rasi 23

1Ariesమేషం

ఇతరుల నుండి అనుకున్న సహాయాన్ని పొందలేక పోవచ్చును. దూర ప్రయాణాలు వాయిదా పడటం, శుభకార్య ప్రయత్నాలకు ఆటంకాలుండటం జరుగు తుంది. చిన్న వ్యాపారాలకు ఆదాయం ఫరవాలేదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఖర్చులు పెరుగుతాయి.

 

2Taurusవృషభం

గృహ నిర్మాణదారులకు, కాంట్రాక్టర్లకు బాగుం టుంది. భూ లావాదేవీలు ఫలించగలవు. సభలు సమా వేశాలలో గుర్తింపు గౌరవం బాగుంటుంది. కోర్టు కేసులందు అనుకూలత, విద్యార్థులకు మంచి ప్రగతి, జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి పరంగా జీవనం కలవారికి ఆర్ధికస్థితి కొంత బాగుంటుంది. వ్యాపార వర్గాలకు మంచి అభివృద్ధి ఆదాయముంటుంది.

 

3Geminiమిధునం

వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసికొంటారు. ఉద్యోగార్ధులకు మేలైన అవకాశాలుండకపోవచ్చును. కుటుంబసౌఖ్యం బంధు సఖ్యత బాగుంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార భాగ స్వామ్యాలకు అవకాశాలు లభించగలవు. అవసరాలకు మాట రూపేణ, డబ్బు రూపేణ సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ప్రయాణాలుంటాయి.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు రావలసిన బాకీలు లభించడం, పని భారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు జరపకుండా జాగ్రత్తపడాలి. బిడ్డల విద్యా శుభకార్య విషయాలందు శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనండి. రావలసిన బాకీలు కొంత అందుతాయి. ఆర్ధికంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి.

 

5Leoసింహం

పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయపడతారు. ప్రముఖులతో పరిచయాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యావృద్ధి కలదు. ఆదాయం పెరిగి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

6Virgoకన్య

కోర్టు వ్యవహారాలలో అనుకూలత తక్కువ. పట్టు దలతో అనుకున్న పనులు సాధించుకొంటారు. అనుకోని ఖర్చులు పైనబడగలవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. స్థిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టుబడులు జరుపుతారు. చిన్న వ్యాపారాలు, వృత్తి జీవనం కలవారికి ఆర్ధికంగా బాగుంటుంది.

 

7Libraతుల

ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసి కొనండి. గృహ వస్తు వాహన రిపేర్లు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. ఉద్యోగులకు విధి నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్య పనులు వాయిదా వేసుకొంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య అవకాశాలు, ఆదాయం ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఉద్యోగ సౌఖ్యం, కొత్త ఉద్యోగావకాశాలు దొరకడం జరుగవచ్చును. కొత్త పరిచయాలు, దైవ కార్యాలలో పాల్గొనడం, దూరప్రయాణాలు వాయిదా పడటం జరుగు తుంది. పరుష ప్రవర్తన, తొందరపాటు మాటలు తగ్గించు కొనాలి. విద్యా ప్రగతి బాగుంటుంది. స్థిరాస్తుల లావా దేవీలు జరుపుతారు. సమస్యాత్మక విషయాలలో సంప్ర దింపులు, చర్చలు జరిపి పరిష్కారం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు స్థాన మార్పులు, పని భారం బాగుం టుంది. యజమానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగండి. శరీరానికి గాయాలు తగలవచ్చును. కొంతమంది మిమ్మల్ని పరోక్షంగా కించపరచవచ్చును. విద్యా ప్రగతి బాగుంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులను అధిగ మించి, రాబడి పెరుగుతుంది. వృత్తి జీవనంలో సామాన్య అవకాశాలుంటాయి. బిడ్డలకు అభివృద్ధి బాగుంది.

 

10Capricornమకరం

సమస్యలు సక్రమంగా సర్దుబాటు కాగలవు. పారి శ్రామిక వర్గాలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కలదు. ఆస్థుల లావాదేవీలు వాయిదా పడతాయి. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆశించినంత ఎక్కువ ఆదాయముండదు. బ్యాంకు ఋణాలు లభించడంలో కాలయాపన జరుగవచ్చును.

 

11Aquariusకుంభం

ఉద్యోగులు తమ విధి నిర్వహణ సమర్ధవంతంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకు తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా బాగుంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండి సర్ధుబాటు కాగలవు. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులను జాగ్రత్తగా నెరవేర్చుకుంటారు. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉమ్మడి వ్యాపారాలకు లీజులకు అవకాశాలు దొరుకు తాయి. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి ఆదరణ ఉంటుంది. బంధువర్గాన్ని కలుసుకొంటారు. ప్రయాణా లుంటాయి. పైకి తీవ్రత లేకపోయినా ఆర్ధికంగా ఇబ్బందు లుంటాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభిస్తాయి.

ugadiజ్యోతిశ్శాస్త్రమునందు లోక వ్యవహారము కొరకు మన దేశమున చంద్ర సూర్య బృహస్పతి మానవులను మూడుగా ప్రధానముగా విభజించారు. తిరుమలగిరికి దక్షిణ ప్రాంతము సౌరమానమని, తిరుమల గిరి- వింధ్య పర్వతముల మధ్య ప్రాంతమును చాంద్ర మానమని, వింధ్య పర్వతములకు ఉత్తర ప్రాంతము బార్హస్పత్యమానమని ప్రచారములోనున్నది. చాంద్ర, సౌరమానముల వారికి విళంబి నామ సంవత్సరము జరుగుతుంది. బార్హస్పత్యమానము వారికి విరోధికృత్‌ నామ సంవత్సరము జరుగుతుంది.

ప్రభవాది అరవై సంవత్సరములలో 32వది విళంబి నామ సంవత్సరము. యుగమనగా సంవత్స రము(కాలము). యుగము యొక్క ఆది అనగా ప్రారంభము 'యుగాది' అయినది. వ్యవహారములో 'ఉగాది'గా పిలవబడుతున్నది. ఉగాదినాడు వారి వారి వర్ణాచారముల ప్రకారము మంగళస్నానము చేసి, దైవాన్ని చిత్తశుద్ధితో ఆరాధించి, షడ్రుచులు కల వేప ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ విషయాన్ని తెలుసు కొనవలసి ఉంటుంది. పంచాంగ ఎందుకు వినటం.. తెలిసికొనడం జరగాలంటే..

శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం

దుస్స్వప్నదోషాపహం

గంగాస్నాన వివేష పుణ్యఫలదం

గోదాన తుల్యం నృణాం

ఆయుర్వుృద్ధిద ముత్తమం శుభకరం

సంతాన సంపత్ప్రదమ్‌

నానాకర్మ సుసాధనం సముచితాం

పంచాంగ మాకర్ణ్యతాం.

విళంబి సంవత్సర ఫలితము :

విషమ బుద్ధులు, దుష్ట ప్రవర్తనలు దేశమంతటా విస్తరించును. ఉపద్రవములు, ప్రాణనష్టము ఎక్కువగా నుండును. సస్యరక్షణలో ధాన్యరక్షణలో ఇబ్బందులుండును. జనంలో రోగబాధితుల సంఖ్య పెరుగుతుంది. ధరలు సూచీ పెరుగును. జీవనం కొరకు జనులు విదేశ, దేశములందు సంచరించెదరు. ప్రభుత్వముల మధ్య వైషమ్యములు పెరుగును. సంపద దోపిడీ పెరుగును. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందును.

బార్హస్పత్యమాన విరోధికృత్‌ సంవత్సర ఫలితములు:

ప్రజావైరుధ్యము పెరుగును. అతివృష్టి బాధలు, వాహన ప్రమాదములుండను. పంటలు సుమారుగా పండును. కేంద్రప్రభుత్వముపై ప్రజల ఆదరణ తగ్గును. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందును. ఎండల తీవ్రత పెరుగును.

నవనాయక ఫలితములు :

ప్రతి సంవత్సరము నవనాయకులని, 21 మంది ఉపనాయకులను పిలవబడుతూ గ్రహములు కాలానికి శుభాశుభ పలితములనిస్తాయి. చైత్ర శుక్ల పాఢ్యమి వారాధిపతి రాజు, రవి మేషరాశి ప్రవేశ వారాధిపతి మంత్రి, రవి సింహరాశి ప్రవేశ వారాధిపతి సేనాధిపతి, రవి కర్కాటక సంక్రమణ ప్రవేశ వారాధిపతి సస్యాధి పతి, ధనుర్మాస ప్రవేశ వారాధిపతి ధాన్యాధిపతి, మిధున సంక్రమణ ప్రవేశ వారాధిపతి అర్ఘాధిపతి, ఆర్ద్రకార్తె ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి, తులా ప్రవేశ సమ యమ వారాధిపతి రసాధిపతి, మకర ప్రవేశ వారాధిపతి నీరసాధిపతి అని నవనాయకులు. సహాయకులైన 21 మంది ఉపనాయకులని పిలవబడుతారు. ముందుగా ఫలితాలు చూస్తూ ఈ విధంగా ఉన్నాయి.

రాజు-రవి :

ప్రభువులకు పరస్పర విరోధము, అల్పవృద్ధి, ప్రజలకు ప్రభుత్వ వ్యక్తుల వల్ల శస్త్రముల వల్ల బాధలుండును. పంటలు తక్కువ. చోరాగ్ని బాధలు ఎక్కువ. అధికారవర్గంలో వైరుధ్యాలుంటాయి. రాజ కీయ పరివర్తనలు, రాజకీయ కల్లోలములుండును. మెట్ట, మాగాణి, ధాన్యాల, రత్నాల, మణుల, కలప, ఎర్రని పదార్ధాముల నిర్మాణరంగ సామగ్రి, సుగంధ ద్రవ్యాలు, చముర్ల ధరలు పెరుగును. తీవ్రవాదులతో పోరాటములుండును. ప్రభుత్వ నేతలు ప్రజలను మభ్యపెట్టుట జరుగును.

మంత్రి-శని :

వర్షములు తగ్గుట, పంటలు తగ్గుట, చెడు బుద్ధులు ప్రవర్తనలు పెరుగుతాయి. అధికార యంత్రాంగము వల్ల ఇబ్బందులు, కష్టములు పెరుగును. రుజుప్రవర్తన ఉండదు. ధరలు పెరుగును. ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయపీఠం నుండి అభిశంస నలుండును.

సేనాధిపతి-శుక్రుడు:

సైనిక సామర్ధ్యము బాగుండును. సైన్యమునకు ఆర్ధికసమృద్ధి, ఆయుధ సమృద్ధి బాగుండను. ఆహారధాన్యల ధరలు స్వల్పముగా పెరుగును. స్త్రీ పురుషులు కామాసక్తులై సంచరించెదరు. అప్పు డప్పుడు యుద్ధ పరిస్థితులు నెలకొని సర్దుబాటగును. వ్యాపార వాటాల ధరలు, వెండి, బంగారు ధరలు పెరిగియుండును. ప్రజలకు సైనిక సేవా సహకార ములు బాగుండును.

సస్యాధిపతి-కుజుడు:

పూర్వ సస్యాధిపతి కుజుడగుటలచే కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రనేలలు మొదలగు మెట్ట పంటలు పండును. పూల ఉత్పత్తి బాగుండును.

ధాన్యాధిపతి-రవి :

రవి ధాన్యాధిపతి అగుటచే వర్షములు పంటలు తక్కువ. ప్రభుత్వం వత్తిడితో అదుపుచేసే పరిస్థితులుండి ధాన్యముల ధరలు సరసముగా నుండవు. మిర్చి, ఉలవలు, కందులు, వేరుశనగ బాగా పండును. కొబ్బరికాయలు, మామిడి, పనస, అరటి, నారింజ ఫలాలు బాగా పండును. వడగండ్ల వానల వల్ల పంటలు బాగా దెబ్బతినును.

అర్ఘాధిపతి-శుక్రుడు :

ధాన్యముల వెలలు స్వల్పముగా పెరిగి స్థిర పడును. వెండి, బంగారు, ఇనుము, కలప, గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరుగును. పెట్రోలు, డీజలు, కిరోసిన్‌, వంటనూనెల ధరలు స్వల్పముగా పెరుగును. బియ్యం, రాగి, దూది, పొగాకు ధరలు యధాతథంగా ఉంటాయి. షేర్‌మార్కెట్‌ లాభదాయముగా

ఉండును.

మేఘాధిపతి-శుక్రుడు :

దక్షిణ దేశంలో అల్పవృష్టి. ఉత్తర దేశంలో అతివృష్టి ఉండును. ధరలు సంతృప్తికరం. అల్పపీడన వాయు గుండముల వలన కొంత సంపద, స్వల్ప జననష్టం కలుగును. పశుసంపద, క్షీరసంపద బాగుండును.

రసాధిపతి-గురువు :

నెయ్యి, పాలపదార్ధములు, బెల్లం, పంచదార, రసవస్తువులు సమృద్ధిగా నుండును. పాడిపంటలు బాగుండును. పండ్లతోటలు, పూలతోటలు బాగుగా పండును.

నీరసాధిపతి-కుజుడు :

బంగారు, వెండి, ఎర్రచందనం, కట్టెలు, బొగ్గుల ధరలు పెరుగును. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, రాగి, ఇత్తడి, కంచు యంత్ర పరికరాల ధరలు పెరుగును. గృహనిర్మాణ సామగ్రి, పరికరముల ధరలు స్వల్పముగా పెరుగును. టెక్నాలజీకి సంబంధించిన వస్తువుల ధరలు తగ్గును. విద్యుత్‌ ఉత్పత్తి పెరుగును.

వర్షలగ్న జగల్లగ్నము :

వర్షలగ్నము కన్య ద్వితీయమున గురువు, చతుర్ధమున శని, కుజులు పంచమమున కేతువు, సప్తమమున రవి చంద్ర శుక్ర బుధులు, లాభమున రాహువు.

గ్రహగతుల స్థితిని పరిశీలించినచో రాష్ట్రప్రభు త్వములు రెండును బలిష్టమైన స్థితిలోనుండును. ప్రభుత్వముపై ప్రజలకు మంచి నమ్మకముండును. అయినా, ఇతర కారణాల వల్ల ప్రభుత్వము ఒడి దుడుకులనెదుర్కొని నిలబడును. కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆర్ధిక స్థితి కొంత ఇబ్బందుల నెదు ర్కొనగలదు. ఇతర దేశాల తోడ్పాటు బాగుండును. వస్తునిల్వలు వృద్ది చెందును. వ్యవసాయ రంగములో పెనుమార్పులుండును. వ్యాపార సంస్థలు, వ్యాపార వర్గముల ఆదాయము పెరుగును. చతుర్ధ శని కుజుల వలన గృహనిర్మాణ రంగము వేగముగా వృద్ధి చెందును. పర్యాటక రంగములోను, రవాణా రంగము లోను సమర్ధవంతమైన పర్యవేక్షణతో ముందంజవేసి వృద్ధి పొందును. మరియు ద్వితీయ గురు, చతుర్ధ శని కుజుల వలన పాడిపరిశ్రమ పంచాయతీరాజ్‌, భూగర్భవనరులు అభివృద్ధి పథములో దూసుకుని పోవును. పెనుమార్పులతో విద్యారంగము వృద్ధి వేగమందుకొనును. దశమాధిపతి బుధునకు దోష గ్రహయుతి అనగా అష్టమ వ్యయాధిపతుల కలయిక వల్ల ప్రభుత్వంలో అధికారవర్గ అవినీతి బాగుండను. పంచమమునకు కేతు రాహు సంబంధము చేత సాంఘిక సంక్షేమ కళారంగాలు అంత తృప్తికరంగా ఉండవు. క్రీడారంగంలో రాష్ట్రానికి గుర్తింపు బాగుం డును. దశమ భావమునకు గురు శని కుజ దృష్టి వలన పోలీస్‌, రక్షణ శాఖలు సమర్ధవంతముగా గుర్తింపు పొందును. నేరచరిత్ర కొంత అదుపులోనుండును. మరియు ఉద్యోగుల సంక్షేమమునకు ప్రభుత్వము శ్రద్ధ చూపును. సప్తమమున చంద్ర బుధ శుక్రులు

ఉండుటవలన ప్రేమ వివాహాలు, స్త్రీలపై వేధింపు లుండును. అయితే, వాణిజ్యరంగము, పెట్టుబడులు వేగముగా వృద్ధిపొందును. గురువుకు ద్వితీయస్థితి వలన దేవాదాయ శాఖ దైవ కార్యక్రమాలను బాగా నిర్వహించును. యజ్ఞయాగాదుల ప్రోత్సాహముం డును. ప్రస్తుత ప్రభుత్వాలు మరొకమారు కొనసాగును.

జగల్లగ్నమునందు మిధున లగ్నము ద్వితీయ మున రాహువు, పంచమమున గురువు, సప్తమమున శని కుజులు, అష్టమ కేతువు, దశమమున చంద్ర బుధులు, లాభమున రవి శుక్రులున్నారు. ఈ గ్రహస్థితిని పరిశీలింపగా (1) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్య ధోరణిలో సహరించుకొనును. కేంద్ర ప్రభుత్వము సమర్ధవంతముగా పాలించును. (2) ప్రభుత్వ ఆదాయము పెరుగును. స్టాక్‌మార్కెట్ల వృద్ధి మెల్లగా సాగును. (3) రవాణా రంగము, పర్యాటక రంగము, రహదారుల నిర్మాణము వేగవంతమగును. ఆదాయము బాగుండను. సమాచార ప్రసార శాఖలు సమర్ధవంతంగా పనిచేస్తూ అక్రమాలను బయటకు లాగును. (4) రెవిన్యూ సంస్కరణలు, విద్యా వైజ్ఞానిక అంతరిక్ష విజ్ఞాన సంస్థలు వేగవంతముగా సాగును. (5) రక్షణ రంగములో సైనిక పాటవము పెరుగును. కవ్వింపు చర్య వల్లన ప్రజా, సైనిక నష్టములు జరుగును (7) ప్రపంచ దేశాల సహకార పొందుట, ఆర్ధిక సంస్కరణల వేగవంతమగుట జరుగును. (8) ప్రకృతి వైపరీత్యాలు ఈ సంవత్సరము దేశములోను, ప్రపంచమంతటా పెరుగును. (9) వాహన ప్రమా దాలు, తుఫాన్ల వలన నష్టాలు, అకాల వర్షముల వల్ల నష్టాలుండును. (10) ప్రస్తుత దేశ ప్రభుత్వము మరొకసారి కొనసాగును. మెజారిటీ స్వల్పముగా గలదు. (11) సేవా, కళారంగాలు, క్రీడారంగాలలో మంచి ఖ్యాతి ఉండును. (12) ప్రజాక్షేమము, దేశ ఆర్ధికాభివృద్ధి సంతృప్తికరముగ నుండును.

తామ్రపర్ణి (భీమరధి) నది పుష్కరములు :

గురువు వృశ్చిక రాశి ప్రవేశ సమయము నుండి 12 రోజుల పటు తామ్రపర్ణి పుష్కరమలు జరుగు తాయి. తేది. 11.10.2018 ఆశ్వీయుజ శుక్ల తదియ గురువారం రాత్రి 1.48 గంటలకు గురువు వృశ్చిక రాశి యందు ప్రవేశించును. సూర్యాస్తమయానంతరం కాబట్టి 12.10.2018 శుక్రవారం నుండి 23.10.2018 వరకు తామ్రపర్ణి పుష్కరాలు జరుగును. నదిలో సంకల్ప పూర్వకముగా స్నానమాచరించి జప తర్పణ కార్యక్రమాలు, పితృదేవతలకు పిండ ప్రదానములు చేయుటవలన పునీతులై కుటుంబ వృద్ధి పొందగలరు.

కర్తరీ నిర్ణయము :

తేది 04.05.2018 నుండి డొల్లు కర్తరీ ప్రారంభము. తేది 11.05.2018 శుక్రవారం నుండి తేది 28.05.2018 సోమవారం వరకు నిజకర్తరి. ఈ కర్తరిలో 'మృచ్ఛిలాదారు కర్మాణి వర్జయేత్‌' అను ప్రమాణము వలన మట్టి, రాయి, కొయ్యతో కూడిన నిర్మాణములు పనికిరాదు.

మౌఢ్యములు :

సూర్యునకు అత్యంత సమీపమున ఏ గ్రహము వచ్చినను అస్తంగత దోషము కలుగును. శుభ గ్రహములగు గురు శుక్రులు రవి సమీపమునకు వచ్చినచో అస్తంగతులగదురు కాబట్టి గురు శుక్ర మౌఢ్యములుగా చెప్పబడినవి. ఏ రకములైన శుభ కార్యములు కూడా చేయరాదని ధర్మశాస్త్ర, జ్యోతిశ్శాస్త్ర ప్రమాణము.

తేది 21.10.2018 ఆశ్వీయుజ శుక్ల ద్వాదశి ఆదివారము నుండి తేది 31.10.2018 ఆశ్వీయుజ బహుళ సప్తమి బుధవారం వరకు శుక్రమౌఢ్యమి జరుగును. తేది :12.11.2018 కార్తీక శుక్ల పంచమి సోమవారం నుండి తేది 10.12.2018 మార్గశీర్ష శుక్ల తదితయ సోమవారం వరకు గురుమౌఢ్యమి జరుగును.

అధిక జ్యేష్టమాసం:

ఏ తెలుగు నెలలో శుక్ల పాఢ్యమి నుంచి అమా వాస్య వరకు మధ్యలో సూర్యసంక్రమణం జరగదో, అది తరువాత నెలకు సంబంధించిన అధికమాసం అగును. ఏ రకమైన శుభముహూర్తములు అధిక మాసంలో ఉండవు.

గ్రహణములు :

తేది : 27.07.2018 అషాఢపూర్ణిమ శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి 3.49 వరకు సంపూర్ణ చంద్రగ్రహణము. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రముల వారు చూడరాదు. ఇది కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం. భారతదేశమంతటా కనిపించును. సూర్య గ్రహణములు లేవు.

అర్థ్ర కార్తె ప్రవేశము:

నిజ జ్యేష్ఠ శుక్ల దశమి శుక్రవారం తేది 22.06.2018 రాత్రి 7.14 గంటలకు రవి ఆర్ద్రా ప్రవేశము. దీనివల్ల ప్రజలకు సుఖ సౌఖ్యములు, ధాన్యవృద్ధి, యుద్ధ వాతావరణము, ప్రజలకు అనారోగ్య బాధలుండును. అధికారవర్గాలు పరస్పరం విభేదాలకు కలహించుకొనుట జరుగును. దేశమంతటా వానలు సంతృప్తికరము.

మకర సంక్రాంతి :

తేది. 14.01.2019 నవమి సోమవారం రాత్రి 1.11 గంటలకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును. దీనినే మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ సమయము. కాబట్టి తేది. 15.01.2019 సంక్రాంతి పండుగ అగును.

దక్షిణాయనగే భానౌ కలికాలే నరై: కృతమ్‌

పాపం మూర్తీభవత్సర్వం బహిర్వ్యాప్యుత్తరాయణే

దక్షిణాయనంలో జనులు చేసిన పాపములన్ని ఘోరం రూపంలో మకర సంక్రమణ సమయంలో సూర్యాంశ గ్రహతారులు ప్రత్యక్షమగు రూపమే మకర సంక్రాంతి పురుషరూపము. అందుకే పితృదేవతలను పూజిస్తారు.

మకర సంక్రాంతి పురుష లక్షణాలను పరిశీలిస్తే శుక్లపక్షం కాబట్టి అక్కడక్కడా క్షామపరిస్థితులు. నవమి తిథి-ఈతిబాధలు, మంగళవారం-ప్రజా దు:ఖం మరియు జననష్టం. అశ్వని నక్షత్రం-ప్రభుత్వాల మధ్య సఖ్యత తక్కువ. రాత్రి సమయం-నటులకు, రాజకీయ, సామాజిక శాస్త్రజ్ఞులకు హాని, మహోదరనామమము- ఆర్ధిక దోపిడీలు, రక్తవస్త్రధారణ-రోగదాయకము, రక్తఛత్రధారణ-యుద్ధ పరిస్థితుల వల్ల ఆందోళన, వ్యాఘ్రవాహనం-అరణ్య జంతునాశనం, దక్షిణాది ప్రయాణం- ఆ దిక్కున గల దేశాలకు అరిష్టం.

ఆదాయ వ్యయమలు - రాజపూజ్య అవమానములు: ఆ వ్య రా అ

మేషం 2 14 5 7

వృషభం 11 5 1 3

మిధునం 14 2 4 3

కర్కాటకం 8 2 7 3

సింహం 11 11 3 6

కన్య 14 2 6 6

తుల 11 5 1 2

వృశ్చికం 2 14 5 2

ధను: 5 5 1 5

మకరం 8 14 4 5

కుంభం 8 14 7 5

మీనం 5 5 3 1

rasi 09

1Ariesమేషం

బిడ్డల విద్యా వివాహ విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనాలి. వస్తువులు, డబ్బు భద్రపరచుకొనడం చేయండి. ఆర్ధికంగా బాగుండినా స్థిమితంగా ఉండలేరు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికం కాగలవు. కుటుంబ విషయాలపై దృష్టిపెడతారు.

 

2Taurusవృషభం

ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధుమిత్రులను కలుసుకొంటారు. గిట్టనివారి వల్ల మాటలు పడవలసి ఉంటుంది. ఇంట బయట పను లందు శ్రమ ఉంటుంది. కాని చేపట్టిన పనులను సమర్ధ వంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. పబ్లిక్‌లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.

 

3Geminiమిధునం

యజమానులకు వర్కర్ల వల్ల ఇబ్బందులుండును. ఉద్యోగులకు అధికారుల అనుకూలత ఉంటుంది. రావల సిన బాకీలు కొంత అందుతాయి. దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పెట్టు బడులు, కొత్త వ్యాపారాల ప్రయత్నాలు జరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయినా అవసరాలకు కొద్ది ఋణాలు చేయక తప్పదు.

 

4Cancerకర్కాటకం

ఆరోగ్యం ఫరవాలేదు. శుభకార్యాలలోను, దైవ కార్యాలలోను పాల్గొంటారు. సోదర వర్గానికి మంచి జరుగుతుంది. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుం టాయి. ప్రయాణాలుంటాయి. కమిటి సమావేశాలలో ప్రముఖ పాత్ర వహిస్తారు. ఉన్నత విద్యావకాశాలుం టాయి. ఇతరులకు ధన వస్తు మాట రూపంలో సహాయం చేస్తారు. పట్టుదలతో అనుకున్న పనులు జరుపుకొంటారు.

 

5Leoసింహం

సాంకేతిక, న్యాయ, వైద్య రంగాల వారికి ఆర్ధికావ కాశాలు బాగుంటాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు పొందుతారు. ఒకటి రెండు పెద్ద అనవసర ఖర్చులుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ముఖ్య విషయా లపై నిర్ణయాలు తీసుకొనలేక టెన్షన్‌ పడతారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కాగలవు. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. ఆదాయం పెరుగుతుంది.

 

6Virgoకన్య

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవ, సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయపడతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారులు, అధికారులకు ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు కలుగ వచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగములలో గాని, ఇతర కార్యక్రమములలోగాని నిర్వహణ సామర్ధ్యము బాగుంటుంది. ఆత్మీయులను కలుస్తారు.

 

7Libraతుల

గృహ మార్పులు, స్థానమార్పులుండగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. హామీలు, మధ్య వర్తిత్వాలకు పోవద్దు. పిల్లల వల్ల ఖర్చులు ఉంటాయి. ఇబ్బందులుండినా ధైర్యంగానే ఉంటారు. ఉద్యోగులకు విధినిర్వహణ సాఫీగా సాగిపోతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక ఇబ్బందులుండవచ్చును. ఖర్చులు అధికంగా ఉంటాయి.

 

8Scorpioవృశ్చికం

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. అధికారు లకు స్థానమార్పు, పెండింగ్‌ పనులు పరిష్కారం కాక పోవుట, ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అవసరాలకు డబ్బు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాలలో విస్తరణ ప్రయ త్నాలు జరగకపోయినా ఆదాయ లోపం కలగదు.

 

9Sagittariusధనుస్సు

ఉన్నత విద్యపై అనిశ్చితి ఉంటుంది. నిరుద్యోగు లకు అవకాశాలు దొరకడం, దైవ సేవా కార్యములలో పాల్గొనడం, సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. విలువైన వస్తువులను సమకూర్చు కొంటారు. ఆర్ధిక ఒప్పందాలు జరుగును. వృత్తి జీవనం కలవారికి మంచి అవకాశాలు దొరుకుతాయి., వ్యాపార వర్గాలకు ఆదాయం బాగుంటుంది.

 

10Capricornమకరం

విలువైన వస్తువులు సమకూర్చుకొనడం, శుభకార్య ములను నిర్వహించడం జరుగుతుంది. దూరప్రయాణా లుండును. రాజకీయ వర్గాలు సామరస్యంగా పోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగావకాశాలు లభించగలవు. వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. కొత్త పెట్టుబడులకు కొత్త వ్యాపారాలకు అవకాశాలుం టాయి. ఆస్థి క్రయవిక్రయాల అగ్రిమెంట్లు జరుగుతాయి.

 

11Aquariusకుంభం

వృత్తి వ్యాపార రంగాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. విలువైన వస్తువులు సమ కూరుతాయి. దైవ సేవా సామాజిక రంగాలకు సహాయం చేయడం చేస్తారు. స్థిరాస్తులు, షేర్ల మీద లాభాలుం టాయి. పనులు సానుకూలంగా జరిగినా టెన్షన్‌ ఉం టుంది. మీ ఆరోగ్యం ఫరవాలేదు.

 

12Piscesమీనం

ఆర్ధికంగా బలపడి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది. తొందరపాటు ప్రవర్తన, మాటలు అదుపులో పెట్టుకొనాలి. బిడ్డలకు స్వల్ప అనా రోగ్య బాధలుంటాయి. బంధు మిత్రులను, ప్రముఖులను కలుసుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. శుభకార్యముల తేదీలను నిర్ణయం చేస్తారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

Page 1 of 45

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?
  నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌…
 • అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!
  ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యం.పి., రాజ్యసభ
  నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
 • పవన్‌కు తోడైన 'సింహపురి పవర్‌'
  పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్‌ స్టార్‌…

Newsletter