kotam edupuసీనియర్‌ సిటిజన్‌లు, విశ్రాంత ఉద్యోగులు సేద తీరడం కోసం, నలుగురు కలిసి మంచిచెడ్డలు చెప్పుకుంటారనే సదుద్దేశ్యంతో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో 'పెద్దలకొలువు' పేరుతో వారికి విశ్రాంతి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదటి పెద్దల కొలువుకు నెల్లూరు, పొదలకూరురోడ్డులో ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు కొంచెం స్థలంలో సీనియర్‌ సిటిజన్స్‌ చేతుల మీదుగానే శంకుస్థాపన చేయించారు. తన స్వంత నిధులతో దీనికి స్లాబు కూడా వేయించారు. నగర కమిషనర్‌ నోటి మాట తీసుకునే ఈఎస్‌ఐ ఆసుపత్రి ముందు దీని నిర్మాణం చేపట్టాడాయన!

అయితే గత నెల 31వ తేదీ నుండి ఈ నెల 3వ తేదీ వరకు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరగడం తెలిసిందే! ఈ కూల్చివేతల పరంపరలో ఈ నెల 3వ తేదీన కార్పొరేషన్‌ సిబ్బంది 'పెద్దలకొలువు' విశ్రాంతి మందిరాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసేసారు. అడ్డుకోబోయిన వృద్ధులను పోలీసుల సాయంతో నెట్టేసారు. 'పెద్దలకొలువు'ను కుప్పకూల్చారన్న సంగతి ఓ పెళ్లి వేడుకకు హాజరై వున్న కోటంరెడ్డికి తెలిసింది. ఆయన వెంటనే సంఘటనా స్థలికి వచ్చారు. కుప్పకూలిన తన ఆశల సౌధం చూసి ఆయన మనసు ముక్కచెక్కలైంది. హృదయం మూగబోయింది. అక్కడే కూలబడిపోయి భోరున విలపించాడు. దాదాపు గంటసేపు మండుటెండలోనే కూర్చుని నిరసన తెలిపాడు. కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీరావు పరిస్థితి సీరియస్‌ కావడాన్ని గమనించి అక్కడకు చేరుకు న్నాడు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ సమన్వయ లోపంతోనే ఇలా జరిగిందని, పెద్దల కొలువుకు తానే మాట పూర్వకంగా అనుమతినిచ్చానని ఒప్పు కున్నారు. అనుమతి లేని భవనం కాబట్టి స్లాబుకు బొక్కలు పొడవమంటే, సిబ్బంది పూర్తిగా కూల్చారని, సమన్వయలోపం వల్లే ఇలా జరిగిందని బాధపడ్డారు.

'పెద్దలకొలువు' కూల్చివేతతో ఈ ప్రాంత ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వంలో, అధికా రంలో ఉన్నోళ్ళు చేయలేని పనిని ప్రతిపక్ష ఎమ్మెల్యే చేస్తుంటే, దానిని కూడా అడ్డుకో వడర ఎంత దుర్మార్గమని ప్రశ్నిస్తున్నారు.

కాగా, 4వ తేదీన కూల్చిన స్థలం లోనే తిరిగి 'పెద్దలకొలువు' పునరుద్ధర ణకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఈసారి ఇక కార్పొరేషన్‌ వాళ్ళు దానిజోలికి పోకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారికే కోటంరెడ్డి అంటే ఏంటో వాళ్ళు చూశారు.

ycpవరల్డ్‌కప్‌ జరుగుతున్నా పందేలే... ఐపిఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నా పందేలే... కబడ్డీ పోటీలు, టెన్నిస్‌ ఆటలు, బ్యాడ్మింటన్‌ ట్రోఫీలు... ఇలా బెట్టింగ్స్‌ అనేవి క్రీడలకు బాగా పాకిపోయాయి. అవే బెట్టింగ్స్‌ రాజకీయాలలోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నా, ఎక్కడ ఎలక్షన్‌లు జరుగుతున్నా పందేల రాయు ళ్ళకు పండుగే!

మొన్ననే ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద భారీగానే పందేలు జరిగాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుంది, గెల వదు అన్న పాయింట్‌ మీద కోట్ల రూపా యల్లో పందేలు కాసారు.

తాజాగా రాష్ట్రంలో జరిగిన మూడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భారీగానే పందేలు పెట్టినట్లు తెలుస్తోంది. నెల్లూరుజిల్లాలో పోటీపై పందేలు బాగా జరిగాయి. తెలుగుదేశం అభ్యర్థి వాకాటి గెలుపు మీద కొందరు, వైసిపి అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి గెలుపు మీద కొందరు వేల నుండి లక్షల్లో పందేలు కాసారు. 20వ తేదీ ఫలితాలు వచ్చాయి. తెలుగు దేశం అభ్యర్థి గెలిచాడు. వైసిపి గెలుపు మీద పందేలు కాసినవాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వైసిపికి పందేలు కలిసిరావడంలేదనిపి స్తోంది. 2012లో కోవూరు ఉపఎన్నికలు జరిగాయి. వైకాపా అభ్యర్థిగా నిలబడ్డ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కోట్లాది రూపాయల పందేలు జరిగాయి. అయితే ఆరోజు ఆయన గెలుపుపై పందేలు కాయ లేదు. మెజార్టీ పాతికవేలు దాటుతుందని, దాటదనే అంశాలపై మాత్రమే పందేలు కాసారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచినా పాతికవేల మెజార్టీకి 1500ఓట్ల దూరంలో ఆగిపోవడంతో వైసిపి మీద పందేలు కాసిన వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకున్నారు. మళ్ళీ 2014 ఎన్నికల్లోనూ వైసిపి విజయం మీద పందేలు కాసినోళ్ళు నష్టపోయారు. వైసిపి అధికారంలోకి వస్తుందని అప్పుడు భారీగా బెట్టింగ్‌లు పెట్టారు కాని అది జరగలేదు. అలాగే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసిపిపై పందేలు కాసినవాళ్ళు నష్టపోయారు.

anuradhaఆడోళ్ళు కడుపులో ఏదీ దాచుకోరు... ఆనందం వచ్చినా పట్టలేము, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేము... ఏదీ ఆపుకోలేరు. వారిని చూసి జిల్లా తెలుగుదేశం మగనాయకులు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి. జిల్లా తెలుగుదేశం నాయకుల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటుంటారు. అయినా ఎదురెదురు పడితే ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. కడుపుల్లో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు. మేం మగనాయకులు మాదిరిగా కాదు... లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకోటి చేయలేం, ఏదైనా ఓపెన్‌ ఫైట్‌ అంటూ జిల్లా తెలుగు మహిళలు తమ సత్తా చూపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తమ విభేదాలకు వేదికగా మలిచారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులకు మధ్య విభేదాలున్నట్లే నాయకురాళ్ళ మధ్య కూడా విభేదాలున్నాయి. అయితే నాయకుల మధ్య విభేదాలున్నా బయటపడలేరు. నాయకురాళ్ళు మాత్రం బయటపడ్డారు. 8వ తేదీ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధ ఆధ్వర్యంలో టీడీపీ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. దీనికి మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ అతిథిగా వచ్చి మాట్లాడిపోబోయారు. అంతలో జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు పొత్తూరు శైలజ, రాష్ట్ర మహిళా ఆర్ధిక సహకార సంస్థ డైరెక్టర్‌ మల్లి నిర్మలలు ఇంకొందరు మహిళలతో వచ్చారు. మంత్రి నారాయణ ముందే అనూరాధతో మల్లి నిర్మల, శైలజలు గొడవకు దిగారు. తమకు తెలియకుండా తమను పిలవకుండా పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. దీంతో అనూరాధ వైపు మహిళలు కూడా అరుపులకు లేచారు. మంత్రి వారికి సర్ధిచెప్పి అక్కడ నుండి జారుకున్నాడు. మంత్రి వెళ్ళాక ఇరువర్గాల మధ్య గొడవ ఇంకొంచెం ఎక్కువైంది. ఈ రచ్చ భరించలేక పార్టీ ఆఫీసు ఇన్‌ఛార్జి శీనయ్య మంత్రికి ఫోన్‌ ద్వారా విషయం చెప్పాడు. పార్టీ ఆఫీసు నుండి అందర్నీ పంపించేయమని మంత్రి చెప్పడంతో శీనయ్య అదే పని చేసాడు. మొత్తానికి కడుపులో కసిపెట్టుకుని పెదాలపై చిరునవ్వులు చిందించడానికి మేం నాయకులం కాదు... నాయకురాళ్ళం అని నిరూపించారు తెలుగు మహిళా నేతలు.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter