cmమీరు ప్రత్యేకహోదా ఇవ్వలేమన్నారు... మీరు ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీ నాకు చాలనుకున్నాను... దుగరాజపట్నం పోర్టు కుదరదన్నారు... అది నాకు సంబంధించిన పనికాదు కదా సరేనన్నాను. రాజధాని నిర్మాణానికి నిధు లిస్తామన్నారు... నేను సింగపూర్‌ లాంటి రాజధాని కట్టుకుంటుంటే దానికి నిధులివ్వకుండా మీరు చంబల్‌పూర్‌ లాంటి పట్టణాన్ని కట్టుకోమన్నట్లుగా ముష్టి విదిలిస్తున్నారు. అయినా సర్దుకున్నాను. పోలవరం ప్రాజెక్ట్‌పై నేను పెంచిన అంచనాలను ఓకే చేయకుండా పాత అంచనాలతోనే పనులు చేసి పెట్టాలన్నారు. ఇక్కడా రాజీపడ్డాను. ఇవన్నీ దేని కోసం... రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతూ విభజన హామీలపై మీతో రాజీపడుతూ వచ్చింది ఎందుకోసం... మా రాష్ట్ర అసెంబ్లీ సీట్లను 175 నుండి 225కు పెంచుతారని. నా నెత్తిన పాలు పోస్తారని కదా... సీట్లు పెరిగితే ఎంచక్కా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చు. వైసిపి నుండి ఆల్‌రెడీ వచ్చిన ఎమ్మెల్యేలకే కాదు, ఇంకా వచ్చే వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వొచ్చు. ఇదీ చంద్రబాబు మనోగతం.

ఆయన ఆశ, ధ్యాస అంతా కూడా నియోజకవర్గాల పెంపు మీదే వుంది. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచుతారనే ఆశతోనే ఇప్పటివరకు మోడీ ముందు సాగిలబడుతూ వచ్చాడు. అందుకోసమే కేంద్రం విభజన హామీలను అటకెక్కించినా ఇదేం పని అని అడగలేకపోయాడు. విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా ఫర్వాలేదు, సీట్లు పెంచితే చాలన్నట్లుగా వుండింది ఆయన వాలకం. ఇటీవల లేకలేక ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరికితే ఈయన పోయి రాష్ట్రానికి ఏం కావాలో అడక్కుండా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచమని అడిగొచ్చాడు.

అసెంబ్లీ సీట్లపెంపుపై కేంద్రం నుండి ఎలాంటి హామీ రాలేదు. భవిష్యత్‌లో పెంచుతారనే వాతావరణం కూడా కన పడ్డం లేదు. ఇక్కడే చంద్రబాబులో నిరాశా వాదం అలుముకుంటోంది. ఇది కూడా చేయకుంటే ఇక బీజేపీతో పొత్తు ఎందు కనిపిస్తోంది. నిరాశావాదాన్ని ఆయన ఈమధ్య తన మాటల్లో చూపించాడు కూడా! పొత్తు వద్దనుకుంటే దండం పెట్టి పోతామని చెప్పాడు.

రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ నాయకుల మధ్య తరచూ వివాదాలు రేగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో తెలుగుదేశంకు అమ్ముడు పోయిన వర్గం, వ్యతిరేక వర్గం అని రెండు న్నాయి. ఎంపీ కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలుగుదేశం అనుకూలవర్గంలో వున్నారు. వారు ఒక రకంగా తెలుగుదేశం నాయకులేనను కోవచ్చు. తెలుగుదేశంతో విభేదించే పురంధేశ్వరి, విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు లాంటి నాయకులు చంద్రబాబుపై ఒంటికాలితో లేస్తున్నారు. ప్రభుత్వ అవి నీతిని, చంద్రబాబు పార్టీ ఫిరాయింపు చర్యలను ఎండగట్టడంలో ఎప్పటికప్పుడు వీళ్ళు ముందుంటున్నారు.

ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీ- బీజేపీల మధ్య దూరం పెంచుతూ వచ్చాయి. రేపు కేంద్రం సీట్లు పెంచకుంటే ఆ దూరం మరింత పెరగొచ్చు కూడా! అది తెగదెంపులదాకా రావచ్చు. బీజేపీని దూరం చేసుకుంటే మైనార్టీలు దగ్గర అవుతారనే ఆశ చంద్రబాబులో వున్న ట్లుంది. ఆ దిశగానే ఆయన బీజేపీతో కటీఫ్‌కు సిద్ధం కావచ్చు. అయితే ఇక్కడ ఆయన ఇంకోదానికి కూడా సన్నద్ధం కావాల్సి వుంటుంది. ఓటు-నోటు కేసు ఏ క్షణమైనా మళ్ళీ తెరమీదకు రావచ్చు. అది రావడం జరిగితే రాష్ట్రంలో రాజకీ యాల సీన్‌ చాలా మారొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బీజేపీని దూరం చేసుకోవడమంటే... కోరి కొరివితో తల గోక్కోవడమే!

somireddyకాంగ్రెస్‌కు అహ్మద్‌ పటేల్‌, బీజేపీకి వెంకయ్యనాయుడు, సమాజ్‌వాదీ పార్టీకి అమర్‌సింగ్‌... ఇలా ప్రతి పార్టీకి వ్యూహకర్తలుండే వాళ్లు. పార్టీకి సంబంధించి ఎక్కడన్నా సమస్య వచ్చినా, లేదా మధ్యమధ్యలో ఎన్నికలు వచ్చినా తమ పార్టీ తరఫున యంత్రాంగాన్నంతా వీళ్ళు నడిపించేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి కూడా అలాంటి వ్యూహకర్త దొరికాడు. అతనే వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

2004 నుండి 2014 దాకా పదేళ్ల రాజకీయ చరిత్రను చూసుకుంటే సర్వేపల్లి నుండి మూడుసార్లు, కోవూరు ఉపఎన్నికల్లో ఒకసారి మొత్తం నాలుగుసార్లు వరుసగా ఓడిపోయాడు సోమిరెడ్డి. ఆయన రాజకీయ చాణక్యుడైతే, వ్యూహకర్త అయితే ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతాడనే సందేహం కూడా రావచ్చు. యుద్ధం చేసేవాడి కంటే యుద్ధం చేయించే వాడు చాలా ప్రభావం చూపుతాడు. యుద్ధం చేసేవాడికి ఒకే కోణం తెలిసివుంటుంది. యుద్ధం చేయించేవాడికి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై అనేక కోణాలు తెలిసుంటాయి. ఇప్పుడు సోమిరెడ్డి యుద్ధం చేయడం కంటే యుద్ధం చేయించి నెగ్గించే పాత్రలో బాగా రాణిస్తున్నాడు. మొన్న కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన సోమిరెడ్డి తన టాలెంట్‌ అంతా చూపాడు. వైసిపి కంచుకోటలో జగన్‌ చిన్నాన్న వై.యస్‌. వివేకానందరెడ్డిని ఓటమి పాల్జేయడంలో సోమిరెడ్డి నిర్విరామ కృషి చేశాడు. కడప ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే సోమిరెడ్డికి బాగా మార్కులు పడ్డాయి. కడపలో ఆయన టాలెంట్‌ను చూసిన చంద్రబాబుకు సోమిరెడ్డిపై నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నంద్యాల ఎలక్షన్‌ బాధ్యతను కూడా అప్పగించాడు. నంద్యాలలో తెలుగుదేశం గెలుపు కోసం సోమిరెడ్డి తాను నిలబడ్డప్పుడు కూడా చేయనంతగా పని చేశాడు. నంద్యాలలోనే తిష్ట వేశాడు. రాత్రింబవళ్ళు పని చేశాడు. నంద్యాలలో సందు సందు గురించి తెలుసుకున్నాడు. ఏ వీధిలో ఏ నాయకుడున్నాడు, ఎవరి వద్ద ఓట్లున్నాయి, ఎవరు చెబితే ఓట్లేస్తారన్న వివరాలన్నీ రాబట్టాడు. అందర్నీ తన బుట్టలోకి లాక్కున్నాడు. కర్నూలు జిల్లా నాయకులకు కూడా సోమిరెడ్డి రాజకీయం నేర్పించాడు. ఎలక్షన్‌ ఎలా చేయాలో చూపించాడు. నంద్యాలలో తెదేపాకు భారీ ఆధిక్యం సాధించి పెట్టడం ద్వారా తన విలువేంటో చంద్ర బాబుకు తెలిసొచ్చేలా చేసాడు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
  • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
    1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter