-      విహారి, హైదరాబాద్. 9848025600

స్వప్రయోజనం ఎప్పుడూ

నిలువెత్తు హింసావాది

ఉనికి కోసం చేసే ఉద్ఘాటన

పరిపరి ఉపరి స్పర్శే

పొరలు త్రచ్చుతూ మూలాలకి

పోకపోవటం కళ్లకు మకమ్మిన పొర

బోలు మాటల దొంతర్లలో

సత్యం హత్య చేయబడుతుంటే

రాజకీయం రంగుల వలని విసురుతూనే వుంటుంది

ఇవ్వాళ పట్టుబడిన దౌష్ట్యం

నిన్న మట్టుబెట్టినవి ప్రాణాలు కావంటుంది

దుర్మార్గపు నిబద్ధత తన చట్టం వేరంటుంది

పావురాల్ని కొట్టేవాడు తనకు మాత్రమే

కన్నీళ్ళు కోరటం – దయ్యపు అభ్యర్థన

ఒకరి బతుకు పచ్చదనాన్ని నిప్పచ్చరం చేసేవాడు

తన నీడనూ శిథిలం చేసే కాల రహస్యాన్ని మరిస్తే...

గీతలూ, రాతలూ కలగా పులగమైపోతాయి

radham

-      డా. సి.భవానీదేవి, హైదరాబాదం. 9866847000

శత సహస్త్ర బాహువులు చాచి

స్వాగతించే అరుణుని పాదస్పర్శతో

పులకాంకిత సూర్యరథ విన్నాణమిది

ఇరవైనాలుగు గంటల దినాలు చక్రాలుగా

ఎనిమిది జాములు చక్రానికి ఆకులుగా

మహాలక్ష్మీ సత్త్వల ఇరుసుగా

సప్తవర్ష్యాశ్వర రధారూఢుడు

ప్రత్యక్ష దైవ శిలారథం

సకల కళాతేజ విలసితం

ఈ శిల్పసుందరీ సౌందర్యకల్పనకు

ఏ శిల్పి యవ్వనాన్ని ధారబోశాడో

ఈ నాగినీభృకుటీ విలాసం

ఏ కళింగరాజ దీక్షా దర్షమో

ఈ మిధున క్రీడా భంగిమల్లో

కుదురుకున్నదే సృష్టి రహస్యమో

ఈ నాట్యకత్తెల కాలి అందియలు

కర్ణపేయ రవళిగా రంజిల్లటం

ఎందరు రసమయ శిల్పకారుల

త్యాగనిరతీ సుకృత ఫలమో

సుప్రభాత సూర్య నేత్రానికి

సిసలైన శిల్పకారుడందించిన కళాంజలిని

కళ్ల నిండా నింపుకుందామనుకున్నాను

మనసుతీరా మాట్లాడదామనుకున్నాను

నిశ్శబ్ద సౌందర్యమే మధురం కదా.

(కోణార్క సూర్యదేవాలయం చూసి)

ఆ జీవన సంస్కారానికి

ఆ జీవన పరిష్కారానికి

నిత్యనూతన సంకేతక్రాంతి

ఉగాదికి నమస్కారం

అంతరాంతరాల్లో పాతుకుపోయిన

తిమిరాన్ని వెంటాడే కిరణంలా

హృదయంలో సాగే నిరంతర రణంలా

కాలానికి మరణం లేదని చాటే

ఉగాదికి నమస్కారం.

భూ అనువునుండి

ఆకాశ వైశాల్యం వరకు

సమస్త చేతనా చేతనల్లోంచి

అవ్యక్తంగా తరలివచ్చే

వాసంతజ్యోత్స్నా స్నాతమై

విక్షునారీపై సంధించిన

మల్లె బాణం చేసిన గాయంతో

గలగలా కలకల కూసేకోయిల

పున్నాగ సన్నాయి గానంతో

కదలివచ్చే మదనకదన భావోద్వేగాల

ఉగాదికి నమస్కారం

మావి పిందెల్ని

వేపూతల్ని

చెరకుగడల్ని

చింతతీర్చే పులుపుల్ని

గడ్డకట్టిన సముద్రాన్ని

జీవితకారాన్ని

సమపాళ్లలో రంగరించుకొని

సుమనోభావాల్ని సంతరించుకొని

వెలుతురు పాదాలతో

జయజయ ధ్వానాలతో నడచివచ్చే

ఉగాదికి నమస్కారం

-      గుర్రాల రమణయ్య, నెల్లూరు. 9963921943.

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter