rasi 05

1Ariesమేషం

ఉద్యోగులకు పనిభారం, అధికారుల ఒత్తిడి ఉంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. సత్కారాలు పొందే అవకాశమున్నది. విద్యా ప్రగతి బాగుంటుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు తాత్కాలికంగా వదలండి.

 

2Taurusవృషభం

దూరప్రయాణాల శ్రమ, సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరించడం ఉంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్ధికంగా కుదుటపడతారు. విద్యాప్రగతి కలదు. ప్రభుత్వ అనుమ తులు పొందుతారు. కొత్త కాంట్రాక్టులు లభించగలవు. పనులు హడావిడిగా సాగుతాయి. కోర్టు కేసులు వాయిదా పడగలవు. అధికారులకు స్థాన చలనం ఉంటుంది.

 

3Geminiమిధునం

దూర ప్రయాణాలు నిర్ణయం కాగలవు. సోదర వర్గంతో చిన్న సమస్యలుండవచ్చును. ఉద్యోగావకాశాలు లభించగలవు. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి గుర్తింపు గౌరవాలుంటాయి. అనుకున్న పనులకు ఇతరుల సహకారం లభిస్తుంది. ఆర్ధిక స్థితి బాగుం టుంది. వ్యాపార విస్తరణ, కొత్త ఆదాయ అవకాశాలు దొరుకుతాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు విధి నిర్వహణ బాగుంటుంది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బిడ్డల విద్య, ఉద్యోగ విష యాలపై, పెండ్లి విషయాలపై ఆందోళన ఉంటుంది. బంధువులతోను, కుటుంబసభ్యులతోను వ్యవహారాలలో రాజీపడతారు. వృత్తి జీవనం కలవారికి ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చేయదలచిన ఆలోచనలు కార్యరూపంలోనికి వస్తాయి.

 

5Leoసింహం

ఉద్యోగులు విధి నిర్వహణలో పబ్లిక్‌తోను, అధికారు లతోను జాగ్రత్తగా మెలగండి. విద్యార్థులకు శ్రమ, వత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు సరిగా జరగక చికాకు, టెన్షన్‌ ఉంటుంది. స్థిరాస్తుల వ్యవహారాలు, కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆర్ధిక విషయాలలో జాగ్ర త్తగా వ్యవహరించండి. నిర్ణయాలు సొంతంగా తీసు కొంటే మంచిది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

6Virgoకన్య

ఆరోగ్యం మీకు బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు, రావలసిన బాకీలు వాయిదా పడగలవు. శుభకార్యాల ప్రయత్నాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్య బాధలుండవచ్చును. విద్యా ప్రగతి బాగుం టుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుం టుంది. ఆడిటర్లు, పరిశ్రమ యజమానులకు, న్యాయ వాదులకు, చిన్న పరిశ్రమలకు ఆదాయం బాగుంటుంది.

 

7Libraతుల

సభలు సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్య నిర్ణయం కాగలవు. ఉద్యోగార్ధులు కొద్దికాలం వేచి ఉం డాలి. బంధుమిత్రులను, ప్రముఖులను కలుసుకొంటారు. ఆస్తి, ఋణ వ్యవహారాలు రాజీకి వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు అదనంగా ఉంటాయి. విద్యార్థులు బాగా శ్రమించాలి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉం టాయి. ఆదాయానికి ధీటుగా ఖర్చులుంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగార్ధులకు అనుకూలత బాగుంటుంది. విద్యా ప్రగతి, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. గృహోపకర ణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగు తుంది. పెట్టుబడులపై లాభాలుంటాయి. ఆరోగ్యం ఫరవా లేదు. కొత్త పరిచయాలు జరిగి ప్రయోజనం పొందు తారు. కోర్టు కేసులు కొంత సానుకూలం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. సభలు సమావేశాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలుంటాయి. స్థిరాస్తుల వివాద పరిష్కారాలు జరుగగలవు. విలువైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఉద్యోగులు వత్తిళ్ళకు లొంగి ఇబ్బంది పడకండి. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. కుటుంబంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలుండి సర్దుబాటు కాగలవు. ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

ఉద్యోగులకు అధికారవర్గంతో సత్సంబంధాలుం టాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసికొనవద్దు. దూర ప్రయాణాలు అవసరం ఉంటుంది. సభలు సన్మా నాలలో పాల్గొంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అవసరాలకు ఇతరులను బట్టి సర్దుకొని పోతూ పనులు జరుపకొనవలసి ఉంటుంది. చిరు వ్యాపా రులు, వృత్తి జీవనం కలవారికి ఆర్ధికస్థితి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

అనుకున్న పనులు సరిగా జరగక టెన్షన్‌ పడుతుం టారు. మాటల తీవ్రత, తొందరపాటు ఎక్కువగా ఉం టుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు అవకాశాలు ఉండగలవు. కుటుంబంలో సమస్యలుంటే చర్చించి పరిష్కరించ గలరు. ఆర్ధిక ఇబ్బంది లేకున్నను సంతృప్తి ఉండదు.

 

12Piscesమీనం

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఒత్తిడులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలందు ఫలితం లభించగలదు. దూర ప్రయాణాలుండుట, సత్కారాలు పొందడం, సభలు సమావేశాలలో పాల్గొనడం, విద్యార్థులకు విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. అనుకున్న పనులు సక్రమంగా జరుపకొనగలిగిన సమర్ధత ఉంటుంది. ఆర్ధిక స్థితి బాగుంటుంది. రావలసిన బాకీలు కొంత లభిస్తాయి.

rasi 05

1Ariesమేషం

వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం బాగుండి ఆదాయం పెరుగుతుంది. త్రోసిపుచ్చలేని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులుండవు. మానసికంగా స్థిమిత పడతారు. అనుకున్న పనులు సాధించుకొంటారు. వ్యాపకాలు, పరిచయాలు పెరిగి ప్రజా సంబంధాలు బలపడతాయి. కోర్టు కేసులు వాయిదా పడవచ్చును. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి.

2Taurusవృషభం

ఆర్ధిక సమస్యలతో పాటు బయట వ్యవహార వత్తిడి ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార జీవనం కల వారికి ఆదాయం తగ్గుతుంది. అనుకున్న పనులకు ఆటంకాలు, ప్రయాణాల వల్ల శ్రమ ఉంటుంది. సభలు సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని అవసరాలు చెల్లింపులు వాయిదా వేసికొంటారు. కొన్ని ముఖ్య నిర్ణ యాలు తీసికొనలేని పరిస్థితులుండవచ్చును.

 

3Geminiమిధునం

ఇంట్లో వారితో భేదాభిప్రాయాలు, సమస్యలు రాకుండా చూచుకొనాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడవచ్చును. బంధువర్గంతో విభేదాలుంటాయి. వృత్తి జీవనం కలవారికి అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. వ్యాపార వర్గాలకు సంతృప్తి ఉండదు మరియు రాబడి తగ్గవచ్చును. శ్రమపడితేగాని అనుకున్న పనులు జర గవు. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేసుకొనాలి.

 

4Cancerకర్కాటకం

అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగు తుంది. ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలలో ఆలస్యం జరుగుతుంది. వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. అధికారులకు పెరిగిన బాధ్యతల వల్ల శ్రమ, ఉద్యోగులకు కార్య సామర్ధ్యం బాగుంటుంది.

 

5Leoసింహం

ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవచ్చును. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. వృత్తి వ్యాపా రాలలో అభివృద్ధి బాగుండి ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తప్పనిసరి కాగలవు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, కోర్టు వ్యవహారాలలో అనుకూలత, బంధుమిత్రల సహాయ సహకారాలు బాగుంటాయి.

 

6Virgoకన్య

వృత్తి వ్యాపారాలలో అవకాశాలు పెరిగి అదాయము సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన పనులలో అనుకూలత అనుమతులు లభిస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశాలు బాగున్నాయి. రావలసిన బాకీలు కొంత మేరకు లభిస్తాయి. టెండర్లు ఏజన్సీలు లభించే అవకాశమున్నది. ఉపాధి, మార్కె టింగ్‌ రంగాల వారికి అభివృద్ధి బాగుంటుంది.

 

7Libraతుల

మంచి ఆర్ధికావకాశాలు, ఉద్యోగావకాశాలు కలసి వస్తాయి. ఆదాయం తృప్తికరం. పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల సానుకూలత, రావలసిన బాకీలపై హామీలు గాని, కొంత చెల్లింపులుగాని పొందుతారు. ఉద్యోగులకు అదనపు పనులు, అధికారులకు స్థానమార్పులుంటాయి. అనుకున్న పనులు నెరవేరగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపా రాలు సామాన్యంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల తోను పబ్లిక్‌తోనూ జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కువ మొత్తంలో ఖర్చు తగలవచ్చును. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మాటలు పడవలసి రావచ్చును. విద్యార్థులు చదు వుపై శ్రద్ధ చూపాలి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

9Sagittariusధనుస్సు

ప్రయత్నం చేస్తున్న పనులు సరిగా జరగవు. ఆటం కాలుంటాయి. అయినా చేస్తున్న కృషి నిలపవద్దు. వ్యాపార వర్గాలకు ఆశించిన పురోగతి ఉండదు. వృత్తి జీవనం గలవారికి ఆదాయం సంతృప్తికరం. చిన్న వ్యాపారులకు బాగా జరుగుతుంది. బంధువర్గంతో ఏదో ఒక రూపంలో విభేదాలు రావచ్చును. విద్యా కృషి బాగుంటుంది. గృహ వస్తు వాహన రిపేర్లపైన ఖర్చులు తప్పనిసరి.

 

10Capricornమకరం

ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. కొన్ని అన వసర ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. వ్యవహారాలు, పనుల వల్ల తీరిక ఉండదు. కాని చేపట్టిన పనులు పేచీలతో సాగుతాయి. టెన్షన్‌ ఎక్కువుగా ఉంటుంది. ప్రభుత్వ చెల్లింపులు మీవి ఆలస్యం కాగలవు. పెట్టు బడులు, కొత్త వ్యాపారాలు ప్రస్తుతానికి విరమించండి. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యాప్రగతి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

ఆర్ధికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలు బాగుండి, ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులకు బంధువులకు సహాయపడతారు. స్థిరాస్తుల లావాదేవీలు జరుగవచ్చును. ప్రభుత్వపరంగా గాని, బయట గాని అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రభుత్వ పర్మిషన్లు, బ్యాంకు లోన్లు పొందుతారు. అనవసర విష యాలలో జోక్యం చేసికొనవద్దు.

 

12Piscesమీనం

ఆదాయానికి లోపం రాదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ఆలోచనలు ప్రయ త్నాలు ఫలించగలవు. శాస్త్ర సాంకేతిక క్రీడా రంగాల వారికి మంచి అవకాశాలుండగలవు. వ్యవహారాలలో మీదే పైచేయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉన్నది. ఉద్యోగులకు అధికారుల సహకారం బాగుంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు.

rasi29

1Ariesమేషం

శుభకార్యాలను నిర్ణయం చేస్తారు. దూరప్రయాణా లను నిర్ణయం చేస్తారు. రావలసిన బాకీలు కొంత లభించగలవు. ముఖ్యపనులను బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాలి. వర్కర్ల సమస్యలు యజమానులకు ఉంటాయి. ఉపాధి పథకాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది లేకుండా వృత్తి వ్యాపా రాలు బలపడి ఆదాయం పెరుగుతుంది.

2Taurusవృషభం

గౌరవమర్యాదలు బాగుండి, సభలు సమావేశాల నిర్వహణలో ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పని భారం పెరిగినా అధికారుల ఆదరణ బాగుంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. ప్రముఖుల పరిచయాలు, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు ఇతరులకు ఉపయోగపడతాయి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి.

 

3Geminiమిధునం

వాణిజ్య ఒప్పందాలకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా మెలగండి. విద్యా ప్రగతి బాగుంటుంది. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వల్ల సమస్యలుండగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యము బాగుండును. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపార వృద్ధికి మీ ప్రయత్నాలు అనుకూలమై ఆదాయం పెరుగుతుంది.

 

4Cancerకర్కాటకం

పిల్లల వల్ల సమస్యలు కొద్దిగా ఉంటాయి. వస్తు వాహన గృహ రిపేర్లుంటాయి. ఆర్ధిక ఒప్పందాలు కుద రడం, ఋణాలు లభించడం జరుగుతుంది. కొన్ని విష యాలలో కుటుంబసభ్యులతో రాజీపడవలసి వస్తుంది. శరీరానికి గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆర్ధిక స్థితి క్రమంగా మెరుగు కాగలదు. అనుకున్న పనులు హడావిడిగా జరుపుతారు.

 

5Leoసింహం

కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి అవకాశాలు బాగుంటాయి. దూరప్రయాణాలుంటాయి. టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య లోపం కలుగకుండా జాగ్రత్తపడాలి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వస్తు వులు, కాగితాలు భద్రపరచుకొనండి. ప్రముఖులను కలుసుకొంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి విస్తరణ జరుపుతారు. ఆదాయం పెరుగుతుంది.

 

6Virgoకన్య

కొత్త కాంట్రాక్టు లీజులు లభించగలవు. శుభకార్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. దూరప్రయాణా లుంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. విద్యావృద్ధి బాగుం టుంది. మీ సమర్ధతకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

 

7Libraతుల

శుభకార్య ప్రయత్నాలు ఫలించవచ్చును. అనుకోని ప్రయాణాలుంటాయి. సభలు సమావేశములందు ప్రము ఖంగా పాల్గొంటారు. అధికారులకు బాధ్యతలు పెరుగు తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. మీవి కాని విషయాలలో జోక్యం వద్దు. ఆరోగ్యం ఫరవా లేదు. సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించగలరు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకొంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, అధికారుల ఆదరణ బాగుంటుంది. కోర్టు వ్యవహారాల విషయంలో పన్నుల చెల్లింపు వ్యవహారాలలో సంప్రదింపులు చేస్తారు. దూర ప్రయాణాలు నిర్ణయం కాగలవు. ఆరోగ్యం ఫరవా లేదు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. కొత్త పెట్టు బడులు, వ్యాపార విస్తరణకు అనుకూలత బాగుంది. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది.

 

9Sagittariusధనుస్సు

అగ్రిమెంట్లు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు మార్పులు, అధికారుల సహకారముం టుంది. బంధుమిత్రులను కలుసుకొంటారు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. నూతన వస్తు, వస్త్రాలు సమకూరుతాయి. యజమానులకు వర్కర్లతో సమస్య లుండవచ్చును. విద్యార్థులకు మంచి అభివృద్ధి కలదు. అనారోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

 

10Capricornమకరం

ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం, ఋణాలు మంజూరు వాయిదా పడగలవు. అనుకున్న పనులను ఉపాయం, తెలివితేటలు చూపి జరుపుకొనవలసి ఉం టుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఉద్యోగులకు శ్రమ అధికం. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఆడిటర్లు, కళా క్రీడా సాంకేతిక రంగాల వారికి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

ఎటువంటి వత్తిడులకు, మొగమాటాలకు లొంగ వద్దు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. విలువైన వస్తువులను సమకూర్చుకొం టారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చేయదలచిన పనులకు సొంత పర్యవేక్షణ అవసరం. అధికారులకు కొత్త బాధ్యతలు, ఉద్యోగులకు పనివత్తిడి ఉంటుంది.

 

12Piscesమీనం

వృత్తి వ్యాపారవృద్ధి ప్రయత్నాలు అనుకూలించి ఆదాయం పెరుగుతుంది. గృహ వస్తు వాహన రిపేర్లుం టాయి. ప్రయాణాలు వాయిదా పడగలవు. ముఖ్య పత్రాలు, నోటీసులు అందుకొంటారు. కోర్టు కేసులందు అనుకూలత కలదు. సోదరులతో కొద్ది విభేదాలు రావ చ్చును. బాకీలు నిలబడిపో తాయి. అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి.

Page 8 of 65

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter