pratapకావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును పరిశీలించారు. ఆ చెరువులో వున్న కొద్దిపాటి నీరు ప్రజల త్రాగునీటికి సరిపోవని, వెంటనే సోమశిల జలాలను చెరువుకు అందజేయాలని ఆయన అధికారులను కోరారు. పశువులకు కూడా తాగేందుకు సరిగా నీరందడం లేదని, వెంటనే సోమశిల జలాలు పంపిణీ చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న ఇనమడుగు శివరామిరెడ్డి మాట్లాడుతూ, కావలి ప్రాంతం పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, కోవూరుకు రెండో పంటకు నీరిచ్చి కావలి నియోజకవర్గానికి తాగునీటికి కూడా నీరు వదలకపోవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెరువుకట్ట సంగం వద్ద నివాసం వుంటున్న కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కనుమర్లపూడి వెంకటనారాయణ, సాయి, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, పి.కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

kvlనిన్న, మొన్నటి వరకు కావలి వైకాపాలో స్థబ్దుగా ఉండగా రామాయపట్నం పోర్టు సాధన పాదయాత్రతో రాజ'కీ'యం వేడెక్కింది. రామాయపట్నం పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి చాలాకాలంగా పోర్టుసాధనకు పాదయాత్ర చేయాలనే తలంపుతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్యకమ్రం చేయాలని అనుకున్నా.. సొంతపార్టీ వైకాపా నుంచి పూర్తి మద్దతకు చివరివరకు చాలా తర్జనబర్జనలు జరిగినట్లు వినికిడి. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వర్గంలో గుబులు రేగి ఎక్కడ వంటేరుకు సొంతమైలేజి వస్తుందోనన్న సందిగ్ధానికి గురయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నేరుగా వంటేరు రంగంలోకి దిగి పాదయాత్రకు వైసిపిలోని నాయకులందరినీ ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే వర్గం కాదనలేక.. ఔననలేక..ఎట్టకేలకు కార్యక్రమంలో పాల్గొనక తప్పలేదని తెలుస్తుంది. పాదయాత్రకు నెల్లూరు యంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు యంపి వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైకాపా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ తూమాటి మాధవరావు, ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి అరుణమ్మలు హాజరయ్యేలా చేసి వంటేరు సఫలీకృతులయ్యారు.

పాదయాత్ర ప్రారంభం వరకు అంటీ ముట్టనట్లు ఉన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి వర్గం ముఖ్యనాయకులు రాకతో కార్యక్ర మంలో పాల్గొని ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారని చర్చించు కుంటున్నారు. జన సమీకరణలోనూ ఎమ్మెల్యే వర్గం నుంచి సహకారం ఉంటుందో లేదోనని వంటేరు వర్గం ముందుగానే మేల్కోని సొంత మండలమైన జలదంకి నుంచి బారీగా జన సమీకరణ చేశారని సమాచారం. ఏది ఏమైనా ఈ పాదయాత్ర విజయవంతం కావడంతో అసలు చర్చ తరువాత మొదలైంది. పాదయాత్ర వల్ల ఎవరికెంత రాజకీయ మైలేజి వచ్చిందనే లెక్కలు రెండువర్గాలు బేరీజు వేసుకున్నారని తెలిసింది. ఈ క్రెడిట్‌ అంతా వంటేరు వైపే మొగ్గు చూపుతుండడంతో ఎమ్మల్యే వర్గం ఆగమేఘాల మీద నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు, తమ వల్లే పాదయాత్ర విజయవంతం అయినట్లు చెప్పుకోవడం సర్వత్రాచర్చాంశనీయమైంది. దీనికి తోడు దిల్లీ వెళిన ఎమ్మెల్యే రామాయపట్నంలో పోర్టును నెలకొల్పాలని కేంద్ర మంత్రుల వద్ద హడావిడి చేయడంలోనూ వంటేరుకు వచ్చిన మైలేజిని తగ్గించడానికేనని ఓ వైపు తెదేపా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంది. వైకాపాలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకోవ డంలో సమన్వయ లోపంపై గుర్రుగావున్న కాటంరెడ్డి సైతం వంటేరు ఆహ్వానాన్ని మన్నించి పాదయాత్రలో పాల్గొనడంతో ఆయన అభిమానులు ఉత్సాహంగా వచ్చి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

వైకాపా అధినాయకత్వం వంటేరును అభినందించడంతో రామిరెడ్డి వెంటనే తాను ఎక్కడ రాజకీయంగా వెనుకబడతానో నని వంటేరును వదలి డిల్లీ వెళ్ళి రామాయపట్నంలో పోర్టును నెలకొల్పాలంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముందు వాలినట్లు తెలుస్తుంది. రామాయపట్నం పోర్టు సాధన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, వైకాపా నాయకులందరినీ ఒకే వేదికపైకి చేర్చి పోర్టు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన వంటేరు లేకుండా రామిరెడ్డి ఒక్కడే డిల్లీ వెళ్లి భాజాపా పెద్దలను కలవడంలోనే ఆయన అంతరార్ధం ఏమిటో అర్ధమౌతుందని వంటేరు సన్నిహితులు చర్చించుకుంటున్నారు...

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter