rasi 01

1Ariesమేషం

బ్యాంకు ఋణాలు, ప్రభుత్వ అనుమతులు లభించ గలవు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. విద్యా ర్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. చెల్లింపులు సకా లంలో జరుపుతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూ లత, కొత్త పస్తువులు పరికరాలు కొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు అధికారులతో సానుకూలంగా ఉం టుంది. పరుషంగా మాట్లాడటం, అనవసర విషయా లలో జోక్యం చేసికొనడం చేయకండి. ఆరోగ్య విషయా లలో శ్రద్ధ అవసరం. కోర్టు కేసులందు అనుకూలత, బిడ్డల విద్యా వివాహ విషయాలపై ప్రయత్నాలు జరుపు తారు. అనుకున్న కార్యక్రమాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులను కలుసుకొంటారు.

 

3Geminiమిధునం

వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వల్ల చిన్న ఇబ్బందులుండవచ్చును. కొత్త వస్తువులు కొనడం, వాహన రిపేర్లుండగలవు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి. వ్యాపార, వృత్తి జీవనం కలిగినవారు కొత్త పథకాలు గూర్చిన ఆలోచనలు, ఆదాయము స్వల్ప పెరుగుదల ఉంటుంది.

 

4Cancerకర్కాటకం

ఇతరుల విమర్శలకు గురికావలసి వస్తుంది. ఆర్ధిక వ్యవహారాలను ఇతరుల సలహాలతో నిర్వహించడం మంచిది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉం టుంది. రావలసిన బాకీలు వాయిదాపడతాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు. చిరు వ్యాపార వర్గాలకు ఆదాయం పెరుగుతుంది. మిగిలిన వారికి ఆదాయ వ్యయాలు ఫరవాలేదు.

 

5Leoసింహం

అనుకోని ప్రయాణాలుండడం, షేర్‌ మార్కెట్‌ నిరుత్సాహ పరచడం జరుగుతుంది. కళాక్రీడా కారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అవ కాశాలు దొరకగలవు. అధికారవర్గాలకు స్థానచలనం, పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఫరవా లేదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

 

6Virgoకన్య

ఉన్నత చదువులకు అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగులకు ప్రజలతో అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొంతవరకు ఋణ సమస్యలు పరిష్కారం కాగలవు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉన్నది. ఇతరులకు సహాయపడతారు. తెలియని విషయాలలో తల దూర్చవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపకాలు పెరగడం వల్ల అనుకున్న పనులు సరిగా చేయలేరు.

 

7Libraతుల

ప్రముఖులను కలవడం, అనుకోని ప్రయాణాలుం టాయి. ఉద్యోగార్ధులకు చిరు అవకాశాలు దొరకగలవు. స్థిరాస్తులవృద్ధికి వ్యాపారవృద్ధి, కొత్త ఆలోచనలు చేస్తారు. ఉన్నత విద్యావకాశాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు, అభివృద్ధి తగ్గుతుంది. సంప్రదింపులు, అగ్రిమెంట్ల విషయంలో ఆలోచించి వ్యవహరించండి.

 

8Scorpioవృశ్చికం

శుభకార్య ప్రయత్నాలలో నేర్పరితనంతో వ్యవహ రించండి. దూర బంధువులను ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు దొరకగలవు. ఒకటి రెండు అనవసర ఖర్చులు పైనబడ గలవు. అనుకున్న పనులు, చేపట్టిన వ్యవహారాలను సక్రమ రీతిలో నిర్వహించలేకపోవచ్చును. అవసరాలకు ఋణాలు చేయవలసి వస్తుంది.

 

9Sagittariusధనుస్సు

గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. కోర్టు వ్యవహారాలు టెన్షన్‌ కలిగిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కలుగవచ్చును. విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో ఆందోళనగా ఉంటారు. శుభకార్య ప్రయ త్నాలు, ఉద్యోగము కొరకు ప్రయత్నాలలో వెనుక బడతారు. తొందరపాటు వ్యవహారాలతో ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన తీరుగా ఉండవు.

 

10Capricornమకరం

విద్యార్థులకు ఉన్నత అవకాశాలు దొరకడం, విలు వైన సామాగ్రిని కొనడం, అనుకోని దూర ప్రయాణా లుంటాయి. సభలు, సమావేశాలలో ప్రముఖంగా వ్యవహ రిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పాత కేసులు, కోర్టు వ్యవహారాలలో ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారములలో అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి.

 

11Aquariusకుంభం

ఆదాయం సామాన్యం. ముఖ్య వ్యక్తులను కలువ లేకపోవచ్చును. దూర ప్రయాణాలుంటాయి. కొత్త కాంట్రాక్టులు, కొత్త ఏజన్సీలకు ప్రయత్నాలు చేయండి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. జరిగిపోయిన విష యాలు గుర్తు చేసి ఇతరులను బాధపెట్టవద్దు. రావలసిన బాకీలు వసూలు కాగలవు. కుటుంబసభ్యులలో సరైన అవగాహన లేక అభిప్రాయబేధాలు ఏర్పడవచ్చును.

 

12Piscesమీనం

విద్యార్థులకు మంచి అవకాశాలు దొరకడం, అను కూలమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు అధికారు లతో సన్నిహితత్వముంటుంది. అనుకున్న పనులు జరు గుతాయి. ఆశించినంత ఆదాయముండదు. వృత్తి వ్యాపా రాలలో శ్రమకు తగ్గ రాబడి ఉండదు. ఉద్యోగ ప్రయ త్నాలలో అవకాశాలు లభించగలవు.

rasi 25

1Ariesమేషం

చేయదలచుకున్న పనులు సమర్ధవంతంగా చేస్తారు. పెండింగ్‌లో పడిన పనులు మరలా ప్రారంభం కాగలవు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుని ఆర్ధికంగా స్థిమితం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నిర్మాణాలు కొన సాగుతాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాలు లభిస్తాయి. రావలసిన బాకీలపై వత్తిడి పెంచుతారు. బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలుంటాయి.

 

2Taurusవృషభం

వృత్తి వ్యాపారాలు లాభాలను సమకూరుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ముఖ్య పత్రాలు అందుకుంటారు. పన్నుల చెల్లింపులు జరుగుతాయి. దూరప్రయాణాలుంటాయి. కుటుంబవ్యక్తుల సమస్యలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడు తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. కొత్త కాంట్రాక్టులు, ఏజెన్సీలు లభించగలవు.

 

3Geminiమిధునం

ఆర్ధికపరంగా చిక్కులుంటాయి. అయితే డబ్బుకు అంతగా ఇబ్బంది ఉండదు. పెండింగ్‌లో సమస్య పోయి మీకు అనుకూలత బాగుంటుంది. వ్యాపారవర్గాలకు ఆశించిన అభివృద్ధి ఉండదు. ఆదాయం సామాన్యం. వృత్తి జీవనం కలవారికి రాబడి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేయండి. విమర్శలను లెక్కచేయకండి.

 

4Cancerకర్కాటకం

తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనండి. స్థిరాస్తులపై ఆదాయముంటుంది. వృత్తి వ్యాపార విషయంలో అభివృద్ధి, ఆదాయము బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారులతోను, ప్రజలతోను జాగ్రత్తగా మెలగండి. అనుకున్న పనులు జరుగుతున్నా వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు తప్పవు.

 

5Leoసింహం

వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి అవకాశం బాగుంది. ఆదాయం సంతృప్తికరం. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. మాట హామీలు, రుణాలు ఇవ్వవద్దు. మిమ్మల్ని విమర్శించేవారుంటారు. కాబట్టి పొరపాట్లను సరిదిద్దుకొనండి. పెట్టుబడులకు అవకాశాలు, ఉద్యో గార్థులకు అవకాశాలు బాగుంటాయి. రావలసిన బాకీలు నిలబడిపోవచ్చును. ఆరోగ్యం బాగుంటుంది.

 

6Virgoకన్య

ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాలు లభిస్తాయి. బంధు ముఖ్యులకు అనారోగ్య వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలను బాగా వృద్ధి చేస్తారు. ఆదాయం బాగుం టుంది. బంధుమిత్రులు సహాయం అర్ధించవచ్చును. ముఖ్యమైన పత్రాలు, రావలసిన బాకీలు అందుతాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరుగగలవు. ఉద్యోగావకాశాలు బాగుంటాయి. అనవసర విషయాలలో జోక్యం వద్దు.

 

7Libraతుల

ఆర్థిక వ్యవహారాలలో చిన్న ఇబ్బందులుంటాయి. అందుకని చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టండి. వ్యాపార వృద్ధి అవకాశాలు అందుబాటు కాకపోవచ్చును. సామాన్య, ఆదాయముంటుంది. చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. స్థిరాస్తులపై కొంత రాబడి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం, వత్తిడి ఉంటుంది. ఉద్యోగార్థులు దీక్షతో ప్రయత్నాలు చేయండి.

 

8Scorpioవృశ్చికం

ఏదో ఒకరూపంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తిజీవన సంపాదన బాగుంటుంది. వ్యాపారవర్గాలు అభివృద్ధికై శ్రమపడాలి. ఆదాయం సామాన్యం. వ్యాపకం పెరిగి అనేకపనులతో ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం తగ్గి విభేదాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. ప్రముఖు లను ఆత్మీయులను కలుసుకుంటారు.

 

9Sagittariusధనుస్సు

చిన్న వృత్తులు, వ్యాపారాలు జరుపుకునేవారికి ఆదాయం బాగుంటుంది. ఇతరులను బాధపెట్టే మాటలు, పనులకు పూనుకొనవద్దు. విలువైన వస్తువులు, కాగితాలు జాగ్రత్త. ప్రభుత్వపరంగా పనులు, అంద వలసిన ఆదాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరిగి, ఆదాయానికి తగిన ఖర్చులుం టాయి. చేపట్టిన పనులకు మధ్య ఆటంకాలుంటాయి.

 

10Capricornమకరం

ప్రవర్తన, మాటలలో దుడుకుతనం తగ్గించుకొనాలి. చేస్తున్న మీ పనుల ప్రయత్నాలు వత్తిడితో జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆదాయం పెరగడం ఉంటుంది. ఉద్యోగులు అధికారులతో సఖ్యతగా ఉం టారు. స్థిరాస్తుల లావాదేవీలకు అవకాశాలుంటాయి. ఉద్యోగార్థులకు అవకాశాలు లభించగలవు. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

11Aquariusకుంభం

లౌకిక వ్యవహారాలను, ఇంటి వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. ఆర్ధికస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం బాగుం టుంది. అయినా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఆర్థిక ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పారిశ్రామిక, కాం ట్రాక్ట్‌ రంగాల వారికి ప్రోత్సాహం, అవకాశాలు బాగుం టాయి. షేర్లలో లాభాలు ఉంటాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులు వేగవంతంగా సాగుతాయి. కొత్త పెట్టుబడులకు, వ్యాపారవృద్ధికి అవకాశాలు బాగుం టాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. బంధువర్గాన్ని కలుసుకుంటారు. వస్తు లాభము, రావలసిన బాకీలు లభించుట, ప్రభుత్వ కార్యాలయాలందు పనులు అను కూలమగును. విద్యార్థులకు మంచి విద్యావకాశాలు దొరుకుట, కుటుంబసౌఖ్యము బాగుండును.

rasi 18

1Ariesమేషం

ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్త వహించండి. యజ మానులకు వర్కర్లతో ఇబ్బందులుంటాయి. షేర్లు, పెట్టు బడులు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం, ఆర్ధి కావకాశాలు తగ్గిపోవడం ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వస్తువులు, డబ్బు జాగ్రత్తగా పెట్టుకొ నండి. ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి.

 

2Taurusవృషభం

శుభవార్తలు వింటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు ఆలస్యం కాగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది. గృహ వస్తు వాహన రిపేర్లు ఖర్చులు, ప్రయాణ ఖర్చులు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. విద్యా ప్రగతి బాగుం టుంది. చేసే కృషికి తగ్గట్లుగా ఆర్ధికస్థితి ఉండదు. ఖర్చులు బాగా పెరిగిపోతాయి.

 

3Geminiమిధునం

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. శరీరానికి గాయాలు తగలవచ్చును. కోర్టు వ్యవహారాలలో అనుకూలత, రావల సిన బాకీలు కొంతవరకు లభించడం జరుగుతుంది. వస్తు వాహన గృహ రిపేర్ల ఖర్చులుంటాయి. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలుంటాయి. కుటుంబసౌఖ్యం, విద్యార్థులకు విద్యావృద్ధి బాగుంటుంది. ఆర్ధిక వ్యవహా రాలను సమర్ధవంతంగా జరుపుతారు.

 

4Cancerకర్కాటకం

అవసరాలకు ఋణం చేయడం, బంధువులతో సత్సంబంధాలు గట్టి పరచుకోవడం ఉంటుంది. శుభ వార్తలు వింటారు. షేర్లు పెట్టుబడుల మీద లాభాలుం టాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉపాధి పధకాలలో నిద్రొక్కుకుంటారు. కళా క్రీడా శాస్త్ర వైద్య రంగాలవారికి పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉం టాయి. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి.

 

5Leoసింహం

అధికారవర్గ అనుకూలత ఉంటుంది. కోర్టు వ్యవ హారాలు పరిష్కారానికి రాగలవు. శుభకార్య ప్రయత్నాలు, అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. కొత్త వస్తువులు సమకూరుతాయి. కుటుంబంలో చిన్నచిన్న విషయాల వల్ల అభిప్రాయభేదాలుంటాయి. కాబట్టి సర్దుకొని పోవాలి. బిడ్డల వల్ల ఖర్చులు, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

 

6Virgoకన్య

రావలసిన బాకీలు లభించడం, స్థిరాస్తుల లావా దేవీలు జరుగగలవు. హామీలు ఇవ్వడం, రిస్క్‌ తీసికొనడం చేయవద్దు. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభించగలవు. ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. కాని మనస్సుకు కొరతగా అనిపిస్తుంది. కొత్త పెట్టుబడులకు, భాగస్వామ్య పెట్టుబడులకు అవకాశా లుంటాయి. పనులందు టెన్షన్‌ ఎక్కువ ఉంటుంది.

 

7Libraతుల

ఆర్ధికంగా పెరుగుదలకు చేసే పనులన్ని కలిసి వస్తాయి. ఆదాయము పెరుగుతుంది. సోదరవర్గానికి అభివృద్ధి ఉంటుంది. పన్నులు, బాకీలు చెల్లిస్తారు. షేర్లు, పెట్టుబడుల మీద లాభాలుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ప్రభుత్వ సహకారం ఉంటుంది. కొత్త పథకాలు ప్రణాళికలు అమలు చేస్తారు. ఆకర్షణలకు వత్తిడులకు లొంగవద్దు. దూర ప్రయాణాలుంటాయి.

 

8Scorpioవృశ్చికం

బంధు ముఖ్యులతో మాట పట్టింపు విరోధాలుం టాయి. జీవిత సహచరులకు ఆరోగ్య లోపం ఉండవ చ్చును. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికా రుల వల్ల ఇబ్బందులు కలుగవచ్చును. గృహ వస్తు రిపే ర్లుండవచ్చును. శ్రమతో అనుకున్న పనులు జరుపు కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక నిర్ణయాలలో పొరపాట్లు రాకుండా జాగ్రత్తపడండి.

 

9Sagittariusధనుస్సు

శుభకార్యాలు నిర్ణయం కావచ్చును. దైవ సేవలు, సభలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు అగ్రిమెంట్లు, లీజులకు అవకాశాలు రాగలవు. కుటుంబ సమస్యలను రాజీ మార్గంలో సర్దుబాటు చేయగలరు. వాణిజ్య వృద్ధికి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఆదాయం బాగుం టుంది. అనుకున్న పనులు నెరవేర్చుకొంటారు. రావలసిన బాకీలు కొంత చేతికందడం జరుగుతుంది.

 

10Capricornమకరం

కళాక్రీడా మార్కెటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. గృహోపకరణాలు విలువైన వస్తు వులు చేకూరుతాయి. దైవకార్యాలలో పాల్గొనడం, సహాయపడడం జరుగుతుంది. దూర ప్రయాణాలుం టాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగార్ధులకు ప్రయ త్నాలు ఫలించవచ్చును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి.

 

11Aquariusకుంభం

ఆర్ధిక వ్యవహారాలను సొంతంగా అజమాయిషీ చేస్తారు. పెట్టుబడులకు అవకాశాలు, షేర్ల మీద లాభా లుంటాయి. కొత్త వారితో పరిచయాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల క్రయవిక్రయ ప్రయ త్నాలు జరుగుతాయి. ప్రభుత్వ అనుమతులు లభించ గలవు. ఉద్యోగ బాధ్యతలు పెరిగి విశ్రాంతి తగ్గుతుంది. ఉద్యోగార్ధులకు ఇంటర్వ్యూ అవకాశాలు లభిస్తాయి.

 

12Piscesమీనం

కొన్ని అదనపు ఖర్చులు నుండి తప్పించుకొనలేరు. దైవ సేవ, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చేపట్టినవి నిదానంగా జరుగుతాయి. ప్రభుత్వ అనుమ తులలో జాప్యం జరుగుతుంది. కుటుంబసౌఖ్యం బాగుం టుంది. శుభవార్తలు వింటారు. బంధు ముఖ్యులను ఆత్మీయులను కలుసుకొంటారు. నిరుద్యోగులకు అవకా శాలు, ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

Page 2 of 65

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter