portదాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు దుగరాజపట్నంను ఎంపిక చేయడం తెలిసిందే! రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఏపికి ఇచ్చిన హామీలలో దుగరాజపట్నంను పొందుపరిచారు. 2014 ఎలక్షన్‌లకు ముందు తిరుపతి ఎంపిగా వున్న చింతా మోహన్‌ ఈ పోర్టుకు హడావిడిగా శంకు స్థాపన చేయించాలని కూడా చూసారు. అయితే అది సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ పోర్టుపై మీన మేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ పోర్టు ఇక్కడ కడితే వచ్చే లాభనష్టాలపై బేరీజు వేశారు. దుగరాజపట్నంకు సమీపంలోనే కృష్ణపట్నం పోర్టుతో పాటు చెన్నైలో రెండు పోర్టులు వుండడం, దీనికితోడు ఇస్రో, పర్యావరణ శాఖ అభ్యంతరాలు ఈ పోర్టుకు అడ్డంకిగా మారాయి. ఈ పోర్టు కట్టినా పెద్దగా ఆదాయం ఉండబోదని నీతిఅయోగ్‌ తేల్చిచెప్పింది. దీనిబదులు ఏపికి మరో రూపంలో ప్రయోజనం కల్పిస్తామని కేంద్రం చెప్పడంతో ఇక దుగరాజపట్నం పోర్టుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది.

portఏపికి ఇచ్చిన విభజన హామీలలో కేంద్రం ఏ ఒక్కదాన్ని కూడా సవ్యంగా అమలు చేయడం లేదు. ప్రధాన హామీ అయిన ప్రత్యేకహోదాను పాడెక్కించడం తెలిసిందే! ఇక పోలవరంను కేంద్రమే చేపట్టాల్సి ఉండగా, తెరచాటు ఒప్పందాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాంట్రాక్ట్‌ను అప్పగించడం జరిగింది. విభజన హామీలలోనే ఇంకొకటి నెల్లూరుజిల్లా దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం! యూపిఏ ప్రభుత్వంలోనే దుగరాజపట్నం ఓడరేవు మంజూరైంది. అయితే దీనికి శంకుస్థాపన చేసేలోపే ఎన్నికలొచ్చాయి. 2014 విభజన చట్టంలో యూపిఏ ప్రభుత్వం దుగరాజట్నం పోర్టును చేర్చింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోర్టు కావాలని కోరలేదు. ఈ నేపథ్యంలో ఈ పోర్టు ఎంత అవసరం అన్నదానిని అంచనా వేసేందుకు కేంద్రం ఓ కన్సల్టెన్సీని నియమించింది. ఆ కన్సల్టెన్సీ ఇటీవలే కేంద్రానికి... దుగరాజ పట్నం పోర్టు వల్ల పెద్దగా వాణిజ్య ఉపయోగం లేదని పేర్కొంటూ నివేదిక ఇచ్చింది.

సానుకూలంగా నివేదిక ఇస్తేనే కేంద్రం ఈ పోర్టు నిర్మాణాన్ని చేపట్టడం అంతంత మాత్రం. ఇక వ్యతిరేకంగా నివేదిక ఇస్తే అసలు దాని జోలికి పోతుందా? దుగరాజపట్నం పోర్టు మీద ఇక పూర్తిగా ఆశలు వదులుకోవచ్చు.

portలేని ఆశలు కల్పించారు. రేకెత్తించిన ఆశలను నీరు గార్చారు. కేవలం నాయకుల వాగ్దానాలకు, పత్రికలలో వూహాగానాలకు, రియల్టర్ల భూముల కొనుగోలుకు మాత్రమే దుగరాజపట్నం పోర్టు అన్న ఓ ఫోబియాను పరిమితం చేశారు.

వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద పోర్టు రానూ వచ్చింది, పోనూ పోయింది. అయితే ఇదంతా కాగితాల మీదే జరిగిపోయింది. దుగరాజపట్నం వద్ద పోర్టు సబ్జెక్ట్‌ ముగిసి పోయిన కథలాగే కనిపిస్తోంది. ఇక్కడ పోర్టు నిర్మాణం వల్ల పెద్దగా ఉపయోగమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటి తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పోర్టు నిర్మాణానికి రోడ్డు, రైలు కనెక్టివిటీలు ఖర్చుతో కూడుకున్న పని. గూడూరు-దుగరాజపట్నం మధ్య రైల్వేలైన్‌ మంజూరైనా ఇంతవరకు ఒక్క అంగుళం పని కూడా జరగలేదు. ఇక పోర్టు నుండి జాతీయ రహదారికి అనుసంధానిస్తూ రోడ్డు విస్తరణ మరియు కొత్త రోడ్డు నిర్మాణం జరగాలి. ఇది కూడా వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ రెండు పనులు కూడా ఆయా శాఖలు పూనుకుంటేనే పూర్తవుతాయి. ఇక సమీపంలో పులికాట్‌ సరస్సు, షార్‌ సెంటర్‌ ఉన్నందున పర్యావరణ అనుమతులు, భద్రతా పరమైన అనుమతులు కొంచెం క్లిష్టం కావచ్చు. అదీకాక పర్యావరణానికి హాని చేయని సరుకురవాణాకే ఇక్కడ ప్రాధాన్యత నివ్వాల్సి వుంటుంది. ఇక్కడ సమీపంలోనే కృష్ణపట్నం పోర్టు, ఎన్నూర్‌ పోర్టులు ఉన్నందున ఈ పోర్టుకు పెద్దగా వ్యాపారం ఉండకపో వచ్చునని పోర్టు సాధ్యాసాధ్యాలపై నియమించిన కమిటి తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

దీంతో దుగరాజపట్నం పోర్టు కథ ఇక ముగిసిపోయినట్లేనని భావిస్తున్నారు. గత యూపిఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వ ర్యంలో నిర్మించ తలపెట్టిన పోర్టుకు మన రాష్ట్రంలో విశాఖ జిల్లా నక్కలపల్లి, ప్రకాశంజిల్లా రామాయపట్నం, నెల్లూరుజిల్లాలోని దుగరాజపట్నంలను పరిశీలించారు. అటూ ఇటు తిరిగి దుగరాజ పట్నంను ఓకే చేశారు. రాష్ట్ర విభజన బిల్లులోనూ యూపిఏ ప్రభుత్వం ఏపి ప్రజల కన్నీళ్లను తుడవడానికన్నట్లు దుగ రాజపట్నం పోర్టును చేర్చింది. ఎన్నికలకు ముందు తిరుపతి ఎంపీగా వున్న చింతా మోహన్‌ ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా హడావిడిగా శంకుస్థాపన చేయించాలని చూశారు. అయితే ఎన్నికలు రావడంతో అది సాధ్యం కాలేదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఈ పోర్టుపై అంత ఆసక్తి చూపించలేదు. అదీగాక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈ పోర్టు విషయంలో పెద్దగా పట్టుబట్టడం లేదు. ఈ పరిసరాలలో మన నాయకులకు భూములు లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇక ముందు నుండి కూడా పులికాట్‌, షార్‌ వంటి అభ్యంతరాలున్నాయి. ఇప్పుడు కమిటీ రిపోర్ట్‌ వ్యతిరేకంగా ఉండడంతో పోర్టు దాదాపు ఎగిరిపోయినట్లే!

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ముగ్గురు మొనగాళ్లు
  ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
 • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
  కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
 • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
  రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
 • పాదయాత్రతో మరో చరిత్ర
  గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
 • 'పీకే'దేమీ లేదు
  జగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు,…

Newsletter