pslvఅంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా పెద్ద దేశాలతో పోటీపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని అందుకుంది. 12వ తేదీ గురువారం తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తెల్లవారుజామున 4.04గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి41 చీకట్లను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. మొత్తం 19నిముషాల వ్యవధిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉపగ్రహాన్ని 143కోట్లతో, వాహకనౌకను 100కోట్లతో రూపొందించారు. స్వదేశీ నేవిగేషన్‌ వ్యవస్థ అభివృద్ధి కోసమే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రయోగం విజయవంతం కాగానే షార్‌ అంతటా ఆనందం వెల్లివిరి సింది. శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ ప్రయోగాన్ని పర్యవేక్షించారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
    రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter