grainవాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన పంటలను నీటముంచి వికటాట్టహాసం చేస్తుంది. ఈ ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల లాడిపోతున్నారు. అసలే మెట్టప్రాంత రైతులు..కొద్దోగొప్పో నీటితో అష్టకష్టాలు పడి పంటలు పండించుకుంటే ఆ పం టంతా హరీమంది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా, అసలే కరువు వాతపడి రైతులు దీనావస్తలో వున్న సమ యంలో వడగండ్లు పడి మరింత కడ గండ్లు తెచ్చాయి. మండే ఎండల్లో కురిసిన ఈ అకాలవర్షాలు రైతులను మళ్ళీ అప్పుల సుడిగుండంలోకి నెట్టేశాయి. కష్టాల్లో వున్న తమను ఆదుకుని తగు చేయూత నందిం చాలని రైతన్నల కుటుంబాలు ప్రభు త్వాన్ని వేడుకుంటున్నాయి. ఇటీవల

ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, వరికుంటపాడు, కొండా పురం మండలాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు మళ్ళీ అష్టకష్టాల పాలయ్యారు. పలుచోట్ల వడగండ్ల వాన కూడా కురవడంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతరైతులు కోట్లరూపాయల్లో నష్టాల పాలయ్యారు. అసలే వర్షాభావంతో కరువు దెబ్బకు ఇక్కడ పంటలు వేసిందే తక్కువ. అయినా వరుణుడి ఆగ్రహానికి పంటలన్నీ నీటిపాలై నాయి. రైతులకు కన్నీటినే మిగిల్చాయి. సుమారు 400ఎకరాల్లో వరి నీట మునిగి పోయింది. మరో 250ఎకరాల్లో బత్తాయి, వంద ఎకరాల్లో అరటి, బొప్పాయి తోట లతో పాటు, మొక్కజొన్న, మిరప తదితర పంటలన్నీ మునిగిపోయాయి. అటు వరి రైతులు, ఇటు తోటల రైతాంగం ఈ అకాలవర్షానికి అతలాకుతలమైపోయారు. అప్పోసప్పో చేసి ఎంతో కష్టపడి సాగు చేసుకున్న పంటలు నీట మునగడంతో మళ్ళీ తిరిగి కోలుకోలేనంతగా అప్పుల పాలయ్యారు. వరికుంటపాడు మండలం లోని గణేశ్వరపురం, నారసింహాపురం, తూర్పు రొంపిదొడ్ల గ్రామాల్లోనైతే ఏకంగా వడగండ్ల వానే పడింది. ఈదురుగాలులు, వడగండ్లు కలసి పంటలన్నిటినీ భీభత్సం

చేశాయి. వింజమూరు మండలంలోని వింజమూరు, చాకలకొండ, బత్తినవారిపల్లి, జనార్దనపురం, గోళ్ళవారిపల్లి, ఊటుకూరు, కాటేపల్లి, తమిదపాడు తదితర ప్రాంతా ల్లోనూ, కొండాపురం మండలంలోని గరిమెనపెంట, చల్లవారిపల్లి తదితర ప్రాంతాల్లోనూ వరితో పాటు బత్తాయి, బొప్పాయి తోటలు, తమలపాకు తోటలు, అరటితోటలతో పాటు మిరప, మొక్కజొన్న పంటలు అన్నీ వర్షార్పితమయ్యాయి. ఇక ఆ రైతన్నలకు దేవుడే దిక్కు అన్నట్లుగా అయింది పరిస్థితి. జిల్లా కలెక్టర్‌ తదితర ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరి శీలించి, నష్టం వివరాలను తక్షణం అంచనా వేయించి, నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాల్సి వుంది.

rain effectఎండలు భగ్గుమనే మే నెలలో వానలు రావడం ఆశ్చర్యమే. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో ఆ ప్రభా వంతో గత రెండు మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురి శాయి. ఎండలు భగభగమంటున్న తరు ణంలోనే, జనమంతా తీవ్ర ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతున్న సమయంలోనే ఉన్నట్లుండి వానలు కురవడంతో ఆ సెగల నుంచి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగి నట్లయింది. బుధ, గురువారం ఈ రెండు రోజులూ జిల్లా అంతటా తుఫాన్‌ వాతా వరణం ముసురుకుంది. ఈదురుగాలులు, జోరువాన మధ్య జిల్లా తడిసిముద్దయింది. ఈ ఎండల్లో ఉన్నట్లుండి వానలు కురవ డంతో భూమి చల్లబడింది. ఈ అకాల వర్షంతో జోరున వీచిన ఈదురుగాలులతో జిల్లాలో పలుచోట్ల పంటపొలాలు, పండ్ల తోటలు దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. అనేకప్రాంతాల్లోని వాగులు వంకలు నిండిపోయి జలకళ రావడంతో, వచ్చే నెల నుంచి రెండో పంట వేసుకునేందుకు సమాయత్తమవుతున్న రైతులకు ఈ వానలు తమకెంతో మేలు చేస్తాయని సంతోషిస్తు న్నారు. కాగా, జోరువాన ధాటికి నగరం లోని రోడ్లు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు బాగా అంతరాయం కలిగింది. ఈదురుగాలుల వల్ల బుధవారం రాత్రి నగరంలోని బాలాజీనగర్‌ తదితర ప్రాం తాల్లో విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. ఈ సమాచారంతో వెంటనే జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఇంతియాజ్‌ బాలాజీనగర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో వెంటనే ఆ చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ తీగలను సరిచేసి విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడా లని, దెబ్బతిన్న రహదారులను వెంటనే బాగు చేయాలని సూచించారు. బుధ వారం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా జోరువానలే కురిశాయి. తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, అనంతసాగరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter