pawankalyaపల్లె హృదయాలను తాకుతూ, పల్లె వాసనలు పీలుస్తూ, పల్లెవాసుల ఆత్మీయ పలకరింపుతో పులకరిస్తూ వైకాపా అధినేత వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది.

అసలు అతను ఏం చేస్తున్నాడు? ఏ లక్ష్యంతో చేస్తున్నాడు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు? ఎవరి బాగు కోసం ఈ వింత చేష్టలు చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని వదిలేసి ప్రతిపక్షం మీద అది కూడా ఒక్కరోజు కూడా అధికారంలో లేని పార్టీ మీద విమ ర్శలు చేయడమేంటి? పవన్‌కళ్యాణ్‌ వల్ల చాలామందిలో ఉత్పన్నమైన ప్రశ్నలివి. కొందరు విద్యార్థులైతే ఈ వితండ రాజ కీయ జీవి మీద పరిశోధనలు కూడా చేయాలనుకుంటున్నారు.

అయితే ఆయన చేసిన అనంతపురం పర్యటనతోనే వీటిలో చాలావాటికి సమా ధానం దొరికింది. తనకు ఏ పరిటాల రవి అయితే గుండు కొట్టించాడనే ప్రచారం జరుగుతుందో, అదే పరిటాల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళతో మంచి చెడ్డా మాట్లాడు కున్నాడు. అదేపనిలో ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్‌బాషా ఇంటికి కూడా వెళ్ళాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడే తెలిసింది ఈయన అసలు రంగు. వెళ్ళింది ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే అయితే అధికార పార్టీ నాయకుల ఇళ్ళల్లో ఏం పని. పవన్‌ది అంతా యాక్షన్‌... ప్యాకేజీ పథకంలో ఈ డ్రామా ఓ భాగమే!

ఇటీవల సోషల్‌ మీడియాలో డైవర్షన్‌ ఆంటీ వీడియోలు హల్‌చాల్‌ చేస్తుండడం చూస్తూనేవున్నాం. రానాకు రావాల్సిన మరణాన్ని రామానాయుడుకి డైవర్ట్‌ చేసా నని, ఏపికి రావాల్సిన వరదలను తమిళ నాడుకు డైవర్ట్‌ చేసానని, భారత దేశానికి రావాల్సిన తుఫాన్‌ను బంగ్లాదేశ్‌కు మళ్లిం చానని ఈ డైవర్షన్‌ ఆంటీ చెబుతుండడాన్ని చూస్తుంటాం. ఈ డైవర్షన్‌ ఆంటీ లాగానే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కూడా ఒక డైవర్షన్‌ అంకుల్‌ తయారయ్యాడు. ఆయనే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.

ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'అజ్ఞాత వాసి' సినిమా ఎత్తిపోయిందని తేలాక రాజకీయ యాత్ర మొదలుపెట్టాడు. ఆ డైవర్షన్‌ ఆంటీ పలు అంశాలను డైవర్ట్‌ చేసానని చెబుతుంటుంది. కానీ, ఈ డైవర్షన్‌ అంకుల్‌కు ఒకటే సబ్జెక్ట్‌. అదే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వైకాపాకు వెళ్ళే ఓట్లన్నింటిని తన పార్టీకి డైవర్ట్‌ చేయడమే! అందుకోసమే వచ్చే ఎన్నికల్లో ఈయన పోటీ చేయబోతున్నాడు కూడా! ఇప్పుడు సడెన్‌గా తెలంగాణ, ఏపి రాష్ట్రాల్లో రాజకీయ యాత్రను మొదలు పెట్టడానికి కూడా ప్రధాన కారణం ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్‌కు వస్తున్న ప్రజాదరణను డైవర్ట్‌ చేయడం కోసమే!

పేరుకు ఈయన రెండు రాష్ట్రాల్లో రాజకీయ యాత్ర చేస్తానంటున్నాడు. తెలంగాణలో పవన్‌కు అంత సీన్‌ లేదు. అక్కడ కేసీఆర్‌కు సరెండర్‌ అయిపోయాడు. ఆయనను ప్రసన్నం చేసుకోబట్టే తెలం గాణలో 'అజ్ఞాతవాసి' బెనిఫిట్‌ షోలకు అనుమతి లభించింది. తెలంగాణలో యాత్రలు చేయాలని, అక్కడ విరగదీయా లనే కాన్సెప్ట్‌ కూడా పవన్‌లో లేదు.

కేవలం ఏపిలో జగన్‌ను అడ్డుకోవ డమే లక్ష్యంగా పవన్‌ రంగంలోకి దిగాడు. ఆయన దిగాడు అనేకంటే కూడా చంద్ర బాబు దించాడని చెప్పవచ్చు. జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాల్లో పూర్తయ్యింది. ఈ జిల్లాల్లో పవన్‌ ప్రభావం పెద్దగా వుండదు. తాజాగా నెల్లూరుజిల్లా అంటే దక్షిణ కోస్తా నుండి జగన్‌ యాత్ర మొదలైంది. ఇక్కడ నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొద్ది జిల్లాల వారీగా పవన్‌ ప్రభావం కొంతవరకు ఉంటుంది. జగన్‌ గుంటూరు, కృష్ణా జిల్లాలోకి వెళ్ళే సరికి పవన్‌ రాజకీయ యాత్ర కూడా

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే మొదలవుతుంది. ఈలోపు ఆయన గారి తెలంగాణ, రాయల సీమ మొక్కుబడి యాత్రలు పూర్తవుతాయి. కృష్ణా నుండి విజయనగరం దాకా ఈ ఆరు జిల్లాలు కీలకం. రేపు అధికారంలోకి రావాలనుకునే వారెవరికైనా ఇక్కడ మెజార్టీ సీట్లు గెలవాల్సిందే! 2014 ఎన్నికల్లో పవన్‌ అండతోనే ఈ జిల్లాల్లో తెలుగు దేశంకు మెజార్టీ సీట్లు వచ్చి అధికారం చేపట్టగలిగింది. కాని, రేపు ఎన్నికల్లో పవన్‌ మద్దతునిచ్చినా ఆయన అభిమా నులు, పవన్‌ సామాజిక వర్గానికి చెందిన కాపులు తెలుగుదేశంకు ఓటేస్తారన్న గ్యారంటీ లేదు. అందుకే చంద్రబాబు పవన్‌ జనసేన పార్టీని విడిగా పోటీ చేయించి ఈ ఓట్లన్నింటిని జగన్‌కు పోకుండా డైవర్ట్‌ చేయాలని ప్లాన్‌ వేశారు.

పవన్‌ కాల్షీట్లను నిర్మాతలు కొంటారు. పవన్‌ సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు కొం టారు. కాని చంద్రబాబు ఏకంగా పవన్‌నే కొనేసాడని టాక్‌! అందుకే ప్రచారంలో ఆయనను ప్యాకేజీ పవన్‌ అని విపక్షం విమర్శిస్తుంటుంది. చంద్రబాబు డైరక్షన్‌ లోనే ఆయన రాజకీయయాత్ర మొదలు పెట్టాడు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఆయన యాక్షన్‌ చేస్తున్నాడు. రేపు ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఏ ఏ సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టమంటాడో పవన్‌ అక్కడ మాత్రమే జనసేన అభ్యర్థులను దించుతాడు. తాను అన్ని సీట్లలో పోటీ చేయనంటున్నది కూడా అందుకే!

'అజ్ఞాతవాసి' సినిమాలో ఓ సీన్‌ వుంది... ఎన్ని కార్లున్నా చిన్నప్పటి నుండి సైకిల్‌ అంటే తనకిష్టమని ఆ సైకిల్‌ను పడనివ్వనని చెబుతాడు. రాజకీయాలలో తన ఉద్దేశ్యాన్ని సినిమాద్వారా ఈ విధంగా చాటుకున్నాడాయన! ఒక సిద్ధాంతం లేకుండా, ఒక ప్రజా ప్రాతిపదిక లేకుండా కేవలం చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడు పవన్‌. ఇలాంటి పార్టీలు, ఇలాంటి డైవర్షన్‌ నాయకులు రాష్ట్రానికి అవసరమా? ప్రజలు, అభిమానులు ఆలోచించాలి.

jumppersనేను పార్టీ మారేది లేదు... పార్టీ మార్చాల్సిన అవసరమే ముంది... మమ్మల్ని ప్రజలు ఒక పార్టీ తరపున ఓట్లేసి గెలిపిం చారు, ఇప్పుడు అధికారంలో లేమని చెప్పి ఇంకో పార్టీలోకి వెళితే... మేం ప్రజలకు ఏం మెసేజ్‌ ఇచ్చినట్లు... పార్టీ మారకముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి.

మరి పార్టీ మారాక... మా నియోజకవర్గం అభివృద్ధి మాకు ముఖ్యం. అధికారపార్టీలో వుంటేనే ప్రజలకు నాలుగు పనులు చేయ గలం. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మెచ్చే మా కార్యకర్త లతో చర్చించి ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారాం.

మొన్నటి భూమా అఖిలప్రియ నుండి నేటి బుట్టా రేణుక వరకు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మారిన ప్రతి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే చెప్పిన మాటలే ఇవి. పార్టీ మారక ముందు ఓ మాట... పార్టీ మార్చాక ఇంకో మాట. అసలు వీళ్లకు అలా మాట్లాడడానికి మనసు ఎలా వస్తుందో కూడా అర్ధం కాదు. రాజకీయ నాయకులకు రెండు నాల్కలు ఉంటాయ న్నది వీళ్లను చూసేనేమో! ప్రతిపక్షంలో వుంటే అభివృద్ధి చేయలేం... అధికార పార్టీలో వుంటేనే అభివృద్ధి చేయగలం అన్న నాయకులకు ఒకటే ప్రశ్న! పుచ్చలపల్లి సుందరయ్య ఎప్పుడు అధికార పార్టీలో వున్నాడు? వాజ్‌పేయి, అద్వానీ వంటి అగ్రనేతలు దాదాపు నాలుగు దశాబ్దాలు ప్రతిపక్ష నేతలుగానే వున్నారు. అంతెందుకు దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి 2004లో సీఎం అవడానికి ముందువరకు కూడా ఏ పార్టీ అధికారంలో వున్నా ప్రతిపక్ష నేత పాత్రనే పోషించాడు. అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నామని చెప్పుకుంటున్న నాయకులెవరు కూడా నియోజకవర్గ ప్రజల మీద ప్రేమతో పార్టీ మారడం లేదన్నది ప్రజలకు తెలిసిన నగ్నసత్యం. వాళ్ళు పార్టీ మారడానికి ప్రధాన కారణం ప్యాకేజీలే అన్నది అందరికీ తెలిసిన నిజం. మన కళ్ళ ముందు ఒక నేరం జరిగింది. నేరం చేసిన వాడే కాదు, చూస్తూ దానిని అడ్డుకోని వాళ్ళు, కోర్టులో చూసింది చూసినట్లు చెప్పని వాళ్ళు కూడా దోషులే! భారత రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, న్యాయమూర్తులు... మరి ఇంతమంది ముందు ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతూనే వుంది. ఒక పార్టీ నుండి గెలిచిన వాళ్ళను ప్రలోభాలతో ఇంకో పార్టీలో చేర్చుకునే కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది. దీనిని అత్యాచారమనాలో... వ్యభిచారమనాలో... పేరు ఏదైనా ఇదొక రాజకీయ నేరమే. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా నేరమే! మరి ఈ నేరాన్ని చూస్తూ కూడా అడ్డుకోలేని ఈ పెద్దలంతా దోషులే కదా!

ఒక పార్టీ టిక్కెట్‌ తెచ్చుకుని, ఆ పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే అధికార పార్టీలోకి దూకే ప్రజాప్రతినిధులను గతంలో ఆయారామ్‌, గయా రామ్‌లు అంటుండేవాళ్ళు. ఇప్పుడు పార్టీలు మార్చే వాళ్ళకు ఆ పేర్లు కూడా తక్కువేమో ననిపిస్తోంది. రాజకీయాలలో ఏ మాత్రం విలువలు, వ్యక్తిగతంగా మనస్సాక్షి అన్నవి వుంటే ఇంకో పార్టీలోకి మారాలనుకున్నప్పుడు ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేసి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి. రాజకీయాలలో అది విలువలకు నిదర్శనం. 2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశంలో చేరారు. వీరిలో ఏ ఒక్కరు కూడా విలువలకు కట్టుబడి తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరలేదు. పదవులతో పాటే పార్టీ మారారు. ఇక వీళ్ళు ఎందుకు పార్టీ మారారు అనేం దుకు చాలా కారణాలుంటాయి. ఒక్కరోజు కూడా అధికారం లేకుంటే ప్రజాప్రతినిధులు నిలబడలేని పరిస్థితులొచ్చాయంటే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడే నాయకులే వుండరు. ప్రజాస్వామ్యానికి ఈ పోకడలు చాలా ప్రమాదకరం. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచనలు ఇంకా ప్రమాదకరం.

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాన్ని పనిగట్టుకుని నిర్వీర్యం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే ప్రజలే ప్రభుత్వం వైపు నిలబడతారు. ఆటో మేటిగ్గా ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనపడుతుంది. పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిష్టులు పాతికేళ్లు పాలించారు. గుజరాత్‌లో బీజేపీ వరుసగా 4సార్లు అధికారంలోకి వచ్చింది. ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌ సీఎంలు విజయాలలో హ్యాట్రిక్‌ సాధించారు. వీళ్లెవరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్యాకేజీల ఆశ పెట్టి తమ పార్టీలోకి లాక్కోలేదు. కేవలం మంచి పరిపాలన ద్వారా ప్రజలను తమ వైపుకు తిప్పుకునే విజయాలు సాధించారు.

కాని, దేశ చరిత్రలోనే చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పోకడలకు బాటలు వేసాడు. ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో వార్‌ను వన్‌సైడ్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ దేశ చరిత్రలోనే ప్రతిపక్షం నిర్వీర్యం కావడం అన్నది ఎక్కడా జరగలేదు. ఏ పార్టీ అయినా చరిత్ర గర్భంలో కలిసిపోవడం అన్నది ప్రజల చేతుల్లో పని. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పంథాలో నడుస్తున్నప్పుడు ప్రజలే ప్రతిపక్షమయ్యి పిడికిలి బిగిస్తారు. అవతల చచ్చు, పుచ్చు పార్టీలున్నా అధికారంలో కూర్చోబెడతారు. మూడేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కలనే చూడండి... ఒక ప్రధాని, 20మంది కేంద్రమంత్రులు... పెద్ద ఎత్తున ప్రచారం... ఇన్ని చేసినా ఆమ్‌ ఆద్మీ చీపురు తుఫాన్‌లో బీజేపీ తుడిచిపెట్టుకు పోయింది. కాబట్టి నాయకులు పార్టీ మారి వచ్చినంత మాత్రాన ప్రతిపక్షం నిర్వీర్యం కాదు. ప్రజల అభిమానం పొందగలిగితే ప్రతిపక్షం దానంతట అదే బలహీన పడుతుంది.

trs tdpఓ పక్క కులాలను పక్కనపెట్టాలంటున్నాం, మతాలను మరచిపోదామంటున్నాం... ఇంకో పక్క చూస్తే దేశ రాజకీయాలను కులాలే శాసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఉత్తరప్రదేశ్‌ దాకా ప్రతి రాష్ట్రంలోనూ కులపోకడలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వాటి విజయావకాశాలు ఎక్కువుగా ఉండేవి. ఇప్పుడు రెండు బలమైన కులాలు కలిస్తే గెలుపు ఖాయమనే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దీనిని ప్రాక్టికల్‌గా విజయవంతం చేసి చూపించాడు చంద్రబాబునాయుడు. ఏపిలో రాజకీయంగా మూడు ప్రధాన అగ్రకులాలుంటాయి. రెడ్డి, కమ్మ, కాపు... ఈ మూడు కులాలలో ఏ రెండు కులాలు కలిస్తే వారికే అవకాశాలెక్కువుగా ఉంటాయి. గత ఎన్నికల్లో కమ్మ, కాపు కాంబినేషన్‌ కుదిరింది. పవన్‌ కళ్యాణ్‌ను గడ్డం పట్టుకునైతేనేమీ, కాపులకు రిజర్వేషన్లు, డిప్యూటీ సీఎం వంటివి ఎరవేయడం వల్లనైతేనేమీ చంద్రబాబు ఈ రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లయిన కాపుల మద్దతు పొందగలిగాడు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉందంటే అది కాపుల పుణ్యమే!

చంద్రబాబు ఇదే ఫార్ములాను రేపు తెలంగాణలోనూ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తెలంగాణలో తెలుగుదేశం ఎత్తిపోయింది. ముఖ్యమైన నాయకులందరూ టిఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. రేవంత్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు వూరేగుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా చూడాలని, ఉనికిని కాపాడుకోవాలని చంద్రబాబు ఆరాట పడుతున్నాడు. తెలంగాణలో ఇక అధికారం మీద ఆశ లేదు. మొన్న గ్రేటర్‌ ఎన్నికల్లోనే అది తేలిపోయింది. కనీసం పార్టీనన్నా నిలబెట్టుకోవాలి. ఇందుకోసం టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడా కులం ఈక్వేషన్స్‌ను తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ కాంగ్రెస్సే! ఆ పార్టీలో రెడ్లదే ఆధిపత్యం. టీఆర్‌ఎస్‌లో ఇప్పుడున్న రెడ్లు రేపు కాంగ్రెస్‌లోకి పోరనే గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి తెలంగాణలో రెడ్లకు పోటీగా బలమైన సామాజిక వర్గాలైన వెలమ, కమ్మలను ఒక గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఓ విడత చర్చలు కూడా జరిగాయి. ఈ రెండు కులాలను ఏకం చేసే ఆపరేషన్‌ బాధ్యతలను చంద్రబాబు చెక్కభజన మీడియాగా పేరుగాంచిన ఓ మీడియా సంస్థ అధినేతకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Page 1 of 23

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter