tankbundఎట్టకేలకు స్వర్ణాల చెరువు త్వరలోనే సరికొత్త సొగసులను సంతరించు కోబోతోంది. మనకంటూ నగరంలో ఒకమంచి ఆహ్లాదకర ప్రాంతం లేదే అని దిగాలుపడుతున్న పౌరులకు ఇదో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం కానుంది. సింహపురీయుల కల మరో ఏడాదిన్నరలోనే సాకారం కాబోతోంది. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం కావడం సంతోషకరం.

పురజనులు తీరికవేళల్లో ఆనందంగా, ఆహ్లాదంగా గడిపేందుకు నెల్లూరు చెరువు ఒక ఆహ్లాద కేంద్రంగా ఏర్పాటు కాబోతోంది. నగరాన్ని సుందర నందనం చేయాలనే ఆలోచనల్లో భాగంగానే, నెల్లూరు చెరువు (స్వర్ణాల చెరువు) అందుకు కేంద్రం కానుంది. దాదాపు 36 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చెరువును అత్యంత సుందరంగా, ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎంతో విశాలంగా వున్న ఈ చెరువు మధ్యలో ఒక ద్వీపాన్ని అభివృద్ధి చేయాలని, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ఆమరణదీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆ ద్వీపం మధ్యలో భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో వున్న బుద్ధుని విగ్రహం మాదిరిగానే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేసి, రాత్రి వేళల్లో సైతం ఈ ప్రాంతమంతా విద్యుత్‌ శోభలతో శోభాయమానంగా వుండేలా తీర్చిదిద్దాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెరువు వద్ద అందమైన రీతిలో స్వాగత ద్వారాలు నిర్మించాలని, ఇక్కడకు వచ్చేవారిని బాగా ఆకట్టుకునేవిధంగా ఈ ప్రాంతంలో అన్ని విధాలైన హంగులు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. చెరువు మధ్యలో ఏర్పాటు చేయనున్న ద్వీపం ప్రాంతమంతా చక్కని పూల మొక్కలతో సుందరమైన ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని, పచ్చదనంతో.. పూలమొక్కలతో కళకళలాడేలా చూడాలని, మంచి రంగులు, ఆందమైన డిజైన్లతో.. నీటి ఫౌంటెన్‌లతో.. విద్యుత్‌ కాంతులతో ఆ ప్రాంతమంతా ఆకర్షణీయంగా వుండాలనే లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

అంతేకాదు, చెరువు కట్టమీది నుంచి చెరువు మధ్యలో వున్న ఆ ప్రాంతం దాకా వెళ్ళేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు అత్యాధునికమైన మరపడవలు కూడా సిద్ధం చేస్తున్నారు. చెరువును సందర్శించే ప్రజలకు, చిన్నారులకు పడవ ప్రయాణం ఒక మరపురాని అనుభూతిగా వుండేలా చూడాలని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు చెరువు వద్ద వున్న ఏడెకరాల స్థలంలో యోగా కేంద్రం, క్రీడలకు ఏర్పాట్లు, ఆహార దుకాణాలు తదితరాలన్నిటినీ ఏర్పాటు చేయాలని, చెరువు చుట్టూ దాదాపు ఆరు కిలోమీటర్లు వున్న చెరువుకట్టను పటిష్టం చేసి, సైకిల్‌ట్రాక్‌, నడకదారి ఏర్పాటు చేసి ప్రజలకు ఆనందం..ఆహ్లాదం పంచాలని భావిస్తున్నారు. ఈ సుందరీకరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం నుంచి 36కోట్లు కేటాయించిందని, నిపుణుల బృందం దీనిని పరిశీలించి నివేదిక కూడా అందించిందని, త్వరలోనే ఈ పథకం అమలు కానుందని భావిస్తున్నారు. ఒకటిన్నర సంవత్సరం లోపే ఈ పనులన్నీ పూర్తిచేయాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనులు త్వరితగతిన ప్రారంభ మయ్యేందుకు కృషిచేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే.. స్వర్ణాల చెరువుకు స్వర్ణకాంతులు వచ్చినట్లే మరి!...

tankbundనెల్లూరు దర్గామిట్టలోని స్వర్ణాల చెరువు తీరాన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవతో మంజూరైన రూ.33కోట్లతో నూతనంగా ట్యాంక్‌బండ్‌ నిర్మించి బారాషాహిద్‌ దర్గా ఆవరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అన్నమయ్య సర్కిల్‌, ముత్తుకూరుగేట్‌, విజయమహల్‌గేట్‌ ప్రాంతాల్లో డివైడర్లలో గ్రీనరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరునెలల్లో నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేందుకు డివైడర్లతో పాటు 15కిలోమీటర్ల మేర పచ్చదనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరు నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వచ్చే మూడేళ్ళలో వందకోట్ల నిధులను ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నాయకులు నన్నేసాహెబ్‌, షంషుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • 'తండ్రి'ని వీడి... 'తల్లి' వద్దకు సత్యకుమార్‌
    గత 24 సంవత్సరాలుగా వెంకయ్యకు తోడుగా ఆయన నీడగా నిత్యం ఆయనను వెన్నంటి వుండిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి సత్యకుమార్‌ భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక అధికారిగా తన పదవికి రాజీనామా చేశాడు. తండ్రి లాంటి పెద్దాయనను వదిలి ఆయనిప్పుడు తల్లి లాంటి…
  • 'లోక్‌సభ'లో సైకిల్‌ వీక్‌
    ఏపిలో ఎక్కడైనా తెలుగుదేశంపార్టీకి తిరుగుండదేమో... ఒకసారి ఓడిన చోట మరోసారైనా గెలుస్తుందేమో... కాని రాష్ట్రంలో కడప తర్వాత తెలుగుదేశంకు మింగుడుపడని నియో జకవర్గం నెల్లూరే! అది లోక్‌సభ అయినా శాసనసభ అయినా? తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 7సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే…

Newsletter