fakeపెద్దనోట్ల రద్దు వెనుక ప్రధాన ఉద్దేశ్యం దొంగనోట్లను అరికట్టడమేనని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్లాక్‌మనీ బయటకు రావడంతో పాటు దొంగనోట్ల చెలామణి ఆగిపోతుందని భావించారు. కాని నోట్ల రద్దు వల్ల బ్లాక్‌మనీని అరికట్టలేరనే విషయం చాలారోజుల క్రితమే అర్ధమైపోయింది. ఇప్పుడు దొంగనోట్లను కూడా అడ్డుకోలేమనే విషయం అర్ధమవుతోంది.

ఈ నోట్ల రద్దు తర్వాత వచ్చిన రెండు వేల రూపాయల నోట్లలో కూడా ఇప్పుడు దొంగనోట్లు వస్తున్నాయి. ఇవి మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. వ్యక్తుల మధ్య వ్యాపార లావాదేవీలలో ఇవి చేతులు మారుతున్నాయి. అసలు నోటు ఏదో దొంగ నోటు ఏదో తెలియక లావాదేవీలలో తీసుకుంటున్నారు. బ్యాంకులలో లేదా బ్యాంకు మిషన్‌లలో వీటిని డిపాజిట్‌ చేసేటప్పుడు అక్కడున్న కౌంటింగ్‌ మిషన్లు దొంగనోట్లను పట్టేస్తున్నాయి. వంద నోట్ల కట్టలో ఒకటి రెండు దొంగనోట్లు వచ్చినా బాధితుడు ఎక్కువుగా నష్టపోయినట్లే! అసలు నోటుకు దొంగనోటుకు పట్టుకుని పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. కాని దొంగనోట్లను చెలామణిలోకి తెస్తున్న వాళ్ళు వీటిని ఒక్కొక్క నోటుగా ఇవ్వడం లేదు. అసలు నోట్ల మధ్య దొంగనోట్లను కలిపి చెలామణి చేస్తున్నారు. లావాదేవీలలో రెండువేల నోట్లు తీసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవడం మేలు. బ్యాంకర్లు, పోలీసులు కూడా దొంగనోట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

jaganవైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప పాద యాత్ర ఈనెల 20వతేదీన నెల్లూరుజిల్లా లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఆయన రాకకోసం వైసిపి అభిమానులు, కార్యకర్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వైయస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ నుండి మొదలైన జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా సాగి ప్రస్తుతం సీఎం చంద్రబాబు సొంత గడ్డ చిత్తూరుజిల్లాలో జరుగు తోంది. ఇప్పటివరకు పర్యటించిన అన్ని జిల్లాలో జగన్‌ పాదయాత్రకు జనం జాతర మాదిరిగా వచ్చారు. పాదయాత్రలో ఇప్ప టికే 700 కిలోమీటర్ల మైలు రాయిని ఆయన అధిగమించాడు. ఖచ్చితంగా వెయ్యో కిలోమీటర్‌ మైలురాయికి నెల్లూరు జిల్లానే వేదిక కాగలదు.

ఈ నెల 20 లేదా ఒకరోజు ముందు వెనుక అయినా జగన్‌ జిల్లాలోకి ప్రవేశించే అవకాశముంది. శ్రీకాళహస్తి తర్వాత జగన్‌ జిల్లాలోకి ప్రవేశించనుండడంతో జిల్లా వైసిపి శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. జగన్‌ పాదయాత్రలో జిల్లాలోని 10అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించేలా వీలైనంత ఎక్కువ పల్లెలను పలుకరించేలా పార్టీ నాయకులు ప్లాన్‌ చేస్తున్నారు.

assemblyప్రతి ఎమ్మెల్యేకు కూడా అసెంబ్లీ హల్‌లో కూర్చుని 'అధ్యక్షా' అంటూ లేచి మాట్లాడాలన్నది ఒక కల. వాళ్ళకు ఎమ్మెల్యే అనే ఫీలింగ్‌ వచ్చేది ఆ అసెంబ్లీ సమావేశాలలో లేచి మాట్లాడినప్పుడు... ఆయన మాట్లాడుతున్నది టీవీ ఛానల్స్‌లో తన నియోజకవర్గ ప్రజలు చూసి నప్పుడు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి పాతఎమ్మెల్యేలే కాకుండా కొత్తగా ఎన్నికైన సభ్యులు కూడా సభలోకి అడుగుపెడుతుంటారు. శాసనసభ సమావేశాలన్నవి అలాంటి వారికి ప్రజాసమస్యల చర్చా వేదికలు కావాలి. ఏ పార్టీ అధికారంలో వున్నా ఇంతవరకు సభా సమా వేశాలు అలాగే జరుగుతూవచ్చాయి.

కాని, ఇన్నేళ్ళ చరిత్రలో ప్రతిపక్షం పూర్తిగా సభను బహిష్కరించింది ఇదే తొలిసారి. అధికారపక్ష ఆగడాలను, స్పీకర్‌ పక్షపాత వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షం ఈ చర్యకు పూనుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోరంగా రాష్ట్ర శాసనసభ తయారైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏ.పి అసెంబ్లీ కళాకాంతులు కోల్పోయింది. అమరావతిలో కట్టిన అసెంబ్లీ భవనంలో సమావేశాలు జరుపుకుంటున్నాము. ఈ వర్షాకాల సమావేశాలు 10వ తేదీ నుండి మొదలుకాగా, ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలను బహిష్కరించింది. సభలో ప్రతిపక్షం లేక పోవడంతో సమావేశాలు సంతాప సభలా జరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి పొగడ్తలు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లులు తప్ప సభలో చూడడానికి, వినడా నికి ఇంకేమీ లేకుండాపోయింది.

అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైకాపా బహిష్కరించడంతో సభ వెలవెల పోయింది. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను జనం చూడడం లేదు. అసలు సభలో ఏం జరుగుతుందో కూడా ఎవరూ పట్టించు కోవడం లేదు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన సభ్యులే! అసెంబ్లీ సమావేశాలకు వారికి ఎంతో కీలకం. అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వేదిక. ఏ ప్రతిపక్షం కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించదు. అలా చేయడం రాజకీ యంగా పొరపాటు కూడా!

అయితే విధి లేని పరిస్థితుల్లోనే ప్రతి పక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిం చాల్సి వచ్చిందన్న సంగతి వాస్తవం. ఈ మూడున్నరేళ్లలో సభను సభలాగా జరగ నీయలేదు. అదేదో తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా జరుపుకుంటూ వచ్చారు. ఏ సభలోనూ చర్చలు ఆరోగ్యవంతంగా జరగలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించినప్పుడల్లా తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు లౌడ్‌స్పీకర్లలా గొంతులేసుకుని... నువ్వు అన్ని కోట్లు తిన్నావు, ఇన్ని కోట్లు తిన్నావని అరవడం తప్ప, సమస్యలపై ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు పద్ధతిగా సమాధానం చెప్పిన దాఖలాలే లేవు. నీ మీద కేసులున్నాయి, నువ్వు దొంగవు అంటూ చర్చను పక్కదారి పట్టించారు తప్పితే, సక్రమంగా చర్చించిన సందర్భాలే లేవు. అదీగాక, ప్రతిపక్ష నేత ఏదన్నా సబ్జెక్ట్‌పై లోతుగా మాట్లాడుతున్న సమయంలో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడం ఒకటి. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంలో ప్రభుత్వం కంటే స్పీకర్‌ పాత్రే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభకు ఎంతో మంది స్పీకర్లుగా పనిచేశారు. మనం గత పాతికేళ్లలో చూసిన శ్రీపాదరావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు, నాదెండ్ల మనోహర్‌ వంటివారు సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ సభను ఎంతో హూందాగా నడిపించారు. కాని, ఈ ప్రభుత్వంలో స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. స్పీకర్‌ సభలో అన్ని పక్షాలకు పెద్దమనిషిగా వ్యవహరించాలి. కాని, ఈ ప్రభుత్వంలో స్పీకర్‌ ఒక పక్షం వారికి మాత్రమే పెద్ద న్నగా వ్యవహరించారు. వైకాపాకు చెందిన 22మంది ఎమ్మెల్యేలను వారిచేత విలువ లకు కట్టుబడి రాజీనామా చేయించ కుండానే చంద్రబాబు తన పార్టీలోకి తీసు కుంటే... ప్రజాస్వామ్యానికి పాతరేసే ఈ పనిని అడ్డుకోండి... ఫిరాయింపు నిరోధక చట్టం క్రింద ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసు కోండంటూ ప్రతిపక్ష సభ్యులు కోరినా స్వీకర్‌ నుండి ఎటువంటి చర్య లేదు. అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. అదేమంటే మీరు కోర్టుకెళ్లారు కదా... కేసు కోర్టు పరిధిలో వున్నప్పుడు నేను చర్య తీసుకోకూడదంటారు. స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదనేగా ప్రతిపక్షం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

ఇలా అసెంబ్లీ ప్రతిష్టను ప్రభుత్వమే మంట గలిపింది. ప్రతిపక్షం బహిష్క రించడంతో అసెంబ్లీ సమావేశాలకు అర్ధం పర్ధం లేకుండా పోయి, అవి చెక్కభజన కార్యక్రమాలుగా మారాయి.

Page 1 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…

Newsletter