kovurజిల్లా రాజకీయాలలోనే కోవూరుకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఈరోజు కాదు, ఏ రోజునుండో ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. వడ్లకు, బలిసిన రెడ్లకు పేరు. చైతన్యవంతులైన ప్రజలున్నారు. విద్యాధికులు అధికం. పాడిపంటలతో అలరారు తున్న ప్రాంతం. అభివృద్ధి పరంగా ఎంత ముందుందో రాజకీయ చైతన్యంలోనూ అంతే ముందుంటుంది.

అలాంటి నియోజకవర్గం కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. 2004ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం నుండి కాంగ్రెస్‌లోకి మారిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సంచలనాత్మక రీతిలో ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే! అదే సంచలనాత్మక రీతిలో ఆయన 2014లోనూ అదే సీన్‌ రిపీట్‌ చేసాడు. అయితే ఈసారి కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశంలో దూరి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 ఎన్నికల్లో కోవూరు సీటు కోసం స్థానిక తెలుగుదేశం నాయకులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో పార్టీలో చేరిన పోలంరెడ్డి ఆ సీటును ఎగరేసుకుపోయాడు.

ఎన్నికలు ఇక రెండేళ్ళలో ఉన్నాయి. ఇప్పుడే సీటు ఎవరికని చెప్పలేరు. కాని, ఈసారి టిక్కెట్‌ టార్గెట్‌గా వర్గపోరు మొదలైంది. ముఖ్యంగా ఇటీవల పోలంరెడ్డి మీదవచ్చిన ఆరోపణలు, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల నేపథ్యమైతేనేమీ, జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లిస్తే గెలవరని కొన్ని వర్గాలు ఇచ్చిన నివేదిక వల్లనైతేనేమీ చంద్రబాబు ఈసారి పోలంరెడ్డికి సీటివ్వడన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనికి తగ్గట్లే ఇటీవల ఏపిఐఐసి ఛైర్మెన్‌ పి.కృష్ణయ్య కోవూరు నియోజకవర్గ వ్యవహారాలలో ఎక్కువుగా తల దూరుస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో సీటును మిస్సయిన పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా పోటీ చేయాలనే పంతంతో ఉన్నట్లు తెలుస్తోంది. కోవూరు నియోజకవర్గంలో 'రెడ్ల' ఆధిపత్యం ఎక్కువ. పి.కృష్ణయ్య, లేదా ఇతర బి.సి వర్గాల నాయకులు ఇక్కడ తట్టుకుని నిలబడడం కష్టం. వైకాపా నుండి 'రెడ్లు' నిలబడకుండా పి.కృష్ణయ్య, లేదా ఇంకొకరికి సీటిచ్చినా ఇబ్బంది ఉండదు. ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' అభ్యర్థిని మోటుకోవాలంటే ప్రత్యర్థిగా రెడ్డి అభ్యర్థే ఉండాలి. కాబట్టి పి.కృష్ణయ్య లాంటి ప్రయోగాలు ఇక్కడ సక్సెస్‌ కావు. అలా చేయడమంటే 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థిగా చిరంజీవి, తుపాకుల మునెమ్మను దించినట్లే వుంటుంది. కాబట్టి ఏ పార్టీకైనా ఇక్కడ అభ్యర్థి ఎంపికలో 'రెడ్ల'కే ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter