chembuప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి... ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వాడాలి... ఆశయం, ఆలోచన మంచిదే. ఆచరణ ఇంకా మంచిదే! ఆత్మగౌరవం అమలులో రాష్ట్రంలోనే నెల్లూరుజిల్లా ప్రథమ స్థానంలో ఉండడం మనం ఇంకా ఆనందించదగ్గ విషయం. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలో లక్ష్యాన్ని అధిగమించడంలో జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు కృషి మరువలేనిది.

ఇంతవరకు బాగానే ఉంది... ఆత్మగౌరవం పేరుతో చెంబుకు శవయాత్రలేంటి? చెంబు చచ్చింది అని నినాదాలు చేయడమేంటి? చెంబుకు పాడెకట్టి గ్రామాలలో ఊరేగిస్తూ ప్రజల సెంటిమెంట్లతో ఆటలేంటి? అసలు ఆత్మగౌరవానికి చెంబుకు సంబంధమేంటి? చెంబు భారతీయుల జీవన విధానంలో ప్రధాన వస్తువు. అది ఈరోజుది కాదు... మన పూర్వీకుల నుండి వచ్చిన వస్తువు. చెంబును ఒక్క బహిర్భూమికి వెళ్లేటప్పుడు మాత్రమే వాడరు. ఇంట్లో నీళ్ళు తాగడానికికైనా, పాలు పితకడానికైనా, చెట్లకు నీళ్ళు పోయడానికైనా చెంబునే వాడుతుంటారు. మన ఇంట్లో నిత్యం వాడే పాత్రలలో చెంబు ఒకటి! అలాంటి వస్తువుకు పాడెకట్టి ఊరేగించడం మంచిది కాదు. గ్రామాలలో చెంబు శవయాత్రలు జనం హర్షించే పద్ధతి కాదు. అధికారులు దీనిని కాస్తా ఆలోచించాలి.

madalaజై ఆంధ్రా ఉద్యమసారధి, మెట్ట ప్రాంత నాయకుడు, మాజీమంత్రి మాదాల జానకిరామ్‌ (67) ఈనెల 6వతేదీ బుధవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో స్వర్గస్థులయ్యారు. గత కొన్ని రోజులుగా నెల్లూరులోని కిమ్స్‌ ఆసు పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 6వ తేదీన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించడానికి ముంబై నుండి ప్రత్యేకంగా ఎయిర్‌ అంబులెన్స్‌(విమానం)ను కూడా తిరుపతి ఎయిర్‌పోర్టుకు తెప్పించారు. మధ్యాహ్నం కిమ్స్‌ ఆసుపత్రి నుండి అంబులెన్స్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు తీసుకువెళుతుండగా గూడూరు దాటాక కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

జిల్లా రాజకీయాలలో మాదాల జానకిరామ్‌ది విలక్షణ మైన పాత్ర. ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడం ఆయన నైజం. దుత్తలూరు మండలం నర్రవాడ ఆయన స్వగ్రామం. విద్యార్థి దశలోనే జైఆంధ్రా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాలలో వెంకయ్యనాయుడు, చంద్ర బాబునాయుడు, వై.యస్‌.రాజశేఖరరెడ్డిల సమకాలీకుడు. 1978లో సంజయ్‌గాంధీ పిలుపుమేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఉదయగిరి అసెంబ్లీ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి జనతాపార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు చేతిలో ఓడిపోయారు. తర్వాత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డితో విభేదించి కొంతకాలం రాజకీయాలకు దూరంగా వుండిపోయారు. 1989లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో ఉదయగిరి అసెంబ్లీ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాదాలకు అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన తెలుగు దేశం అభ్యర్థి కంభం విజయరామిరెడ్డిపై గెలుపొందారు. 1991-93ల మధ్య నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినెట్‌లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1992లో ఒంగోలు పార్ల మెంటు అభ్యర్థిగా మాగుంట సుబ్బరామరెడ్డిని రంగంలోకి తీసుకు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మాగుంట సుబ్బ రామరెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1994 ఎన్నికల్లో ఉదయగిరి కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా, ఆయనను అధిగమించి తిరిగి టిక్కెట్‌ తెచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో మేకపాటి వర్గం పూర్తిగా వ్యతిరేకంగా చేయడంతో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కంభం విజయ రామిరెడ్డి చేతిలో 27వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1996లో ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మాగుంట పార్వతమ్మ గెలుపు కోసం, 1998లో ఇదే నియోజకవర్గం నుండి రాజకీయ అరంగేట్రం చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపు కోసం ఆయన బాగా కష్టపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో మేకపాటి, కంభం వర్గాలు కలిసి పనిచేసినా కూడా ఇక్కడ వాళ్ళకు భారీ మెజార్టీలు రాకుండా అడ్డుకోగలిగాడు. 1999 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఉదయగిరి టిక్కెట్‌ వచ్చింది. అప్పటికే తెలుగుదేశంలో చేరిన మాదాల తెలుగుదేశం అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి గెలుపుకు సహకరించారు. 2004 ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నుండి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత చంద్రబాబు విధానాలు నచ్చక ఆయన ముఖాన్నే నాలుగు తిట్టి బయటకు వచ్చేసారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.

జానకిరామ్‌కు స్వర్గీయ పి.వి.నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలుండేవి. మంత్రిగా వున్న కాలంలో ఢిల్లీలో కూడా చక్రం తప్పిన ఘనుడాయన.

స్వగ్రామమైన నర్రవాడలో తన తల్లి రాములమ్మ పేరు మీద ట్రస్టును నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిం చారు. వెంగమాంబ తల్లి అంటే ఆయనకు అత్యంత భక్తి. ఆ భక్తితోనే ఆమెకు ప్రత్యేక దేవాలయం నిర్మించారు. జైఆంధ్రా

ఉద్యమంతో పాటు నాగార్జునసాగర్‌ ఎడమకాలువ సాధన కోసం 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసారు. వెలుగొండ, సీతారాం సాగర్‌ ప్రాజెక్టుల కోసం పోరాటం చేశారు. విద్యార్థి దశ నుండే అయ్యప్ప భక్తుడైన ఆయన అయ్యప్పస్వామి మహత్యం పేరుతో ఒక సినిమాను, అలాగే వెంగమాంబ జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమాను నిర్మించారు. మాదాల జానకిరామ్‌ ఒక చరిత్ర వున్న నాయకుడు. నేటి తరాలకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతోంది 'లాయర్‌'.

kurugondla2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశంపార్టీ మూడు సీట్లే గెలవగా అందులో వెంకటగిరి ఒకటి. ఆ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఇంకొంచెం కష్టపడివున్నా, ఆర్ధికంగా ఇంకొంత ఉత్సాహం చూపివున్నా ఫలితం వేరుగా వుండేది. నియోజకవర్గంలోని ఇతర మండ లాలలో వైకాపా ఆధిక్యం చూపినా వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశంకు గట్టి పట్టుంది. ఇక్కడున్న బలం తోనే ఆ ఎన్నికల్లో కురుగొండ్ల గెలవగలిగాడు. అదీగాక, ఆ ఎన్నికలప్పటికి అతను సిటింగ్‌ ఎమ్మెల్యే. ప్రజల్లో ఆయన పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోవడం ఆయన గెలుపుకు దోహదపడింది. అదీగాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైకాపా ఓట్లను చీల్చి కురుగొండ్లకు పరోక్ష సహకారం అందించాడు.

జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ముగ్గురి మీద కూడా వారి వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత వుందని తెలుస్తోంది. ఈ వ్యతిరేకత కురుగొండ్ల రామకృష్ణ మీద కాస్తా ఎక్కువుగా వున్నట్లు తెలుస్తోంది. ఈ మూడున్నరేళ్లలో ఆయన పేరు అభివృద్ధి పనుల పరంగా కంటే వివాదాల పరంగానే ఎక్కువుగా ప్రచారంలో వుంది. అధికారులతో వివాదాలు... సొంత పార్టీ నేతలతోనే విభేదాలు... కాంట్రాక్టర్లకు, మద్యం వ్యాపారులకు బెదిరింపులు వంటి చర్యలతో ఆయనపై తెలియని వ్యతిరేకత వచ్చేసింది. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు ఆయన వైఖరిపై అసంతృప్తితో వున్నారు. అయితే ఇంత వ్యతిరేకత వున్నా కురుగొండ్ల మాత్రం మూడోసారి కూడా వెంకటగిరి టిక్కెట్‌ తనదేనని ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు అంత సామాన్యంగా ఎవరికీ టిక్కెట్‌ ఇవ్వడు. సర్వేలు చేయిస్తాడు, ఐవిఆర్‌ఎస్‌ ద్వారా వివరాలు రాబడతాడు. పదిమందిని పరిశీలించి, ఐదుగురిని సెలక్ట్‌ చేసి వారిలో ఒకరిని బెస్ట్‌ అని ఎంపిక చేస్తాడు. చంద్రబాబు వద్ద టిక్కెట్‌ గ్యారంటీ అన్నది వుండదు.

వెంకటగిరి టిక్కెట్‌ కోసం ఈసారి గట్టిపోటీ ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఈ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఆయనకు బలమైన బంధువర్గం ఉండడంతో పాటు, డీసీసీబీ ఛైర్మెన్‌గా ఈ నాలుగున్నరేళ్లలో మంచిపేరు తెచ్చుకున్నాడు. మంచి పరిచయా లున్నాయి. ఆర్ధికంగా మోటుకోగలడు. ఆయన అభ్యర్థి అయితే వ్యతిరేకత అన్న ప్రశ్నే లేదు. ఇక వెంకటగిరి రాజాల నుండి సర్వజ్ఞ యాచేంద్ర ఈసారి సీటును ఆశిస్తున్నాడని తెలుస్తోంది. పారిశ్రామికవేత్త గంగోటి నాగేశ్వరరావు కూడా రేసులో వున్నాడు. అన్నింటికి మించి నేదురుమల్లి రాజకీయ వారసుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కూడా వెంకటగిరి సీటుకు ప్రయత్నిస్తున్నాడు. టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదిరితే జిల్లాలో ఒక సీటును బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయి. ఈసారి నెల్లూరు నగరం, రూరల్‌లో తెలుగుదేశం అభ్యర్థులను దించే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వెంకటగిరిని బీజేపీకి కేటాయిస్తే నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థి కావచ్చు.

మొత్తానికి కురుగొండ్లకు మూడోసారి సీటు అంత సులభం కాకపో వచ్చు.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter