munchutaroరాష్ట్ర రాజకీయాలలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి విషయాలలో క్లారిటీ వుంది. 2014లోనే కాదు వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు ఎలాగూ ఓట్లేయరు, కాబట్టి అవి డమ్మీలే! ఇవి పోటీలో వున్నా వచ్చేది నామమాత్రపు ఓట్లే!

అదికాకుండా ఇప్పుడు జనాలకు అర్ధం కాని పజిల్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో తిరుగుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ జనసేన జెండా పట్టుకుని ప్రత్యక్షంగానే రాజకీయ యాత్రలు చేస్తున్నాడు. లక్ష్మీనారాయణే ఇంకా ఏ జెండా పట్టుకోలేదు. అతని అజెండా ఏంటో కూడా తెలియడం లేదు. కాని వచ్చే ఎన్నికల్లో బీజేపీకో లేదా టీడీపీకో పనిచేసే అవకాశముంది. లేదంటే పవన్‌కు తోడుగా జతకావచ్చు కూడా! గత ఎన్నికలకు రేపటి ఎన్నికలకు తేడా ఇదే! 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి పడ్డ బీజేపీ ఓట్లను ఈసారి ఆ పార్టీ చీల్చుకోవచ్చు. ఈ రూపంలో నష్టం ఎంతుండొచ్చో అప్పుడే చెప్పలేం. మరి లక్ష్మీనారాయణ, పవన్‌కళ్యాణ్‌లు ఎవరిని ముంచడానికి సిద్ధంగా వున్నారో తేలాల్సివుంది. లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరినా, ఏ పార్టీకి ప్రచారం చేసినా వైసిపికి వచ్చే నష్టం ఏమీ లేదు. జగన్‌ వ్యతిరేకులే లక్ష్మీనారాయణ అభిమానులవుతారు. ఆయన ఇంకా జనసేనకో, బీజేపీకో మద్దతునిస్తే ఎంతో కొంత తెలుగుదేశంకే నష్టం. 2014లో పవన్‌కళ్యాణ్‌ ఓటు తెలుగుదేశానికే పడింది. కాబట్టే ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం భారీగా సీట్లు సాధించి అధికారంలోకి రాగలిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన సొంతంగానే పోటీ చేయబోతోంది. మరి పవన్‌కళ్యాణ్‌ ఓట్లు తెలుగుదేశం, జనసేనల మధ్య చీలితే ఎవరికి నష్టం? పవన్‌ వల్ల జగన్‌కు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్‌ టీడీపీకే మద్దతు నిస్తే వైసిపికి నష్టం. పవన్‌ విడిగా పోటీ చేస్తే వైసిపికి కొంత లాభం. అసలు వైసిపికే మద్దతునిస్తే తెలుగుదేశాన్ని సులభంగా పడగొట్టొచ్చు. మొత్తంమ్మీద వీళ్ళిద్దరి వల్ల ఎవరికి మూడనుందో చూడాలి!

pawanజనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యవహారశైలే కాదు, మాటల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు మూలంగా రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబుతో సఖ్యతగా వున్నంతకాలం కూడా పవన్‌కళ్యాణ్‌ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే బలం తమకు లేదని, సత్తా వున్నచోటే పోటీ చేస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. అదీగాక, ముఖ్యమంత్రి అయ్యే అనుభవం తనకు లేదని కూడా చెప్పాడు. ఈ లెక్కన చూస్తే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వైకాపాకు పోకుండా డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు సూచించిన నియోజక వర్గాలలోనే తన పార్టీ అభ్యర్థులను పోటీలోకి దింపుతాడనే ప్రచారం జరిగింది.

ఇటీవలకాలంలో డామిట్‌ కథ అడ్డం తిరిగింది. మనోడే అనుకున్న పవన్‌ కళ్యాణే చంద్రబాబు మీద కావాల్సినంత బురద చల్లాడు. జగన్‌ కంటే పవనే ఇప్పుడు చంద్ర బాబుకు అపాయంగా మారాడు. జగన్‌ తెలిసిన ప్రమాదం. పవన్‌ ఊహించకుండా వచ్చిన ప్రమాదం. చంద్రబాబు మీద జగన్‌ అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కాని నిన్నటిదాకా చంద్రబాబును మోసిన పవన్‌కళ్యాణ్‌ అవినీతి ఆరో పణలు చేస్తే మాత్రం జనం నమ్ముతారు. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని విషయం.

మొన్నటిదాకా బలమున్న చోటే పోటీ చేస్తానన్న పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటున్నాడు. 2009 ఎన్నికల్లో తన అన్న చిరంజీవి పోషించిన పాత్రనే ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ పోషించబోతున్నాడు. చిరంజీవి ప్రజారాజ్యం ఆనాడు ఉమ్మడి ఏపిలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి 18సీట్లను గెలుచుకుంది. ఆరోజు ప్రజారాజ్యం పోటీ వల్ల అసెంబ్లీలో కాంగ్రెస్‌కే నష్టం వాటిల్లింది. అప్పుడు వై.యస్‌. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వ సానుకూల ఓట్లను ప్రజారాజ్యం కొంతవరకు చీల్చింది. కాబట్టే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ 34లోక్‌సభ సీట్లను గెలిచినా అసెంబ్లీలకొచ్చేసరికి 154స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ స్థానాలతో పోల్చి చూస్తే కనీసం 180 స్థానాలకు తగ్గకూడదు. కాని, కృష్ణా నుండి శ్రీకాకుళం దాకా కాంగ్రెస్‌ అండగా నిలిచే కాపు సామాజికవర్గం ఓట్లు ఆనాడు చిరంజీవి చీల్చాడు.

మరి రేపు పవన్‌ ఎవరి ఓట్లను చీల్చబోతున్నాడన్నది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. 2014 ఎన్నికల్లో పవన్‌ ఓట్లన్నీ తెలుగుదేశంకు పడ్డాయి. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆ ఓట్లే కారణమయ్యాయి. ఈ ఓట్లే రేపు పవన్‌కు పడతాయి. పవన్‌ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆయన ఓట్లు ఈసారి టీడీపీకి పడతాయో లేక వైసిపికి డైవర్ట్‌ అవుతాయో, అదీగాకుంటే రెండు పార్టీల మధ్య చీలుతాయో చెప్పలేని పరిస్థితి. కాని పవన్‌ పోటీ చేస్తే మాత్రం 2014 ఎన్నికల్లో టీడీపీకి పడ్డ పవన్‌ మద్దతుదారుల ఓట్లు ఆయన పార్టీకి డైవర్ట్‌ అవుతాయి. పవన్‌ వల్ల వైసిపి ఓటు చీలడం వుండదు. ఏ విధంగా నష్టం జరిగినా అది తెలుగుదేశంకే!

cm modiనాలుగేళ్ళ చంద్రబాబు పాలనలోని పాపాలను బీజేపీ బయట పెట్టబోతోందా? బాబు విధానాలలోని వైఫల్యాలను ఎత్తి చూపనుందా? కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలేవంటూ బొక్కలు వెదకనుందా? ఇది మీ అవినీతి చిట్టా అంటూ చీటీ చించబోతుందా? ఓటు-నోటు కేసును తిరగతోడనుందా? పోలవరం అంచనా వ్యయం పెంపులో బాబు అక్రమాలను ప్రశ్నించబోతుందా? వైరిపక్షాలతో జతకట్టి తెలుగుదేశం పార్టీని కకావికలం చేయనుందా? రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలివి.

నిజమే ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే త్వరలో వీటిలో కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు లభించే అవకాశాలు లేకపోలేదు.

బీజేపీ అధిష్టానం ఆపరేషన్‌ ఆంధ్రను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే జమ్మూ-కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో సైతం బీజేపీ జెండాను రెపరెపలాడించిన రాంమాధవ్‌ను ఏపి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. రాంమాధవ్‌ వెనువెంటనే రంగం లోకి దిగడం కూడా జరిగింది. ఏపిలో తెలుగుదేశం అవినీతిపై, చంద్రబాబు పాలనా వైఫల్యాలపై ఎదురుదాడి చేయండంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నుండి రాష్ట్ర బీజేపీ నాయకులకు సందేశాలు అందాయి. రాష్ట్రంలో తెలుగుదేశంను దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన వుండబోతోంది. అయితే రాష్ట్రంలో సొంతంగా అంత సీన్‌ బీజేపీకి లేదు. రాజకీయంగా ఆ పార్టీ చాలా తక్కువుగా వుంది. దీనికితోడు అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. జిఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచాయి. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఆ పార్టీ తెలుగుదేశంను ఏమీ చేయలేదు. ఇందుకోసం ఆ పార్టీ ఎంచుకున్న మార్గం జనసేన. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చంద్రబాబు, లోకేష్‌లపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన అవినీతి ఆరోపణలతో తెలుగు దేశం నాయకుల కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఆ ముందు క్షణం వరకు కూడా పవన్‌కళ్యాణ్‌ మా వాడు అనే వాళ్ళను కుంటున్నారు. పవన్‌ ఇచ్చిన ఊహించని షాక్‌తో వాళ్ళకు ఏ విధంగా ముందుకు పోవాలో తెలియలేదు. పవన్‌కళ్యాణ్‌ ఇక మనోడు కాదని, అతను బీజేపీ ట్రాప్‌లో పడ్డాడని వీళ్ళకై వీళ్ళు నిర్ధారించుకున్నాక అనుకూల మీడియా ద్వారా పవన్‌పై ఎదురుదాడి మొదలుపెట్టించారు.

బీజేపీ చర్యలు ఏ విధంగా ఉండబోతాయన్నదానిపైనే చంద్రబాబులో ఆందోళన వుంది. బీజేపీ వైపు నుండి కేవలం రాజకీయ దాడి మాత్రమే వుండదు. ఒక నాయకుడిని టార్గెట్‌ చేస్తే ఎంతలా తొక్కుతున్నాడో ఒక లాలూను, ఒక శశికళను చూస్తే అర్ధమవుతుంది. చంద్రబాబు మీద 'ఓటు-నోటు' కేసుతో పాటు పలు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో వున్నాయి. వీటన్నింటి మీద ఆయన 'స్టే'లు తెచ్చుకుని వున్నాడు. ఈ నాలుగేళ్ళలో 24మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను వైసిపిలో నుండి లాగాడు. కొన్నాడని చెప్పొచ్చు కూడా! నలుగురు వైసిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కాడు. ఇక పరిపాలనా పరంగా చూస్తే అన్నీ వైఫల్యాలే! అమరావతి రాజధాని అని చెప్పి ఎన్ని దేశాలు తిరిగాడో, ఎన్ని కోట్లు దుబారా చేసాడో లెక్కే లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ను నేనే కడతానని చెప్పి 16వేల కోట్ల అంచనా వ్యయాన్ని 56వేల కోట్లకు తీసుకెళ్లాడు. కేంద్రం ఇచ్చిన నిధులను తన ఆర్భాటపు కార్యక్రమాలకు మళ్ళించాడు. కేంద్రం నిధులతో అమలు చేయాల్సిన పథకాలకు తన పేరు పెట్టుకున్నాడు. పుష్కరాలు, తాత్కాలిక ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల పేరుతో వేలకోట్ల అవినీతి జరిగింది. వీటన్నింటిలో దేని మీద విచారణ చేయించినా చంద్రబాబుకు ఇబ్బంది తప్పదు.

మరి బీజేపీ వూరుకుంటుందా? వారి ఆలోచనలు వారికున్నాయి. రాష్ట్రంలో పవన్‌తో కలిసి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్ళే అవకాశముంది. పవన్‌ ప్రత్యేకహోదా పోరాటాలు చేస్తాడు. కర్నాటకా ఎన్నికల తర్వాత ఏపికి కేంద్రం ప్రత్యేకహోదా ప్రకటించే అవకాశా లున్నాయి. ఎందుకంటే ముందుగా ఏపికి హోదా ఇస్తే కర్నాటకా ఎన్నికల్లో ఆ ప్రభావం బీజేపీపై పడుతుంది. కాబట్టే కర్నాటక ఎన్నికల తర్వాత ఏపి ఎన్నికలకు ముందు హోదా ప్రకటన వుండొచ్చు. జగన్‌, పవన్‌ చేసిన పోరాటాల వల్లే ప్రత్యేకహోదా ఇచ్చా మనే సంకేతాలు రావచ్చు. బీజేపీ వాళ్ళు జగన్‌ జోలికైతే పోరు. ఎందుకంటే అతని మాట మీద నిలబడే నైజం వారికి ఇష్టమే. ఒక్క చంద్రబాబు నైజమే వారికి సరిపడడం లేదు. అందుకే చంద్రబాబును టార్గెట్‌ చేశారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ మొదలుపెడతారో, ఎక్కడ నరుకుతారో అర్ధం కాక చంద్రబాబుకు దడ పట్టుకుంది.

Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter