sittingaరాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!

ముఖ్యంగా పార్టీకి జిల్లాలో వైసిపి నుండి జంప్‌ చేసొచ్చిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ను లెక్కలోకి తీసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలున్నారు. అసలు గూడూరు సీటును సునీల్‌కు ఇవ్వడమే పెద్ద సందేహం. సునీల్‌ వైసిపి నుండి వచ్చాక పార్టీ ఎమ్మెల్యేల లెక్క పెరిగిందనేగాని పార్టీకి ఇక్కడ అదనంగా ఒరిగిందేమీలేదు. వైసిపి నుండి ఆయన వెంట పెద్దగా వచ్చినవాళ్లు లేరు. అంతే కాదు, పార్టీలోనే కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. పార్టీలో చేర్చు కునేటప్పుడు సునీల్‌కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ గ్యారంటీ ఇచ్చి

ఉంటారు. కాని, అభ్యర్థి ఓడిపోతాడని రిపోర్ట్‌ వస్తే మాత్రం చంద్రబాబు మాటకంటే కూడా సర్వే రిపోర్ట్‌కే ఎక్కువ ప్రాధాన్యత నిస్తాడు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఆయనపై ఆరోపణలొచ్చాయి. ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. పార్టీ నాయకులలో కూడా కొంతమందికి ఆయనంటే పడడం లేదు. ఈసారి ఆయనను మార్చవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు విషయాని కొస్తే ఎటువంటి అవినీతి ఆరోపణలు గాని, వివాదాలు గాని లేవు. కాకపోతే జనంలో ఉండడం లేదంతే! ఉదయగిరి ప్రజలు ఎమ్మెల్యే తమ మధ్య వుండాలని, తమ ఇంట్లో పెళ్లయినా, చావైనా రావాలని కోరుకుంటారు. అప్పట్లో వెంకయ్యనాయుడు నుండి కంభం వియజరామి రెడ్డి, మాదాల జానకిరామ్‌, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిల దాకా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పని చేసిన వాళ్ళందరూ అలా అలవాటు చేసి పెట్టారు మరి! వాళ్లంతా ఫుల్‌టైం పొలిటీషియన్స్‌ కావడంతో ఆ విధంగా ఉండగలి గారు. కాని బొల్లినేని రామారావు పరిస్థితి అది కాదు. మహారాష్ట్రలో పేరు మోసిన కాంట్రాక్టర్‌. సీఎం తన నియోజకవర్గానికొచ్చినా ఆయన రాలేనంత బిజీ! వారానికొకసారి వస్తాడు. కలిగిరిలోని తన ఆఫీసులో కూర్చుంటాడు. అన్ని మండలాల నుండి నాయకులను పిలిపించుకుని మాట్లాడతాడు. అతని నాయకత్వంలో మండలస్థాయి నాయకులు హ్యాపీగానే వున్నారు. అతనిని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కాకపోతే ప్రజల్లో లేడనే వ్యతిరేకత వుంది. ఉదయగిరికి ఈసారి బొల్లినేని కాదనుకుంటే కంభం విజయరామిరెడ్డి రేసులో వున్నాడు. బొల్లినేని కూడా ఈసారి చంద్రబాబు నిలబడమంటేనే పోటీకి దిగేటట్లున్నాడు తప్పితే సీటు నాకే కావాలని గట్టిగా పట్టుపట్టకపోవచ్చు.

కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఈసారి సీటును డైలమాలో పెట్టేటట్లున్నారు. నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రంగా వుంది. 2014 ఎన్నికల్లో సీటు ఆశించి నిరాశ చెందిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఈసారి సీటు కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మొత్తానికి సిటింగ్‌ ఎమ్మెల్యేలు నలుగురిలో ఎవ్వరికీ సీటు గ్యారంటీ లేదు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • ప్రాణాలు తీస్తున్న పందేలు!
    బ్రతుకులు డొల్ల... భవిష్యత్‌ గుల్ల క్రికెట్‌... ఆడేవాళ్ళకు డబ్బులు, చూసేవాళ్ళకు ఆనందం... ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కాకుండా ఇంకో జాతి వుంది. అదే బెట్టింగ్‌ జాతి. క్రికెట్‌ను అందరూ ఆటగా చూస్తే ఈ బెట్టింగ్‌ జాతి మాత్రం జూదంగా…
  • నోర్లు తెరిచిన బోర్లు.. మృత్యువుకు రహదార్లు
    బోర్లు నోర్లు తెరిచాయంటే.. అవి మృత్యువుకు రహదార్లనే తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా బోర్లను తవ్వి వదిలేస్తే అవే మనపాలిట మృత్యుకూపాలవుతాయి. నీళ్ళ కోసం బోర్లు తవ్వుకుంటే, అటు నీళ్ళు రాకపోగా..ఆ బోర్ల గుంతలు చావుగుంతలుగా మారుతుంటాయి. అందుకే, బోర్లు తవ్వుకునేవారు ఎంతో అప్రమత్తంగా…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • జనం మెచ్చేలా జగన్‌!
    'నాకు ఓట్లేయకుంటే నేనేసిన రోడ్ల మీద నడవొద్దు... నేనిచ్చే పింఛన్‌లు, రేషన్‌ తీసుకుంటూ నాకు ఓట్లేయరా... హైటెక్‌ సిటి నేనే కట్టించాను... హైదరాబాద్‌ను నేనే డెవలప్‌ చేసాను... కంప్యూటర్‌ కనిపెట్టింది నేనే... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేనే'' అని…

Newsletter