kavaliనెల్లూరుజిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో టిక్కెట్‌ యుద్ధానికి తొలి వేదికగా మారింది కావలి నియోజకవర్గం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి మళ్ళీ పోటీకి సమాయత్తం అవుతుం డగా, ఈసారి మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణు వర్ధన్‌రెడ్డి కూడా రంగంలోకి రావడంతో సీన్‌ రస వత్తరంగా మారింది. ఏదైనా జగన్‌తోనే తేల్చుకుంటానంటూ ఇటీవల కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో జగన్‌తో భేటీ అయ్యాడు. కావలి సీటు విషయమై గట్టిగానే అడిగాడు. జగన్‌ ఆయనకు హామీ అయితే ఇవ్వలేదుగాని పరిశీలిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. కావలి సీటును విష్ణు గట్టిగా అడిగాడని తెలిసేసరికి ప్రతాప్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. నేను సిటింగ్‌ ఎమ్మెల్యేను, నాకు సీటు వుందో లేదో తేల్చండి... నా పని నేను చూసుకుంటానని డోసు పెంచి చెప్పాడు. దీంతో ఓ పక్క ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మరో పక్క పార్టీ జిల్లా కన్వీనర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు కావలి సీటు సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌దేనని, జగన్‌ నుండి తమకు ఆ విధంగా సందేశం వచ్చిందని చెప్పారు. ఇక్కడితో ప్రతాప్‌ కూల్‌ అయ్యాడు. రాష్ట్రంలో ఇంతవరకు ఏ సీటు ఎవరిదన్నది ఖరారు కాలేదు. అప్పుడే చేయలేరు కూడా! ప్రతి నియోజకవర్గంలోనూ ప్రశాంత్‌కిషోర్‌ బృందం సర్వే జరుగుతోంది. ఏ నియోజకవర్గం నుండి ఎవరు బెటరో ఆ సర్వేలో తేలుతుంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ తిరిగి సీట్లు ఇచ్చినా వారిలో కొందరు గెలుస్తారనే నమ్మకం లేదు. అంతెందుకు నెల్లూరు సిటింగ్‌ ఎంపీ మేకపాటికి మళ్ళీ సీటిస్తే... గెలుపు డౌటే... కాబట్టి ఇప్పుడు ఎవరికి సీటు ఖరారు చేసారని చెప్పినా అది కంటి తుడుపు చర్యేగాని, బి-ఫారాన్ని చేతికిచ్చినట్లు మాత్రం కాదు.

pratapకావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును పరిశీలించారు. ఆ చెరువులో వున్న కొద్దిపాటి నీరు ప్రజల త్రాగునీటికి సరిపోవని, వెంటనే సోమశిల జలాలను చెరువుకు అందజేయాలని ఆయన అధికారులను కోరారు. పశువులకు కూడా తాగేందుకు సరిగా నీరందడం లేదని, వెంటనే సోమశిల జలాలు పంపిణీ చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న ఇనమడుగు శివరామిరెడ్డి మాట్లాడుతూ, కావలి ప్రాంతం పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, కోవూరుకు రెండో పంటకు నీరిచ్చి కావలి నియోజకవర్గానికి తాగునీటికి కూడా నీరు వదలకపోవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెరువుకట్ట సంగం వద్ద నివాసం వుంటున్న కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కనుమర్లపూడి వెంకటనారాయణ, సాయి, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, పి.కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

kvlనిన్న, మొన్నటి వరకు కావలి వైకాపాలో స్థబ్దుగా ఉండగా రామాయపట్నం పోర్టు సాధన పాదయాత్రతో రాజ'కీ'యం వేడెక్కింది. రామాయపట్నం పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి చాలాకాలంగా పోర్టుసాధనకు పాదయాత్ర చేయాలనే తలంపుతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్యకమ్రం చేయాలని అనుకున్నా.. సొంతపార్టీ వైకాపా నుంచి పూర్తి మద్దతకు చివరివరకు చాలా తర్జనబర్జనలు జరిగినట్లు వినికిడి. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వర్గంలో గుబులు రేగి ఎక్కడ వంటేరుకు సొంతమైలేజి వస్తుందోనన్న సందిగ్ధానికి గురయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నేరుగా వంటేరు రంగంలోకి దిగి పాదయాత్రకు వైసిపిలోని నాయకులందరినీ ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే వర్గం కాదనలేక.. ఔననలేక..ఎట్టకేలకు కార్యక్రమంలో పాల్గొనక తప్పలేదని తెలుస్తుంది. పాదయాత్రకు నెల్లూరు యంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు యంపి వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైకాపా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ తూమాటి మాధవరావు, ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి అరుణమ్మలు హాజరయ్యేలా చేసి వంటేరు సఫలీకృతులయ్యారు.

పాదయాత్ర ప్రారంభం వరకు అంటీ ముట్టనట్లు ఉన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి వర్గం ముఖ్యనాయకులు రాకతో కార్యక్ర మంలో పాల్గొని ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారని చర్చించు కుంటున్నారు. జన సమీకరణలోనూ ఎమ్మెల్యే వర్గం నుంచి సహకారం ఉంటుందో లేదోనని వంటేరు వర్గం ముందుగానే మేల్కోని సొంత మండలమైన జలదంకి నుంచి బారీగా జన సమీకరణ చేశారని సమాచారం. ఏది ఏమైనా ఈ పాదయాత్ర విజయవంతం కావడంతో అసలు చర్చ తరువాత మొదలైంది. పాదయాత్ర వల్ల ఎవరికెంత రాజకీయ మైలేజి వచ్చిందనే లెక్కలు రెండువర్గాలు బేరీజు వేసుకున్నారని తెలిసింది. ఈ క్రెడిట్‌ అంతా వంటేరు వైపే మొగ్గు చూపుతుండడంతో ఎమ్మల్యే వర్గం ఆగమేఘాల మీద నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు, తమ వల్లే పాదయాత్ర విజయవంతం అయినట్లు చెప్పుకోవడం సర్వత్రాచర్చాంశనీయమైంది. దీనికి తోడు దిల్లీ వెళిన ఎమ్మెల్యే రామాయపట్నంలో పోర్టును నెలకొల్పాలని కేంద్ర మంత్రుల వద్ద హడావిడి చేయడంలోనూ వంటేరుకు వచ్చిన మైలేజిని తగ్గించడానికేనని ఓ వైపు తెదేపా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంది. వైకాపాలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకోవ డంలో సమన్వయ లోపంపై గుర్రుగావున్న కాటంరెడ్డి సైతం వంటేరు ఆహ్వానాన్ని మన్నించి పాదయాత్రలో పాల్గొనడంతో ఆయన అభిమానులు ఉత్సాహంగా వచ్చి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

వైకాపా అధినాయకత్వం వంటేరును అభినందించడంతో రామిరెడ్డి వెంటనే తాను ఎక్కడ రాజకీయంగా వెనుకబడతానో నని వంటేరును వదలి డిల్లీ వెళ్ళి రామాయపట్నంలో పోర్టును నెలకొల్పాలంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముందు వాలినట్లు తెలుస్తుంది. రామాయపట్నం పోర్టు సాధన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, వైకాపా నాయకులందరినీ ఒకే వేదికపైకి చేర్చి పోర్టు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన వంటేరు లేకుండా రామిరెడ్డి ఒక్కడే డిల్లీ వెళ్లి భాజాపా పెద్దలను కలవడంలోనే ఆయన అంతరార్ధం ఏమిటో అర్ధమౌతుందని వంటేరు సన్నిహితులు చర్చించుకుంటున్నారు...

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter