pranithaఏం పిల్లో ఏం పిల్లడో' లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌.. ఎన్టీఆర్‌.. మహేష్‌ బాబు లాంటి సూపర్‌ స్టార్లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది కన్నడ అమ్మాయి ప్రణీత. ఐతే 'అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌ బస్టర్లో నటించినప్పటికీ ఆమె కెరీర్‌ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు సినిమాలే లేవు. పోనీ సొంత ఇండస్ట్రీ శాండిల్‌ వుడ్లో అయినా చెప్పుకోదగ్గ అవకాశాలు ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో ఇక ఆల్టర్నేట్‌ కెరీర్‌ చూసుకుంటున్నట్లుంది ప్రణీత. సినిమాలకు సెలవిచ్చేసి బిజినెస్‌ వుమన్‌ గా మారడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంది. బెంగళూరులో ప్రణీత ఫుడ్‌ అండ్‌ బార్‌ బిజినెస్‌ ఛైన్‌ ప్రారంభిం చడం విశేషం. దాన్ని బెంగళూరుతో పాటు మరిన్ని నగరాలకు విస్తరించే పనిలో ఉంది ప్రణీత. ఐతే ఈ బిజినెస్‌ వరకే పరిమితం కాకుండా భవిష్యత్తులో సినీ నిర్మాణం చేపట్టాలని కూడా ఆమె భావిస్తోంది. ఐతే ఇప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదని.. ఫుడ్‌ అండ్‌ బార్‌ బిజినెస్‌ లో డబ్బులు బాగా సం పాదిస్తే.. ప్రొడక్షన్‌ హౌజ్‌ మొదలుపెట్టి సినిమాలు నిర్మించే అవకాశాలు లేక పోలేదని ఆమె వెల్లడించింది. ప్రణీత ఫ్యామిలీలో చాలామంది డాక్టర్లు ఉన్నా రు. వాళ్లకు హాస్పిటల్‌ బిజినెస్‌ కూడా ఉంది. ఫుడ్‌ అయినా.. హాస్పిటల్‌ అయినా.. చాలా వరకు సాఫీగా సాగి పోయే వ్యాపారాలే. వాటి విూద దృష్టి పెట్టక సినిమాల నిర్మాణం అనే జూదం ఆడటం ఎందుకు అని జనాలు ప్రణీ తను హెచ్చరిస్తున్నారు.

pranitha-subhash-10-hప్రణీత టాలీవుడ్ లో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఆమెను ఎవరు గుర్తించలేదు ఆమె నటించిన ఏం పిల్లో ఏం పిల్లోడో, బావ సినిమాలు ఫ్లాపవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఏ ముహుర్తనా అత్తారింటికి దారేది చిత్రానికి సైన్ చేసిందోగాని అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది. ఆ సినిమాలో ఆమె పెద్దగా ప్రాధాన్యంలేని పాత్ర చేసినా బాపుగారి బొమ్మ అనే పాటలో పవన్తో ఆడి పాడడం వల్ల ఆమెకు క్రేజ్ బాగా వచ్చింది. వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈమె ప్రస్తుతం రభస, గబ్బర్ సింగ్-2లో హీరోయిన్గా ఎంపికయ్యినట్లు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా తనకు బ్రేక్ నిచ్చిన దర్శకుడు త్రివికమ్ మళ్లీ ఆమెకు గొప్ప అవకాశం ఇచ్చాడు త్రివికమ్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో ప్రణీతకు సోలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. మొత్తానికి ప్రణీతకు తన కెరీర్లో ఇదో పెద్ద అవకాశమని చెప్పాలి. త్రివికమ్ లాంటి టెస్ట్ ఉన్నదర్శకుడిని ప్రణీత బాగానే మెప్పించింది. అంతే కాదు తన మాతృభాషయైన కన్నడంలో కూడా అమ్మడు ఓ మంచి క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందట. ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • వివేకన్నా... నీ రాక కోసం.. నిలువెల్ల కనులై...
    సింహపురి సోగ్గాడా... స్టైల్‌ ఆఫ్‌ సింహపురీ... ఓ వివేకా... ఎన్నిరోజు లైందయ్యా నిన్ను చూసి... నిన్ను చూడక, చిరునవ్వుల లొలికే నీ ఫేసు చూడక మా వాళ్ళ ముఖం వాచిపోయిం దనుకో... నాలుగేళ్ళు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా, పదిహేనేళ్ళు ఎమ్మె ల్యేగా వుంటే…

Newsletter