ps2కోవూరు నియోజకవర్గం కేంద్రంగా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అదే పార్టీ నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డిల మధ్య రేగిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలు స్తోంది. విభేదాలు తెరకెక్కడంతో ఈ పంచాయితీ ఐ.టి మంత్రి నారా లోకేష్‌ దాకా వెళ్ళినట్లు సమాచారం.

కోవూరు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీలో పోలంరెడ్డి, పెళ్ళకూరు వర్గాలు నిప్పు, ఉప్పు అన్నట్లుగా వున్నాయి. 2014 ఎన్నికలప్పుడు ఇరువురు కలిసే పనిచేసినా ఆ తర్వాత దూరం పెరిగింది. 2014 ఎన్నికలకు ముందు పోలంరెడ్డి కాంగ్రెస్‌ నుండి రావడం, ఆయనతో పాటు అనుచరులు వచ్చి తెలుగు దేశంలో చేరడం జరిగింది. పోలంరెడ్డి ఎమ్మెల్యే కావడం, తెలుగు దేశం అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుండి వచ్చిన తన అనుచరులకే పోలంరెడ్డి ప్రాధాన్యతినిచ్చు కుంటూ వచ్చాడు. దీంతో నియోజకవర్గంలోని అయిదు మండలా లలో కూడా ఎమ్మెల్యే బ్యాచ్‌, ఎమ్మెల్యే యాంటీ బ్యాచ్‌లు తయా రయ్యాయి. ఈ వ్యతిరేక గ్రూపులన్నీ పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి పక్కన చేరాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది. దీంతో పెళ్ళకూరు 2014లో వదులుకున్న సీటును ఈసారైనా చేజిక్కించుకోవాలనే పంతంతో నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా నాయకులను కార్యకర్తలను కలుసుకోసాగాడు. దీనిపై ఎమ్మెల్యే పోలంరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. ఇటీవలే ఐ.టి మంత్రి నారా లోకేష్‌ పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి పిలిపించుకుని మాట్లాడాడని సమాచారం. అలాగే సమన్వయ కమిటి సమావేశంలో కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రి అమర్‌ నాథ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్రలు పెళ్ళకూరుతో ఈ విషయమై చర్చించారని సమాచారం. అయితే ఎవరు పిలిచి మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో కోవూరు నుండి పోటీచేసే తీరుతానని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు వుండదని పెళ్ళకూరు ఘంటా పథంగా చెబుతున్నాడు.

పోలంరెడ్డి - పెళ్ళకూరుల మధ్య విభేదాలకు కొత్త సంవత్సరం వేడుకలు కూడా ఆజ్యం పోసాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పెళ్లకూరుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ భారీఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నెల్లూరులోని పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన కొత్త సంవత్సర వేడుకలకు కోవూరు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇదంతా కూడా పోటీకి నేను సిద్ధంగా వున్నానని పెళ్ళకూరు సంకేతాలు పంపడమే! మరి నిప్పు మీద ఉప్పు వేస్తే మండుతున్నట్లుగా వున్న కోవూరు టీడీపీ లీడర్స్‌ విబేధాలను అధిష్టానం ఏ తీరులో పరిష్కరిస్తుందో చూడాలి.

psకోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రాజుకుంటోంది. 2019 ఎన్నికల టిక్కెట్టే లక్ష్యంగా వర్గ రాజకీయం రోజురోజుకు మారుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చాపక్రిందకు నీళ్లు తేవడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థి పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి క్రమక్రమంగా పావులు కదుపుతున్నాడు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం నాయకుడుగా వున్న పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కోవూరు టిక్కెట్‌ను ఆశించాడు. 2009లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశాన్ని వదిలి వెళ్ళాక ఇక్కడ ఆ పార్టీకి నాయకత్వం కరువైంది. 2012 ఉప ఎన్నికల్లో ఇక్కడ పార్టీకి సరైన అభ్యర్థి లేక సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి నిలబడాల్సి వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు నియోజకవర్గ రాజకీయాలలోకి సోమిరెడ్డి ప్రధాన అనుచరుడుగా వున్న పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి ప్రవేశించాడు. నియోజక వర్గంలో స్థానిక ఎన్నికలప్పుడు పార్టీ శ్రేణులకు ఆయనే అండగా నిలిచాడు. 2014 ఎన్నికల్లో కోవూరు టీడీపీ టిక్కెట్‌ ఆయనదే అనుకున్న తరుణంలో కాంగ్రెస్‌ నుండి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశంలో చేరాడు. ఒక రకంగా చంద్రబాబే ఆయనను పార్టీలోకి పిలిపించుకుని సీటిచ్చాడు. అప్పటివరకు సీటును ఆశించిన పెళ్ళకూరుకు చంద్రబాబే నచ్చజెప్పాడు. ఆ ఎన్నికల్లో పోలంరెడ్డి గెలవడం తెలిసిందే! అయితే కొద్ది రోజులకే ఇక్కడ వర్గ రాజకీయాలు తెరకెక్కాయి. ఎమ్మెల్యే పోలంరెడ్డి కాంగ్రెస్‌ నుండి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యతనిస్తున్నాడంటూ పెళ్ళకూరు వర్గం రచ్చ చేయసాగింది. పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని గోలపెట్టారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక లప్పుడు కొందరు స్థానిక నాయకులు ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తూ వైసిపిలో చేరారు.

2014లో పార్టీ టిక్కెట్‌ను దక్కించుకోలేకపోయిన పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డికి పార్టీ ఏ విధమైన ప్రత్యామ్నాయ న్యాయం చేయలేకపోయింది. ఈ మూడున్నరేళ్ళుగా పెళ్ళకూరు పార్టీలోనే వుంటూ తన పని తాను చేసుకుంటున్నాడు. కొంత కాలం వరకు అధిష్టానం ఆదేశాలతో నియోజకవర్గ పార్టీ వ్యవహా రాలలో తల దూర్చలేదు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోవూరు టిక్కెట్‌ లక్ష్యంగా వర్గ సమీకరణ మొదలుపెట్టారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులను కలుస్తూ నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టాడు. 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ఆయన గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఒకవేళ టిక్కెట్‌ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా వున్నాడని, అంతేగాని గతంలోలాగా సర్దుకుపోయే పరిస్థితి లేదని సమాచారం. అదే సమయంలో పోలంరెడ్డి పరిస్థితి కూడా అంతే! మళ్ళీ సీటిస్తే పార్టీలో వుంటాడు, లేదంటే తన దారి తాను చూసుకుంటాడు.

మొత్తానికి ఈ ఇద్దరు పిఎస్‌ఆర్‌లలో 2019 ఎన్నికలప్పుడు ఒక పిఎస్‌ఆరే పార్టీలో నిలిచే అవకాశముంది.

telug biddaతెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం విధానాలన్నారు... ప్రజాస్వామ్యం పద్ధతిలో పదవుల పందారం ఉంటుం దన్నారు... కష్టించినవారికే పదవుల న్నారు... మరి ఏవి ఆ పదవులు. ఎప్పుడూ పదవులు ఒక్కరికేనా? పని చేసేవాళ్లు ఎప్పుడూ బోయీలుగా ఉండి పోవాల్సిందేనా? వాళ్ళను పల్లకినెక్కించే అవకాశం లేదా... అంటూ జిల్లా తెలుగు దేశంపార్టీలో ఓ గొంతు ప్రశ్నించింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఈ ప్రశ్నలను సంధించింది. ఆ గొంతు పేరే పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి.

కోవూరు నియోజకవర్గంలో ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన నాయకుడు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డాడు. చంద్రబాబు చెప్పే ఐవిఆర్‌ఎస్‌ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు తీసు కుని, అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పట్టుబట్టాడు. ఈమేరకు చంద్రబాబుకే లేఖవ్రాసి సంచలనం రేపాడు. అయితే ముందుగానే ఫిక్స్‌ అయిపోయిన పద్ధతి ప్రకారం జిల్లా అధ్యక్ష పదవి బీద రవి చంద్రనే వరించింది. ఆయన వ్రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం రవిచంద్రను అధ్యక్షుడిగా నియ మించాక, ఆయన ఎంపికపై ఐవిఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయ సేకరణ కోరింది.

ఎప్పుడూ లేని విధంగా పార్టీ అధ్యక్ష పదవి కోసం ఈసారి జిల్లాలో పోటీ నడిచింది. బీద రవిచంద్ర పార్టీ అధ్య క్షుడిగా వుండగా, ఈసారి అధ్యక్ష స్థానం కోసం కోవూరుకు చెందిన నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డితో పాటు మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డిలు కూడా పోటీ పడ్డారు. ఈమేరకు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీ అధినేత చంద్ర బాబుకు లెటర్‌ వ్రాసి సంచలనం సృష్టిం చాడు. పార్టీలో సమన్వయం లోపించిం దని ఆయన ఆ లేఖలో ఎత్తి చూపారు. 2014 ఎన్నికల్లో కోవూరు తెలుగుదేశం సీటు కోసం ఆయన తీవ్రంగా ప్రయ త్నించాడు. అంతకుముందు పార్టీకి నాయకత్వమే లేని స్థితిలో తాను ముందు కొచ్చి తన సొంత ఖర్చుతోనే ఇక్కడ పార్టీని నడిపించాడు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచాడు. అయితే సీటు తనకే గ్యారంటీ అనుకున్న తరు ణంలో కాంగ్రెస్‌ నుండి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చివరి క్షణంలో సీటెత్తు కుని పోయాడు. దీంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎటువంటి న్యాయం జరగలేదు. అడక్కుండా వుంటే ఎవరూ పట్టించు కోరనుకున్నాడో ఏమో, అధ్యక్ష పదవి కోసం పోటీలోకి దిగి చంద్రబాబుకే లేఖాస్త్రం సంధించాడు.

మాజీఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి 1999ఎన్నికలకు ముందు నుండే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు. పార్టీలో పదవులన్నీ డెల్టావాళ్లకేనా... మెట్ట ప్రాంతంలో పార్టీ అవసరం లేదా అంటూ ఆయన అధ్యక్ష స్థానాన్ని ఆశిం చాడు. పార్టీలో సీనియర్‌... అందరితో సత్సంబంధాలున్నవాడు. పూర్తిగా రాజ కీయాలే వ్యాపకంగా ఉండేవాడు. ఆయన అధ్యక్ష పదవిని ఆశించడంలో అభ్యర తరం కూడా లేదు.

ఇక మరో మాజీఎమ్మెల్యే ముంగ మూరు శ్రీధరకృష్ణారెడ్డి కూడా అధ్యక్ష పదవిని ఆశించాడు. అయితే ఆయన రవిచంద్రను మార్చేపనైతేనే తనకు పదవి కావాలన్నాడు. ఇక్కడ అధ్యక్ష స్థానానికి ఈ ముగ్గురూ అర్హులే! కాకపోతే బీద రవిచంద్ర నాకొద్దు అని అనుకుని వుంటేనే వీళ్లల్లో ఒకరికి ఛాన్సుండేది!

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter