corporationనెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప యోగించుకోవడంలోనూ, తడి, పొడి చెత్త సేకరణలోనూ నెల్లూరు కార్పొరేషన్‌ విఫల మైందంటూ 'కాగ్‌' దుయ్యబట్టింది. కార్పొరేషన్‌ పరిధిలో పెండింగ్‌లో వున్న 5.10కోట్ల కరెంట్‌ బిల్లుల విషయాన్ని కూడా 'కాగ్‌' ప్రస్తావించింది. అయితే 'కాగ్‌' నెల్లూరు కార్పొరేషన్‌ను ఒక వైపే చూసింది. రెండో వైపు చూసుంటే దండకాలను ఎన్ని రూపా లలో చేయొచ్చో, దందాలను ఏ విధంగా చేయవచ్చో తెలిసుండేది. ఆ ప్రతిభను గుర్తించి వుంటే 'కాగ్‌' ఖచ్చితంగా అవి నీతి వసూళ్లలో నెల్లూరు కార్పొరేషన్‌ అభివృద్ధిని మెచ్చుకుని ఉండేది.

guntaనెల్లూరు నగర కార్పొరేషన్‌ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. నేతల ఆధిపత్యపోరు మధ్యలో ప్రజలకు వాతలు పెడుతున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇద్దరూ నెల్లూరీయులే పట్టణాభివృద్ధి శాఖలకు సారధ్యం వహి స్తున్నా, నెల్లూరు కార్పొరేషన్‌ని మాత్రం బాగుచేయడం ఎవరి తరమూ కాదన్నంత అధ్వాన్నంగా తయారయిపోయింది.

మాగుంట లే అవుట్‌లోని ఎస్‌.ఆర్‌.కె స్కూల్‌ నుండి సి.పి.ఆర్‌ కళ్యాణ మండపం వరకూ మంజూరు కాబడిన డ్రైన్‌ నిర్మాణ విషయంలో మరోసారి నగర కార్పొరేషన్‌ అసమర్ధత, నేతల చేతగాని తనం బయటపడిపోయింది.

ఇక్కడ గత కొన్నేళ్ళ ప్రయత్నం ఫలితంగా మంజూరైన డ్రైన్‌ నిర్మాణం అధికారుల అలక్ష్యానికి, కాంట్రాక్టర్ల అహంకారానికి సాక్షీభూతంగా నిలిచి పోయింది. దురాక్రమణతో మున్సిపల్‌ స్థలంలో నిర్మించిన భవనాలను తొలగించ డంలో మున్సిపల్‌ శాఖ నీళ్ళు నములు తుంటే అది సాకుగా చూపిన కాంట్రాక్టర్‌ ప్రజల మొహాన ఇసుక, కంకర కొట్టి మనిషి లోతు గుంట తీసి అందులో నిండా మురుగునీళ్ళు నింపి దోమలను ఉత్పత్తి చేస్తూ సరదా చూస్తున్నాడు.

ఈ కాంట్రాక్టర్‌ పుణ్యమా అని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన సిమెంటురోడ్డు నాశనమైపోతోంది. కాం ట్రాక్టర్‌ తీసిన గుంట ప్రక్కనే యస్‌.ఆర్‌.కె. స్కూలుంది. ఇక్కడి చిన్నపిల్లలెవరయినా ఆడుకుంటూనో లేక స్కూల్‌ వదిలిన ఆనందంలో ఇంటికి పరిగెత్తుతూనో ఆ గుంటలో పడితే అంతే సంగతులు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న రీతిలో రాజకీయ నేతలూ అధికారులూ వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చి ఓదార్చిపోతారు.

ఈ కాలువ విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యానికి సంబంధించి మాగుంట లే అవుట్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ 5వారాల క్రితం రూరల్‌ శాసనసభ్యుడిని కలిసి విన్నవించుకుంది. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్ష ణమే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చాడు. అదేరోజు మేయర్‌ని కూడా కలిసి తమ గోడు చెప్పుకుంటే ఆయన కూడా అధికారులను పిలిచి వెం టనే పనులు మొదలుపెట్టేలా చూడాలని హుకుం జారీ చేశాడట. కానీ ఫలితం మాత్రం శూన్యం. రోజులు మారుతు న్నాయి, వారాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి... చివరికి సంవత్సరం కూడా మారింది... కానీ ఈ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ అహంకారం మాత్రం మారలేదు.

ఈ దరిద్రానికి తగ్గట్లుగా మంత్రిగారి బామ్మర్ది అంటూ ఓ పెద్దాయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలను ఈ త్రవ్వకానికి సమీ పంలో ఏర్పాటు చేశారు. యస్‌.ఆర్‌.కె స్కూలు వైపు నుండి వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళేవాళ్ళకి అక్కడో మలుపు వున్నట్లుగా కూడా అర్ధంకాని విధంగా ఈ ఫ్లెక్సీ వుంది. ఇక్కడా మళ్ళీ కార్పొరేషన్‌ నిర్లక్ష్యమే!

ఈ విషయమై ''లాయర్‌'' కూడా నేరుగా మేయర్‌తో మొరపెట్టుకుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని విన్నవించుకుంది. కానీ, మేయర్‌ కూడా స్పందించలేదు. పరిస్థితి అలాగే వుంది. ఇలాంటి నీచ నికృష్టమైన మనస్థత్వం కలిగిన అధికారులు, రాజకీయ నేతల మధ్య జీవనం సాగిస్తున్న నెల్లూరు ప్రజలు ఎంతటి సౌమ్యులో తలుచుకుంటే ఆశ్చర్య మేస్తుంది. వారి ఓర్పుని, సమాజం పట్ల వారు చూపిస్తున్న అసక్తతని చూస్తే జాలి కలుగుతుంది. ఇది ఉద్యమాల పురిటి గడ్డగా పిలవబడిన విక్రమ సింహపురేనా అన్న అనుమానం కలుగుతోంది. మొద్దు బారిన చర్మంతో రాయిలాంటి హృద యంతో ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న ఇలాంటి వారిని ఆ భగవం తుడే మార్చాలి... నెల్లూరు నగరమా వర్ధిల్లు...!

pipes1100కోట్ల హడ్కో నిధులతో నెల్లూరు నగరంలో భూగర్భడ్రైనేజీ.. శాశ్వత మంచినీటి పైప్‌లైన్‌ పనులు... కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణల ఘనకార్యమిది... ఈ పనులతో నెల్లూరు స్వరూపమే మారిపోతుందంటూ ఓ పక్క పాలకులు ప్రకటనలు దంచారు.

మరోపక్క ఈ హడ్కో నిధుల పనులతో నెల్లూరుకు ముప్పు, అప్పు తప్ప ఇంకేం ఒరిగేదేమీలేదు. ఈ అప్పును ప్రజలే కట్టాలి. ప్రతి తలపై 5వేల రూపా యల అదనపు భారం పడబోతుంది. నెల్లూరు సెప్టిక్‌ ట్యాంక్‌గా మారబోతుంది. ఈ హడ్కో పనులే మనకొద్దంటూ కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఉద్యమం మరోపక్క...

ఏదైతేనేం... నెల్లూరు ప్రజలపై భారం దిగినట్లే కనిపిస్తోంది. టెండర్లు కూడా జరిగిపోయి పనులు మొదలుపెట్టాల్సిన సమయంలో నగరంలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ల పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. మంచినీటి పైప్‌లైన్‌ల కోసమని కాంట్రా క్టర్లు నగరంలో అక్కడక్కడా తోలిపెట్టిన పైపులను కూడా రేపోమాపో తరలించే అవకాశాలున్నాయి.

నెల్లూరులో మంచినీటి, భూగర్భడ్రైనేజీ కంటూ 1100కోట్లు హడ్కో ఋణం మంజూరైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రి నారా యణలు ఈ హడ్కో అప్పుపై బాగానే శ్రద్ధ చూపారు. దీనికి సంబంధించి 2015ఏప్రిల్‌లో సంతకాలు పెట్టి, టెండర్లను కూడా పిలిచి ఎల్‌అండ్‌టి, మెగా ఇంజ నీరింగ్‌ కంపెనీలకు పనులు అప్పగించారు. మంచి నీటి పైప్‌లైన్‌ పనులకు సంబంధించి 476.31కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. మొత్తం 1100కోట్ల ఋణంలో నెల్లూరు నగరపాలక సంస్థ 10శాతం వాటాను భరించాలి. అంటే 110కోట్లన్న మాట! ఇక 3నెలలకొకసారి ఇన్‌స్టాల్‌మెంట్‌లాగా మూడుకోట్లు కట్టాలి. ఇంత భారాన్ని నగరపాలక సంస్థ భరించే స్థితిలో లేదు, నెలొచ్చేసరికి జీతా లివ్వడానికి, కరెంట్‌ బిల్లులు కట్టుకోవడానికే వెదుక్కోవాల్సిన పరిస్థితి. ప్రజలపై ఇప్పుడున్న పన్నులే ఎక్కువ. ఇంకా ఎక్కువ భారం మోపితే తంతారు. కాబట్టి నెల్లూరుకు కార్పొరేషన్‌ను రీపేమెంట్‌ సామర్ధ్యం లేదు. ఇదంతా కేంద్రంలో వెంకయ్య, రాష్ట్రంలో నారాయణ చూసుకుంటారులే అని గుడ్డిగా ఆమో దించేసారు.

ఇప్పుడు సీన్‌ రివర్సయ్యింది. మంచినీటి పైప్‌లైన్‌ కాంట్రాక్టర్‌ పైప్‌లు, ఇతరత్రా సామాన్లకు సంబం ధించి 60కోట్లకు బిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కార్పొరేషన్‌ వాటాగా 6కోట్లు భరించాలి. ఇక్కడ అంత సీన్‌ లేదు. అందుకే ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటూ లేఖ వ్రాశారు. అయితే రాష్ట్రప్రభుత్వం దీనికి స్పందించలేదు. ఈ డబ్బులు మొదటి నుండి ఇస్తామని మేం చెప్పలేదు, పనులు పూర్తయ్యాక వాయిదాలు చెల్లించడంలో మీరు డిఫాల్ట్‌ అయితే మేం చూసుకుంటామని, మంచినీటి పైప్‌లైన్‌ పని వరకు గ్యారంటీ ఇచ్చాం, దీనికింకా చాలా టైముంది, ముందు మీరు చేయాల్సిన పని చేయండని చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో హడ్కో వాళ్లు కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టండంటూ కార్పొ రేషన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ రెండూ మేం కట్టే పరిస్థితిలేదని మేయర్‌ చేతులెత్తేసాడు. దీంతో కాంట్రాక్టర్లు సందిగ్ధంలో పడ్డారు. పనులను నిలిపే సారు. హడ్కో నిధులు ఇక వెనక్కి పోయినట్లేనని భావించవచ్చు. కాగల కార్యం గంధర్వులే తీర్చా రన్నట్లు... భూగర్భడ్రైనేజీ పనులు ఆపేయాలని కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఉద్యమం చేస్తున్నా, పరిస్థితులు వాటంతట అవే తిరగబడి పనులు ఆగిపోవడం యాధృచ్ఛికమే అయినా, అతని ఉద్యమానికి తగిన విధంగానే ఫలితం రావడం విశేషం.

Page 1 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
  నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
 • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
  జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter