rasi 01

1Ariesమేషం

ప్రభుత్వ కార్యాలయాలలో పనులు వాయిదా పడవచ్చును. ప్రయాణాల విషయంలో ముందు వెనుకల ఆలోచిస్తారు. ఉద్యోగులు పబ్లిక్‌తోను అధికారులతో జాగ్రత్తగా మెలగండి. స్థిరాస్తులపై ఆదాయం, షేర్ల వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలుంటాయి. ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. అనుకోని ఖర్చులు పైనబడగలవు.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలుం టాయి. వృత్తి పరంగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నా లలో అవకాశాలుంటాయి. అనుకున్న పనులు సమర్ధ వంతంగా జరుపుతున్నా అప్పుడప్పుడు టెన్షన్‌ పడుతుం టారు. మీ వ్యక్తిత్వానికి మంచి విలువ గౌరవముంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆదాయం సంతృప్తికరము.

 

3Geminiమిధునం

ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం జరుగుతుంది. రావలసిన బాకీలు కొంతమొత్తం అందవచ్చును. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగులు అధికారు లతో, పబ్లిక్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు లభించగలవు. విద్యార్థులకు చదువు శ్రద్ధ తగ్గి, వ్యాపకాలు పెరుగు తాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

కోర్టు కేసులు వాయిదా పడతాయి. సహచరులను ఆదుకొనడం జరుగుతుంది. వృత్తి పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు అధికార వర్గంతో సాన్ని హిత్యం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో వున్న వారికి చిరు అవకాశాలు దొరకగలవు. ముఖ్యమైన పత్రాలు, వస్తువులు జాగ్రత్తపరచుకొనాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు.

 

5Leoసింహం

ఉద్యోగులు సమర్ధవంతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకుతాయి. అనవసర వ్యవహారాలలోకి లాగడానికి ఇతరులు ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్త పడండి. పిల్లలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. విద్యాప్రగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి తీరిక లేకుండా శ్రమపడతారు. పనులందు టెన్షన్‌ ఉంటుంది.

 

6Virgoకన్య

కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. బిడ్డల ఉద్యోగ వివాహాల ప్రయత్నాలు ఫలించగలవు. అనుకోని ప్రయా ణాలు, ప్రముఖులను, ఆత్మీయులను కలుసుకొనడం జరుగుతుంది. విద్యాప్రగతి బాగుంటుంది. సమావేశా లలో మీ సూచనలకు ఆమోదం లభిస్తుంది. ఆస్తి వ్యవ హారాలు, బాకీ వ్యవహారాలు ఒక సర్దుబాటుకు వస్తాయి. ఆర్ధికంగా ఇబ్బందులు అంతగా ఉండవు.

 

7Libraతుల

కుటుంబసభ్యులతో సామరస్య ధోరణిలో నడుచు కొనండి. సోదరీ సోదర వర్గాలకు మంచి జరుగుతుంది. వర్కర్లతో యజమానులకు సమస్యలు ఏర్పడవచ్చును. అనుకోని ఆదాయం వస్తు ధన రూపంలో లభించగలదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చిన్న అవకాశాలు దొరక గలవు. అనవసర వివాదాలలో తలదూర్చకుండా జాగ్రత్త పడండి. వ్యాపార వర్గాలకు ఆదాయం పెరుగుతుంది.

 

8Scorpioవృశ్చికం

జీవిత భాగస్వామి సలహాలు పాటించండి, మేలు జరుగుతుంది. ఉద్యోగార్ధులకు స్థానమార్పులు, ప్రమో షన్లు వంటివి వస్తాయి. విద్యార్థులకు మంచి ప్రగతి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు, ఎదుటివారి వల్ల మేలు జరగడం ఉంటుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు కలిగినా సమర్ధవంతంగా చక్కదిద్ది నిర్వహి స్తారు. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల అభీష్టాలకు అనుగుణంగా నడుచుకొనవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసులు, ఆస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. సాహిత్య, కళా, క్రీడా రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఎదుటివారి ప్రలోభాలకు, ఆశకలిగించే మాటలకు లొంగవద్దు.

 

10Capricornమకరం

స్థిరాస్తులు, షేర్లపై లాభాలుంటాయి. శుభకార్యాలను నిర్ణయం చేస్తారు. ఓర్పు, లౌక్యంతో పనులు సాధించ గలరు. సోదరవర్గానికి మేలు జరుగుతుంది. చిన్న విష యాలపై ఇంట్లో వారితో తగాదాలు రావచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. ఇంటర్వ్యూలకు తయారౌతారు. క్రొత్త వ్యాపారాలకు, భాగస్వామ్య వ్యాపారాలకు నిర్ణయాలు జరుగవచ్చును.

 

11Aquariusకుంభం

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్ర వర్గాలకు యధోచిత సహాయం అందిస్తారు. అధికారు లకు స్థానమార్పు, ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరకడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. క్రొత్త వస్తువులు కొనడం, అనుకోని ప్రయాణాలుంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు సాధిస్తారు. ఆర్ధికస్థితి బాగుండి మంచి అవకాశాలు దొరుకుతాయి.

 

12Piscesమీనం

ఉద్యోగులకు విధి నిర్వహణలో సమర్ధత, అధికారు లతో చనువు లభిస్తుంది. విలువైన వస్తువులు, గృహోప కరణాలు కొంటారు. యజమానులకు వర్కర్లతో సమస్య లుంటాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఆర్ధిక వ్యవహా రాలలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. శ్రేయోభి లాషులను సంప్రదించండి. వ్యాపార వృత్తి రంగాల వారికి అవకాశాలు చేజారిపోవచ్చును.

 

rasi 24

1Ariesమేషం

ఉద్యోగులు సహచరులతో, అధికారులతో జాగ్రత్తగా మెలగండి. ఇతరుల నుండి అనుకున్న సహాయాన్ని పొందలేకపోవచ్చును. శుభకార్య ప్రయత్నాలకు ఆటం కాలుండటం జరుగుతుంది. చిన్న వ్యాపారులకు ఆదాయం ఫరవాలేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలసి ఉంటుంది. వృత్తివ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఖర్చులు పెరుగుతాయి.

 

2Taurusవృషభం

గృహ నిర్మాణదారులకు, కాంట్రాక్టర్లకు బాగుం టుంది. భూ లావాదేవీలు ఫలించగలవు. సభలు, సమా వేశాలలో గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. ఉద్యోగు లకు ప్రమోషన్లు, అధికారవర్గ సహకారం బాగుంటుంది. కోర్టు కేసులందు అనుకూలత, విద్యార్థులకు మంచి ప్రగతి, జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి పరంగా జీవనం కలవారికి ఆర్థికస్థితి బాగుంటుంది.

 

3Geminiమిధునం

అనుకోని ప్రయాణాలు, శుభకార్య ప్రయత్నాలలో ఆలస్యం ఉంటుంది. వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసికొంటారు. ఉద్యోగార్ధులకు మేలైన అవకాశాలుండక పోవచ్చును. కుటుంబసౌఖ్యం, బంధు సఖ్యత బాగుం టుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు లభించగలవు. అవసరాలకు మాట రూపేణా సహాయం చేస్తారు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు రావలసిన బాకీలు లభించడం, పని భారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు జరుప కుండా జాగ్రత్తపడాలి. బిడ్డల విద్యా శుభకార్య విషయా లందు శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడు కొనండి. రావలసిన బాకీలు కొంత అందుతాయి. ఆర్ధి కంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి.

 

5Leoసింహం

ఆకస్మిక ప్రయాణాలుంటాయి. పారిశ్రామికవేత్త లకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధు మిత్రులకు సహాయపడతారు. ప్రముఖులతో పరిచయా లుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యావృద్ధి కలదు. ఆదాయం పెరిగి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి.

 

6Virgoకన్య

పట్టుదలతో అనుకున్న పనులు సాధించుకొంటారు. అనుకోని పెద్ద ఖర్చు పైనబడగలవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. స్థిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టు బడులు జరుపుతారు. వృత్తి జీవనం కలవారికి ఆర్ధికంగా బాగుంటుంది. హోల్‌సేల్‌ వ్యాపారులకు, కాంట్రాక్టులకు ప్రభుత్వ పరంగా ఇబ్బందులుంటాయి.

 

7Libraతుల

ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసి కొనండి. గృహ వస్తు వాహన రిపేర్లు ఏర్పడతాయి. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. ఉద్యో గులకు విధి నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్య విష యంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యపనులు వాయిదా వేసికొంటారు. కొత్త పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి.

 

8Scorpioవృశ్చికం

కొత్త పరిచయాలు, దైవ కార్యాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలు వాయిదా పడటం జరుగుతుంది. పరుష ప్రవర్తన, తొందరపాటు మాటలు తగ్గించు కోవాలి. విద్యా ప్రగతి బాగుంటుంది. స్థిరాస్తుల లావా దేవీలు జరుపుతారు. సమస్యాత్మక విషయాలలో సంప్ర దింపులు, చర్యలు జరిగి పరిష్కారం కాగలవు. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు వస్తాయి.

 

9Sagittariusధనుస్సు

బిడ్డలకు అభివృద్ధి బాగుంది. ఉద్యోగులకు స్థాన మార్పులు, పని భారం బాగుంటుంది. యజమానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగండి. శరీరానికి గాయాలు తగల వచ్చును. కొంతమంది మిమ్మల్ని పరోక్షంగా కించ పరచవచ్చును. విద్యాప్రగతి బాగుంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులను అధిగమించి, రాబడి పెరుగుతుంది. వృత్తి జీవనంలో సామాన్య అవకాశాలుంటాయి.

 

10Capricornమకరం

సమస్యలు క్రమంగా సర్దుబాటు కాగలవు. పారిశ్రా మిక వర్గాలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్య ప్రయ త్నాలలో అనుకూలత కలదు. ఆస్తుల లావాదేవీలు వాయిదాపడతాయి. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆశించినంత ఎక్కువ ఆదాయముండదు. కోర్టు వ్యవ హారాలు వాయిదా పడతాయి.

 

11Aquariusకుంభం

ఉద్యోగులు తమ విధి నిర్వహణ సమర్ధవంతంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకు తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధి కంగా బాగుంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలుండి సర్దుబాటు కాగ లవు. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి.

 

12Piscesమీనం

ఉద్యోగార్ధులకు అవకాశాలు లభిస్తాయి. అనుకున్న పనులను జాగ్రత్తగా నెరవేర్చుకుంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉమ్మడి వ్యాపారు లకు లీజులకు అవకాశాలు దొరుకుతాయి. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి ఆదరణ ఉంటుంది. బంధు వర్గాన్ని కలుసుకొంటారు. ప్రయాణాలుంటాయి. పైకి తీవ్రత లేకపోయినా ఆర్ధికంగా ఇబ్బందులుంటాయి.

rasi 17

1Ariesమేషం

ఆర్ధిక స్థితి బాగుండి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా ఉంటాయి. ఆదాయం తృప్తికరం. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొనేవారికి మంచి సమయమిది. అనుకున్న పనులు సక్రమంగా సాగుతాయి. అవసరాలకు కొద్దిపాటి ఋణం చేస్తారు. కుటుంబసభ్యుల సహకారం బాగుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడటం మంచిది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.

 

2Taurusవృషభం

వస్తు వాహన గృహ రిపేర్ల ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలుంటాయి. శుభకార్యాలలో, సభలు సమావే శాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం బాగుంటుంది. బిడ్డల విద్య ఆరోగ్య ఉద్యోగ వ్యవహారాలలో దృష్టి పెడతారు. పరిచయాలు కొత్తవి జరిగి ప్రయోజనం నెరవేరేందుకు ఉపయోగ పడతాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి.

 

3Geminiమిధునం

అనుకున్న పనులను శ్రమపడి పూర్తి చేస్తారు. వృత్తి జీవనంలో అభివృద్ధి ఉండి ఆదాయం బాగుంటుంది. వ్యాపారవర్గాలకు మాత్రం స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆదాయం సామాన్యము. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం జరుగుతుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి. మొగ మాటాలకు పోవద్దు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

వ్యాపారాలలో అభివృద్ధిని గూర్చి సమీక్ష చేసి, కొత్త ప్రయత్నాలు చేపడుతారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం బాగుంటుంది. ప్రారంభించి చేస్తున్న పనులను విజయ వంతంగా నెరవేర్చుతారు. నూతన వస్తు ప్రాప్తి, ప్రము ఖుల పరిచయాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల పరిణామాలుంటాయి. బంధుమిత్రుల సలహా మేలు చేకూర్చుతుంది.

 

5Leoసింహం

ఈ రాశి వారికి ఆర్ధికావకాశాలు బాగుంటాయి. సమాజంలో గుర్తింపు గౌరవాలుంటాయి. సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాటలందు చేతలందు దూకుడు తగ్గించుకొనాలి. ఇతరులకు సహాయ సహకా రాలు అందిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. స్థిరాస్తులు కొనే అవకాశాలుంటాయి. సోదర వర్గానికి అభివృద్ధి ఉంటుంది.

 

6Virgoకన్య

అనుకున్న పనులను పట్టుదలగా నెరవేర్చుతారు. ఆర్ధిక ఉద్యోగ రంగాలపై వచ్చిన అవకాశాన్ని వినియో గించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ అనుకూలత, బ్యాంకు ఋణాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం పెరుగు తుంది. శుభకార్యాలు నిర్ణయం కావచ్చు. స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరుపుతారు.

 

7Libraతుల

వృత్తి వ్యాపారాలు బాగా వృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది. అయినా వ్యాపారవృద్ధికి గాని, ఇతర అవసరాలకు గాని ఋణం కొంత చేయవలసి వస్తుంది. సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. స్థిరా స్తుల లావాదేవీల విషయంలో తొందర వద్దు. ఉద్యోగు లకు పనిభారం పెరుగుతుంది. అధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఆర్ధిక ఇబ్బందులు పెరుగుతాయి. ఖర్చులను అదుపు చేసికొనవలెను. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. వస్తు నష్టం, వస్తు వాహన రిపేర్ల ఖర్చులు ఎక్కువుగా ఉంటాయి. వృత్తి పరంగా బాగుండి రాబడి ఉంటుంది. వ్యాపారపరంగా సామాన్యంగా ఉం టుంది. చెల్లింపులు వాయిదా పడతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి.

 

9Sagittariusధనుస్సు

వ్యాపారవృద్ధి అవకాశాలు లభించకపోవచ్చును. ఆదాయం వ్యాపారవర్గాలకు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఆదాయం తృప్తికరం. ముఖ్య బంధువుల నుండి అనారోగ్య వార్తలు వింటారు. శుభకార్య ప్రయ త్నాలలో శ్రద్ధ చూపుతారు. అనుకున్న పనులు నిదా నంగా జరుగుతాయి. ఉద్యోగులకు పని సామర్ధ్యం బాగుండినా, బాధ్యతలు, వత్తిడి పెరుగుతుంది.

 

10Capricornమకరం

పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. అందరిని అనుమానించవలసిన పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపా రాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. కొత్త వస్తు వులను సమకూర్చుకొంటారు. కుటుంబంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలుండి సర్ధుకుంటాయి. వత్తిళ్ళకు, మొగ మాటాలకు లొంగవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకా శాలు లభిస్తాయి. లీజులు పొందుతారు.

 

11Aquariusకుంభం

వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలు కరెంటు పనులందు జాగ్రత్త అవసరం. గాయాలు తగలవచ్చును. ఉద్యోగులకు సమర్ధత, గుర్తింపు గౌరవాలుంటాయి. ప్రయాణాలు తప్పనిసరి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు, అభివృద్ధి ఉంటుంది. వ్యాపారములందు వృత్తిలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

 

12Piscesమీనం

నిర్ణయాలు తీసికొనడం, అమలు పరచడంను కట్టు దిట్టంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకా శాలు బాగుంటాయి కాబట్టి ప్రయత్నించాలి. విద్య, పరి శోధన రంగాలలో మంచి ప్రగతి చూపుతారు. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు బాగుండి ఆదాయం బాగుం టుంది. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. బంధువుల నుండి సహాయసహకారాలు బాగుంటాయి.

Page 10 of 65

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter