rasi 15

1Ariesమేషం

ఆలోచనలు, అభివృద్ధి ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతాయి. పిల్లల విద్యా వివాహ విషయాలపై చర్చ లుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయము తృప్తికరం. దూరప్రాంత ప్రయాణాలు నిర్ణయం కాగలవు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్రమంగా చేకూరుతుంది. బంధుమిత్రుల సహాయ సహ కారాలుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

2Taurusవృషభం

మీ ప్రయోజనాలకు బంధువులు, స్నేహితులే అడ్డు పడుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రాబడి తగ్గుతుంది. కొన్ని అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరగడం, పెట్టు బడులకు అవకాశాలు దొరకడర జరుగుతుంది. ఉద్యో గులకు పనివత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో బాగా సిద్ధమై ప్రయత్నించండి.

 

3Geminiమిధునం

రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కుటుంబ, వ్యాపార వ్యవహారాలను సొంతంగా పరిశీలిస్తుండాలి. వృత్తి వ్యాపారాలు కొంత మెరుగుగా ఉంటాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది ఇతరులకు ఆర్ధికంగా, మాట రూపంలో సహాయపడతారు. కొత్త స్నేహాలు పరిచయాలుంటాయి. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. విద్యాప్రగతి బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

సరైన సమయం సరైన నిర్ణయాలు తీసికొనలేక టెన్షన్‌ పడుతుంటారు. సమయానికి జ్ఞాపకాలు రావు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. పనులు అనుకొన్నవి నిదానంగా సాగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలకు, పెట్టుబడులకు అనుకూల అవకాశాలుం టాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అవసరం.

 

5Leoసింహం

మంచి ఆర్ధిక ప్రణాళికలతో ముందుచూపుతో వృత్తి వ్యాపారాలందు ప్రదర్శించి ఆదాయం పెంచుతారు. ప్రభుత్వ పరంగా అనుమతులు, ఋణాలు లభిస్తాయి. దూరప్రాంతాలకు పోవడానికి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఆలోచనలుంటాయి. ఉద్యోగులకు పని భారం ఉండినా అధికారుల నుండి గుర్తింపుంటుంది.

 

6Virgoకన్య

తొందరపాటు మాటలు, ప్రవర్తన తగ్గించుకొనండి. వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. స్వల్ప ఆర్ధిక ఇబ్బందులుండవుచ్చను. కుటుంబంలో గాని, బంధు వర్గంలో గాని అనారోగ్య బాధితులుంటారు. కొన్ని అన వసర ఖర్చులుంటాయి. ఆత్మీయులతో, బంధువులతో జాగ్రత్తగా మెలగండి. ఆర్ధిక లావాదేవీలు, క్రయవిక్ర యాలు వాయిదా వేసికొంటే మంచిది.

 

7Libraతుల

అనుకోని ఖర్చులు, మొగమాటం వల్ల ఖర్చులు అదనంగా ఉంటాయి. దైవకార్యాలు, సభలు సమావేశా లలో పాల్గొంటారు. అనుకున్న పనులను సమర్ధవంతంగా జరుపుకొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం, అభివృద్ధి అవకాశాలుంటాయి. అప్పులను, హామీలను త్వరపడి ఇవ్వవద్దు. ఉద్యోగులకు స్థానమార్పులు, అధికార వర్గ సహకారం ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

వృత్తి వ్యాపారాలలో పెరుగుదలతో పాటు రాబడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రభుత్వం నుండి రావలసిన బాకీలు, అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. శుభకార్య నిర్ణయాలు జరిపి పనులందు నిమగ్నం కాగలరు. వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వల్ల వత్తిడి ఉంటుంది. దూరప్రయాణాలుంటాయి.

 

9Sagittariusధనుస్సు

ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనాలి. అనుకున్న పనులకు ఆటంకాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అవకాశాలు బాగుండి ఆదాయం పెరుగుతుంది. షేర్లు, పెట్టుబడులపై లాభాలుంటాయి. ఉద్యోగులకు కార్యదక్షత, అధికారవర్గం నుండి సహకారం లభిస్తుంది. రావలసిన బాకీలు, వస్తువులను పొందుతారు. విద్యార్థులు మరింత కృషి చేయవలసి ఉంటుంది.

 

10Capricornమకరం

ఆర్ధిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. రాబడి సామాన్యంగా ఉంటుంది. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. గృహ వస్తువాహన రిపేర్లుంటాయి. వాహనాలు నడపడం, కరెంటు పనులందు జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ప్రయోజనకరంగానే ఉంటాయి. ఉద్యోగప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది.

 

11Aquariusకుంభం

ఆర్ధికంగా స్థిరపడటం ప్రారంభం కాగలదు. రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉం టుంది. ఉద్యోగులు వ్యాపారులు అధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తపడండి. కొత్త వ్యాపారాలు, భాగ స్వామ్య వ్యాపారములు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులను సమన్వయం చేసికొంటూ సాగండి. కొత్త వస్తువులు సమీకరించుకొంటారు.

 

12Piscesమీనం

పనులు సకాలంలో నిర్వహిస్తారు. ఇంటా బయట ప్రత్యర్థులను, అవరోధాలను తొలగించుకొనగలరు. వ్యాపార వృద్ధి ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో, బంధువులలో ఒకరు అనారోగ్యంతో బాధ పడతారు. వస్తు వాహనాలు పోగొట్టకొనకుండా జాగ్రత్త పడాలి. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. పెట్టుబడులకు ప్రోత్సాహం బాగుంటుంది.

rasi 09

1Ariesమేషం

గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అనుకూల సమయం కాదు. ఉద్యో గులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెల గండి. వివాహాది ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. ఆర్ధికపరమైన వత్తిడి ఇబ్బందులుండవచ్చును. ఖర్చులు ఏదో ఒక నెపంతో పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసికొనలేని స్థితి ఉంటుంది.

 

2Taurusవృషభం

ఆస్థి, కుటుంబ వ్యవహారాలు పరిష్కారానికి రాగ లవు. ఆరోగ్యం ఫరవాలేదు. దూరప్రయాణాలుంటాయి. కొత్త వస్తువులు సమకూరడం, ఇతరులకు సహాయ పడటం చేస్తారు. అధికారవర్గ సహాయ సహకారాలు పొందుతారు. కోర్టు కేసులు, రావలసిన బాకీలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉం టుంది. ఆదాయం బాగుంటుంది.

 

3Geminiమిధునం

నూతన పరిచయాలు కలిగి మేలు జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. ఆహ్వానాలు అందుకొంటారు. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యోగులు అధికారులతో సన్నిహితము కాగలరు. అవసరాలు, అనుకున్న పనులు నెరవేరుతాయి. స్థిరా స్తుల లావాదేవీలు జరుగుతాయి. స్వల్పంగా అదనపు ఖర్చులుండినా ఇబ్బంది కలుగదు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగావకాశాలు లభించగలవు. శుభకార్యలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు కొంత లభించడం, గతంలోని ఆర్ధిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అనుకోని ఖర్చు ఒకటి పైన పడుతుంది. అనుకున్న పనులు సవ్యంగా జరగడం వల్ల సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో అభిప్రాయ భేదాలుండి సర్దుబాటు కాగలవు. మొగమాటాలకు లోబడవద్దు.

 

5Leoసింహం

వస్తు వాహన గృహ రిపేర్లుంటాయి. కొత్త నిర్మా ణాలు చేపట్టుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఇతరుల వల్ల విమర్శలు అభియోగాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా నుండి ఆదాయం బాగుంటుంది. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి.

 

6Virgoకన్య

బంధువుల వల్ల ఇబ్బందులేర్పడవచ్చును. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. దూరప్రయాణాలు, శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. మంచి పనులకు సహాయమందిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడ గలవు. ఉద్యోగులు తమ పనులందు జాగ్రత్త పడటం మంచిది. అనుకోని ఖర్చుల భారం పైనబడుతుంది. అయినా ఇబ్బందులు అధిగమిస్తారు.

 

7Libraతుల

ప్రభుత్వంతో సంబంధించిన పనులు ఆలస్యం కాగ లవు. నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతాయి. పిల్లల వల్ల కొద్ది ఇబ్బందులు కలుగవచ్చును. శుభకార్య నిర్ణ యాలలో జాప్యం జరుగుతుంది. వృత్తి పరంగా అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యవిషయాలలో బంధుమిత్రుల సలహా పొందండి. అనుకోని ప్రయాణముంటుంది. ఆర్ధిక విషయాలలో జాగ్రత్త పడండి.

 

8Scorpioవృశ్చికం

కుటుంబసౌఖ్యం కలదు. శుభకార్యాలలో పాల్గొం టారు. బిడ్డల అభివృద్ధికి కొత్త పథకాలు నిర్ణయించుకొం టారు. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలుం టాయి. మీ సూచనలు సలహాల వల్ల సంస్థలలో అభివృద్ధి కలదు. ఆరోగ్యం బాగుంటుంది. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును. బంధువర్గంతో సమస్యలు, వివాదాలు వచ్చే అవకాశమున్నది.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, స్థానమార్పు ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొం టారు. దూర దేశ ప్రయాణాలు నిర్ణయం కాగలవు. కుటుంబమునకు రావలసి బాకీలు లభించడం, కోర్టు కేసులందు అనుకూలత, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక స్థితి బాగుండి వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

రావలసిన బాకీలు కొంత లభించగలవు. చెల్లిం పులు సకాలంలో జరుపుతారు. ఏ రకమైన ప్రలోభాలకు మెత్తబడవద్దు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలపై దృష్టి పెడతారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు అవకాశాలు దొరుకు తాయి. మీ పనులు జరగడానికి బంధుమిత్రులు సహాయ పడతారు. శుభకార్యాలు ఫలించే అవకాశం ఉన్నది.

 

11Aquariusకుంభం

కుటుంబసౌఖ్యం ఉంటుంది. నూతన వస్తువులను సమకూర్చుకొంటారు. అధికారులతో మంచి అనుకూ లత ఉంటుంది. నిర్మాణాలు, కాంట్రాక్టులు పొందడం సవ్యంగా సాగుతుంది. విమర్శలు, నిందలు తగ్గించి ఇతరులతో సామరస్యంగా మెలగండి. అనుకున్న పనులు టెన్షన్‌ పెట్టగలవు. అయితే సమస్యలను పరిష్కరించు కొనగల సామర్ధ్యం ఉంటుంది.

 

12Piscesమీనం

ఉద్యోగార్ధులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగు లకు విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. బిడ్డల చదువు ఆరోగ్య విషయాలలో శ్రద్ధ పెడతారు. ఇంటికి కొత్త వస్తువులు సమకూరుతాయి. వృత్తి వ్యాపారాలలో అభి వృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. మంచి పనులకు, దైవ కార్యాలకు సహాయం చేస్తారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

rasi 1

1Ariesమేషం

ఉద్యోగులకు అధికారుల అనుకూలత సహచరుల ఆదరణ ఉంటుంది. కాంట్రాక్టర్లకు పారిశ్రామికవేత్తలకు వర్కర్లతో సమస్యలు రావచ్చును. స్థిరాస్తుల లావాదేవీలలో జాగ్రత్తపడండి. క్రొత్త వస్తువులు కొనడం, వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. దూరప్రాంతాల నుండి శుభ వార్తలు వింటారు. విద్యాప్రగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారములందు ఆదాయం పెరుగుతుంది.

 

2Taurusవృషభం

బిడ్డల విద్యా వివాహ ఉద్యోగాలపై దృష్టి పెడుతారు. శుభవార్తలు వినడం, దూరం నుండి ఆహ్వానాలు అందు కొనడం జరుగుతుంది. ఉద్యోగులు సహచరులతోను, పైఅధికారులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకొంటారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త చేసుకొనండి. పారిశ్రామిక, కళా, సాంకేతిక రంగాలలో ప్రోత్సాహం బాగుంటుంది. ఉద్యోగావకాశాలు కలవు.

 

3Geminiమిధునం

కోర్టు వ్యవహారాలు, బాకీల విషయంలో అనుకూలత ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత దొరుకుతుంది. అందరితో మంచిగా ఉంటూ పనులు జరుపుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు దొరక గలవు. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ వ్యయాలను ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలలో పట్టుదలకు పోకుండా సర్ధుకొనిపోండి.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగ ప్రయత్నాలకు అవకాశాలు దొరుకుతాయి. ఆకస్మిక ప్రయాణాలుండగలవు. ఉద్యోగులు అధికారు లకు సంజాయిషీ చెప్పుకొనే పరిస్థితి ఉంది, కావున జాగ్రత్తపడండి. స్వల్పంగా అదనపు ఖర్చులుంటాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. ప్రభుత్వ కార్యా లయాలలో మీ పనులకు అనుమతులు దొరుకుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంది.

 

5Leoసింహం

క్రొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. స్టాక్‌ మార్కెట్‌, మార్కెటింగ్‌ రంగాలలో ప్రోత్సాహం ఆశా వహంగా ఉంటుంది. ఇంట శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉన్నది. కొంత బాకీ చెల్లింపులు జరుగ గలవు. అనుకోని ప్రయాణాలు ఉండగలవు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది. మీ బలహీనతలను అదుపులో ఉంచుకొనాలి.

 

6Virgoకన్య

ఆర్ధిక లావాదేవీలు వాయిదా వేసికొనడం మంచిది. స్టాక్‌ మార్కెట్‌ రంగాలు ఉద్యోగ ప్రయత్నాలలో అవకా శాలు ప్రోత్సాహకరంగా ఉండవు. రియల్‌ ఎస్టేట్‌, కాంట్రాక్టర్లు, పరిశ్రమల యజమానులకు కార్మికులతో సమస్యలు రాగలవు. విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. శుభకార్యాల గురించిన ఆందోళన ఉంటుంది. శివ సహస్ర పారాయణం చేసికొంటే మంచిది.

7Libraతుల

ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. పాతమిత్రులను కలుసుకొనడం, క్రొత్త పరి చయాలు పెంచుకొనడం జరుగుతుంది. సోదరవర్గంతో సమస్యలుంటే సర్ధుకుపోవడం మంచిది. విద్యార్థులు మంచి కృషి ప్రారంభించగలరు. ఆర్ధికంగా బాగుంటుంది. వ్యాపారము గాని సొంత వృత్తి గాని అభివృద్ధి పరంగా సాగుతుంది. షేర్‌ మార్కెట్‌ ఆశావహంగా ఉండదు.

 

8Scorpioవృశ్చికం

సాంకేతిక క్రీడా కళా రంగాల వారికి అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుం టాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు దొరకగలవు. పనులందు టెన్షన్‌ పడుతుంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఖర్చులు అధికంగా ఉండినా ప్రయో జనం బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అనవసర వ్యవహా రాలలో తలదూర్చకండి. ఉద్యోగులు సహచరులతోను ఉన్నతాధికారులతోను జాగ్రత్తగా మెలగండి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉన్నది. విద్యా ప్రగతి బాగుం టుంది. క్రొత్త వస్తువులు గృహోపకరణాలు కొంటారు. ఋణాలు చెల్లింపులు సకాలంలో చెల్లించగలరు. కార్య నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు.

 

10Capricornమకరం

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశాలు న్నాయి. పెద్దలతో సంప్రదించి ముఖ్య నిర్ణయాలు తీసి కొంటే మేలు జరుగుతుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. సోదర, బంధువర్గంతో జాగ్రత్త పడండి. శుభకార్య ప్రయ త్నాలలో అనుకూల సందేశాలు లభిస్తాయి. ఇతరుల ప్రలోభాలు ఆకర్షణలకు లోబడకుండా నడుచుకొనండి. ఆర్ధిక ఇబ్బందులుంటాయి.

 

11Aquariusకుంభం

ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు లభించగలవు. వస్తు వాహన రిపేర్లుంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఎటూ తేలక సమస్య కాగలదు. కుటుంబ సభ్యుల కొరకు, అయిన వారి కొరకు అధికంగా ఖర్చు ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వస్తువులు పోగొట్టుకొనకుండా చూచుకొనండి. అనవసర వ్యవ హారాల వల్ల ఆర్ధిక భారం, బాధ్యత పైనబడగలవు.

 

12Piscesమీనం

కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. శుభకార్య నిర్ణ యాలు జరిగే అవకాశం ఉన్నది. ఆత్మీయులు నుండి వర్తమానాలు అందుతాయి. గృహ మార్పు ప్రయత్నాలుం డగలవు. క్రొత్త వస్తువులు కొనడం, క్రొత్త పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది. విద్యాప్రగతి బాగుంటుంది. స్వల్ప అనారోగ్య బాధలుండినా ఇబ్బంది పెట్టవు. బాకీలు, చెల్లింపులు కొంత పరిష్కారం కాగలవు.

Page 1 of 51

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter