pachadanamపాతికేళ్ళ క్రితం నెల్లూరు నగరంలో ''పార్కు'' అంటే గాంధీ బొమ్మ వద్ద స్వతంత్ర పార్కు ఒక్కటే కనిపించేది. ఆ పార్కులో చెట్ల క్రిందే జనాలు సేద తీరుతూ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ముచ్చట్లు పెట్టుకుని వుండేవాళ్ళు. తిక్కన పార్కు, గుప్తాపార్కు వంటివి వున్నా వాటిని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. 2000 ప్రాంతంలో అప్పటి కలెక్టర్‌ శ్రీలక్ష్మి చొరవతో ప్రముఖ దాత జె.యస్‌.రెడ్డి దాతృత్వంతో చింతారెడ్డిపాలెంరోడ్డులో నగరానికే శోభాయమానంగా చిల్డ్రన్స్‌ పార్క్‌ వెలసింది. అయితే ఆ తర్వాత వచ్చిన కలెక్టర్‌ అనంతరాము దానిని వ్యాపారం కోసం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించి నాశనం చేసి పెట్టారు.

నగరంలో పలు చోట్ల పార్కుల కోసం రిజర్వు స్థలాలు ఉం చినా వాటిని పార్కులుగా అభివృద్ధి చేసింది లేదు. మాగుంట లే అవుట్‌లో కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ ఎదురుగా మాగుంట సుబ్బరామ రెడ్డి మెమోరియల్‌ పార్కును అప్పట్లో స్థానికులే అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అయ్యప్పగుడి, బాలాజీనగర్‌లలో పార్కు స్థలాలలోనే పోలీసు స్టేషన్‌లు కట్టడం చూసాం.

వాస్తవంగా లే అవుట్లు వేసిన రియల్టర్లే పార్కుల కోసం వదిలిన స్థలాలలో పార్కులను అభివృద్ధి చేయాలి. కాని, వాళ్ళు రిజర్వు స్థలాలు వదలడం తప్పించి, అభివృద్ధి చేసేవాళ్ళు కాదు. మున్సిపాల్టీవాళ్ళు కూడా వీటిని పట్టించుకోకపోవడం వల్ల చాలాచోట్ల రిజర్వ్‌ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి.

అయితే గత నాలుగేళ్లలో నగరంలో ఇతర విభాగాలలో జరిగిన అభివృద్ధిని పక్కనపెడితే పార్కులకు మాత్రం మంచికాలమే వచ్చిందని చెప్పవచ్చు. మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల నిరుపయోగంగా వున్న ఎన్నో రిజర్వ్‌స్థలాలు పార్కులుగా రూపాంతరం చెందాయి, చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అమృత్‌' పథకం ద్వారానైతేనేమీ, స్థానిక దాతల సహకారంతోనైతేనేమీ, కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలోని సివిఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో గాని నగరంలో చాలా పార్కులకు పచ్చని కళ వచ్చింది. ఎంతో అందంగా ఈ పార్కులు తయారవుతున్నాయి. నెల్లూరీయులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించబోతున్నాయి.

parksఆరు లక్షలు దాటిన జనాభా, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి వున్న నెల్లూరు నగరంలో ప్రజలు, పిల్లల ఆహ్లాదం కోసం ఒక్క మంచి పార్కు కూడా లేకపోవడం సిగ్గుచేటైన విషయం. నెల్లూరు నగరంలో ఎన్ని పార్కులున్నాయి, ఎన్ని పార్కుల కోసం రిజర్వు స్థలాలు వదిలి ఉన్నారనే సమాచారం పూర్తిగా కార్పొరేషన్ వద్ద కూడా లేదు. నెల్లూరు నగరంలో పార్కులున్నాయి. పార్కుల కోసం స్థలాలు వదిలి వున్నారు. ఎవరో ఒకరు వాటిని ఆక్రమించుకుంటున్నప్పుడు మాత్రమే రిజర్వ్ స్థలాల విషయం వెలుగులోకి వస్తుంది.

చింతారెడ్డిపాలెంరోడ్డు, ఆదిత్యనగర్ లో వున్న ఏకైక చిన్నపిల్లల పార్కును కూడా దరిద్రం చేసిపెట్టారు. 2000సంవత్సరంలో దాత జె.యస్.రెడ్డి జన్మభూమి క్రింద ఈ పార్కును నిర్మించి ప్రజలకు, ముఖ్యంగా చిన్నపిల్లకు కానుకగా ఇచ్చారు. ఈ పార్కు నిర్మాణంలో అప్పటి కలెక్టర్ శ్రీలక్ష్మి పాత్ర విస్మరించలేము. నగరంలో అత్యంత చెత్త(కంపోస్ట్ యార్డ్) ప్రాంతాన్ని అత్యంత సుందరంగా మార్చింది శ్రీలక్ష్మినే. ఆమె వల్లే ఇక్కడ కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం జరుగుతుంది కూడా. ఈ పార్కును ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ అనంతరాము వ్యాపారవేత్తలకు లీజుకు వ్రాసిచ్చేయడంతో దీని రూపురేఖలు మారిపోయాయి. ఉన్న ఒక్క మంచి పార్కు కూడా ఇప్పుడు అధ్వాన్న స్థితికి చేరుకుంది. నగరంలో చెప్పుకోదగ్గ వాటిలో స్వతంత్రపార్కు ఒకటి. చిన్నపార్కే అయినా కొద్దోగొప్పో బాగానే వుంది. నగరంలో ఇంకే పార్కు కూడా పార్కు రీతిలో లేదు. నగరంలో నవాబుపేట, స్టోన్ హౌస్ పేట, బాలాజీనగర్, ఏసి నగర్, హరనాథపురం, పొదలకూరురోడ్డు, వేదాయపాలెం, మాగుంట లే అవుట్, రవీంద్రనగర్, అయ్యప్పగుడి, రంగనాయకులపేట, సంతపేట వంటి ప్రాంతాల్లో పాత పార్కులున్నాయి. అవి జూదరులకు, వ్యసనపరులకు ఆశ్రమాలుగా మారివున్నాయి. కొత్తగా లే అవుట్లు వేసిన శివారు ప్రాంతాల్లోనూ పార్కుల అభివృద్ధి అంతం మాత్రంగానే వుంది. ఈమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాలను, డివిజన్ లను దత్తత తీసుకుంటున్నారు. ఒక గ్రామంలో పూర్తిస్థాయి వసతులు కల్పించాలంటే ఒక రకంగా సాధ్యమయ్యే పని కాదు. కాని పనిచేసే దిశగా ఇదొక ముందడుగని చెప్పవచ్చు. అలాగే ఆయా ప్రాంతాల్లో పార్కులను గుర్తించి వాటిని దత్తత తీసుకునే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సివుంది. గతంలో బి.లక్ష్మీకాంతం నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరించినప్పుడు ఈ దిశగా చొరవచూపాడు. పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక తయారుచేసారు. అయితే ఆయన బదిలీతో ఆ ప్రణాళిక ఆగిపోయింది. పార్కులు పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్కరు ఒక్కో పార్కును దత్తత తీసుకోవడం ఉత్తమం.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter