empty chairఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ పోస్ట్‌ను. కమిషనర్‌గా వున్న వెంకటేశ్వర్లును గతేడాది డిసెంబర్‌లో బదిలీ చేశారు. విజయవాడ సిసిఎల్‌ఏలో పనిచేస్తున్న హరీష్‌ను కొత్త కమిషనర్‌గా వేసినా ఆయన ఇక్కడకు రావడానికి భయపడ్డారు. బాధ్యతలు తీసుకోవ డానికి వెనుకాడాడు. దీంతో అతను ఇక్కడకు రాడని తేటతెల్ల మైంది. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో దాదాపు మూడున్నర నెలల నుండి కమిషనర్‌ పోస్ట్‌లో ఇన్‌ఛార్జ్‌లు నడుస్తున్నారు. అలాగే జడ్పీ సిఇఓగా వున్న బి.రామిరెడ్డిపై ఏసిబి దాడి జరిగి ఆయన అరెస్ట్‌ కావడంతో ఆ పోస్ట్‌లో కూడా ఇన్‌ఛార్జే వున్నారు. అలాగే జిల్లా పంచాయితీ అధికారిగా కూడా ఇన్‌ఛార్జ్‌ వున్నారు. జిల్లా అటవీశాఖ అధికారిగా కూడా ఇన్‌ఛార్జ్‌ అధికారి చంద్రశేఖర్‌ కొనసాగుతున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జోనల్‌ మేనేజర్‌గాను, కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు సిఇఓగాను ఇన్‌ఛార్జ్‌లే ఉండడం విశేషం. సోమశిల ప్రాజెక్ట్‌ ఎస్‌.ఇగా 4నెలల నుండి ఇన్‌ఛార్జ్‌ వున్నారు. ఇక పిడబ్ల్యూడి ఎస్‌ఇగా వున్న కోటేశ్వరరావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఇరిగేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌ఇగా కూడా ఆయనే పనిచేస్తున్నారు. ఆయన రిటైర్‌ అయితే ఈ రెండుశాఖలకు ఎస్‌ఇలను నియమించాల్సి వుంటుంది. పూర్తి స్థాయి అధికారులు లేక ఆయాశాఖల్లో పనితీరు గాడి తప్పుతోంది. అధికారులను నియమించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సివుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter