాబట్టి ఆయనతో సమన్వయం బాగానే వుంది. కాకపోతే ఆనం వాళ్ళ విషయంలోనే కొంత ఫెయిలైనట్లుగా కనిపిస్తుంది. పార్టీపై వాళ్లెప్పటి నుండో అసంతృప్తితో వున్నారు. ఆ విషయాన్ని పసిగట్టి అధిష్టానానికి చేరవేయడంలోనూ, ఆనంను బుజ్జగించడంలోనూ జిల్లా పార్టీ నాయకత్వం సరైన సమయంలో స్పందించలేకపోయింది. ఇలా పార్టీలో నాయకుల మధ్యే సమన్వయం లేనప్పటికీ, అందరినీ కలుపుకునిపోవడంలో రవిచంద్ర తనవంతు కష్టం బాగానే చేసాడు.

ఇంతవరకు బాగానే వుంది. కాని, 2019 ఎన్నికలే జిల్లా అధ్యక్షుడికి పెద్దపరీక్ష కానున్నాయి. రాష్ట్రంలోనే తెలుగుదేశంపార్టీ అత్యంత బలహీనంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. రేపు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కూడా చాలా క్లిష్టంగా వుండొచ్చు. 2014 ఎన్నికల్లో 10సీట్లకు గాను టీడీపీకి మూడు సీట్లే వచ్చాయి. జిల్లాలో ఈసారి టీడీపీ పరిస్థితి అంతకన్నా ఘోరంగా వుండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి పని కుంటి గుర్రంపై యుద్ధానికి వెళ్ళినట్లే కాగలదు.

Page 10 of 60

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter