prasannaవైకాపా సీనియర్‌ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాను పార్టీ మారుతు న్నానన్న వదంతులకు తెరదించారు. తన రాజకీయ జీవితం చివరి క్షణం వరకు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వెంటే తన పయనమంటూ కుండబద్ధలుకొట్టారు.

ఇటీవలకాలంలో ప్రసన్న తెలుగు దేశం పార్టీలో చేరుతున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ లలోనూ పోస్ట్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనకు సీటు ఇవ్వలేదని ప్రసన్న అలిగాడని వార్తలొచ్చాయి. అసలు ప్రసన్న స్థానిక ఎమ్మెల్సీ సీటు అడగలేదు. అలాంటప్పుడు అలగాల్సిన అవసరమేముంది. అదీగాకుండా ఆయనే గనుక సీటు కావాలంటే ఇక ఇవ్వకుండా పోవడమేమిటి? ఆయన పోటీ చేసుంటే ఫైట్‌ ఇంకా టైట్‌ అయ్యుండేది కూడా!

ఇప్పటికప్పుడు తెలుగుదేశంలో చేరాల్సినంత అవసరం కూడా ఆయనకు లేదు. వైకాపాలో ఆయన గౌరవం ఆయనకుంది. ఆయన సీనియార్టీ ఆయ నది! 2014లో వైకాపా అధికారంలోకి వచ్చుంటే జిల్లా నుండి మంత్రి కూడా ఆయనే అయ్యుండేవాడు. జగన్మోహన్‌రెడ్డి అంత ప్రాధాన్యతనిస్తున్నాడాయనకు!

అయితే ప్రసన్నను తెలుగుదేశంలోకి లాగడానికి కొందరు చేసిన ప్రయత్నాలు నిజమేనని తెలుస్తోంది. ప్రసన్న సమీప బంధువులు జేసీ బ్రదర్స్‌ తెలుగుదేశంలో వున్నారు. ప్రసన్న మరో బావ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలుగుదేశంలోనే

ఉన్నప్పటికీ ఆయనకు ఈయనకు పడదు. కాబట్టి ప్రసన్న కోసం జేసీ బ్రదర్సే ప్రయ త్నించారు. కాని ప్రసన్న వారి ప్రతిపాద నను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ప్రసన్న రాజకీయ ప్రస్థానం మొద లైందే తెలుగుదేశం పార్టీ నుండి. 1993లో కోవూరు ఉపఎన్నిక ద్వారా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 1994, 1999లలో కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాడు. 2004లో ఓడిపోయాడు. 2009లో మళ్ళీ గెలిచాడు. అయితే అప్పుడు రెండోసారి కూడా తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. దాంతో చంద్రబాబు నాయకత్వం మీద విరక్తి పెంచుకున్న ప్రసన్న ఆయనపై పదునైన విమర్శలు గుప్పించి వై.యస్‌. పక్కన చేరారు. ఆ చేరడం చేరడం వై.యస్‌. మరణం తర్వాత కూడా ఆయన కొడుకు జగన్‌నే నీడలా అంటిపెట్టుకుని కొనసాగుతున్నాడు.

prasannaనల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పెద్ద గుదిబండగానే ఉన్నట్లుంది. దానిని వదిలించుకోవడానికే ఆయన మొదట్నుండి ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి మళ్ళీ రాజీనామా చేసాడు. అయితే పార్టీని వదిలిపోను, జగన్‌ను ముఖ్యమంత్రి సీట్లో చూసేదాకా నిద్రపోనని పంతం పట్టాడు.

అధికారపార్టీ అధ్యక్ష పదవులు మెత్తటి కుర్చీ ల్లాంటివి. కూర్చుంటే హాయిగా ఉంటుంది. అదే ప్రతిపక్ష అధ్యక్ష పదవి అయితే ముళ్ల కుర్చీలాంటిది. ముళ్ల మీద కూర్చున్నట్లే ఉంటుంది. ఇప్పుడు వైకాపా జిల్లా అధ్యక్ష పదవి కూడా అలాంటిదే! ఈ పదవిని తీసుకోవడమంటే పాడిఆవును అమ్ముకుని తెల్ల ఏనుగును కొనుక్కోవడమే. ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ఆర్ధిక కష్టాలు ఎక్కువ. పార్టీ తరఫున బంద్‌లు చేయాలన్నా, రాస్తారోకోలు నిర్వహించాలన్నా సభలు, సమావేశాలు పెట్టాలన్నా డబ్బు ఖర్చుతో కూడుకున్న పని. పార్టీ కార్యకర్తలు కూడా దినసరి కూలీ ఇవ్వనిదే ధర్నాలకు రాని పరిస్థితి. ఇక పార్టీ ఆఫీసు అద్దె, కరెంటు బిల్లులు, కాఫీ, టీ ఖర్చులు... ప్రతి నెలా ఇవన్నీ తడిసి మోపెడవుతుంటాయి. ఈ భారాన్ని మోయలేకే ప్రసన్న కొద్దిరోజుల క్రితమే అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసేసాడు. అయితే జగన్‌ కలుగజేసుకుని నచ్చజెప్పి రాజీనామా ఆలోచనను మాన్పించాడు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు జిల్లా పార్టీ కార్యా లయానికి వెళ్లాలని, పార్టీ కార్యక్రమాలు సమిష్టిగా నిర్వహించాలని అందరికీ చెప్పి ప్రసన్నను శాంతింపజేశాడు. అది జరిగాక ఇంతవరకు జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు కాలేదు. ఈలోపు ఏమైందో ఏమోగాని ప్రసన్న రాజీనామా లేఖను విజయ సాయిరెడ్డికి పంపించేసాడు. ఇక ఆయన రాజీనామా నిర్ణయం నుండి వెనక్కి రాకపోవచ్చు. జగన్‌ కూడా ఇక బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవచ్చు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter