pawanరాజకీయాలలో కొందరి పరిస్థితి కూరలో కరివేపాకు మాదిరిగానే వుం టుంది. అవసరం వున్నప్పుడు వాడు కోవడం, అవసరం తీరాక దూరంగా పడేయడం. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి కూడా అంతే!

2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి పట్టం కట్టా లంటూ తన అభిమానులకు పిలుపు నిచ్చాడు. నరేంద్ర మోడీ, చంద్రబాబు లతో కలసి ఒకే వేదికను పంచుకు న్నాడు. ఆ ఎన్నికల్లో తన జనసేన పార్టీ తరపున అభ్యర్థులను పెట్టకుండా బీజేపీ, టీడీపీలకు సంపూర్ణ మద్దతు పలికాడు.

అయితే ఎన్నికల తర్వాత కేం ద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ రెండూ కూడా పవన్‌ను కూరలో కరివే పాకు లాగా తీసి పక్కనపడేసాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదని కేంద్రం ప్రకటించాక పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. కేంద్రం తీరుకు నిరసనగా ప్రత్యేక హోదా కోసం పోరాటమంటూ పలుచోట్ల సభలు నిర్వహించి బీజేపీ నాయకులపై విమర్శలకు కూడా దిగాడు. అయితే ఇంతకాలం పవనే బీజేపీ మీద విమర్శలు చేస్తూ వచ్చాడు. తాజా పరిణామాలు చూస్తే బీజేపీ కూడా పవన్‌ను వదులుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన 'స్వచ్ఛతే సేవ' ర్యాలీకి ప్రధాని నరేంద్రమోడీ నుండి టాలీవుడ్‌ స్టార్స్‌ మహేష్‌, ప్రభాస్‌లకు ఆహ్వానం అందింది గాని, 2014 ఎన్నికల్లో మోడీకి పనిచేసిన పవన్‌ను మాత్రం మర్యాదపూర్వకంగా కూడా ఆహ్వానించలేదు. మన రాష్ట్రం నుండి ఏ స్టార్‌నూ పిలవకుండా వుంటే ఏ సమస్యా వుండేది కాదు. కాని నేడు తెలుగు ఇండస్ట్రీలో టాప్‌లో వున్న పవన్‌ను వదిలేసి మహేష్‌, ప్రభాస్‌లకు మోడీ ప్రాధాన్యతనివ్వడాన్నే పవర్‌స్టార్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

pawanచంద్రబాబు చేతిలో తురుపుముక్క పవన్‌. ఆయన వెనుకున్న ఆరు అడుగుల బుల్లెట్‌ పవన్‌... ఆయన అమ్ములపొదిలో వున్న రామబాణం పవన్‌... నిజమే... పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చంద్ర బాబుకు వజ్రాయుధమే.

2014 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడానికి వాడుకోబడ్డ ఆయుధాలలో పవన్‌ ఒకడు. ఆరోజు పవన్‌ స్థాపించిన జనసేనతో పొత్తు పెట్టుకుని ప్రయోజనం పొందాడు. ఇదే వజ్రాయుధాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంకో విధంగా వాడుకుని లబ్ది పొందాలని చంద్రబాబు భావిస్తూ వచ్చాడు. అదెలాగంటే కాపు సామాజిక వర్గం బలంగా వున్న నియోజకవర్గాల్లో పవన్‌ జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం, ఆ ఓట్లు వైకాపాకు పోకుండా చూసి తిరిగి తెలుగు దేశాన్ని అధికారంలోకి తీసుకురావడం. పొరపాటున జనసేన కొన్ని సీట్లు గెలిచినా ఎలాగూ తెలుగుదేశంకే సపోర్ట్‌ చేస్తుంది కాబట్టి అధికారం గ్యారంటీ. ఇదే చంద్రబాబు స్కెచ్‌. దీనికి తగ్గట్లుగానే పవన్‌ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం వర్గాలను సందిగ్ధంలో పడేసాయి. ఏ కాపు సామాజిక వర్గం వాళ్లయితే తెలుగుదేశానికి దూరమయ్యారని, ఆ ఓట్లు వైకాపాకు పోకుండా చూడాలంటే వచ్చే ఎన్నికల్లో జనసేనను పోటీ పెట్టించి డైవర్ట్‌ చేయాలనుకుంటున్నారో ఆ కాపులు ఈ రెండుచోట్లా తెలుగుదేశంకే అండగా నిలిచారు. వీళ్ల ఓట్లు వైకాపాకు పడుంటే జనసేనపై చంద్రబాబుకు ఒక క్లారిటీ వుండేది. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైకాపాకు పోకుండా చూసేందుకు జనసేన చేత సొంతంగా పోటీ చేయించి ఉండేవాడు. ఇప్పుడు ఈ రెండు ఫలితాలతో పునరాలోచనలో పడాల్సి వచ్చింది. జనసేనతో మళ్ళీ జతకడితేనే మేలన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం ప్రభావం కాపులపై పెద్దగా లేదని, కాపులు మనల్ని నమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు విశ్వసిస్తున్నారు. పవన్‌ను మళ్లీ కలుపుకుంటే కాపుల ఓటును యధావిధిగా కొల్లగొట్టువచ్చని భావిస్తున్నారు.

మరి ఒంటరిగా పోటీ చేస్తానన్న పవన్‌ అదే మాట మీదుంటాడో లేక మరోసారి చంద్రబాబు చేతిలో వజ్రాయుధంగా మారుతాడో చూడాలి.

3చంద్రబాబు పక్కా రాజకీయనాయకుడు. కాబట్టే ప్రజానాయకుడు కాక పోయినా ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పరిపాలించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర రాజకీయాలను ఔపాసన పట్టిన నాయకుడు. ఎప్పుడు ఏమి చేయాలో తెలి సిన నాయకుడు. ప్రజల్లో బలం లేక పోయినా, ఆ ప్రజల మద్దతు ఎలా పొం దాలో, ఎన్ని మార్గాలలో రాబట్టాలో తెలిసిన నాయకుడు. అలా తెలిసినవాడు కాబట్టే 2014లో పార్టీ పనైపోయిందను కున్న వాతావరణంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాడు.

ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ప్రజలు కట్టకట్టుకుని ఓట్లేసేంత మంచిపనులేవీ చంద్రబాబు చేయలేదు. ఈ మూడేళ్లలో చేసినవన్నీ కూడా సొం తంగా ఆర్ధిక వనరులు కూడగట్టుకోవ డానికి చేసినవే! ప్రజల్లో వ్యతిరేక వాతా వరణం బాగానే కనిపిస్తోంది. అయినా కూడా రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఏక పక్షంగా జరగాలనే కాంక్ష చంద్రబాబులో కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు మూడు.

మొదటిది రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను 175 నుండి 225కు పెంచడం. ఇలా చేస్తే తెలుగుదేశంలో వున్నోళ్లకు, కాంగ్రెస్‌, వైకాపాల నుండి చేరినోళ్లందరికీ సీట్లొస్తాయి. డబ్బు ఖర్చుపెట్టే అభ్యర్థులకు తెలుగుదేశంలో లోటు లేదు. కాని వైకాపాకు అలాంటి అభ్యర్థుల కొరత ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షం మొదటి దెబ్బ తింటుంది. తెలుగుదేశం తరపున అన్ని నియోజక వర్గాలలోనూ బలమైన అభ్యర్థులు నిల బడతారు.

రెండోది... పవన్‌ కళ్యాణ్‌ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంలో ప్రధాన కారణాలలో పవన్‌ కళ్యాణ్‌ ఒకడు. ఆరోజు ఆయన బీజేపీతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశంకు కూడా మద్దతు పలికాడు. దీంతో పవన్‌ అభిమా నులతో పాటు కాపుల ఓట్లు కూడా తెలుగుదేశంకు పడ్డాయి. ఈ మూడేళ్లలో కాపులు చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. కాపులకు బి.సి రిజర్వేషన్‌లు అమలు చేస్తామన్న బాబు మాట గాలిమూటే అయ్యింది. కాపు రిజర్వేషన్‌ ఉద్యమాలను చంద్రబాబు బలంగానే అణచివేసాడు. ఈసారి కాపుల ఓట్లు తెలుగుదేశంకు పడవని చంద్రబాబుకు తెలుసు. అయితే ఆ ఓట్లు వైకాపాకు పోతే చంద్రబాబుకు డేంజర్‌. వాటిని డైవర్ట్‌ చేయాలి. అందుకు ఆయన ముందున్న మార్గం పవన్‌ కళ్యాణ్‌ జనసేన చేత పోటీ చేయించడం. దీనివల్ల కాపుల ఓటును వైకాపాకు పోకుండా చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైకాపా, జనసేనల మధ్య చీల్చి తెలుగుదేశాన్ని లబ్దిపొందేలా చేయడం.

ఇక మూడోమార్గం అందరికీ తెలి సిన డబ్బు. ఎన్నికలంటేనే దీని పాత్ర ప్రధానమైపోయింది. ఇప్పుడు తెలుగుదేశం నాయకుల దగ్గర ఇది పుష్కలంగా వుంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలోనే ఒక్కో జిల్లాలో ఎన్నేసికోట్లు ఖర్చుపెట్టారో చూసాం. 2014 ఎన్నికల్లోనూ తెలుగు దేశం గెలుపులో డబ్బు ప్రభావం బాగానే పనిచేసింది. ఐదేళ్లు అధికారంలో ఉం డడం వల్ల తెలుగుదేశంపార్టీ ఆర్ధికంగా ఇంకా పుంజుకుంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆర్ధిక శక్తులను బాగానే ప్రయోగిస్తాడు.

ప్రజల్లో బలం లేకున్నా, ప్రజాకర్షక పథకాలు ఏవీ లేకున్నా, అవినీతి అక్ర మాలు పోటెత్తుతున్నా, రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా... చంద్ర బాబుకు వచ్చే ఎన్నికలో మనదే అధికారం అని బల్లగుద్ది చెప్పడానికి బలమైన కారణం ఈ మూడుమార్గాలను బలంగా నమ్ము తుండడమే!

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ల్యాండవుతున్న విమానం
  దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
 • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
  వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter