kovurజిల్లా రాజకీయాలలోనే కోవూరుకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఈరోజు కాదు, ఏ రోజునుండో ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. వడ్లకు, బలిసిన రెడ్లకు పేరు. చైతన్యవంతులైన ప్రజలున్నారు. విద్యాధికులు అధికం. పాడిపంటలతో అలరారు తున్న ప్రాంతం. అభివృద్ధి పరంగా ఎంత ముందుందో రాజకీయ చైతన్యంలోనూ అంతే ముందుంటుంది.

అలాంటి నియోజకవర్గం కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. 2004ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం నుండి కాంగ్రెస్‌లోకి మారిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సంచలనాత్మక రీతిలో ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే! అదే సంచలనాత్మక రీతిలో ఆయన 2014లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేసాడు. అయితే ఈసారి కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశంలో దూరి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 ఎన్నికల్లో కోవూరు సీటు కోసం స్థానిక తెలుగుదేశం నాయకులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో పార్టీలో చేరిన పోలంరెడ్డి ఆ సీటును ఎగరేసుకుపోయాడు.

ఎన్నికలు ఇక రెండేళ్ళలో ఉన్నాయి. ఇప్పుడే సీటు ఎవరికని చెప్పలేరు. కాని, ఈసారి టిక్కెట్‌ టార్గెట్‌గా వర్గపోరు మొదలైంది. ముఖ్యంగా ఇటీవల పోలంరెడ్డి మీదవచ్చిన ఆరోపణలు, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల నేపథ్యమైతేనేమీ, జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లిస్తే గెలవరని కొన్ని వర్గాలు ఇచ్చిన నివేదిక వల్లనైతేనేమీ చంద్రబాబు ఈసారి పోలంరెడ్డికి సీటివ్వడన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనికి తగ్గట్లే ఇటీవల ఏపిఐఐసి ఛైర్మెన్‌ పి.కృష్ణయ్య కోవూరు నియోజకవర్గ వ్యవహారాలలో ఎక్కువుగా తల దూరుస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో సీటును మిస్సయిన పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా పోటీ చేయాలనే పంతంతో ఉన్నట్లు తెలుస్తోంది. కోవూరు నియోజకవర్గంలో 'రెడ్ల' ఆధిపత్యం ఎక్కువ. పి.కృష్ణయ్య, లేదా ఇతర బి.సి వర్గాల నాయకులు ఇక్కడ తట్టుకుని నిలబడడం కష్టం. వైకాపా నుండి 'రెడ్లు' నిలబడకుండా పి.కృష్ణయ్య, లేదా ఇంకొకరికి సీటిచ్చినా ఇబ్బంది ఉండదు. ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' అభ్యర్థిని మోటుకోవాలంటే ప్రత్యర్థిగా రెడ్డి అభ్యర్థే ఉండాలి. కాబట్టి పి.కృష్ణయ్య లాంటి ప్రయోగాలు ఇక్కడ సక్సెస్‌ కావు. అలా చేయడమంటే 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థిగా చిరంజీవి, తుపాకుల మునెమ్మను దించినట్లే వుంటుంది. కాబట్టి ఏ పార్టీకైనా ఇక్కడ అభ్యర్థి ఎంపికలో 'రెడ్ల'కే ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.

psr sకోవూరు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. తమ్ముళ్ల పోరు బహిరంగంగానే జరుగుతోంది. ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంలో ఎక్కడా దాపరికం లేదు. బహిరంగంగానే కుమ్ముకుంటున్నారు.

ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై ఆయన వ్యతిరేక వర్గమైన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి వర్గీయులు బహిరంగ దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఎప్పటి నుండో కనిపెట్టుకుని వున్న తమను కాదని ఎమ్మెల్యే పోలంరెడ్డి కాంగ్రెస్‌ నుండి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ పెళ్లకూరు అనుచరులు అధిష్టానానికి, పార్టీ పరిశీలకులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. పోలంరెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంతా నా ఇష్టం అనే రీతిలో తన పంథాను అనుసరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కోవూరు టిడిపి సీటుపై పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2009 ఎన్నికల అనంతరం నల్లపరెడ్డి ప్రసన్న పార్టీ వదిలి పోవడం తెలిసిందే! ఆ సమయంలో ఇక్కడ పార్టీకి నాయకుడు కరువయ్యాడు. 2012లో జరిగిన కోవూరు ఉపఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరూ లేక సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిలబడ్డాడు. ఆ ఎన్నికల తర్వాత కోవూరు రాజకీయాల్లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్షంలో వున్నా పార్టీ కేడర్‌కు అన్ని విధాలుగా అండగా నిలిచారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటనలు చేస్తూ తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014లో ఇక సీటు అతనికే ఖాయం అనుకున్న తరుణంలో కాంగ్రెస్‌లో వున్న పోలంరెడ్డి తెలుగుదేశంలో చేరి టిక్కెట్‌ ఎగరేసుకుపోయాడు. పెళ్లకూరుకు నోటిదాకా వచ్చిన సీటు చేజారినట్లయ్యింది. ఆ ఎన్నికల్లో పోలంరెడ్డి విజయ సాధించడం తెలిసిందే!

ఇక యధాఫలంగా అక్కడి నుండి ఇరువర్గాల వారి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. నామినేటెడ్‌ పదవుల్లో గాని, పార్టీ కమిటీలలోగాని, పనుల కేటాయింపులోగాని పోలంరెడ్డి తనతో పాటు కాంగ్రెస్‌ను వీడి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నాడు. ఇది అంతకుముందు నుండి పార్టీని నమ్ముకుని వున్న పెళ్లకూరు అనుచరులకు మింగుడు పడడం లేదు. ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని వారు వాపోతున్నారు. రాజకీయాల్లో ముందూ, వెనుక అని వుండదు. చంద్రబాబు కంటే ముందే తెలుగుదేశంలో చాలా మంది వున్నారు. వాళ్లకంటే వెనుకొచ్చిన చంద్రబాబుకు పార్టీ సీఎం కుర్చీ అప్పగించలేదా?! రాజకీయా లలో అసలు సూత్రం ఇదే!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter