flemingoక్యాలెండర్‌ మారితే రాష్ట్రంలో అన్ని జిల్లాల వారికీ మొదటి పండుగ సంక్రాంతి. అయితే నెల్లూరుజిల్లా వాసులకు మాత్రం దానికంటే ముందొచ్చే పండుగ పక్షుల పండుగ. సూళ్లూరుపేట కేంద్రంగా నేలపట్టు విదేశీ పక్షుల కోసం జరిపే ఈ పండుగను 2000 సంవత్సరం ప్రాంతంలో కలెక్టర్‌గా వున్న కె.ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. అప్పటి నుండి ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈసారి జనవరి 7, 8, 9తేదీలలో పక్షుల పండుగ జరపాలని నిర్ణయించారు. దీని కోసం 3కోట్లు నిధులు విడుదల చేసినట్లు కూడా కలెక్టర్‌ ముత్యాలరాజు వెల్లడించారు.

kaka prataకుక్కను చంపాలంటే దాని మీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలి. ఈ సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీ అనుకూల మీడియా బాగానే పాటిస్తోంది. వైకాపాలో ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేయడం, వాళ్ళు పార్టీ మారుతున్నా రనే ప్రచారాన్ని మీడియా ద్వారా కల్పించడం, వారిలో కూడా పార్టీ మారాలనే ఆశ కలిగించడం... ఇదీ ఒక రొటీన్‌ పద్ధతి.

రాష్ట్రంలో ఇంత వరకు ముగ్గురు ఎంపీలు, 22మంది ఎమ్మెల్యేలు వైయ స్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో నుండి తెలుగు దేశంలోకి ఫిరాయించారు. వీళ్ళందరిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపధ్యం. కొందరు అధికారం కోసం... కొందరు మంత్రి పదవుల కోసం... కొందరు అధికార పార్టీ వేధింపులు, అక్రమ కేసులకు తట్టుకోలేక... కొందరు డబ్బుకు అమ్ముడుపోయి... ఇవీ వీళ్ళందరు కూడా పార్టీ మారడానికి ప్రధాన కారణాలు. అయినా పార్టీ మారే టప్పుడు అందరూ చెప్పిన కంబైన్డ్‌ పచ్చి అబద్ధమేంటంటే అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పడం.

తెలుగుదేశం వాళ్ళు తమ నెక్ట్స్‌ టార్గెట్‌ నెల్లూరుజిల్లాను పెట్టుకున్నారు. జగన్‌ పట్ల నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు చాలా విశ్వాసం చూపించారనుకోవచ్చు. సొంత జిల్లా కడప నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు. కర్నూలు జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ. కాని, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారాడు. అతను కూడా ఒకప్పుడు తెలుగుదేశం మనిషే! కాబట్టి అతనిని లెక్కలో తీసుకో వాల్సిన అవసరం కూడా లేదు. మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం జగన్‌కు గట్టిగా నిలబడివున్నారు. ఇది నెల్లూరుజిల్లా టీడీపీ నాయకులకు చాలా ప్రిస్టేజ్‌గా మారింది. కనీసం ఇంకో ఇద్దరు ఎమ్మెల్యే లనన్నా పార్టీలోకి తీసుకొచ్చి చంద్రబాబు వద్ద తమ టాలెంట్‌ చూపించుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు. మిగతా ఆరు గురు ఎమ్మెల్యేలెవరు కూడా డబ్బులకు లొంగే వాళ్ళు కాదు. అలాగని మంత్రి పదవులు ఇవ్వలేరు. కాబట్టి వారి బలహీ నతల మీదే కొట్టాలనుకున్నారు. ఈ క్రమం లోనే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డిలను లక్ష్యంగా ఎంచుకున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి ఇద్దరి మీదా నకిలీ మద్యం కేసులు నమోదై వున్నాయి. అలాగే రామిరెడ్డి ప్రతాప్‌కు అమరావతి రాజధాని ప్రాంతంలో కొంత భూమి సమస్య వుంది. వీటిని ఆధారంగా చేసుకుని వీరిద్దరిపై ఒత్తిడి పెంచి తెలుగు దేశంలో చేర్పించాలని చూసారు. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రయత్నం, ఈ ప్రచారం జరుగుతూనే వుంది. తమ మీద ఇలాంటి అపోహలు వచ్చినప్పుడల్లా కాకాణి, ప్రతాప్‌లు ఖండిస్తూనే వున్నారు. ఇప్పుడు కూడా మరోసారి తమపై అలాంటి ప్రచారం వచ్చిన నేపధ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విలేకరుల సమావేశం పెట్టి తాము జగన్‌తోనే ఉంటామని తేల్చి చెప్పి అనవసరంగా జరుగుతున్న ప్రచా రానికి తెరదించారు.

somi kandlకండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 13వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఆఖరుకల్లా జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌ లన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీలను గడువులోగానే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గుండా సోమశిలకు తీసుకొచ్చి కండలేరుకు తర లిస్తున్నామని, కృష్ణా నుండి తరలించే నీటిని మరో 5 టీఎంసీలకు పెంచుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నదుల అనుసంధానం వేగంగా జరుగు తోందని, వృధాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి పెన్నాకు తరలించే భగీరథ ప్రయత్నం జరుగుతుందని, ఈ ప్రయత్నం పూర్తయితే ఈ జిల్లాలో సాగు నీటికి, తాగునీటికి కొరత వుండదని మంత్రి చెప్పారు.

ఆశయం నెరవేరింది

కండలేరు ఎడమకాలువ గట్టు ఎత్తిపోతల పథకం పూర్తిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కృషి ఫలితమేనని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా 30వేల ఎకరాలకు సాగునీళ్ళు అందించ వచ్చని గుర్తించిన ఆయన 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ఈ పనికి శంకుస్థాపన చేయించారు. అంతేకాదు, వేగంగా పనులు పూర్త య్యేలా పర్యవేక్షించారు. ఇచ్చిన మాట ప్రకారం దానిని రైతులకు నిర్ణీత గడువులోపే అందించగలిగారు. ఆయన కృషితో సర్వేపల్లి, వెంకటగిరి నియోజక వర్గాల్లోని వేలాది ఎకరాలకు నీళ్ళందాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తిరుపతి ఎంపి వి.వరప్రసాద్‌, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్‌, మాజీమంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పరసా రత్నం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకటస్వామి నాయుడు పాల్గొన్నారు.

Page 1 of 114

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మళ్ళీ చెడింది
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
  ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter