nudaతెలుగుదేశం పార్టీలో ఇంతవరకు జరిగిన పదవుల పందేరం ఓ లెక్క... ఇకముందు జరగబోయే పదవుల పందేరం ఓ లెక్క! ఇప్పటివరకు కులసమీకరణల లోనో, లేక సీనియార్టీ మీదనో, లేక పిలవ గానే అవతల పార్టీల నుండి పరుగెత్తు కుంటూ వచ్చారనో పదవులిస్తూ వచ్చారు. కాని ఇక నుండి ఇవ్వబోయే పదవులు మాత్రం రానున్న ఎలక్షన్‌ కోణంలోనే వుంటాయి. ఆ పదవుల పంపిణీ వెనుక ఓట్ల లెక్కలుంటాయి. ఒకరికి ఈ పదవి ఇచ్చిన దానివల్ల కనీసం ఎన్ని ఓట్లు పార్టీకి అదనంగా వస్తాయనే ఆలోచనలు ఉం టాయి. రేపు 'నుడా' ఛైర్మెన్‌ పదవిని కూడా అదే కోవలో ఇవ్వబోతున్నారు.

'నుడా' పదవికి ప్రస్తుతం అనూరాధ, డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, కోటంరెడ్డి శ్రీని వాసులురెడ్డి, దేశాయిశెట్టి హనుమంత రావుల పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ జిల్లా రాజకీయాలలో కుల సమీకరణలు బట్టి కూడా పదవులను ఇవ్వాల్సి ఉంటుంది. రాజకీయంగా రెడ్లు, బి.సిలకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సి వుంటుంది. ఈ జిల్లా నుండి చూస్తే కాపుల తరపున ఒక మంత్రి ఉన్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బి.సి వర్గాలకు చెందిన నాయకుడున్నారు. ఇక పార్టీని రెడ్లకు చేరువ చేయాలనే దృష్టితో ఇటీవలే ఆ వర్గానికి చెందిన సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం కల్పిం చడం జరిగింది. రెడ్లను పార్టీవైపు లాక్కునే కనీస ప్రయత్నం ఇది.

ఇప్పుడు జిల్లా టీడీపీ రాజకీయాలలో ఒకటే లాజిక్‌! రెడ్లు దగ్గరైతే పార్టీ బల పడుతుంది. బీసీలు దూరమైతే పార్టీ బలహీనపడుతుంది. 'రెడ్ల'కు నుడా ఇచ్చి నంత మాత్రాన ఆ వర్గాలకు చెందిన ఓట్లు వస్తాయన్న గ్యారంటీ ఇక లేదు. కాని, ఇప్పటికే కాపు రిజర్వేషన్లను కలబెట్టి

ఉండడంతో బి.సిలలో అసంతృప్తి మొద లైంది. రేపు నామినేటెడ్‌ పదవుల విష యంలో కూడా బి.సిలకు తగిన ప్రాధా న్యతనివ్వకపోతే కొత్త ఓట్లు రావడం మాట దేముడెరుగు పార్టీకి ఉన్న ఓట్లు పోయే అవకాశముంది. కాబట్టి పార్టీకి ఓట్లు సమకూర్చే దిశగా 'నుడా' ఛైర్మెన్‌ ఎంపిక ఉండబోతోంది.

nudaఅభివృద్ధి జరిగినా జరగకపోయినా కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య! వ్యాపారాలలో ఉండే కొందరు పనులు లేకున్నా పనులను సృష్టిస్తుంటారు. చంద్రబాబునాయుడు కూడా అంతే... ఇక్కడ రాజకీయాలలో శూన్యత ఆవరించినా తనకంటూ ఏదో ఒక పని సృష్టించుకుని, రాష్ట్రంలో ఏదో అద్భుతం జరిగిపోతుందనే భ్రమలను ప్రజలకు కల్పిస్తుంటాడు. ఈ కోవలోనే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఏదో ఒక డెవలప్‌మెంట్‌ చేస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఒకటి.

నెల్లూరు, చిత్తూరుజిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాల్టీలను కలిపి మొత్తం కావలి కడ నుండి తడ దాకా 21మండలాలు, 156 గ్రామాలతో 'నుడా'ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జి.ఓను జారీచేసింది. అపాయింటెడ్‌ నోటిఫికేషన్‌ను కూడా నెల్లూరు, చిత్తూరుజిల్లాల కలెక్టర్లకు పంపించారు. నెల్లూరుజిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా వుండే కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కొడవలూరు, కోవూరు, నెల్లూరురూరల్‌, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, గూడూరు, చిల్లకూరు, ఓజిలి, నాయుడుపేట, డి.వి.సత్రం, సూళ్ళూరుపేట, తడ మండలాల్లోని 145 గ్రామాలు, చిత్తూరుజిల్లా పరిధిలోని సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలకు చెందిన 11గ్రామాలను 'నుడా'లో కలిపారు.

అపాయింటెడ్‌ తేదీ నుండి 'నుడా' అధికారికంగా మొదలైనట్లే! నెల్లూరు కేంద్రంగా 'నుడా' పనిచేస్తుంది. ప్రస్తుతానికి 'నుడా'కు పాలకవర్గాన్ని నియమించలేదు. దీనిలో ఛైర్మెన్‌ పదవి కీలకం. ముఖ్యమంత్రి ఆశీస్సులు ఎవరికి వుంటే వారికే ఈ పదవి దక్కుతుంది. ఇక స్పెషల్‌ గ్రేడ్‌ అధికారిని వైస్‌ఛైర్మెన్‌గా లేదా సిఇఓగా నిమించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో మున్సిపల్‌, ఆర్ధిక, విద్యుత్‌, రోడ్లు భవనాలు, ఎన్విరాన్‌మెంట్‌ శాఖలకు చెందిన అధికారులు ప్రభుత్వం తరపున డెవలప్‌మెంట్‌ అథారిటీలో సభ్యులుగా కొనసాగుతారు.

మేయర్‌ అధికారాలకు కత్తెర

కార్పొరేషన్‌ పరిధిలో ఆదాయం వచ్చే మార్గం రియల్‌ ఎస్టేట్‌! కొత్తగా లే అవుట్‌ వేయాలన్నా, అపార్ట్‌మెంట్‌లు, భవన నిర్మాణాల ప్లాన్‌లు అప్రూవల్‌ కావాలన్నా కార్పొరేషన్‌ లేదా మున్సిపాల్టీలకే అధికారముండేది. ఇప్పుడు ఈ అధికారాలన్నీ కూడా 'నుడా'కు బదిలీ అవుతాయి. లే అవుట్‌లు వేసే వాళ్ళకు డిటిసిపి అప్రూవల్స్‌ నెల్లూరులో అందుతాయి. ఇంతకు ముందు పిటిసిపి అప్రూవల్స్‌ కోసం గుంటూరు పోవాల్సి వచ్చేది. ఆరు నెలలు తిరగాల్సి వచ్చేది.

పరిధి చాలాపెద్దది

రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలున్నాయి. గతంలో కొన్ని నగరాలకే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను పరిమితం చేశారు. కాని, ఇప్పుడు సువిశాల ప్రాంతాలతో అర్బన్‌ డెవలప్‌మెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు సగం నెల్లూరుజిల్లాతో 'నుడా'ను ఏర్పాటు చేసినట్లయ్యింది. జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఇఫ్కో సెజ్‌, చింతవరం సెజ్‌, మేనకూరు సెజ్‌, మాంబట్టు సెజ్‌, శ్రీసిటీ సెజ్‌లే కాకుండా ఇసుక, సిలికా మైకాలున్న మండలాలు, ఆక్వాసాగు చేసే మండలాలు కూడా 'నుడా' పరిధిలోకే వచ్చాయి. కాబట్టి నెల్లూరు మేయర్‌ కంటే కూడా 'నుడా' ఛైర్మెన్‌ పదవి ఎంతో కీలకమైనది, విలువైనది కూడా కాబోతోంది.

nellore mapనెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)... తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇది ఊరిస్తూనే వుంది. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచాయి. 'నుడా' ఏర్పాటు ప్రతిపాదనలు నానుతూనే వున్నాయి. మొదట 36మండలాలను కలిపి 'నుడా' ఏర్పాటు చేయాలనుకు న్నారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలోని 10మండలాలను పక్కన పెట్టేసి మిగతా జిల్లానంతా 'నుడా' పరిధిలోకి తెచ్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. తద్వారా ఆ ప్రతిపాదనలను అటకెక్కించారు. 'నుడా' ఛైర్మెన్‌ పదవిపై గంపెడాశలు పెంచుకున్న తెలుగుదేశం నాయకులు ఇది వచ్చేది లేదు, సచ్చేది లేదు అని సరిపెట్టుకున్నారు.

కాగా 'నుడా'పై మళ్లీ ఆశలు చిగురించాయి. ఆగస్టు రెండోవారంలో జరిగే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో 'నుడా' ఏర్పాటు ఫైల్‌ను పెట్టబోతున్నారు. ఈమేరకు 'నుడా' ప్రతిపాదనతో కూడిన ఫైలును కేబినెట్‌ భేటీలో పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుండి మున్సిపల్‌ శాఖకు ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు జిల్లాలోని 19మండలాలలను కలిపి నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి రూపకల్పన చేసారని తెలుస్తోంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట మున్సిపాల్టీలను, నాయుడుపేట నగర పంచాయితీని 'నుడా' పరిధిలోకి తేనున్నారు. కావలి నుండి తడ దాకా జాతీయ రహదారి వెంబడి పారిశ్రామికాభివృద్ధికి అవకాశం వున్న అన్ని మండలాలు 'నుడా' పరిధిలోకి వస్తాయి. మొత్తం 1569 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 13లక్షల జనాభాతో 'నుడా' ఫైల్‌ తుది మెరుగులు దిద్దుకుంది. ఆగస్టులో జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై స్టాంప్‌ పడితే, ఆ తర్వాత జిల్లా నాయకుల మధ్య 'నుడా' ఛైర్మెన్‌ పదవికై రన్నింగ్‌రేస్‌ మొదలవుతుంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter