prasannaవైకాపా సీనియర్‌ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాను పార్టీ మారుతు న్నానన్న వదంతులకు తెరదించారు. తన రాజకీయ జీవితం చివరి క్షణం వరకు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వెంటే తన పయనమంటూ కుండబద్ధలుకొట్టారు.

ఇటీవలకాలంలో ప్రసన్న తెలుగు దేశం పార్టీలో చేరుతున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ లలోనూ పోస్ట్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనకు సీటు ఇవ్వలేదని ప్రసన్న అలిగాడని వార్తలొచ్చాయి. అసలు ప్రసన్న స్థానిక ఎమ్మెల్సీ సీటు అడగలేదు. అలాంటప్పుడు అలగాల్సిన అవసరమేముంది. అదీగాకుండా ఆయనే గనుక సీటు కావాలంటే ఇక ఇవ్వకుండా పోవడమేమిటి? ఆయన పోటీ చేసుంటే ఫైట్‌ ఇంకా టైట్‌ అయ్యుండేది కూడా!

ఇప్పటికప్పుడు తెలుగుదేశంలో చేరాల్సినంత అవసరం కూడా ఆయనకు లేదు. వైకాపాలో ఆయన గౌరవం ఆయనకుంది. ఆయన సీనియార్టీ ఆయ నది! 2014లో వైకాపా అధికారంలోకి వచ్చుంటే జిల్లా నుండి మంత్రి కూడా ఆయనే అయ్యుండేవాడు. జగన్మోహన్‌రెడ్డి అంత ప్రాధాన్యతనిస్తున్నాడాయనకు!

అయితే ప్రసన్నను తెలుగుదేశంలోకి లాగడానికి కొందరు చేసిన ప్రయత్నాలు నిజమేనని తెలుస్తోంది. ప్రసన్న సమీప బంధువులు జేసీ బ్రదర్స్‌ తెలుగుదేశంలో వున్నారు. ప్రసన్న మరో బావ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలుగుదేశంలోనే

ఉన్నప్పటికీ ఆయనకు ఈయనకు పడదు. కాబట్టి ప్రసన్న కోసం జేసీ బ్రదర్సే ప్రయ త్నించారు. కాని ప్రసన్న వారి ప్రతిపాద నను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ప్రసన్న రాజకీయ ప్రస్థానం మొద లైందే తెలుగుదేశం పార్టీ నుండి. 1993లో కోవూరు ఉపఎన్నిక ద్వారా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 1994, 1999లలో కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాడు. 2004లో ఓడిపోయాడు. 2009లో మళ్ళీ గెలిచాడు. అయితే అప్పుడు రెండోసారి కూడా తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. దాంతో చంద్రబాబు నాయకత్వం మీద విరక్తి పెంచుకున్న ప్రసన్న ఆయనపై పదునైన విమర్శలు గుప్పించి వై.యస్‌. పక్కన చేరారు. ఆ చేరడం చేరడం వై.యస్‌. మరణం తర్వాత కూడా ఆయన కొడుకు జగన్‌నే నీడలా అంటిపెట్టుకుని కొనసాగుతున్నాడు.

leadersత్వరలో నెల్లూరుజిల్లా స్థానిక శాసన మండలి నియోజకవర్గానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. వీటికంటే కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రంజుగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపాల మధ్య ప్రత్యక్ష యుద్ధం. సాధారణంగా ఈ తరహా ఎన్నికల్లో అధికారపార్టీదే పైచేయిగా ఉంటుంది. అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష స్థానిక ఓటర్లను సైతం ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకోగలరు. గతేడాది జరిగిన ప్రకాశంజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికే దీనికి ఉదాహరణ. ఆ జిల్లాలో వైకాపాకు మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి తెలుగుదేశం గెలవడం తెలిసిందే!

రేపు నెల్లూరు జిల్లాలో కూడా అదే జరగవచ్చు. మొదట్లో ఈ జిల్లాలో వైకాపాకే స్థానిక సంస్థల ఓటర్లు ఎక్కువుగా వున్నారు. తర్వాత కాలంలో కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైకాపా నుండి తెలుగుదేశంలో చేరడంతో పార్టీ బలాబలాలు తారుమారయ్యాయి.

అయినా కూడా నెల్లూరుజిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీకి పోటీ చేస్తామని వైకాపా నాయకులు ప్రకటించారు. మొన్న నెల్లూరుకు వచ్చిన ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తా మన్నారు. అయితే ప్రతిపక్షం తరఫున అంత ధైర్యంగా పోటీ చేసే అభ్యర్థి ఎవరా? అన్నది ప్రశ్న! కావలి మాజీఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆయన పేరు ప్రతిపాదించాడని తెలుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీలోకి దిగితే కనీసం 10 నుండి 15కోట్లన్నా ఖర్చుపెట్టాలి. గెలుపు గ్యారంటీ లేని సీటు కోసం ఆయన ఇంత సాహసం చేయగలడా? ప్రస్తుతం వైకాపాలో వున్న నాయకుల్లో అంత ఆర్ధిక భారాన్ని భరించేవాళ్లు లేరు. ఒకవేళ వంటేరు కాకుంటే వైకాపా నుండి నామమాత్రంగానైనా ఇంకో నాయకుడిని బరిలోకి దించవచ్చు. ఇక్కడ నుండి పోటీ చేయాలన్నది జగన్‌ పంతం!

వైకాపా అభ్యర్థి బరిలోకి దిగితే తెలుగుదేశం అభ్యర్థికి తడిసి మోపెడవడం ఖాయం. అధికారపార్టీ అభ్యర్థి అయినప్పటికీ ఖర్చు నుండి తప్పించుకోలేడు. అయితే ఖర్చుపెట్టడానికి సిద్ధంగా వున్న నాయకులు టీడీపీలో ఉండడం గమనార్హం. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాజీమంత్రులు ఆనం రామ నారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలతో పాటు డిసిసిబి ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, తెలుగుదేశం నాయకులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా రెడీగా వున్నారు. మరి చంద్రబాబు ఎవరిని ఆదరిస్తాడో చూడాలి!

tdp ycpఆంధ్రప్రదేశ్‌లోనే నెల్లూరుజిల్లా రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. ఇక్కడ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటుంటాయి. ఈ జిల్లా ప్రజలు ట్రెండ్‌ను సెట్‌ చేస్తారే గాని, ట్రెండ్‌ను ఫాలో అవ్వరు. ఇలాంటి చైతన్యవంతమైన జిల్లాలో తమ పట్టును నిలుపుకునేందుకు, పటిష్టంగా ఉండేందుకు ప్రధాన రాజకీయపార్టీలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో నెల్లూరుజిల్లాలో మున్ముందు ఏ పార్టీ బలపడనుందన్నది ప్రధాన చర్చనీయాంశం.

ఈరోజు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండే జిల్లాల్లో మొదటిది నెల్లూరు జిల్లానే! కడప, కర్నూలు వంటి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు జిల్లాకు ఇద్దరు ముగ్గురు లెక్కన పోయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే ఒక ఎమ్మెల్యే వెళ్లాడు. ఆరుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో జగన్‌కు బలమైన అండగా నిలిచారు.

2014ఎన్నికల్లో 10 అసెంబ్లీలకు గాను 7 సీట్లు వైకాపాకు వచ్చాయి. నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆర్ధికంగా సపోర్ట్‌ చేసుంటే

ఉదయగిరి, కోవూరులో కూడా గెలిచి ఉండేవాళ్లు. అయితే, అసలు జగనే సక్రమంగా ఎలక్షన్‌ చేసుంటే అధికారమే వచ్చుండేదనుకోండి! 2014కు ఇప్పటికి పార్టీల పరిస్థితిలో ఏమన్నా మార్పు వచ్చిందా అన్నది ప్రశ్న? వివిధ కోణాల్లో నుండి చూస్తే కొత్తగా సర్వేపల్లి, ఆత్మకూరులలో తప్పితే తెలుగుదేశం పార్టీ పుంజుకున్నదేమీ లేదు. అన్నిచోట్లా ప్రభుత్వం మీద వ్యతిరేకత బలంగానే కనిపిస్తోంది. దీనిని వైకాపా నాయకులు ఎంతవరకు తమ బలంగా మలచుకుంటారన్నదే సందేహం. వైకాపా ఎమ్మెల్యేలు ఆరుమంది కూడా ప్రజల్లో ఉంటున్నారు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter