nandiఈ రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా దాని వెనుక ఓట్ల మర్మం దాగి వుంటుంది. లేదా పూర్తిగా రాజకీయ కోణం వుంటుంది. ఆ రాజకీయ కోణం ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా వదల్లేదు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ప్రకటించలేదు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను మొన్న ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది. నంది విజేతల ఎంపికలో నందమూరి కుటుంబానికి పెద్దపీట వేసి సినీ పరిశ్రమలో నందమూరికి పోటీగా వున్న మెగా ఫ్యామిలీ ప్రాధాన్యత తగ్గించడం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. కేవలం బంధుప్రీతితోనే నంది అవార్డుల ఎంపిక జరిగిందంటూ ఇప్పటికే సినీరంగం నుండి పలువురు విమర్శలు మొదలుపెట్టారు. 2014లో ఉత్తమ నటుడుగా బాలకృష్ణ, 2015లో మహేష్‌, 2016లో జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 2014లో లెజండ్‌ను, 2015లో బాహుబలిని, 2016లో జనతాగ్యారేజ్‌ను ఎక్కువ అవార్డులు వరించాయి.

సినీ పరిశ్రమలో మెగా కుటుంబం నుండి చిరంజీవితో పాటు పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌, సాయి ధర్మతేజ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, కంచె హీరో వరుణ్‌తేజ వున్నారు. వీరిలో చిరంజీవిని 2016 సంవత్సరానికి రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. అల్లు అర్జున్‌కు రుద్రమదేవి సినిమాకుగాను

ఉత్తమ సహాయనటుడు అవార్డు లభించింది. ఈ మూడేళ్ళలో మెగా ఫ్యామిలీ నటుల నుండి మంచి సినిమాలే వచ్చాయి. అల్లు అర్జున్‌ నటించిన సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో ఎంతో మంచి సందేశం దాగి వుంది. అలాగే తెలుగువారి పౌరుషాన్ని చాటే 'రుద్రమదేవి' సినిమాకు ఒక్క ఉత్తమ సహాయ నటుడు అవార్డు తప్ప ఇంకేమీ దక్కలేదు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. జరిగిందో లేదో తెలియని కల్పిత కథను ఆధారంగా చేసుకుని తీసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. అదే వాస్తవ కథతో, తెలుగుజాతి పౌరుషాన్ని చాటే సారాంశంతో తీసిన రుద్రమదేవి సినిమాకు మాత్రం వినోదం పన్ను మినహాయించలేదు. ఆ చిత్ర దర్శకుడు దీనినే ప్రశ్నించాడు. గోదావరి పుష్కరాలప్పుడు 23మంది భక్తుల ప్రాణాలు తీసి సెట్టింగ్‌లు వేసి నిర్మించిన పుష్కరాల డాక్యుమెంటరీకి నంది రావడం ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోవచ్చు... కాని నందుల ఎంపికలో మెగా ఫ్యామిలీని తక్కువ చేసి చూసారనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది.

ntr'దూకుడు' సినిమాలో బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణలను హీరో మహేష్‌బాబు ఎలా వాడుకుంటాడో చూసాము. అది సినిమా. రాజకీయా ల్లోనూ అలాంటి వాడకం వుంటుంది. అవసరాన్ని బట్టి, అనువైన సమయాన్ని బట్టి ఏ మనిషిని ఏ విధంగా వాడుకోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

రాజకీయాలలో అధికారం కోసం అవసరమైతే సొంత అన్నదమ్ములను కూడా దూరంగా పెట్టాలి. ప్రత్యర్థులనుకున్నవాళ్ళను కూడా పక్కన చేర్చుకోవాలి. తన అధికారం కోసం అడ్డంగా వున్నారని చెప్పే చంద్రబాబు సొంత తమ్ముడిని దూరంగా పెట్టాడు. బావమరుదులు, తోడల్లుడును కూడా కాదనుకున్నాడు. 2014 ఎన్నికల్లో నందమూరి కుటుంబసభ్యులను కూడా కాదనుకుని పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ను పట్టుకున్నాడు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేసాడు. 2014 ఎన్నికలప్పుడు మాత్రం చంద్ర బాబు అతనిని ప్రచారానికి పిలవలేదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ ప్రచారానికి వచ్చినా రాకున్నా ఎన్టీఆర్‌ అభిమానుల ఓట్లు పడేది తెలుగుదేశానికే! పక్కకు పోవు. అదే పవన్‌ కళ్యాణ్‌ ప్రచారానికి వస్తే పక్కకుపోయే ఓట్లు కూడా తెలుగుదేశానికి వస్తాయి. ఈ లెక్కలోనే గత ఎన్నికల్లో జూనియర్‌ను దూరంగా పెట్టి పవన్‌ను తెచ్చుకున్నాడు.

మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి. ఈసారి పవన్‌ తెలుగుదేశంకు మద్దతిచ్చేది అను మానమే. సొంతంగా పోటీ చేసే ఆలో చనలో ఆయనున్నాడు. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే! అదే సమయంలో తాను దూరంగా పెట్టిన జూనియర్‌ ఎన్టీ ఆర్‌ను ఇంకా దూరంగా పెడితే లేనిపోని సమస్యలొస్తాయి. జూనియర్‌ను చంద్ర బాబు మరీ తొక్కేస్తున్నాడన్న ప్రచారం ఎక్కువైతే అతని అభిమానులు రివర్సయ్యే అవకాశముంది. 2014 ఎన్నికలప్పుడు కొడాలి నాని ఈ బాపతే! కాబట్టే మళ్ళీ జూనియర్‌ను వాడుకునే ఆలోచనకు చంద్ర బాబు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. నందమూరి కుటుంబంలో ప్రధాన ఆక ర్షణ, బలమైన అభిమానగణం వుండేది జూనియర్‌కే! జూనియర్‌ను తిరిగి పార్టీ కోసం వాడుకోవాలంటే అతని తండ్రి నందమూరి హరికృష్ణను లైన్‌లోకి తీసు కోవాలి. ఈ కోణంలోనే హరికృష్ణకు పార్టీలో మళ్ళీ పెద్దపీట వేస్తున్నాడు. ఈ విధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ వాడకానికి మార్గం సుగమం చేసుకున్నాడు.

ntr balaతెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు నేలపై ఆయనో చరిత్ర. తెలుగుసినిమాకే కాదు, జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయాలకే వెలుగు తెచ్చిన నాయ కుడు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నానంటూ ఆయన తనయుడు, సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి రసవత్తర చర్చకు తెరలేపారు. అందులో ఎన్టీఆర్‌ పాత్రను తానే పోషిస్తు న్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అయితే, ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తీయడమంటే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తీసినంత సులభం కాదు. చరిత్రలో వ్రాసిన దాన్ని బట్టి ఈ సినిమా తీసారు. కాబట్టి సినిమాలో వున్నదే చరిత్ర అనుకుంటారు ప్రజలు. ఆ కాలంలో జరిగిందేందన్నది ఈ కాలం వారికి తెలియదు. కాని ఎన్టీఆర్‌ జీవితచరిత్ర ఏంటన్నది ఈ కాలం వారికి తెలుసు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ తెలుసు. వాటిని ధైర్యంగా ప్రజల ముందుకు తేగలరా? ఒకవేళ తెస్తే ఆయన జీవితచరిత్రలో పాజిటివ్‌ క్యారెక్టర్‌లున్నాయి, నెగటివ్‌ క్యారెక్టర్లున్నాయి. ఉన్నవి ఉన్నట్లు బాలకృష్ణ చూపగలడా? ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పరిశీలిస్తే పుట్టుక నుండి సినిమా రంగ ప్రవేశాన్ని మొదలుకొని 'శ్రీమద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' సినిమా వరకు ఒక పార్ట్‌. సినిమా రంగంలో ఆయన వ్యక్తిగత విజయాలు తప్పితే సంచలనాలకు చోటు లేదు. ఇక 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి రెండో పార్ట్‌గా తీసుకోవాలి. 1983లో అద్భుత ప్రజాప్రభంజనంతో అధికారంలోకి రావడం, 1984లో నాదెండ్ల భాస్కర్‌రావు చేతిలో వెన్నుపోటుకు గురై పదవీచ్యుతుడు కావడం, తిరిగి ప్రజామద్దతు కూడగట్టి నాదెండ్లను దించడం, 1985లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడం, 1989లో అధికారం కోల్పోవడం, 1993లో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం, 1994లో తిరిగి అధికారంలోకి రావడం, 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురై సీఎం పదవిని కోల్పోవడం, వైస్రాయ్‌ హోటల్‌ వద్ద తాను గెలిపించిన ఎమ్మెల్యేలే తనపై చెప్పులు విసరడం, తనను పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబుపై ఎన్టీఆర్‌ తీవ్ర విమర్శలు చేయడం, ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో కొడుకులు, కూతుర్లు, మరో అల్లుడు ప్రధానపాత్ర పోషించడం, తీవ్ర మానసిక వేదనతో ఎన్టీఆర్‌ 1996 జనవరిలో మరణించడం... ఎన్టీఆర్‌ రాజకీయ చరిత్రలో ప్రధాన ఘట్టాలు. వీటిలో ఆయా క్యారెక్టర్‌లను పర్‌ఫెక్ట్‌గా చూపించకపోతే ఆ సినిమాకు అర్ధమే లేదు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను అర్ధంపర్ధం లేకుండా చేసినట్లవుతుంది. 1984లో ఎన్టీఆర్‌కు నాదెండ్ల పొడిచింది వెన్నుపోటు అయితే 1995లో చంద్రబాబు చేసింది కూడా అదే! నాదెండ్లను విలన్‌గా చూపించొచ్చు. అదే సమయంలో తన బావ చంద్రబాబును బాలయ్య విలన్‌గా చూపించగలడా? ఖచ్చితంగా చేయడు. లక్ష్మీపార్వతి ఉచ్చులో చిక్కుకున్న ఎన్టీఆర్‌ను, తెలుగుదేశం పార్టీని కాపాడడానికే ఆరోజు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసారన్నట్లు చూపిస్తారు. అలాగే ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను కూడా మంచిగానే చూపించుకుంటారు. ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌లుగా చూపబోయేది నాదెండ్ల భాస్కర్‌రావు, లక్ష్మీపార్వతిలనే! ఇందులో సందేహమేలేదు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter