rasi 02

1Ariesమేషం

నిలబడిపోయిన సమస్యలు కొన్ని పరిష్కారమై, చేస్తున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ వల్ల కొన్ని ఇబ్బందులు కుటుంబసభ్యులకు కలుగవచ్చును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండి ఆశించిన ఆదాయము తగ్గుతుంది. శుభకార్య ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలలో అను కూలత ఉంది. కుటుంబసౌఖ్యం బాగున్నది.

 

2Taurusవృషభం

రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. వ్యవహారాలలో తొందర పాటు, కటువుగా మాటలు లేకుండా చూచు కొనాలి. ఉదరకోశ సంబంధ రుగ్మతులుంటాయి. దూర ప్రయా ణాలు నిర్ణయం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల వృద్ధి, ఆదాయవృద్ధి ఉంటుంది. పనులు సానుకూలంగా సాగు తాయి. బంధు సఖ్యత బాగుంటుంది.

 

3Geminiమిధునం

డబ్బుకు ఇబ్బందులు లేకపోయినా, ఖర్చులు పెరిగి పోతాయి. రావలసిన బాకీలు, కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చు లుంటాయి. స్థిరాస్తుల లావాదేవీలను వాయిదా వేసు కొనడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు దృష్టి పెట్టండి ప్రయత్నాల మీద. సాంస్కృతిక సేవా కార్యక్ర మాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.

 

4Cancerకర్కాటకం

వృత్తి జీవనం కలవారికి ఆదాయవృద్ధి, వ్యాపార వర్గాలకు కొత్త ఆర్ధికావకాశాలు లభిస్తాయి. పెండింగ్‌లోని సమస్యలు పరిష్కారానికి రాగలవు. స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, పనిభార ముంటుంది. బిడ్డలకు ఉద్యోగావకాశాలు దొరకడం, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. నిత్య కృత్యాలైన పనులు టెన్షన్‌ పెడతాయి.

 

5Leoసింహం

వృత్తి వ్యాపార రంగాలు సామాన్యంగా జరుగు తాయి. పెద్ద అభివృద్ధి ఉండదు. అయితే డబ్బుకు ఇబ్బందులుండవు. బంధువర్గంతోను, మిత్రులతోను మనస్ఫర్ధలు రాకుండా చూచుకొనాలి. వ్యవహారాలలో మీ సమర్ధతకు గుర్తింపు ఆలస్యం కాగలదు. కొన్ని అదనపు ఖర్చులుంటాయి. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. విద్యావృద్ధి బాగున్నది.

 

6Virgoకన్య

ఆలోచనలు కార్యరూపం దాల్చి బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి మీకు మేలు జరుగుతుంది. ఆర్ధికంగా బాగుండి పెట్టు బడికి అవకాశాలు, కొత్త వ్యాపారావకాశాలుండగలవు. వృత్తులలో గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. రావలసిన బాకీలు లభించగలవు. నిలబడిపోయిన సమస్యలు, ఇబ్బందులు సర్దుబాటు కాగలవు.

 

7Libraతుల

ఆర్ధికంగా స్థిమితపడగలరు. వ్యాపార రంగంలో గాని, వృత్తిపరంగాగాని ముందంజ వేస్తారు. రావలసిన బాకీలు కొంతవరకు అందుతాయి. ముఖ్యఅవసరాలు జరిగిపోతూ మానసిక ఆనందం పొందుతారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు బాధ్యతల నిర్వ హణలో సంతృప్తి చెందుతారు. అనుకున్న పనులు కొద్ది టెన్షన్‌ పెట్టినా అనుకూలంగా జరుగుతాయి.

 

8Scorpioవృశ్చికం

తొందరపాటు నిర్ణయాలు, చర్యలు తగ్గించు కొనండి. బంధుమిత్రులకు సహాయ పడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇవ్వగలదు. అదనంగా ఖర్చులు పైనబడినా ఇబ్బందులుండవు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ప్రగతి బాగుండి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో కొద్దిపాటి అభిప్రాయభేదాలుండి సర్దుబాటు కాగలవు. విద్యార్థులు మరింత కృషి చేయాలి.

 

9Sagittariusధనుస్సు

వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంట బయట వ్యవహారాలలోను, ఆర్ధిక వ్యవహారాల లోను విశ్రాంతి లేక బిజీగా ఉంటారు. బిడ్డలకు అనా రోగ్య బాధలుంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ముమ్మ రంగా ఉంటారు. పనులు నెరవేరడానికి బాగా శ్రమ పడవలెను. అనవసర విషయాలను వదలివేయండి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

10Capricornమకరం

చేపట్టిన పనుల వల్ల బాగా టెన్షన్‌ పడతారు. పనులు నిదానంగా జరుగుతాయి. ఆర్ధికంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. అత్యవసర ప్రయాణాలుం టాయి. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సంతృప్తి ఉం టుంది. సహచరులతో, క్రింది ఉద్యోగులతో జాగ్రత్తగా మెలగాలి. ఆత్మీయులను కలుసుకొంటారు.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపార రంగములందు సామాన్య ప్రగతి ఆదాయము ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు విం టారు. పెండింగ్‌లోనున్న వ్యవహారాలలో మార్పుండదు. అవసరాలకు డబ్బు, రావలసిన బాకీలు కొంత అందు తాయి. ఉద్యోగులు తమ అధికారులతో, జనంతో జాగ్ర త్తగా మెలగండి. ఖర్చులు కొంత అదనం కాగలవు.

 

12Piscesమీనం

ఏ పనులనైనా ముందుచూపుతో, ప్రణాళికాబద్ధంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంటుంది. ఆర్ధికస్థితి బాగుండి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు బాధ్య తలు ఎక్కువై, గృహ వస్తువాహన రిపేర్లుంటాయి. శుభ కార్య ప్రయత్నాలు ఫలించగలవు. కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం.

rasi 05

1Ariesమేషం

ఉద్యోగులకు పనిభారం, అధికారుల ఒత్తిడి ఉంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. సత్కారాలు పొందే అవకాశమున్నది. విద్యా ప్రగతి బాగుంటుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు తాత్కాలికంగా వదలండి.

 

2Taurusవృషభం

దూరప్రయాణాల శ్రమ, సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరించడం ఉంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్ధికంగా కుదుటపడతారు. విద్యాప్రగతి కలదు. ప్రభుత్వ అనుమ తులు పొందుతారు. కొత్త కాంట్రాక్టులు లభించగలవు. పనులు హడావిడిగా సాగుతాయి. కోర్టు కేసులు వాయిదా పడగలవు. అధికారులకు స్థాన చలనం ఉంటుంది.

 

3Geminiమిధునం

దూర ప్రయాణాలు నిర్ణయం కాగలవు. సోదర వర్గంతో చిన్న సమస్యలుండవచ్చును. ఉద్యోగావకాశాలు లభించగలవు. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి గుర్తింపు గౌరవాలుంటాయి. అనుకున్న పనులకు ఇతరుల సహకారం లభిస్తుంది. ఆర్ధిక స్థితి బాగుం టుంది. వ్యాపార విస్తరణ, కొత్త ఆదాయ అవకాశాలు దొరుకుతాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు విధి నిర్వహణ బాగుంటుంది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బిడ్డల విద్య, ఉద్యోగ విష యాలపై, పెండ్లి విషయాలపై ఆందోళన ఉంటుంది. బంధువులతోను, కుటుంబసభ్యులతోను వ్యవహారాలలో రాజీపడతారు. వృత్తి జీవనం కలవారికి ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చేయదలచిన ఆలోచనలు కార్యరూపంలోనికి వస్తాయి.

 

5Leoసింహం

ఉద్యోగులు విధి నిర్వహణలో పబ్లిక్‌తోను, అధికారు లతోను జాగ్రత్తగా మెలగండి. విద్యార్థులకు శ్రమ, వత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు సరిగా జరగక చికాకు, టెన్షన్‌ ఉంటుంది. స్థిరాస్తుల వ్యవహారాలు, కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆర్ధిక విషయాలలో జాగ్ర త్తగా వ్యవహరించండి. నిర్ణయాలు సొంతంగా తీసు కొంటే మంచిది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు.

 

6Virgoకన్య

ఆరోగ్యం మీకు బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు, రావలసిన బాకీలు వాయిదా పడగలవు. శుభకార్యాల ప్రయత్నాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్య బాధలుండవచ్చును. విద్యా ప్రగతి బాగుం టుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుం టుంది. ఆడిటర్లు, పరిశ్రమ యజమానులకు, న్యాయ వాదులకు, చిన్న పరిశ్రమలకు ఆదాయం బాగుంటుంది.

 

7Libraతుల

సభలు సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్య నిర్ణయం కాగలవు. ఉద్యోగార్ధులు కొద్దికాలం వేచి ఉం డాలి. బంధుమిత్రులను, ప్రముఖులను కలుసుకొంటారు. ఆస్తి, ఋణ వ్యవహారాలు రాజీకి వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు అదనంగా ఉంటాయి. విద్యార్థులు బాగా శ్రమించాలి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉం టాయి. ఆదాయానికి ధీటుగా ఖర్చులుంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగార్ధులకు అనుకూలత బాగుంటుంది. విద్యా ప్రగతి, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. గృహోపకర ణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగు తుంది. పెట్టుబడులపై లాభాలుంటాయి. ఆరోగ్యం ఫరవా లేదు. కొత్త పరిచయాలు జరిగి ప్రయోజనం పొందు తారు. కోర్టు కేసులు కొంత సానుకూలం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. సభలు సమావేశాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలుంటాయి. స్థిరాస్తుల వివాద పరిష్కారాలు జరుగగలవు. విలువైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఉద్యోగులు వత్తిళ్ళకు లొంగి ఇబ్బంది పడకండి. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. కుటుంబంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలుండి సర్దుబాటు కాగలవు. ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

ఉద్యోగులకు అధికారవర్గంతో సత్సంబంధాలుం టాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసికొనవద్దు. దూర ప్రయాణాలు అవసరం ఉంటుంది. సభలు సన్మా నాలలో పాల్గొంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అవసరాలకు ఇతరులను బట్టి సర్దుకొని పోతూ పనులు జరుపకొనవలసి ఉంటుంది. చిరు వ్యాపా రులు, వృత్తి జీవనం కలవారికి ఆర్ధికస్థితి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

అనుకున్న పనులు సరిగా జరగక టెన్షన్‌ పడుతుం టారు. మాటల తీవ్రత, తొందరపాటు ఎక్కువగా ఉం టుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు అవకాశాలు ఉండగలవు. కుటుంబంలో సమస్యలుంటే చర్చించి పరిష్కరించ గలరు. ఆర్ధిక ఇబ్బంది లేకున్నను సంతృప్తి ఉండదు.

 

12Piscesమీనం

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఒత్తిడులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలందు ఫలితం లభించగలదు. దూర ప్రయాణాలుండుట, సత్కారాలు పొందడం, సభలు సమావేశాలలో పాల్గొనడం, విద్యార్థులకు విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. అనుకున్న పనులు సక్రమంగా జరుపకొనగలిగిన సమర్ధత ఉంటుంది. ఆర్ధిక స్థితి బాగుంటుంది. రావలసిన బాకీలు కొంత లభిస్తాయి.

rasi 27

1Ariesమేషం

విద్యాప్రగతి బాగుంటుంది. పెద్దలతో, ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిభారం, వత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడటం మంచిది. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులను అధిగమించి, ఆదాయం పెరుగుదలకు కృషి చేస్తారు.

 

2Taurusవృషభం

తలపెట్టిన పనులు సవ్యంగా జరిగినా నిదానంగా జరుగుతాయి. విద్యాప్రగతి బాగుంటుంది. వ్యవహారాలు ఇతరుల సలహాలు తీసుకొని సొంతంగా నిర్వహించడం మంచిది. ఆదాయం సామాన్యం. వృత్తివ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఆర్ధికాభివృద్ధి అవకాశాలు చేజారిపోవచ్చును. కుటుంబంలో చిన్నచిన్న భేదాభి ప్రాయాలు, బంధువర్గంతో కొద్దిపాటి విభేదాలుండగలవు.

 

3Geminiమిధునం

నిర్మాణాలు చేపట్టిన వారు త్వరగా జరుపుతారు. యజమానులకు వర్కర్లతో ఇబ్బందులుంటాయి. కొత్త పెట్టుబడులకు అవకాశాలు లభిస్తాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఉద్యోగులు సమర్ధవంతంగా విధి నిర్వహణ జరుపుతారు. ఆరోగ్యం ఫరవాలేదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. చేపట్టిన పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. బాకీలు కొంతవరకు అందుతాయి.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. దైవ ఆథ్యాత్మిక కార్యములందు పాల్గొంటారు. అప్పులివ్వడం, హామీలివ్వడంలో తొందర వద్దు. అలర్జీ లాంటి అనారోగ్యాలుంటాయి. వృత్తి జీవనము కలవారికి, వ్యాపారవర్గాలకు ఆర్ధికంగా, అన్ని విధములా బాగుంటుంది.

 

5Leoసింహం

ఉద్యోగవర్గాలకు సమర్ధత బాగుండి అధికారుల నుండి ప్రోత్సాహం పొందుతారు. నిరుద్యోగులకు అవ కాశాలు లభించడం, ఆలోచనలలో తేడాలుంటాయి. పర్వదినాలు, దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కాంట్రాక్టర్లకు, గృహ నిర్మాణ దారులకు పనులు నిదానం కాగలవు. వ్యాపారాలలో కొత్త అవకాశాలు, పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

6Virgoకన్య

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యో గులకు విధి నిర్వహణలో సామర్ధ్యం బాగుంటుంది. కొత్త గృహోపకరణాలు, విలువైన వస్తువులు కొనడం జరుగు తుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభిస్తాయి. అనుకున్న పనులు నెర వేరడానికి పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగుంటుంది.

 

7Libraతుల

ఉద్యోగులకు పనిభారం, అధికార వర్గం నుండి వత్తిడులుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు వింటారు. వేడుకలలో పాల్గొనడం, దూరప్రయాణాలుంటాయి. అదనపు ఖర్చులు ఎక్కువుగా వుంటాయి. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో వృద్ధి ఉండదు. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేసుకోండి.

 

8Scorpioవృశ్చికం

కుటుంబంలో విభిన్నాభిప్రాయాలుంటాయి. సర్దు బాటు చేసుకొనాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవ సరం. విద్యార్థులకు ఇతర వ్యాపకములుంటాయి. పెద్ద లతో పరిచయాలు కలుగగలవు. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. వృత్తి జీవనం సుమారుగా జరిగినా వ్యాపారవర్గాల వారికి నిరాశే ఉంటుంది. ఆదాయం సామాన్యం.

 

9Sagittariusధనుస్సు

ప్రభుత్వ అనుమతులు పొందడం, కొత్త కాంట్రా క్టులు దొరకడం జరుగుతుంది. నూతన వస్తువులు సమ కూర్చుకొనడం, బంధుమిత్రులను కలుసుకొనడం జరుగుతుంది. విద్యాప్రగతి బాగుంది. ఆదాయం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపార భాగస్వామ్యాలకు పెట్టుబడులకు అవకాశాలు లభించగలవు. ఆరోగ్యం సరిగా ఉండక బాధపడతారు.

 

10Capricornమకరం

కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులకు సమర్ధత గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగార్ధులకు అవకాశా లుంటాయి. కొత్త వస్తువులు సమకూర్చుకొంటారు. పనులు చేసేటప్పుడు టెన్షన్‌ ఎక్కువుగా ఉంటుంది. దైవ కార్యాలు వేడుకలందు పాల్గొంటారు. స్వల్ప అనా రోగ్య బాధలుంటాయి. ఈ రాశి వారికి ఆర్ధికంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు.

 

11Aquariusకుంభం

కాంట్రాక్టర్లు, నిర్మాణాలు జరిపేవారికి వర్కర్లతో సమస్యలుంటాయి. ఆర్ధికంగా వత్తిడులుంటాయి. చెల్లిం పులు, అవసరాలను వాయిదా వేసికొనవలసి వస్తుంది. ముఖ్యవస్తువులు జాగ్రత్త చేసికొనండి. అధికారులతో, పబ్లిక్‌తో జాగ్రత్తగా మెలగండి. విద్యాప్రగతి బాగుం టుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపార వర్గాలకు శ్రమకు తగ్గ ఫలితాలుండవు.

 

12Piscesమీనం

కుటుంబంలో బేధాభిప్రాయాలను సర్దుబాటు చేసు కొంటారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిర్మాణాలు నిదానంగా జరుగుతాయి. వేడుకలందు పాల్గొంటారు. అనవసరపు ఖర్చులుంటాయి. సమర్ధత బాగుండినా అనుకున్న పనులు సరిగా జరగవు. వృత్తి జీవనం గలవారికి ఆదాయం తృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కావచ్చును.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter