real boomవై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జిల్లా రియల్‌ ఎస్టేట్‌కు శాపంగా మారితే, ఆ తర్వాత మోడీ చేసిన నోట్ల రద్దు దెబ్బకు పూర్తిగా కుదేలయ్యింది.

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు పడిపోయి దాదాపు పదేళ్ళు కావొస్తుంది. ఈ పదేళ్ళ కాలంలో చాలా జరిగాయి. కొందరు పెద్ద రియల్టర్లు ఐ.పి పెట్టారు, ఇంకొంతమంది రియల్టర్ల ఆస్తులు వడ్డీలకే కరిగిపోయాయి. పదేళ్ల క్రితం కోటిరూపాయలు పెట్టి కొన్న ఎకరా భూమిని ఇప్పుడు పాతిక లక్షలకు కూడా అడగడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు పదేళ్లక్రితం ఏ రేటు వున్నాయో ఇప్పుడూ అదే రేటు వున్నాయి. అప్పులు చేసి స్థలాలు, పొలాలు కొన్న రియల్టర్లు ఈ పదేళ్ళలో నిండా మునిగిపోయారు. లే అవుట్‌ యజమానులే కాదు, అపార్ట్‌మెంట్లు కడుతున్న బిల్డర్లు కూడా మార్కెట్‌ స్థంభించిపోయి ఇబ్బందుల్లో పడ్డారు. నోట్ల రద్దు ఎఫెక్ట్‌ నిర్మాణ రంగంపై బాగానే పడింది.

పదేళ్ళుగా నైరాశ్యం వహించిన రియల్‌ మార్కెట్‌లో గత రెండు మూడు నెలలుగా కొంత కదలిక వచ్చింది. మరీ బూమ్‌ లేకపోయినా, అవసరమైన కొద్ది మార్కెట్‌ నడుస్తోంది. వేలంవెర్రి మార్కెట్‌ లేదు. పొలాలు, స్థలాల కోసం పరుగులు పెట్టడం లేదు గాని పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, ఇళ్ళు కట్టుకోవాలను కున్నవాళ్ళు, ఫ్లాట్‌లు కొనాలనుకున్నవాళ్ళు అనువైన వాటికోసం అన్వేషిస్తుండడంతో మార్కెట్‌లో కొంత ఊపు కనిపిస్తోంది.

anam brosనెల్లూరుజిల్లాలో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ముద్రపడ్డ ఆనం కుటుంబం ఇక తెలుగుదేశంపార్టీతో కలిసి ప్రయాణం కొనసాగించబోతోంది. ఈమేరకు తెలుగుదేశంలో చేరాలని ఆనం సోదరులు నిర్ణయించుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డితో పాటు వారి సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డి, కుమారులు ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు కూడా పసుపు చొక్కాలు తగిలించుకోనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. పెద్ద నాయకులుగా మిగిలి వుండేది ఆనం సోదరులు, రఘువీరారెడ్డి లాంటివాళ్లే! ఆనం సోదరులు కూడా వెళ్లిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లే. విభజనతోనే ఏపిలో కాంగ్రెస్‌ పనైపోయింది. 2014 ఎన్నికలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ గతి పట్టించాయో చూసాము. ఇక ఎంతకాలం కాంగ్రెస్‌లో వున్నా దండగే! ఈ రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉండేది తెలుగుదేశం, వైకాపాలే! ఆనం సోదరులు వైకాపాలోకి పోలేరు. అక్కడకు పోలేనంతగా జగన్‌ను వాళ్లు బూతులు తిట్టారు. ఇక వారి రాజకీయ ప్రయాణానికి ప్రత్యామ్నాయ వేదిక తెలుగుదేశమే! కాబట్టి 'దేశం' వైపు మొగ్గు చూపారు.

ఇక్కడ చంద్రబాబుకు కూడా సమయానికి వాళ్ల అవసరం వచ్చి పడింది. జిల్లాలో తెలుగుదేశం నాయకత్వం బలహీనంగా వుంది. సోమిరెడ్డి ఆయనకు చాలడం లేదు. మంత్రి నారాయణ పబ్లిక్‌ లీడర్‌ కాదు. జిల్లానంతా మెయింటైన్‌ చేసే నాయకులెవరూ ఇక పార్టీలో లేరు. ఆనం సోదరులు పార్టీలో చేరితే తెలుగుదేశం బలహీనంగా వున్న నెల్లూరు నగరం, రూరల్‌తో పాటు ఆత్మకూరులోనూ పార్టీ బలపడుతుంది. ఈ వ్యూహంతోనే చంద్రబాబు వారికి స్వాగతం పలుకుతున్నాడు. బలమైన నాయకులు పార్టీలోకి వస్తామంటే తీసుకోమని ఆయన ఇంతకుముందే సంకేతాలిచ్చి వున్నాడు.

ఆనం సోదరులకు తెలుగుదేశం కొత్తేమీ కాదు. చంద్రబాబుతో ఎంతో సాన్నిహిత్యం వుంది. 1983లో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగానే గెలిచారు. 1985లో అదే పార్టీ అభ్యర్థిగా రాపూరులో గెలిచారు. 1989లో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిని తెలుగుదేశం నుండి సస్పెండ్‌ చేసాక, రామనారాయణరెడ్డికి ఆర్‌ అండ్‌ బి మంత్రి పదవిని కూడా ఇచ్చారు. 1989లో ఆయన రాపూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగానే ఓడిపోయారు. 1983 నుండి 1992 వరకు ఆనం సోదరులు తెలుగుదేశం లోనే వున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.

1992 నుండి 2015 నవంబర్‌ నెల వరకు కాంగ్రెస్‌తో ప్రయాణం సాగించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మునిగిపోతున్న పడవ. కాబట్టి రాజకీయంగా ఒడ్డున పడడం కోసం సురక్షితంగా వున్న తెలుగుదేశం ఓడను ఎక్కబోతున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter