పెద్దనోట్ల రద్దుచేసినా, దేశ రాజకీయాలు ఎలా వున్నా, నాయకులు, మన పాలకులు ఎంత రోతగా తయారైనా... ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ అగ్రదేశాలకు ధీటుగా నిలుస్తున్న ఏకైక సంస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. అత్యంత తక్కువ కాలంలోనే అంతరిక్ష ప్రయోగాలలో అగ్రదేశాల సరసన నిలిచింది. అమెరికా, రష్యా వంటి దేశాలు ఒకటికి నాలుగుసార్లు ప్రయోగాలు జరిపి విజయవంతమైన ఉపగ్రహాలను ఇస్రో ఒకే ఒక్క ప్రయోగంతో విజయవంతం చేసింది. అంతే కాదు, ఖర్చులోనూ ఎంతో పొదుపుగా ఉపగ్రహాలు తయారు చేస్తూ పెద్ద దేశాలకు గట్టి సవాలు విసురుతోంది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగిస్తూ, విదేశీ అంతరిక్ష వాణిజ్యాన్ని సైతం ఆకర్షిస్తోంది. ఈ పరంపరలోనే మరో అనితర సాధ్యమైన విజయం వైపు ఇస్రో అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఏ దేశం ప్రయోగించని విధంగా ఒకే రాకెట్‌ ద్వారా 103ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి సన్నా హాలు చేస్తోంది. మొదట 83 ఉపగ్రహాలను ప్రయోగిం చాలనుకున్నప్పటికీ సెంచరీ కొట్టాలన్న లక్ష్యంతో ఆ సంఖ్యను 103 ఉపగ్రహాలకు పెంచింది. ఫిబ్రవరి నెలలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ దేశవ్యాప్తంగా యువత ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు. ఈ అరుదైన అంతరిక్ష ప్రయోగానికి మన నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదిక కావడం నెల్లూరీయులుగా మనకు గర్వకారణం.

pslvఅంతరిక్ష ప్రయోగాలలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ, ఆ దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో గ్రహాల మీదకు ఉపగ్రహాలను పంపిస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో అంతర్జాతీయ అంతరిక్ష రికార్డుకు సిద్ధమవుతోంది.

ప్రపంచంలోనే ఇంతవరకు ఏ దేశం ప్రయో గించని విధంగా ఒకే రాకెట్‌ ప్రయోగం ద్వారా 83 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇస్రోకు ఎంతో నమ్మకమైన పిఎస్‌ఎల్‌వి ద్వారానే ఈ ప్రయోగం నిర్వహించ బోతున్నారు. వచ్చే జనవరిలోనే ఈ ప్రయోగం

ఉండొచ్చు. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలు పనుల్లో పూర్తిగా మునిగిపోయారు. 83 ఉపగ్రహాలలో రెండు మన దేశానికి చెందినవి కాగా, 81ఉప గ్రహాలు విదేశాలకు చెందినవి. వీటి ప్రయోగం ద్వారా 500కోట్లకుపైగా ఆదాయం రావచ్చు. ఈమేరకు ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్‌ ఆయా దేశాలతో ఒప్పందం చేసుకుంది. ఈ ఉప గ్రహాలలో యుఎస్‌వి 60 కాగా, యూరప్‌వి 20 ఉన్నాయి. ఒకటి యుకెది.

ఇంత వరకు అత్యధిక ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన జాబితాలో రష్యా 2014జూన్‌లో 37 ఉపగ్రహాలను, 2013 నవంబర్‌లో యుఎస్‌ 19 ఉపగ్రహాలను, 2016 జూన్‌లో ఇండియా 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాయి. ఒకేసారి 83ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం అనేది మన సాహస ప్రయోగమే! ఇది సక్సెస్‌ అయితే ఇస్రో ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుంది.

pslv c33 2పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో రాకెట్లను విజయ వంతం చేయడమంటే శెనగలు తిని చేతులు కడుక్కున్నంత సులభంగా మారింది ఇస్రో వాళ్ళకు. గతంలో ఏ రాకెట్‌ను ప్రయోగిస్తున్నా శాస్త్రవేత్తల్లో టెన్షన్‌ కనిపించేది. నాలుగో దశ విజయవంతమయ్యే వరకు వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటుండేవి.

ఇప్పుడు అలాంటి పరిస్థితి మారింది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు సక్సెస్‌కు చిరు నామాగా మారాయి. ఇస్రో శాస్త్రవేత్తల నమ్మ కాన్ని నూరుశాతం నిలబెడుతూ పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ప్రయోగాలు విజయవంతమవు తున్నాయి. ఈ పరంపరలోనే ఇస్రో ఖాతాలో మరో విజయం జమయ్యింది.

ఏప్రిల్‌ 28వ తేదీ శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-సి33 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. మధ్యాహ్నం 12.50 గంటలకు నిప్పులు విరజిమ్ముతూ నింగిని చీల్చుకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి33 దూసుకుపోయింది. మొత్తం 19 నిముషాల 42సెంకడ్లలో ప్రయోగం పూర్తయ్యింది. దేశీయ నేవిగేషన్‌ వ్యవస్థ కోసం ఇస్రో రూపొందించిన 1425కిలోల బరువు గల ఐఎన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌కుమార్‌తో పాటు భారత త్రివిధ దళాల అధిపతి అరూప్‌రహో కూడా ఈ ప్రయోగాన్ని వీక్షించడం విశేషం. ప్రయోగం విజయవంతం కాగానే శాస్త్రవేత్తలు ఒకర్నొకరు ఆలిం గనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

పూర్తయిన నావిగేషన్‌ ప్రయోగాలు:

సొంత నావిగేషన్‌ వ్యవస్థ కోసం ఇస్రో చేసిన 7ఉపగ్రహ ప్రయోగాలు పూర్తిగా విజయవంతమయ్యాయి. దీంతో భారత్‌కు సంపూర్ణ నావిగేషన్‌ వ్యవస్థ ఏర్పాటైంది. గతంలో పిఎస్‌ఎల్‌వి సిరీస్‌ ద్వారా ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ 1ఎ, 1బి, 1సి, 1డి, 1ఇ, 1ఎఫ్‌ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిం చడం తెలిసిందే! 2013జూలై 2వ తేదీ నుండి మొదలైన నావిగేషన్‌ ఉపగ్రహాల ప్రయోగం గురువారంతో ముగిసింది. ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల నుండి రెండు రకాల సేవలను పొందవచ్చు. స్టాండార్డ్‌ పొజిష నింగ్‌ సిస్టం ద్వారా అందరికీ సేవలందు తుంటాయి. అలాగే నిర్దేశించిన వ్యక్తులు, వ్యవస్థలకు గోప్యంగా సమాచారం అందిస్తుంది. విమానాలు, నౌకలకు ఈ వ్యవస్థ ద్వారా దిశా నిర్దేశం జరుగనుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిర్ధిష్ట సమాచారం లభిస్తుంది. ఏ వాహనం ఎక్కడుందో పసి గట్టగల జిపిఎస్‌ సిస్టం అందుబాటులో వుంటుంది. మొబైల్‌ ఫోన్‌లలో ఇంటిగ్రేషన్‌ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.

1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో పాక్‌ బలగాలు, ఉగ్ర వాదుల కలయికలపై జిపిఎస్‌ సమాచారం ఇవ్వాలని భారత్‌, అమెరికాను కోరింది. అందుకు అమెరికా నిరాకరించడంతో సొంత నావిగేషన్‌ కోసం ఇస్రో ఆరోజు నుండే శ్రీకారం చుట్టింది. ఈ 17ఏళ్ళలో తీవ్రంగా శ్రమించి అగ్రరాజ్యాలకు ధీటుగా అతితక్కువ ఖర్చుతో సొంత నావిగేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగలిగింది. శెభాష్‌... ఇస్రో!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
 • ఎగరకుండానే వెళ్ళిపోయింది!
  ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం…
 • పాపం పండెన్‌!
  నరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌,…

Newsletter