inlu gadapaరాష్ట్రంలో దాదాపు ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలైందనే చెప్పొచ్చు. గట్టిగా పోరాడితేగాని వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే పరిస్థితి అటు తెలుగుదేశం నాయకులకు, ఇటు వైకాపా నాయకులకు అర్ధమైపోయింది. నంద్యాలలో ఓటమితో ప్రభంజనం, ప్రభుత్వ వ్యతిరేకత భ్రమల నుండి వైకాపా నాయకులు బయటకొచ్చారు. ఈ రెండింటిని మాత్రమే నమ్ముకుంటే అధికారం దక్కదనే విషయాన్ని గ్రహించారు. అదే సమయంలో నంద్యాలలో 27 వేలఓట్ల తేడాతో గెలిచామనే ఆనందం కన్నా ఇంతగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇన్ని వందలకోట్లు ఖర్చు చేసినా వైకాపాకు 70వేల ఓట్లు రావడం కూడా తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఎందుకంటే ఉపఎన్నికల్లో పని చేసినట్లుగా సాధారణ ఎన్నికల్లో ప్రలోభాలు పనిచేయవనే విషయం వారికి తెలుసు.

అందుకే ఇరు పార్టీల వాళ్ళు కూడా అప్రమత్తమై నాయకులను కార్యకర్తలను జనం మీదకు, ఇళ్ల మీదకు తరిమే కార్యక్రమాలు పెట్టుకున్నారు. అధికార తెలుగుదేశం ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ప్రతిపక్ష వైకాపా ఇంతకుముందు నుండే గడపగడపకు వైసిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నెల్లూరుజిల్లాలో ఈ రెండు కార్యక్రమాలను తెలుగుదేశం, వైయస్సార్సీపీ నాయకులు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఇరుపార్టీల కార్యక్ర మాలలో నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు టిక్కెట్ల రేసులో నిలవాలంటే ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి మార్కులు తెచ్చుకోవాల్సి వుంది. కాబట్టే నాయకులు ఈ కార్యక్రమాలలో లీనమైపోయి పని చేస్తున్నారు.

govt hospసర్కార్‌ దవాఖానా అంటే నరకానికి నమూనా అన్న ఒక పేరుంది. నిజమే... ఇంతకాలం మనం చూసిన పెద్దాసుపత్రిలో పరిస్థితి అదే! ఒక రోగంతో ఆసుపత్రికి వెళితే బోనస్‌గా ఇంకొన్ని రోగాలు తగులుకునేంత దుస్థితి వాతావరణం అక్కడ ఉండేది. అయితే కాలం మారింది. ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చాక పెద్దాసుపత్రి ప్రాంగణం రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాంగణంలో ఎటుచూసినా కార్పొరేట్‌ కంపెనీలులాగా వున్న భవనాలు, విశాలమైన రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, పచ్చదనం... కనువిందు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరులో వున్న కార్పొరేట్‌ ఆసుపత్రులకంటే కూడా ఇప్పుడు పెద్దాసుపత్రి ప్రాంగణంలో వాతావరణమే బాగుంది. ఒకప్పుడు మనకు నరకంలా అనిపించిన పెద్దాసుపత్రిని పాత భవనాల నుండి కొత్తగా కట్టిన భవనాలలోకి త్వరలోనే ప్రభుత్వ సర్వజన వైద్యశాలగా తరలించనున్నారు. వందకోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి భవనాలు పూర్తి కావచ్చాయి. మొత్తం 750 పడకలతో, అత్యాధునిక వైద్య పరికరాలతో ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కంటి, ఆర్థోపెడిక్‌ విభాగాలను అనధికారికంగా ప్రారంభించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే ఈ ఆసుపత్రి ఎంతో బాగుందని ఆనందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన అన్ని వైద్య విభాగాలను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసుపత్రిని అందంగా కట్టారు. వైద్యులు కూడా అంతే అందమైన మనస్సుతో వైద్యసేవలందిస్తే చాలామంది పేదరోగులకు జబ్బుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తప్పించిన వాళ్లవుతారు.

anna canteenగుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే ఐఏఎస్‌ చదివిన కలెక్టర్‌ వచ్చి వీధులు వూడిస్తే ఎలా ఉంటుంది? సమాజంలో ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తే అసలు సమస్యలే వుండవు. ఎవరికి వాళ్ళు తమ బాధ్యతలను నిర్వర్తించకుండా ఇతర పనులవైపు చూస్తుండడం వల్లే సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తవి పుట్టుకొస్తున్నాయి.

నగరపాలక సంస్థకు ఎన్నో బాధ్యత లుంటాయి. నగరంలో పారిశుద్ధ్యాన్ని సక్రమంగా చూడడం, పందులు, దోమలు, కుక్కలు, కోతులు వంటివాటి బెడదను తొలగించడం, వీధి దీపాలను సక్రమంగా వెలిగేటట్లు చూడడం, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలను సక్రమంగా అమలు చేయడం, పన్నులను క్రమబద్ధంగా కట్టించుకోవడం, అక్రమ నిర్మాణాలను అరికట్టడం, పార్కు లను ఏర్పాటు చేయడం... ఇలా ఒక నగరపాలక సంస్థ చేయాల్సిన బాధ్యతలు ఎన్నో వున్నాయి. వీటిని సక్రమంగా ఏడిస్తే చాలు... ప్రజలకు వాళ్లెంతో మేలు చేసిన వాళ్ళవుతారు.

కాని, మన నెల్లూరు నగర పాలకసంస్థ వాళ్ళు చేయాల్సిన ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకుండా నగరంలో అన్నక్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అన్న క్యాంటీన్‌లు, అమ్మ క్యాంటీన్‌లతో వీళ్లకు ఏం పని. వీళ్లదేమైనా సివిల్‌ సప్లయిస్‌ సంస్థా? ప్రజలేమన్నా వీళ్లను క్యాంటీన్‌లు పెట్టమని అడిగారా? నగరంలో పందుల బెడద, దోమల రొద ఎక్కువైందని ప్రజలు మొరపెట్టుకుంటుంటే పట్టించుకునే దిక్కులేదు. అన్నక్యాంటీన్‌లు పెట్టమని వీళ్లను ఎవరు బ్రతిమలాడారు. నగరంలో పారిశుద్ధ్య పనులైనా, పందులు, దోమల నిర్మూలనైనా కార్పొరేషన్‌ వాళ్ళే చేయాలి. ఇంకొకరొచ్చి చేసేది కాదు. కాని, కార్పొరేషన్‌ వాళ్ళు అన్నక్యాంటీన్‌లు పెట్టక పోయినా జనానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. నెల్లూరులో ఎవరూ తిండి లేక చావడం లేదు. మరి కడుపు నింపుకోవ డానికి ఆస్తులమ్ముకునేంత పరిస్థితులైతే లేవు. నెల్లూరులో ఏ స్థాయి వారికి తగ్గట్లు ఆ స్థాయి హోటళ్లు వున్నాయి. జేబులో పదివేలు వున్నోడు మినర్వాలో తింటాడు, వెయ్యి రూపాయలు వున్నోడు మయూరి రెస్టారెంట్‌లో తింటాడు, వంద మాత్రమే వున్నోడు మురళీకృష్ణకు వెళతాడు. పదో, ఇరవయ్యో వుంటే తోపుడు బండి వద్ద తింటాడు. నెల్లూరులో ప్లేట్‌ ఇడ్లీ 200 రూపాయలకు దొరుకుతుంది, అదే ప్లేటు ఇడ్లీ పది రూపాయలకూ దొరుకుతుంది. భోజనమైతే స్టార్‌ హోటల్‌లో 500 రూపా యలకు బఫే వుంది. రోడ్ల మీద బండ్ల వద్ద పాతిక రూపాయలకూ దొరుకుతుంది. మరీ డబ్బులు లేక అడుక్కునే వాళ్లకు దేవా లయాల వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాలు న్నాయి. కార్పొరేషన్‌ వాళ్లు అన్నక్యాంటీన్‌ పెట్టి ఒక చపాతిని 5రూపాయలకు ఇస్తా రేమో? ఇదే చపాతి బయట పది రూపా యలకు కూడా దొరుకుతుంది. నెల్లూరు భోజనానికి, రుచికరమైన టిఫిన్‌లకు పెట్టింది పేరు. ఇక్కడ ఆహార పదార్ధాలు ఖరీదుగానే కాదు చౌకధరల్లోనూ దొరుకు తాయి. ఈ హోటళ్లు, టిఫిన్‌ బండ్లు, టిఫిన్‌ అంగళ్లు పెట్టుకునే నగరంలో వేలాది మంది బ్రతుకుతున్నారు. తక్కువ ఖర్చుతోనే ఎన్నో వేలమంది కడుపులు నింపుతున్నారు. ఇప్పుడు కార్పొరేషన్‌ వాళ్ళు అన్న క్యాం టీన్‌లు పెట్టి అర్జంట్‌గా ఈ చిరువ్యాపారుల కడుపు మీద కొట్టాల్సిన అవసరముందా? దానికంటే ముందు నగరంలో పారిశుద్ధ్యం, పందులు, దోమలు, అస్తవ్యస్థంగా తయా రైన రోడ్లు, సరిగా రాని మంచినీళ్ళు, రిజర్వ్‌ స్థలాల ఆక్రమణలు వంటి ఎన్నో సమస్యలు న్నాయి. ముందు వాటి సంగతి చూడండి!

Page 1 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter